Primary markets
-
ఐపీవో వేవ్
న్యూఢిల్లీ: ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత వారం 4 ఇష్యూలు మార్కెట్లను పలకరించగా.. గురువారం(19న) మరో 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. 23న ముగియనున్న ఇవి 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. బుధవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనున్నాయి. వివరాలు చూద్దాం..ట్రాన్స్‌రైల్ లైటింగ్ ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధ ఈపీసీ సేవలందించే ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 410–432 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్ 1.01 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 839 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.డీఏఎమ్ క్యాపిటల్ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఏఎమ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 269–283 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 2.97 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. తద్వారా రూ. 840 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, విలీనాలు– కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్రోకింగ్, రీసెర్చ్లతోకూడిన సంస్థాగత ఈక్విటీల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కంపెనీ నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.కంకార్డ్ ఎన్విరో పర్యావరణ సంబంధ ఇంజనీరింగ్ సొల్యూషన్ల సంస్థ కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 665–701 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 46.41 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 500 కోట్లుపైగా సమ కూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధులను వాటర్ ట్రీట్మెంట్ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త అసెంబ్లీ యూనిట్(సీఈఎఫ్)లో ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రోకెమ్ సెపరేషన్ సిస్టమ్స్‌పై మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.సనాతన్ టెక్స్టైల్స్ విభిన్న యార్న్‌ల తయారీ కంపెనీ సనాతన్ టెక్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 305–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, గ్రూప్ సంస్థలు రూ. 150 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 550 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ టెక్స్టైల్స్, ఇండ్రస్టియల్ పాలియస్టర్, కాటన్ తదితర యార్న్లను కంపెనీ రూపొందిస్తోంది. -
ఐపీవో రష్.. లాభాల జాతర
గత క్యాలండర్ ఏడాది(2023)లో పబ్లిక్ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త కంపెనీల లిస్టింగ్స్‌తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం! ముంబై: స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్(బీఎస్ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్ఎస్ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి. రూ. 82 లక్షల కోట్లు గతేడాది(జనవరి–డిసెంబర్) దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్ టాప్–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్ చోటు సాధించింది. సగటున 45 శాతం ప్లస్ గతేడాది స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!! టాప్‌లో పీఎస్‌యూ ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్ డీఎల్ఎమ్ 155 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ 141 శాతం చొప్పున జంప్‌చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిస్టింగ్‌లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్ అత్యధిక ఐపీవోల మార్కెట్‌గా నిలిచింది. కారణాలున్నాయ్ బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్ 41 శాతం జంప్‌చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్ డిసెంబర్ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది! -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్‌వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్‌గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్‌చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్‌గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్‌డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
ఐపీవో బూమ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకియో లైటింగ్, సెన్కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, నెట్వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్ఎఫ్బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెల్లో వరల్డ్ సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది. హ్యాపీ ఫోర్జింగ్స్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది. 18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు. పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని వివరించారు. -
మళ్లీ పబ్లిక్ ఇష్యూల సందడి
న్యూఢిల్లీ: రెండున్నర నెలల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్‌కు జోష్ రానుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీలలో సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ నేడు(12న) ప్రారంభంకానుంది. ఎవలాన్ టెక్నాలజీస్ అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవో దరఖాస్తుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఫిన్‌కేర్ సాŠమ్ల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండోసారి సెబీకి దరఖాస్తు చేసింది. వివరాలు చూద్దాం.. ఎస్జీఎస్ టెక్.. నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐపీవో ద్వారా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 18న ముగియనున్న ఇష్యూకి రూ. 209–220 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇంతక్రితం మే 24–26న ఏథెర్ ఇండస్ట్రీస్ ఐపీవో చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 11 కంపెనీలు లిస్టింగ్ ద్వారా రూ. 33,254 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎల్ఐసీ వాటా రూ. 20,557 కోట్లు. కాగా.. సిర్మా ఎస్జీఎస్ ఐపీవోలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 33.69 లక్షల షేర్లను వీణా కుమారి టాండన్ విక్రయానికి ఉంచనున్నారు. నిధులను పెట్టుబడి వ్యయాలు, ఆర్అండ్డీ విస్తరణ, కార్పొరేట్ అవసరాలు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో ఏవో స్మిత్, టీవీఎస్ మోటార్, యురేకా ఫోర్బ్స్ తదితరాలున్నాయి. యథార్ధ్.. రెడీ ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవోకు సెబీ అనుమతించింది. ఇష్యూలో భాగంగా రూ. 610 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 65.51 లక్షల షేర్లను ప్రమోటర్లు, తదితర సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ ఏప్రిల్‌లో దరఖాస్తు చేసింది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎవలాన్ టెక్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవోకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,025 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 625 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫిన్‌కేర్.. మళ్లీ ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి లభించిన ఏడాది గడువు గత నెలలో ముగియడంతో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరోసారి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 1.7 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇంతక్రితం రూ. 1,330 కోట్ల సమీకరణకు 2021 మే నెలలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. అదే ఏడాది జులైలో సెబీ ఓకే చేసింది. బిబాకు చెక్ ఫ్యాషన్, సంప్రదాయ దుస్తుల కంపెనీ బిబా ఫ్యాషన్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాత్కాలికంగా చెక్ పెట్టింది. వివరాలు వెల్లడికానప్పటికీ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచినట్లు సెబీ వెబ్సైట్ పేర్కొంది. కంపెనీ ఏప్రిల్ 12న ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. 1986లో ఏర్పాటైన కంపెనీ బిబా బ్రాండుతో మహిళా ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తోంది. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
బాండ్లలోకి.. సేఫ్ రూట్
పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ బ్రోకర్ ద్వారా ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్బీఐ తీసుకొచ్చిన రిటైల్ డైరెక్ట్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం.. స్టాక్ మార్కెట్ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్) షేర్లను ఆఫర్ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్బీఐ బాండ్లను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్స్ తదితర ఇనిస్టిట్యూషన్స్ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి. ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ కాంపిటీటివ్ బిడ్ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్), డేటెడ్ సెక్యూరిటీలు (జీసెక్‌లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్డీఎల్) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్ జీసెక్‌లు, ఎస్డీఎల్ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్బీఐ దీన్ని కేలండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్బీఐ వేలం కేలండర్(షెడ్యూల్)ను ప్రకటిస్తుంది. ఆర్బీఐ పోర్టల్ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ► ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్‌వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్ల వేలం ఈల్డ్ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్‌లు సాధారణంగా ఈల్డ్ ఆధారితంగానే ఉంటాయి. కూపన్ రేటు ఆధారంగా బిడ్ వేసుకోవచ్చు. వేలం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తక్కువ కూపన్రేటును కటాఫ్ ఈల్డ్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్‌పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్‌లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్‌లో కటాఫ్ ఈల్డ్ కంటే తక్కువకు కోట్ చేసిన లేదా కటాఫ్ ప్రైస్ కంటే ఎక్కువకు కోట్ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్ ఈల్డ్/ధరల వద్ద కోట్ బిడ్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్‌లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. సెకండరీ మార్కెట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్) నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–వోఎం) ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్ కొనసాగుతుంటుంది. టెలిఫోన్ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్ ఆక్షన్ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆర్డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్డీఎస్–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్ మార్కెట్’, ‘ఆడ్ లాట్స్ విభాగం’ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ మార్కెట్లో ఒక లాట్ సైజ్ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్ కోసం ఆడ్లాట్స్ విభాగం పనిచేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్ వేళల్లో https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్ రేటు. జీసెక్ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్డ్ రేటు బాండ్లు కూడా వాటి కూపన్రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్ రేటు బాండ్లు ఎఫ్ఆర్బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్డీఎస్–వోఎం హోమ్‌పేజీలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఆర్బీఐ వద్ద ప్రారంభించే ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్ చేయడం లేదా, ఈమెయిల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. కాలవ్యవధి బాండ్ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్‌లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్ రేటును ఆఫర్ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఎంపిక చేసుకునే బాండ్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్‌కే పరిమితం కావడం మంచిది. సెక్యూరిటీ టీబిల్లు, జీసెక్‌లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మార్గం అనుకూలం. లిక్విడిటీ ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్లాట్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్డీఎస్–వోఎంలో ఆయా బాండ్‌కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్‌లలో ట్రేడ్ వ్యాల్యూమ్ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్డీఎల్లలో వ్యాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు.. -
లక్ష కోట్ల ఐపీవోలకు రెడీ
దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు ఇటీవల పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. జాబితాలో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, హెచ్డీబీ ఫైనాన్షియల్, ఆధార్ హౌసింగ్, డెలివరీ, సెంబ్‌కార్ప్ ఎనర్జీ తదితరాలున్నాయి. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీని పక్కనపెడితే.. రూ. లక్ష కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు ప్రకటించాయి. దీంతో ఈ కేలండర్ ఏడాది(2021)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులకు వేదికయ్యే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం... ముంబై: కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను కోవిడ్–19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా భారీగా నిధులను సమీకరించాలని ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది(2021)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. లక్ష కోట్లకుపైగా నిధులను సమీకరించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పబ్లిక్ ఇష్యూ బాటలో సాగనున్న ప్రధాన సంస్థలలో ఎన్ఎస్ఈ(రూ. 10,000 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్(రూ. 9,000 కోట్లు), ఆధార్ హౌసింగ్(రూ. 7,300 కోట్లు), డెల్హివరీ(రూ. 6,000 కోట్లు), సెంబ్‌కార్ప్ ఎనర్జీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(రూ. 5,000 కోట్లు), జొమాటో(రూ. 4,000 కోట్లు) తదితరాలను ప్రస్తావించవచ్చు. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో 2017లో నమోదైన చరిత్రాత్మక రికార్డులు బ్రేకయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రూ. 13,000 కోట్లు... ఈ ఏడాది ఇప్పటికే 9 కంపెనీలు ఐపీవోలను చేపట్టాయి. తద్వారా రూ. 13,000 కోట్లు సమకూర్చుకున్నాయి. గత వారం ఎంటార్ టెక్నాలజీస్ రూ. 597 కోట్లు, తాజాగా ఈజీ ట్రిప్ ప్లానర్స్ రూ. 510 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. వెరసి మరో రూ. 90,000 కోట్లకుపైగా సమీకరించే వీలుంది. ప్రస్తుత బుల్ రన్ నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా నైకా, పాలసీ బజార్, మాక్రోటెక్ డెవలపర్స్, సంహీ హోటల్స్, ఆరోహణ్ ఫైనాన్షియల్, కళ్యాణ్ జ్యువెలర్స్, పెన్నా సిమెంట్స్ తదితరాలు రూ. 3,500–1,500 కోట్ల మధ్య నిధులను సమకూర్చుకునే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో తాజాగా ఐపీవోకు అనుమతించమంటూ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాది లిస్టింగ్ యోచనలో ఉంది. ఎల్ఐసీ ఒక్కటే రూ. లక్ష కోట్ల ఐపీవోను చేపట్టే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతక్రితం ఐపీవోల ద్వారా 2017లో 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను సమీకరించాయి. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. బుల్ జోష్ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో 2020 మార్చి నుంచీ లిక్విడిటీ వెల్లువెత్తింది. వెరసి విదేశీ నిధులు అటు స్టాక్స్, ఇటు పసిడి తదితరాలలోకి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా 2020 ఆగస్ట్‌లో దేశీయంగా పసిడి 10 గ్రాములు రూ. 56,000ను అధిగమించగా.. విదేశీ మార్కెట్లో ఔన్స్ 2,070 డాలర్లను తాకింది. 2021లో సెన్సెక్స్ 52,000కు చేరింది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌పై దృష్టిసారించాయి. వివిధ రంగాలకు చెందిన బార్బిక్యు నేషన్, శ్రీరామ్ ప్రాపర్టీస్, కిమ్స్ హాస్పిటల్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్, లావా ఇంటర్నేషనల్, తదితర పలు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.1,000–3,000 కోట్ల మధ్య సమీకరించే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో మరో మూడు ఇష్యూలు ♦క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్ ♦లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ అనుపమ్ రసాయన్ ఈ నెలలో మరో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. శుక్రవారం(12) నుంచి అనుపమ్ రసాయన్ ఐపీవో ప్రారంభంకానుంది. షేరుకి రూ. 553–555 ధరలో ఇష్యూకి వస్తోంది. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇదే విధంగా సోమవారం(15) నుంచి క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. క్రాఫ్ట్స్‌మ్యాన్ షేరుకి రూ. 1488–1490 ధరలో ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇష్యూ ద్వారా రూ. 824 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇక లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ షేరుకి రూ. 129–130 ధరలో పబ్లిక్ ఇష్యూని చేపడుతోంది. తద్వారా రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఈ బాటలో కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలు రాను న్నాయి. వెరసి ఈ నెలలో రూ. 10,000– 12,000 కోట్ల నిధులను సమీకరించే వీలుంది. -
ఐపీవోలకు అచ్ఛేదిన్!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్)తో ప్రైమరీ మార్కెట్లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చి తులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా సబ్స్క్రయిబ్ అవుతాయన్న నమ్మకం ఉన్న కంపెనీలే వాటిని చేపట్టాయి. చాలా కంపెనీలు ఐపీవో ఇష్యూ చేపట్టాలని అనుకుంటున్నా, సానుకూల వాతావరణం కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని ఆఫర్ పత్రాలను దాఖలు చేసినా ముందుకు వెళ్లలేకపోయాయి. సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను భారీ తగ్గింపు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో పడ్డాయి. దీంతో ఐపీవో ఇష్యూలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గత రెండు నెలల్లో రూట్ మొబైల్, మాంటే కార్లో, మజ్గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ, ముంబైకి చెందిన పురానిక్ బిల్డర్స్ సంస్థలు సెబీ వద్ద ఐపీవో ఆఫర్ పత్రాలను మరోసారి దాఖలు చేశాయి. తాజాగా ఎస్బీఐకి చెందిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (క్రెడిట్‌కార్డు కంపెనీ) కూడా ఆఫర్ పత్రాలను దాఖలు చేసింది. వచ్చే కొన్ని నెలల్లో ఐపీవో కోసం యూటీఐ మ్యూచువల్ ఫండ్, పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐపీవో పత్రాలను సెబీ ముందు దాఖలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. 27 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్... ఇప్పటి వరకు సెబీ నుంచి ఐపీవో కోసం 27 కంపెనీలు అనుమతి పొందాయి. ఇవి ఐపీవో ఇష్యూల ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బజాజ్ ఎనర్జీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, పెన్నా సిమెంట్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ఏడు సంస్థల వరకు ఆఫర్ పత్రాలను దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఈ ఏడాది 14 కంపెనీలు కలసి సుమారు రూ.15,000 కోట్ల వరకు నిధులను ఐపీవో ద్వారా సమీకరించాయి. వీటిల్లో ఒక్కటి మినహా (స్టెర్లింగ్ అండ్ విల్సన్) అన్నీ ఇష్యూ ధర కంటే ఎక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ మాత్రం ఇష్యూ ధర కంటే నూరు శాతం మించి పెరిగాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరిగింది. స్థిరమైన ర్యాలీ ఉంటేనే... సెకండరీ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటే తప్ప, ప్రైమరీ మార్కెట్లో (ఐపీవోలు) వాతావరణం మారకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా రివకరీ సంకేతాలు ఇవ్వలేదని, కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లిక్విడిటీ (నిధుల రాక) ఆధారంగా జరుగుతున్న ప్రస్తుత మార్కెట్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది బ్రోకరేజీల అభిప్రాయం. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగింది. ‘‘ఈ ఏడాది పలు ఐపీవోలకు అనుమతుల గడువు కూడా తీరిపోయింది. తాము ఆశిస్తున్న ధరకు తగినంత డిమాండ్ లేని పరిస్థితుల్లో ఇదే వాతావరణం కొనసాగొచ్చు’’ అని ప్రైమ్ డేటా బేస్ ఎండీ ప్రణవ్ హల్దియా పేర్కొన్నారు. ‘‘మార్కెట్లో ఇప్పటికీ ఎంతో అనిశ్చితి ఉంది. తిరిగి ఆఫర్ పత్రాలను దాఖలు చేయడం వల్ల ఈ వాతావరణం మెరుగుపడిన వెంటనే ఐపీవోలకు వచ్చేందుకు కంపెనీలకు వీలు కలుగుతుంది’’ అని పీఎల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ దారా కల్యాణి వాలా చెప్పారు. మంచి ఇష్యూలకు భారీ డిమాండ్ ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి వ్యాపార నమూనాలు కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణే దక్కింది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్, పాలీక్యాబ్, నియోజన్ కెమికల్స్, సీఎస్బీ బ్యాంకు ఇష్యూలకు భారీ స్పందనే లభించింది. లిస్టింగ్‌లోనూ లాభాలు కురిపించాయి. ఐఆర్సీటీసీ షేరు ఇష్యూ ధర రూ.320 కాగా, లిస్టింగ్‌లోనే వాటాదారులకు 100% లాభాలిచ్చింది. యాఫ్లే ఇండియా కూడా ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటికే 119% ర్యాలీ చేసింది. కేరళకు చెందిన సీఎస్బీ బ్యాంకు ఇష్యూ ఈ నెల 27న ముగియగా 87 రెట్లు అధికంగా బిడ్లు రావడం గమనార్హం. వచ్చే వారం మొదలయ్యే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు, త్వరలో రానున్న ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూకు సైతం మంచి స్పందన ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. త్వరలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో... ఇష్యూ సైజు రూ.9,500 కోట్ల రేంజ్లో... ముంబై: ఎస్బీఐకు చెందిన దేశంలోనే రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డ్ కంపెనీ... ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో పత్రాలను సెబీకి బుధవారం సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో ఎస్బీఐ, కార్లైల్ గ్రూప్‌నకు చెందిన సీఏ రోవర్ హోల్డింగ్స్ సంస్థలు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మొత్తం మీద ఈ ఐపీవో సైజు రూ.8,000–9,500 కోట్ల రేంజ్లో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీ విలువ రూ.65,000 కోట్ల మేర ఉండగలదని అంచనా. సెబీ ఆమోదం లభిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. వచ్చే ఏడాది మార్చిలోనే మార్కెట్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. -
పెట్టుబడుల తీరుపై సెబీ సర్వే
ఇన్వెస్టర్ల నుంచి వివరాల సేకరణకు సన్నాహాలు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సర్వే న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుపై సర్వేను నిర్వహించనుంది. తద్వారా దేశీ కుటుంబాల పొదుపు, పెట్టుబడుల ట్రెండ్‌పై అధ్యయనం చేయనుంది. ఈ విషయంలో సెక్యూరిటీల మార్కెట్‌పై పడినప్రభావం, ఏర్పడిన మార్పులు తదితర అంశాలపై వివరాలను సేకరించనుంది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇన్వెస్టర్ సర్వేను చేపట్టనుంది. దీనిలో భాగంగా 50,000 కుటుంబాలు, 1,000 మంది స్టాక్ ఇన్వెస్టర్ల నుంచి వివరాలను సేకరించనుంది. సెబీ ఇంతక్రితం ఇలాంటి సర్వేను 2008-09లో మాత్రమే చేపట్టింది. రిస్క్ ప్రొఫైల్‌పై అవగాహన పొదుపు, పెట్టుబడులు, సెక్యూరిటీ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలపట్ల ఆసక్తి తదితర అంశాల ఆధారంగా ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం(ప్రొఫైల్)ను అంచనా వేయనున్నట్లు సెబీ తెలిపింది. దీంతోపాటు ఇన్వెస్టర్ల అవగాహనను పెంచేందుకు చేపడుతున్న విద్యా సంబంధ కార్యక్రమాల ప్రభావాన్ని తెలుసుకోనున్నట్లు వివరించింది. ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వే నిర్వహించనుంది. బోనస్ షేర్ల విక్రయానికి ఓకే ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిచ్చే బాటలో బోనస్ షేర్ల విక్రయానికి సంబంధించి సెబీ నిబంధనలను సవరించనుంది. ఏదైనా ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు లేదా ఇతర ఇన్వెస్టర్లు తమకు లభించిన షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించనుంది. బోనస్ షేర్ల కేటాయింపు జరిగి ఏడాది పూర్తికానప్పటికీ విక్రయించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కేటాయించిన బోనస్ షేర్లను ఐపీవోలో అమ్ముకునేందుకు వీలులేదు