దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రతికూల అంశాలు ప్రభావం చూపడంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,756.11 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 65,014.06 పాయింట్ల గరిష్ఠానికి, 64,580.95 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ముగింపు దశలో ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి.
చివరకు 72 పాయింట్ల లాభంతో 64,904 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో 19,425 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్‌లు లాభాలు గడించగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment