మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్‌ | Stock Market Affects GDP says market experts | Sakshi
Sakshi News home page

మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్‌

Dec 2 2024 4:51 AM | Updated on Dec 2 2024 8:05 AM

Stock Market Affects GDP says market experts

ఆర్‌బీఐ పాలసీపై దృష్టి 

గణాంకాలకూ ప్రాధాన్యం 

ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ ప్రసంగం

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కె ట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్‌ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఆటో గణాంకాలు 

నవంబర్‌ నెలకు ఆటో రంగ గణాంకాలు ఆశావహంగా వెలువడ్డాయి. పెళ్లిళ్ల సీజన్‌కుతోడు.. ఎస్‌యూవీలకు డిమాండ్‌ కొనసాగడంతో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. దీంతో సోమవారం(2న) ఆటో రంగ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అంచనాలను వమ్ము చేస్తూ జీడీపీ నెమ్మదించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడే వీలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. తయారీ, మైనింగ్‌తోపాటు వినియోగం తగ్గడం జీడీపీని దెబ్బతీసింది. జీడీపీ మందగమన ప్రభావం ఆర్‌బీఐ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని మిశ్రా తెలియజేశారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు.  

విదేశీ అంశాలు 

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భౌగోళిక అనిశి్చతులు మార్కెట్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌మీనా పేర్కొన్నారు. ప్రధానంగా రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. యూఎస్‌ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు, వ్యవసాయేతర రంగంలో ఉపాధి, నిరుద్యోగిత అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ పాల్క అరోరా చోప్రా వివరించారు. వీటికితోడు యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ ప్రసంగం(5న)పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు సంతోష్‌ మీనా పేర్కొన్నారు.  

ఆర్థిక గణాంకాలు 

దేశీయంగా ఈ వారం ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు అరోరా చోప్రా తెలియజేశారు. నవంబర్‌ నెలకు తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో తయారీ రంగ పీఎంఐ 57.3కు చేరగా.. సరీ్వసుల రంగ పీఎంఐ 59.5గా నమోదైంది. క్యూ2లో దేశ జీడీపీ నీరసించినప్పటికీ ప్రపంచ దేశాలలో వేగవంత వృద్ధిగా నిలవడం ప్రస్తావించదగ్గ అంశమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ వంటి అంశాలూ కీలకమేనని తెలియజేశారు.  

గత వారమిలా.. 

పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ నికరంగా 686 పాయింట్లు(0.9 శాతం) జంప్‌చేసింది. 79,803 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224 పాయింట్లు(1 శాతం) ఎగసి 24,131 వద్ద స్థిరపడింది.

అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు 
నవంబర్‌లో రూ. 21,612 కోట్లు 
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల(నవంబర్‌)లో నికరంగా రూ. 21,612 కోట్ల(2.56 బిలియన్‌ డాలర్లు) విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ మెరుగుపడటం, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం, దేశీ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే అంతక్రితం నెల(అక్టోబర్‌)తో పోలిస్తే నవంబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్‌ తగ్గింది. అక్టోబర్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ ఎఫ్‌పీఐలు దేశీ ఈక్విటీల నుంచి 11.2 బిలియన్‌ డాలర్లు(రూ. 94,017 కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement