ముంబై: రిజర్వ్ బ్యాంక్ డిశెంబర్ 7 బుధవారం మానిటరీ పాలసీ రివ్యూను ప్రకటించే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు తరువాత ఇది మొదటి ద్రవ్య విధాన సమీక్ష. రూ. 500/1000 నోట్ల రద్దు తరవాత జరగనున్న ఈ సమీఓలో వడ్డీ రేటులోకోత పడే అవకాశం ఉందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. కీలక వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించ వచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వైస్ ఛైర్మన్, సీఈవో కెకి మిస్త్రీ అంచనావేశారు.
కొత్తగా ఏర్పాటైన మానిటరీ పాలసీ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షకు ఈ నెల 6,7 తేదీల్లో సమావేశం కానుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను డిశెంబర్ 7న మధ్నాహ్నం 2.30గంటల తరువాత వెబ్ సైట్ లోఉంచుతామని ఆర్ బీఐ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వ్యవస్థలోని నగదు బ్యాంకులకు మళ్లడంతో ఇటీవల లిక్విడిటీ భారీగా పెరగడంతో వడ్డీరేట్లను తగ్గించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే లిక్విడిటీకి చెక్ పెడుతూ ఆర్‌బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను 100 శాతానికి పెంచడంతోపాటూ ఇతర మార్కెట్ నియంత్రణ చర్యలు చేపట్టింది. దీనికితోడు జీడీపీ 7 శాతం పైగా పుంజుకోవడంతో ఈ సారి పాలసీ సమీక్షలోనూ రెపోలో కనీసం పావు శాతం కోత పెట్టే వీలున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
కాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటైన ఎంపీసీ అక్టోబర్ సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
డిశెంబర్ 7నే సమీక్ష..వడ్డీరేట్లుకోత?
Published Sat, Dec 3 2016 12:27 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
Advertisement
Advertisement