ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశీయ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 31, ఆదివారం సెలవు దినం రోజున బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే అన్ని ఏజెన్సీ శాఖలు ఆదివారం పనిచేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వినియోగదారుల అవగాహన కోసం పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని బ్యాంకులను కోరింది.
2018-19 ఆర్ధిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ ఆదివారం సెలవును రద్దు చేసింది. బ్యాంకులతో పాటు ప్రభుత్వ రశీదు, చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకుగాను అన్ని చెల్లింపు, అకౌంట్ అఫీసులు తెరిచే వుండాలని ఆదేశించింది.
ప్రభుత్వ లావాదేవీలన్నీఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని మరో నోటిఫికేషన్‌లో కోరింది. ఇందుకు మార్చి 30న రాత్రి 8 గంటలవరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని వివరించింది. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 1867వ సంవ్సతరం బ్రిటిష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment