ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు
ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అమ్మకాలు
ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం దాదాపు ఒకశాతం నష్టపోయాయి. అమెరికా, భారత్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి(మంగళవారం) ముందు ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 685 పాయింట్లు పెరిగి 74,187 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు బలపడి 22,527 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు అందుకున్నాయి. రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు దిగడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్ 617 పా యింట్లు పతనమైన 73,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద స్థిరపడింది. కాగా, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 2% క్షీణించింది.
► ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు మరో పదిశాతం నష్టపోయి రూ.79 వద్ద ముగిసింది.
► రిటైల్ ఇన్వెస్టర్ల ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రక్రియ ప్రారంభంతో ఎన్‌ఎల్‌సీ ఇండియా షేరు 7% నష్టంతో రూ.233 వద్ద స్థిరపడింది.
► రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ఆర్‌వీఎన్‌ఎల్ షేరు 3% లాభంతో రూ.245 వద్ద నిలిచింది.
► ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ ఉతి్పత్తిని, సదుపాయాలను మెరుగుపరచుకోడానికి ఆర్థిక సహాయం అందించే– ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి.
► ఎస్‌బీఐ షేరు 2% నష్టపోయి రూ.773 వద్ద ముగిసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి వెల్లడించడంపై గడువును మరింత పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ దాఖలు చేసిన
పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment