Monetary Policy Decision
-
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
ఆర్బీఐ అండతో 60 వేల పైకి..
ముంబై: ఆర్థిక వృద్ధికి కట్టుబడుతూ ఆర్బీఐ కమిటీ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు స్టాక్ మార్కెట్ను మెప్పించాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 60 వేల స్థాయిపైన 60,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 17,895 వద్ద నిలిచింది. తాజా ముగింపు నిఫ్టీ సూచీకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు టెక్నాలజీ షేర్లు దుమ్ములేపాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్అండ్గ్యాస్, ఆటో షేర్ల కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.64 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు 168 కోట్ల షేర్లను అమ్మారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1293 పాయింట్లు, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడికి ముందు(శుక్రవారం) అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు... స్టాక్ మార్కెట్లో గడిచిన రెండో రోజుల్లో రూ.4.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266.36 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 869 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ నాలుగు శాతం జంప్... అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ తొలి స్టోర్ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నాలుగు శాతం లాభపడి రూ.2,671 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ద్వైమాసిక రివ్యూను గురువారం ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో రెండురోజుల సమావేశం అనంతరం మానిటరీ పాలసీ కమిటీ రేటు యథాయథంగా ఉంచేలా ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద యథాతథంగా ఉండనున్నాయి. -
డిశెంబర్ 7నే సమీక్ష..వడ్డీరేట్లుకోత?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ డిశెంబర్ 7 బుధవారం మానిటరీ పాలసీ రివ్యూను ప్రకటించే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు తరువాత ఇది మొదటి ద్రవ్య విధాన సమీక్ష. రూ. 500/1000 నోట్ల రద్దు తరవాత జరగనున్న ఈ సమీఓలో వడ్డీ రేటులోకోత పడే అవకాశం ఉందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. కీలక వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించ వచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వైస్ ఛైర్మన్, సీఈవో కెకి మిస్త్రీ అంచనావేశారు. కొత్తగా ఏర్పాటైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షకు ఈ నెల 6,7 తేదీల్లో సమావేశం కానుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను డిశెంబర్ 7న మధ్నాహ్నం 2.30గంటల తరువాత వెబ్ సైట్ లోఉంచుతామని ఆర్ బీఐ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యవస్థలోని నగదు బ్యాంకులకు మళ్లడంతో ఇటీవల లిక్విడిటీ భారీగా పెరగడంతో వడ్డీరేట్లను తగ్గించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే లిక్విడిటీకి చెక్ పెడుతూ ఆర్బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను 100 శాతానికి పెంచడంతోపాటూ ఇతర మార్కెట్ నియంత్రణ చర్యలు చేపట్టింది. దీనికితోడు జీడీపీ 7 శాతం పైగా పుంజుకోవడంతో ఈ సారి పాలసీ సమీక్షలోనూ రెపోలో కనీసం పావు శాతం కోత పెట్టే వీలున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటైన ఎంపీసీ అక్టోబర్ సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.