ముంబై: బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం కొనసాగడంతో స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 286 పాయింట్లు పతనమై 65,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 19,436 వద్ద నిలిచింది. రెండు సూచీలకు ముగింపు స్థాయిలు నెల కనిష్టం. ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి.
ఎఫ్‌ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 633 పాయింట్లు నష్టపోయి 65 వేల స్థాయి దిగువన 64,879 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు పతనమై 19,334 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,424 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,769 కోట్ల షేర్లను కొన్నారు.
► అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 3% పెరిగి రూ.2464 వద్ద స్థిరపడింది. అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్(ఐహెచ్‌సీ) ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆదానీలో తన వాటాను 4.98% నుంచి 5.04 శాతానికి పెంచుకోవడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
► అప్‌డేటర్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.300)తో 0.03 స్వల్ప డిస్కౌంట్‌తో 299.90 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 6% క్షీణించి రూ.282 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచి్చంది. చివరికి 5.38% నష్టంతో 284 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment