న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.
వీటిలో ఐకియో లైటింగ్, సెన్‌కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, నెట్‌వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్‌ఎఫ్‌బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్‌ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం..
ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్
స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది.
ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది.
సెల్లో వరల్డ్
సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది.
హ్యాపీ ఫోర్జింగ్స్
ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్‌మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్‌ఎం, ఎస్‌ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది.
18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో
టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు.
పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని
వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment