సెన్సెక్స్ 692 పాయింట్లు అప్
75,000 అధిగమించిన ఇండెక్స్
201 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
22,821 వద్ద ముగింపు
అమ్మకాల బాటలోనే ఎఫ్‌పీఐలు
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది.
వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది.
నేటి ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి
నేడు(శుక్రవారం) ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, నెస్లే, ఇండస్‌ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.
కాగా, బీఎస్‌ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.
బీహెచ్‌ఈఎల్ 9% జంప్
అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది.
అదానీ షేర్లు జూమ్
వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్‌డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది.
Comments
Please login to add a commentAdd a comment