మిడ్‌సెషన్ నుంచీ భారీ కొనుగోళ్లు
సెన్సెక్స్ 445, నిఫ్టీ 145 పాయింట్లు ప్లస్
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది.
రియల్టీ జూమ్..: ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, టెక్‌ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.
అయితే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్‌యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.
అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి.
Comments
Please login to add a commentAdd a comment