
ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్న అమ్మకాలు
ఇప్పటివరకూ రూ. 23,710 కోట్లు వెనక్కి
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్‌పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్‌పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment