Domestic stock markets
-
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
ఆఖర్లో అమ్మకాల బెల్
ముంబై: చివరి గంటలో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమై 71,731 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 21,772 వద్ద నిలిచింది. అయితే తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు పరిమిత శ్రేణిలో స్వల్ప లాభాల మధ్య కదిలాయి. చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో కుదేలయ్యాయి. వెరసి ఒక దశలో 72,386 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివర్లో 71,602 వరకూ నీరసించింది. నిఫ్టీ సైతం 21,964– 21,727 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రిలయన్స్, ఎయిర్టెల్, మారుతీ సైతం ఇండెక్సులను బలహీనపరచినట్లు పేర్కొన్నారు. కారణాలివీ... జనవరి నెలకు యూఎస్ ఉద్యోగ గణాంకాలు బలపడటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపకపోవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 4 శాతం ఎగువకు చేరడం, దేశీయంగా తాత్కాలిక బడ్జెట్‌కు ముందు మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు ఉసిగొలి్పనట్లు విశ్షించారు. దిగ్గజాల తీరిలా నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్ 6 శాతం ఎగసింది. కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ 5–2% మధ్య జంప్‌చేశాయి. అయితే యూపీఎల్ 11 శాతం పతనంకాగా.. బజాజ్ ఫైనాన్స్, ఫిన్, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, మారుతీ, అ్రల్టాటెక్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, అపోలో హాస్పిటల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, ఆర్ఐఎల్ 3.2–1.2 శాతం మధ్య క్షీణించాయి. క్యూ3 ఫలితాల నిరాశతో యూపీఎల్ 11 శాతం పతనమైంది. షేర్ల స్పీడ్... టాటా మోటార్స్: క్యూ3 (అక్టోబర్–డిసెంబర్)లో నికర లాభం రెట్టింపై రూ. 7,100 కోట్లను తాకడంతో 6 శాతం జంప్‌చేసి రూ. 950 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8 శాతం దూసుకెళ్లి రూ. 950 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! కంపెనీ మార్కెట్ విలువ రూ. 15,950 కోట్లు బలపడి రూ. 3.07 లక్షల కోట్లను దాటింది. ఎల్ఐసీ: లిస్టయిన తదుపరి తొలిసారి రూ. 1,000 మార్క్‌ను అందుకుంది. 6 శాతం లాభపడింది. తద్వారా రూ. 6 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది. ఒక్క రోజులో రూ. 35,230 కోట్లను జమ చేసుకుంది. విలువరీత్యా గత నెలలో ఎస్బీఐను దాటేసింది. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
జీడీపీ గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. ఇతర అంశాలూ కీలకమే.. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు. నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. వడ్డీ రేట్ల ప్రభావం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు. యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. -
ఐపీవో బూమ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకియో లైటింగ్, సెన్కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, నెట్వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్ఎఫ్బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెల్లో వరల్డ్ సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది. హ్యాపీ ఫోర్జింగ్స్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది. 18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు. పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని వివరించారు. -
మూడో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బలపడ్డాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు జంప్‌చేసి 62,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు ఎగసి 18,599 వద్ద నిలిచింది. యూఎస్ మార్కెట్లు పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రభావంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. దీంతో మార్కెట్లు ఊగిసలాడినప్పటికీ లాభాల మధ్యే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 524 పాయింట్లు పురోగమించి 63,026కు చేరింది. వెరసి 63,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 18,641 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,072 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 313 పాయింట్లు లాభపడింది. దీంతో మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల సమీపానికి చేరాయి. యూఎస్ రుణ పరిమితిపెంపునకు ఆదివారం సూత్రప్రాయ అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఎంఅండ్ఎం జూమ్ ఎన్ఎస్ఈలో కన్సూ్యమర్ డ్యురబుల్స్, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 0.6 శాతం స్థాయిలో బలపడితే.. ఆయిల్–గ్యాస్, ఐటీ 0.4 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో క్యూ4 ఫలితాల అండతో ఎంఅండ్ఎం 3.4 శాతం ఎగసింది. ఇతర బ్లూచిప్స్‌లో టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, ఐటీసీ 2.6–1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఓఎన్జీసీ 3 శాతం పతనంకాగా.. దివీస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, బీపీసీఎల్, బ్రిటానియా, అదానీ ఎంటర్, విప్రో 1.2–0.4 శాతం మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు..: బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,921 లాభపడగా.. 1,715 నష్టపోయాయి. ఇటీవల దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా నగదు విభాగంలో రూ. 1,758 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ సైతం రూ. 854 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నాయి. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం నీరసించి 76.82 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి స్వల్పంగా 4 పైసలు తగ్గి 82.63కు చేరింది. -
చివర్లో బౌన్స్‌బ్యాక్
ముంబై: రోజంతా నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లో బౌన్స్‌బ్యాక్ సాధించాయి. వెరసి సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 61,873 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు బలపడి 18,321 వద్ద స్థిరపడింది. మే నెల డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో తొలి నుంచీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 61,934 వద్ద గరిష్టాన్ని, 61,485 దిగువన కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 18,338–18,202 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రధానంగా చివరి అర్ధగంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లో నిలిచాయి. రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఎఫ్ఎంసీజీ, కన్సూ్యమర్ డ్యూరబుల్స్ 1–0.5 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్, ఎయిర్టెల్, ఐటీసీ, దివీస్, ఐషర్, టాటా కన్సూ్యమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్ 3–1% మధ్య ఎగశాయి. అయితే విప్రో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్, యూపీఎల్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా 1.2–0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. చిన్న షేర్లు ఓకే బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,802 లాభపడితే.. 1,687 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 589 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 338 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత 3 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 2,291 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 1.2 శాతం క్షీణించి 77.47 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 7 పైసలు తగ్గి 82.75ను తాకింది. ఎల్ఐసీ జూమ్ క్యూ4లో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన ఎల్ఐసీ షేరు 2 శాతం వృద్ధితో రూ. 604 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 616వరకూ ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 6,357 కోట్లు బలపడి రూ. 3,81,777 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 55.4 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
5 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్‌లో టోకు ధరలు మైనస్‌కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్‌చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి. టాటా మోటార్స్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది. సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లు మళ్లీ ప్రారంభం స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ తాజాగా సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లను సోమవారం పునఃప్రారంభించింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజును తగ్గించడంతో పాటు ఎక్స్పైరీ రోజును కూడా గురువారం నుంచి శుక్రవారానికి మార్చినట్లు సంస్థ ఎండీ సుందరరామన్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. సెన్సెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజు 15 నుంచి 10కి, బ్యాంకెక్స్ లాట్ సైజును 20 నుంచి 15కి తగ్గించారు. అధిక రాబడులిచ్చేందుకు ఆస్కారమున్న అత్యంత రిస్కీ సాధనాలుగా డెరివేటివ్స్‌ను పరిగణిస్తారు. 2000లో బీఎస్ఈ తొలిసారిగా సెన్సెక్స్–30 డెరివేటివ్స్ (ఆప్షన్స్, ఫ్యూచర్స్)ను ప్రవేశపెట్టింది. -
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. కోల్ ఇండియా వీక్ వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్‌చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్అండ్టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి. ఇతర అంశాలు ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
ఫెడ్ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్‌వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడుల ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్‌పట్ల గ్లోబల్ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్ ఫెడ్‌పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ నిపుణులు అజిత్ మిశ్రా, శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ సేథ్ అభిప్రాయపడ్డారు. గత వారం వెనకడుగు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 952 పాయింట్లు పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల దన్ను తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్‌లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్‌చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్‌పీఐలు 2021 అక్టోబర్– 2022 జూన్ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్‌పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం!
దేశీ స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సూచీలు ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వడ్డీ రేట్లు చూస్తే ఇవి మరికొన్నాళ్లు తక్కువ స్థాయిల్లోనే కొనసాగవచ్చు. వేల్యుయేషన్స్ ధోరణులను, మార్కెట్ల దిశను అంచనా వేయడానికి కీలకమైన ఈ రెండింటి తీరు తెన్నులను బట్టి చూస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈక్విటీలు ఆశావహంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గణనీయంగా పెరిగినప్పటికీ.. వేల్యుయేషన్ దృష్టికోణం నుంచి దీర్ఘకాలిక సగటు ప్రాతిపదికన చూస్తే సూచీల్లోని లార్జ్ క్యాప్ స్టాక్స్ మరీ ఖరీదైనవిగా ఏమీ లేవు. వడ్డీరేట్లు మరి కొంత కాలం తక్కువ స్థాయిలోనే ఉండనున్న నేపథ్యంలో సహేతుకమైన వేల్యుయేషన్స్ గల లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ చోటు చేసుకోవచ్చు గానీ.. స్థూలంగా చూస్తే మాత్రం రిస్కుకు తగిన రివార్డులివ్వడంలో ఈక్విటీలే ఆశావహంగా కనిపిస్తున్నాయి. స్మాల్ క్యాప్ జోరు తగ్గుముఖం.. దేశీయంగా పెట్టుబడులు ఈక్విటీల్లోకి రావాలంటే మార్కెట్లు బాగుండాలి. స్టాక్‌మార్కెట్లలోకి దేశీ పెట్టుబడులు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ గడిచిన కొన్నాళ్లుగా చూస్తే.. ఈ పెట్టుబడుల్లో అధిక భాగం మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లోకి వచ్చాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోకి అంతగా రాలేదు. లార్జ్ క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు రాణిస్తుంటేనే మార్కెట్లపై దేశీయంగా సామాన్య ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉంటారు. మధ్య, చిన్న స్థాయి షేర్ల వేల్యుయేషన్లు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. దీంతో మరికొన్నాళ్ల పాటు ఈ పరుగు పునరావృతం కాకపోవచ్చు. రేప్పొద్దున మరింత భారీగా ఎదిగే సత్తా ఉన్న చిన్న సంస్థలను నిరంతరాయంగా దొరకపుచ్చుకోవడం చాలా కష్టమైన వ్యవహారమే. మంచి ట్రాక్ రికార్డు, లాభదాయకత, ఉత్తమమైన కార్పొరేట్ విధానాలు, వ్యాపారం తీరుతెన్నులు బాగున్న సంస్థలు స్వల్పకాలంలో లార్జ్ క్యాప్‌లుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ రంగాలు ఆసక్తికరం.. రాబోయే రోజుల్లో రంగాలవారీగా చూస్తే.. ఫార్మా మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. ఎఫ్‌డీఏ అంశాలు ప్రస్తుతం చికాకుపెడుతున్నప్పటికీ.. అవి మరింత కాలం కొనసాగకపోవచ్చు. ఫార్మా కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ.. మెల్లగా అంతా చక్కబడగలదు. ఫైనాన్షియల్ సర్వీసుల రంగం కూడా కొన్నాళ్లుగా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తోంది. అలాగే ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు సైతం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు చిన్న రంగాలకు సంబంధించి టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆగ్రో కమోడిటీ స్టాక్స్ కూడా రాబోయే రోజుల్లో మెరుగ్గా రాణించవచ్చు. విస్తృతమైన ర్యాలీ... వర్ధమాన మార్కెట్లలోకి మళ్లీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో సూచీలు ర్యాలీ చేస్తున్నాయి. క్రమంగా కొన్ని రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం పరిమితమైనా.. మొత్తం మీద మాత్రం విçస్తృ తంగా అన్ని రంగాల షేర్లలోనూ ర్యాలీ కనిపించవచ్చు. అంతర్జాతీయ పరిణామాలకు తగినట్లుగా ఒకో సందర్భంలో ఒక్కో రంగం హైలైట్ కావొచ్చు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో ఉండటంతో పాటు మెరుగైన ఆర్థిక ఫలితాలతో అన్నింటి వేల్యుయేషన్స్ పెరగొచ్చు. వాటికుండే వెయిటేజీని బట్టి తదనుగుణంగా సూచీలు సైతం పెరిగే అవకాశముంది. -
సెన్సెక్స్.. క్రాష్
⇒ 556 పాయింట్లు పతనం; 28 వేల దిగువన ముగింపు ⇒ నిఫ్టీ 158 పాయింట్లు డౌన్; 8448 వద్ద క్లోజ్ ⇒ వెంటాడిన పన్ను భయాలు.. అమ్మకాల బాటలో ఎఫ్ఐఐలు ⇒ ఎగుమతుల్లో తీవ్ర క్షీణత ప్రభావం కూడా... ⇒ భారీగా పడిన రిలయన్స్, ఇన్ఫోసిస్ తదితర బ్లూచిప్స్ ఇన్నాళ్లూ దేశీ స్టాక్ మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు కోపం వచ్చింది. ఐటీ శాఖ జారీ చేసిన భారీ పన్ను నోటీసులతో ఆందోళన చెందుతున్న విదేశీ ఫండ్స్ ఎడాపెడా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్ కుప్పకూలింది. ఏకంగా 556 పాయింట్లు దిగజారి... ‘బ్లాక్ మండే’గా మారింది. అంతేకాదు సెన్సెక్స్ మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం మరో ప్రధానాంశం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించింది. ప్రధానంగా రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్స్ తీవ్రంగా నష్టపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కూడా దేశీ సూచీలు దిగజారడానికి కారణాల్లో కొన్ని. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు/ఎఫ్‌పీఐలు)కు పన్ను నోటీసుల భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 95 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమైన సూచీ... ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారిపోయింది. ఒకానొక దశలో 640 పాయింట్లు ఆవిరై.. 27,802 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. చివరకు క్రితం ముగింపు 28,442తో పోలిస్తే 556 పాయింట్లు(దాదాపు 2 శాతం) క్షీణతతో 27,886 వద్ద సెన్సెక్స్ ముగిసింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనూ వరుసగా నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీ.. మొత్తం 1,160 పాయింట్లు దిగజారడం గమనార్హం. ఇక నిఫ్టీ కూడా భారీగా 1.83 శాతం(158 పాయింట్లు) నష్టపోయి 8,448 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8,620-8,423 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లలో పెద్దయెత్తున లాభాల స్వీకరణ జరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రధానాంశాలు... ⇒ బీఎస్ఈలో రియల్టీ సూచీ అత్యధికంగా 2.78 శాతం కుప్పకూలింది. ఆ తర్వాత భారీగా దిగజారిన వాటిలో ఎఫ్ఎంసీజీ(2.71%), క్యాపిటల్ గూడ్స్(2.17%), ఐటీ(2.08%), విద్యుత్(2.04%), చమురు-గ్యాస్(1.91%) రంగాలు ప్రధానంగా ఉన్నాయి. ⇒ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2.17%, మిడ్‌క్యాప్ సూచీ 2.02 చొప్పున నష్టపోయాయి. ⇒ సెన్సెక్స్ జాబితాలోని 30 స్టాక్స్‌లో 28 నష్టాలతో ముగిశాయి. సన్ ఫార్మా(0.66%), ఐసీఐసీఐ బ్యాంక్(0.31%) స్వల్ప లాభాలను చవిచూశాయి. ⇒ గత శుక్రవారం ఫలితాలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు అత్యధికంగా 4.46 శాతం కుప్పకూలింది. ⇒ ఇక భారీగా నష్టపోయిన ఇతర షేర్లలో హీరో మోటోకార్ప్(3.96%), సిప్లా(3.03%), ఎంఅండ్ఎం(2.96%), యాక్సిస్ బ్యాంక్(2.94%), ఐటీసీ(2.97%), హెచ్డీఎఫ్సీ(2.69%), ఎల్అండ్టీ(2.51%), ఓఎన్జీసీ(2.47%), డాక్టర్ రెడ్డీస్(2.44%), హెచ్‌యూఎల్ (2.43%) ఇన్ఫో సిస్(2.23%), ఉన్నాయి. ⇒ బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్కూడా గత శుక్రవారంతో పోలిస్తే(రూ.3,457 కోట్లు).. భారీగా రూ.5,004 కోట్లకు ఎగబాకింది. ఇక ఎన్ఎస్ఈ క్యాష్ సెగ్మెంట్లో రూ.17,678 కోట్లు, డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో రూ,3,27,420 కోట్ల చొప్పున టర్నోవర్ జరిగింది. రూ.1.59 లక్షల కోట్ల సంపద ఆవిరి మార్కెట్ తీవ్ర పతనంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా కరిగిపోయింది. సోమవారం ఒక్కరోజే స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మొత్తం షేర్ల విలువ)లో రూ.1.59 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.102.64 లక్షల కోట్లకు తగ్గిపోయింది. రూపాయి భారీ క్షీణత.. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడంతో దేశీ కరెన్సీ మారకం విలువ సోమవారం భారీగా క్షీణించింది. 55 పైసలు తగ్గి నెల రోజుల కనిష్టమైన 62.91 స్థాయికి పతనమైంది. ఒక్క రోజులో రూపాయి విలువ ఇంతగా క్షీణించడం 2015లో ఇదే మొదటిసారి. అటు అంతర్జాతీయంగా డాలరు బలపడుతున్న నేపథ్యంలో ఎగుమతిదారులు షార్ట్‌కవరింగ్‌కు దిగడం, ఇటు దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం తదితర అంశాలతో రూపాయిపై గణనీయంగా ఒత్తిడి పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా మార్చి 13న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 62.97 వద్ద క్లోజయ్యింది. కారణాలేంటి... ఎఫ్ఐఐలు తమ మూలధన లాభాలపై 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) చెల్లించాల్సిందేనంటూ ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై తామేమీ కల్పించుకోలేమంటూ మోదీ సర్కారు తేల్చిచెప్పడంతో విదేశీ ఇన్వెస్టర్లలో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఎఫ్ఐఐలు చెల్లించాల్సిన పన్ను బకాయిల మొత్తం రూ.40,000 కోట్లుగా అంచనా. మరోపక్క, కెయిర్న్, క్యాడ్బరీ వంటి కేసుల్లో రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత కేసులు, లావాదేవీలకూ పన్ను విధింపు) నోటీసులు కూడా విదేశీ ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,500 కోట్లకుపైగా విలువైన షేర్లను అమ్మేసినట్లు ప్రాథమిక గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు స్టాక్స్, బాండ్ మార్కెట్లలో రూ.83,000 కోట్లకు పైగానే నికరంగా పెట్టుబడులు పెట్టారు. దెబ్బతీసిన ఎగుమతుల డేటా: ఇదిలాఉంటే.. మార్చి నెలలో దేశీ ఎగుమతులు భారీగా 21 శాతం క్షీణించడం.. 2014-15 ఏడాది ఎగుమతుల లక్ష్యానికి ఆమడదూరంలోనే(లక్ష్యం 340 బిలియన్ డాలర్లు.. సాకారమైంది 311 బిలియన్ డాలర్లే. 2013-14లో ఎగుమతులు 314 బిలియన్ డాలర్లు) నిలిచిపోవడం కూడా మార్కెట్లకు షాకిచ్చిందని ట్రేడర్లు పేర్కొంటున్నారు. దాదాపు ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలతో ముగియడం.. నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను దిగజార్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. యూబీఎస్.. నిఫ్టీ అంచనాలు కట్ ఎన్ఎస్ఈ నిఫ్టీ డిసెంబర్ కల్లా 9,600 పాయింట్లకు చేరుతుందన్న అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ 9,200 పాయింట్లకు తగ్గిం చింది. వృద్ధి రికవరీ ఆశించిన దానికన్నా నెమ్మదిగా ఉండడమే దీనికి కారణమని వివరించింది. ఆర్బీఐ కీలర రేట్ల కోత, ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం, సంస్కరణల వార్తలతో గత ఏడాది కాలంలో భారత మార్కెట్లు వృద్ధి పధంలో కొనసాగాయని యూబీఎస్ హెడ్(ఇండియా రీసెర్చ్) గౌతమ్ చౌహరియా పేర్కొన్నారు. ఇక ఇప్పటి నుంచి కంపెనీల వాస్తవిక ఫలితాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు ప్రభావం చూపుతాయన్నారు. వృద్ధి రికవరీ అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా ఉండడం వల్లే నిఫ్టీ లక్ష్యాన్ని తగ్గించామని, ప్రస్తుతం వెలువడుతున్న కంపెనీల ఫలితాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. -
చివర్లో లాభాలు
* వారం రోజుల గరిష్టానికి సెన్సెక్స్ * 8,300 పైన నిఫ్టీ మార్కెట్ అప్డేట్ పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆశావహ అంచనాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభపడ్డాయి. సోమవారం దాదాపు రోజంతా నష్టాల్లోనే ట్రేడయినా చివరి గంటన్నర వ్యవధిలో లాభాలు నమోదు చేశాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి వారం రోజుల గరిష్ట స్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన 8,300 మార్కును దాటి .. 38 పాయింట్ల లాభంతో 8,323 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో క్రితం ముగింపు కన్నా అధికంగా 27,524 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత లాభాల స్వీకరణతో 27,324 స్థాయికి పడిపోయింది. అయితే, మధ్యాహ్నం సెషన్లో మళ్లీ కోలుకుని చివరికి 27,585 వద్ద ముగిసింది. జనవరి 5 నాటి 27,842 క్లోజింగ్ తర్వాత ఇదే అత్యధికం. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల్లో 676 పాయింట్లు పెరిగినట్లయింది. మొత్తం మీద బీఎస్ఈలో 1,651 స్టాక్స్ లాభాల్లోనూ, 1,253 స్టాక్స్ నష్టాల్లోనూ ముగిశాయి. టర్నోవరు రూ. 3,285 కోట్ల నుంచి రూ. 3,019 కోట్లకు తగ్గింది. మరోవైపు ఎన్ఎస్ఈ స్టాక్స్ విభాగంలో రూ. 14,485 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 1,73,407 కోట్లు టర్నోవరు నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాల్లో చాలా మటుకు సూచీలు నష్టపోయాయి. ఉద్దీపన ప్యాకేజీలు యూరో దేశాల సమస్యలు తీర్చలేకపోవచ్చన్న ఆందోళనలు ఇందుకు కారణం. జపాన్ మార్కెట్లో ట్రేడింగ్ జరగలేదు. మరోవైపు, యూరప్ సూచీల్లో లాభాల్లో ముగిశాయి. -
వారం రోజుల లాభాలకు బ్రేకు
మార్కెట్ అప్డేట్ సెన్సెక్స్ 46 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టం బ్లూచిప్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు సెషన్ల ర్యాలీకి బ్రేకు పడింది. దాదాపు నెల రోజుల గరిష్టానికి ఎగిసిన సెన్సెక్స్ 46 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయాయి. దేశీ సూచీలు కీలక నిరోధక స్థాయులను అధిగమించడంతో సోమవారం ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,064 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,446 పాయింట్ల స్థాయిని తాకాయి. అయితే, ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ముగియడం, యూరప్ మార్కెట్లు అంత బలంగా లేకపోవటం వంటిపరిణామాలతో బ్లూచిప్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో చివర్లో సెన్సెక్స్ 27,842 పాయింట్లు, నిఫ్టీ 8,378 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, టెలికం, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా.. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ తదిత షేర్లు నష్టపోవడంతో మార్కెట్లపై గణనీయంగా ప్రభావం పడినట్లు ట్రేడర్లు తెలిపారు.మార్కె ట్లు సానుకూలంగా మొదలైనప్పటికీ అంతర్జాతీయ పరిణామాలతో నష్టాల్లో ముగిసినట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ తెలియజేశారు. మొత్తం 1,545 స్టాక్స్ లాభాల్లోనూ, 1,420 షేర్లు నష్టాల్లోను ముగిశాయి. -
300 పాయింట్లు పతనం
మార్కెట్ అప్డేట్ * 27,209కు దిగిన సెన్సెక్స్ * అమెరికా వడ్డీ పెంపు భయాలు * లాభాల స్వీకరణ ఎఫెక్ట్ కూడా * ఎన్ఎస్ఈ టర్నోవర్ రికార్డు అంచనాలకంటే ముందుగానే అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చునన్న ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను మరోసారి పడగొట్టాయి. క్యూ3లో యూఎస్ జీడీపీ 5% పుంజుకోవడం దీనికి కారణం కాగా, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు రోజు కావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టడం కూడా జతకలిసింది. వెరసి సెన్సెక్స్ 298 పాయింట్లు పతనమైంది. వారం రోజుల కనిష్టమైన 27,209 వద్ద ముగిసింది. ఇదే విధంగా నిఫ్టీ కూడా 93 పాయింట్లు జారి 8,200 కీలక స్థాయి దిగువకు చేరింది. 8,174 వద్ద నిలిచింది. పీఎస్‌యూలు డీలా సెన్సెక్స్ దిగ్గజాలలో పీఎస్‌యూలు భెల్, ఎన్టీపీసీ, గెయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా 3-2% మధ్య నీరసించా యి. ఈ బాటలో ఇతర బ్లూచిప్స్ హెచ్డీఎఫ్సీ ద్వయం, డాక్టర్ రెడ్డీస్ 2-1% మధ్య క్షీణించాయి. డిసెంబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల ము గింపు నేపథ్యంలో ఎన్ఎస్ఈ ఈక్విటీ డెరివేటివ్స్‌లో రికార్డు టర్నోవర్ జరిగింది. ఇండెక్స్ ఆప్షన్స్‌లో నమోదైన రూ. 4,53,562 కోట్లతో కలిపి ఎఫ్‌అండ్‌వోలో మొత్తం రూ. 5,66,898 కోట్లు జరిగింది. ఇక నగదు విభాగంలోనూ రూ. 22,159 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా, అల్ట్రాటెక్‌కు 2 సిమెంట్ ప్లాంట్లను విక్రయించనున్న జేపీ అసోసియేట్స్ షేరు 9% జంప్‌చేసింది. మెడికల్ పరికరాల రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయడంతో ఆప్టో సర్క్యూట్స్ 16% దూసుకెళ్లింది. నేడు మార్కెట్లకు సెలవు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. -
క్రాష్ మార్కెట్!
సెన్సెక్స్ 538 పాయింట్లు డౌన్ ⇒27,000 స్థాయి దిగువకు... ⇒ఏడాదిన్నర కాలంలో అతిపెద్ద పతనం ⇒152 పాయింట్లు దిగజారిన నిఫ్టీ ⇒ఐదున్నరేళ్ల కనిష్టానికి చమురు ధరలు ⇒సంక్షోభంలో రష్యన్ కరెన్సీ ‘రూబుల్’ ⇒నష్టాలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ప్రపంచ స్టాక్ మార్కెట్ల నష్టాలకు తోడు తాజాగా కరెన్సీ ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దేశీయంగానూ పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, వాణిజ్యలోటు పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. వీటికి ఎఫ్ఐఐల అమ్మకాలు జత కలవడంతో సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో లేనివిధంగా 538 పాయింట్లు పతనమైంది. 27,000 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 26,781 వద్ద ముగిసింది. దాదాపు రెండు నెలల కనిష్టమిది! సెన్సెక్స్ ఇంతక్రితం 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో 651 పాయింట్లు కోల్పోయింది. ఏం జరుగుతోంది? ఇటీవల నాలుగేళ్ల కనిష్టానికి చేరిన మలేసియన్ కరెన్సీ రింగిట్కు జతగా రష్యన్ కరెన్సీ రూబుల్ తాజాగా డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచీ 50% విలువ కోల్పోయింది. దీంతో 1998 తరువాత మళ్లీ రష్యా హుటాహుటిన వడ్డీ రేటును 10.5% నుంచి ఏకంగా 17%కు పెంచివేసింది. అక్కడి స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ కూడా 14 శాతం పైగా కుప్పకూలింది. మరోపక్క రష్యా, మలేసియాసహా చమురు ఉత్పాదక దేశాల ఆదాయాన్ని దెబ్బతీస్తూ తాజాగా ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్టాన్ని తాకడం కూడా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను బలహీనపరచింది. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 58.5 డాలర్ల స్థాయికి దిగిరాగా, నెమైక్స్ రకం 54.5 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇక ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న గణాంకాల నడుమ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు వెల్లడిస్తే డాలర్ నిధులు వెనక్కు మళ్లుతాయన్న భయాలు ఇప్పటికే వర్ధ మాన దేశాలను కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే చైనా తయారీ రంగ మందగమన ఆందోళనలు, జపాన్ మాంద్య పరిస్థితులు ఆసియా మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో యూరప్, అమెరికా మార్కెట్లు 2.5-1% మధ్య నష్టపోయాయి. మంగళవారం చైనా మినహా జపాన్ తదితర ఆసియా మార్కెట్లు కూడా నీరసించాయి. దేశీయంగానూ... దేశీయంగా చూస్తే నవంబర్‌లో వాణిజ్య లోటు 7 బిలియన్ డాలర్లమేర పెరిగి 18 నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 13 నెలల కనిష్టమైన 63.53కు చేరింది. మరోవైపు గత రెండు రోజుల్లో రూ. 1,325 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,250 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్ల బలహీనతలకుతోడు ఇలాంటి పలు అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేశాయి. దీంతో ట్రేడింగ్ గడిచేకొద్దీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 152 పాయింట్లు పడిపోయి 8,068 వద్ద నిలిచింది. ఇతర ప్రధాన అంశాలివీ... ⇒బీఎస్ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ 4-1.5% మధ్య పతనమయ్యాయి. డాలర్ బలోపేతంతో హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా 4.5-1.5% మధ్య లాభపడ్డాయి. ⇒ప్రధానంగా మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ సూచీలు 4-3% మధ్య నీరసించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం మార్కెట్లను మించుతూ 3% చొప్పున పడిపోయాయి. ⇒సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఎస్బీఐ, టాటా పవర్, ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ 8-2% మధ్య తిరోగమించాయి. ⇒ ప్రతికూల పరిస్థితులను ప్రతిబింబిస్తూ ట్రేడైన షేర్లలో 2,327 నష్టపోతే, కేవలం 541 లాభపడ్డాయి. ⇒రియల్టీ రంగానికి చెందిన షేర్లలో యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, ఒబెరాయ్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్ 11-4% మధ్య కుప్పకూలాయి. -
మరో ఏడాదిన్నర బుల్ జోరే!
‘సాక్షి’ ఇంటర్వ్యూ : డీఎస్పీ బ్లాక్‌రాక్ ఫండ్ మేనేజర్ అపూర్వ షా * వరుస సానుకూల వార్తలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి * గతేడాదిలాగానే లాభాలను ఇవ్వొచ్చు * అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఆ ప్రభావం పెద్దగా ఉండదు... * బడ్జెట్ తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్ల కోత * ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్‌పై బుల్లిష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వైపుల నుంచి వస్తున్న సానుకూల అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని, వచ్చే ఏడాదిన్నర వరకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు డీఎస్పీ బ్లాక్ రాక్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ అపూర్వ షా. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినా ఇండియాకొచ్చే ఎఫ్ఐఐ నిధుల ప్రవాహంపై పెద్దగా ప్రభావం చూపదంటున్న ‘షా’తో ఇంటర్వ్యూ విశేషాలు.. గతేడాది కాలంగా ఎటువంటి చెప్పుకోదగ్గ పతనం లేకుండానే మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఒకదాని తర్వాత ఒకటి సానుకూల వార్తలు, సంఘటనలే మార్కెట్లను పరుగెట్టిస్తున్నాయి. రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూపాయి బలపడటం, యూపీఏ ప్రభుత్వం చివర్లో సంస్కరణలు, మోదీ నేతృత్వలో స్థిరమైన ప్రభుత్వం, ముడి చమురు, బంగారం ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణం... ఇలా అన్నీ ఒకదాని వెనుక ఒకటిగా సానుకూల వార్తలు వెలువడుతుండటంతో లాభాల స్వీకరణకు అవకాశం లేకుండా మార్కెట్ పెరుగుతోంది. వచ్చేది రెండో ఆర్థిక సంస్కరణల బడ్జెట్ అన్న వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచుతున్నాయి. రానున్న కాలంలో ఇదే విధమైన సానుకూల వార్తలు వస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే రికవరీ బాట పట్టడంతో మరో ఏడాదిన్నర పాటు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయి. గతేడాది కాలంలో ఇండెక్స్‌లు సుమారు 40 శాతం రాబడిని అందించాయి. వచ్చే ఏడాదిన్నర కూడా ఇదే విధమైన రాబడిని అంచనా వేస్తున్నారా? ఎంత రాబడిని అందిస్తాయని చెప్పలేము. ఇండెక్స్‌ల పెరుగుదల అనేది కంపెనీలు ఆర్జించే లాభాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రోత్సాహకరమైన విధానాలు ప్రవేశపెడితే వచ్చే ఏడాది కూడా ఇండెక్స్‌లు ఇదే స్థాయిలో లాభాలు అందించవచ్చు. వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ ఏ స్థాయికి చేరవచ్చు? మా పాలసీ ప్రకారం ఇండెక్స్ లక్ష్యాలను చెప్పలేము. కానీ బంగారం, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ ఇన్కమ్ వంటి ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక రాబడిని ఇస్తాయని చెప్పొచ్చు. ఇప్పటికే బంగారం ధరలు తగ్గడంతో దేశీయ నగదు ఈక్విటీల్లోకి వస్తోంది. వడ్డీరేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు కూడా మంచి రాబడిని అందించే అవకాశం ఉన్నా అది ఈక్విటీల కంటే తక్కువగా ఉంటుంది. ఇండెక్స్‌లు ఏటా 20% పెరిగితే ఇప్పుడు కొంతమంది మార్కెట్ నిపుణులు పేర్కొంటున్న లక్ష్యాలను(రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2030కి నిఫ్టీ 1,25,000పాయింట్ల చేరుతుందని చెప్పారు) చేరుకోవడం పెద్ద కష్టం కాదు. దీర్ఘకాలంలో చూస్తే దేశీ స్టాక్ మార్కెట్స్ 20% రాబడిని అందించాయి. ఇప్పుడు ఇండెక్స్‌లు ఎంత లాభాలు అందిస్తాయని చెప్పలేము కానీ, ఇతర పెట్టుబడి సాధనాల కంటే ఈక్విటీలు అధిక లాభాలను అందిస్తాయని చెప్పగలను. ప్రస్తుతం దేశీ మార్కెట్స్ ఎదుర్కొనే అతిపెద్ద రిస్క్? దేశీయంగా అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా తీవ్రవాదం, దేశాల మధ్య యుద్ధాలు ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఎదుర్కొంటుందన్నదే ప్రధానమైన రిస్క్‌గా చెప్పొచ్చు. దేశీయంగా చూస్తే అధికారంలో ఉన్న మోదీ నాయకత్వానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదే అయినా... మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదన్న సంకేతాన్ని ఇస్తోంది కదా? ప్రస్తుతం చమురు ధరలు తగ్గడాన్ని ఆ విధంగా చూడలేము. ఇంతకాలం కొంతమంది కూటమిగా ఏర్పడి చమురు ధరలను పెంచుతున్నారు. ఇప్పడు ఆ కూటమికి దెబ్బపడింది. రష్యాని దెబ్బతీయడంతో పాటు షెల్ గ్యాస్ కంపెనీలను దెబ్బతీయాలన్న ఉద్దేశంలో ఒపెక్ దేశాలు ఉన్నాయి. షెల్ గ్యాస్ కంపెనీల బ్యాలెన్స్ షీట్ బలహీనంగా ఉండటం, అత్యధిక వ్యయంతో కూడిన ఈ ఉత్పత్తిని ధరలు తగ్గించడం ద్వారా ఆపించాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు 40 శాతం తగ్గాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చింది. రానున్న ఏడాది కాలంలో వడ్డీరేట్ల కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుతాయని ఇప్పటికే ఆర్బీఐ చెప్పింది. బడ్జెట్ తర్వాత కోత మొదలు కావచ్చు. ఒకసారి రేట్ల కోత మొదలైన తర్వాత అది నిరంతరాయంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. అమెరికా వడ్డీరేట్లు పెంచితే దేశీయ మార్కెట్స్పై ముఖ్యంగా ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంపై ప్రభావం ఏవిధంగా ఉండొచ్చు? అమెరికా వడ్డీరేట్లు పెంచినా అది మన మార్కెట్లపై అంత ప్రతికూల ప్రభావం చూపించకపోవచ్చు. యూరప్, జపాన్ నుంచి వచ్చే నిధులు ఆదుకునే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయిలోనే ఒడిదుడుకులు తక్కువే. ఇది ఇండియా మార్కెట్‌పై బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది. అమెరికాలో తక్షణం వడ్డీరేట్లు పెంచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఏ సెక్టార్స్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు? ఒక సెక్టార్ బాగున్నా.. అందులోని అన్ని కంపెనీల షేర్లు బాగుంటాయని కాదు. అందుకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీల ఫండమెంటల్స్‌ను చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో మొబైల్ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నాం. అలాగే ఇప్పటికే బాగా పెరిగిన ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పై వాటితో పోలిస్తే ఈ రెండు రంగాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. -
తీవ్ర హెచ్చుతగ్గులకు చాన్స్
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ప్రధాన సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని చెప్పారు. గురువారం(25న) ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుంది. మరోవైపు అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ముడిచమురు ధరలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపారు. కాగా, సమీప కాలానికి ఈ నెల చివర్లో(30న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్ష మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనుందని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత పరిస్థితినే కొనసాగించే అవకాశముందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థపై ఆశలు దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలులేని నేపథ్యంలో ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి కదలికలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌదరి అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై అంచనాలతో గత వారం మొదట్లో మార్కెట్లు డీలాపడినప్పటికీ, రేట్ల పెంపు నిర్ణయం లేకపోవడంతో చివర్లో జోరందుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలు ఈ వారం మార్కెట్లను ముందుకు దౌడు తీయించగలవని అమన్ అంచనా వేశారు. పాలసీ సమీక్ష వివరాలను వెల్లడిస్తూ ఫెడరల్ రిజర్వ్ చైర్ఉమన్ జానట్ యెలెన్ మరికొంత కాలం నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నెలకు 85 బిలియన్ డాలర్లను అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్ చేయడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ అక్టోబర్‌లో ముగియనున్న నేపథ్యంలో రేట్ల పెంపు వాయిదా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడిందని వివరించారు. ఫెడ్ తాజా నిర్ణయంతో మరికొంతకాలం విదేశీ పెట్టుబడులకు ఢోకా ఉండబోదని, ఇది భారత్‌సహా వర్థమాన మార్కెట్లకు తీపి కబురు అందించిందని వ్యాఖ్యానించారు. మోడీ యూఎస్ పర్యటన ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 29-30న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు మోడీ వైట్‌హౌస్‌ను సందర్శించనున్నారు. పర్యటనకు సంబంధించిన అంశాలపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, గడిచిన వారం ఎగుడుదిగుడు నడకలో సాగిన సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు మాత్రమే జమ చేసుకోవడం గమనార్హం. వెరసి 27,090 వద్ద ముగిసింది. -
రికార్డుల బాటలోనే...
యూఎస్ ఆర్థిక గణాంకాలు, యూఎస్ సహాయక ప్యాకేజీ వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పుంజుకున్నాయి. వెరసి వరుసగా మూడో రోజూ రికార్డుల బాటలోనే సాగాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు లాభపడి 26,560 వద్ద నిలవగా, 31 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 7,936 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్ట స్థాయి ముగింపులుకాగా, సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు లాభపడటం విశేషం! కాగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 26,599ను తాకగా, నిఫ్టీ 7,947కు చేరింది. యూరోపియన్ కేంద్ర బ్యాంక్ మరోసారి సహాయక ప్యాకేజీలకు సై అనడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకుల అంచనా. డిఫెన్స్ షేర్ల జోరు: ర క్షణ రంగ పరికరాల షేర్లకు భారీ డిమాండ్ కనిపించింది. రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడం ఇందుకు దోహదపడింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 20% జంప్‌చేయగా, ఆస్ట్రా మైక్రోవేవ్ 8%, బీఈఎంఎల్ 5% చొప్పున పుంజుకున్నాయి. మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ వార్తలతో యూకో బ్యాంక్ 8% పతనం అయ్యింది.