Solid
-
ఎస్బీఐ లాభం అప్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది. -
ఐపీవో బూమ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకియో లైటింగ్, సెన్కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, నెట్వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్ఎఫ్బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెల్లో వరల్డ్ సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది. హ్యాపీ ఫోర్జింగ్స్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది. 18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు. పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని వివరించారు. -
అత్యంత పురాతన పదార్థమిదే
వాషింగ్టన్: భూమిపైన దొరికిన అత్యంత పురాతనమైన ఘన పదార్థం ఒకదాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహశకలం లోపల నిక్షిప్తమై ఉన్న ఈ పదార్థం సౌర కుటుంబం ఏర్పడక ముందు కాలం నాటిది కావడం విశేషం. యాభై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో దొరిగిన గ్రహశకలంలో ఈ పదార్థం ఉందని, సుమారు 700 కోట్ల ఏళ్ల క్రితం కొత్త నక్షత్రాలు ఏర్పడిన కాలం నాటి పరిస్థితులకు ఇది సాక్ష్యమని పీఏఎన్‌ఎస్ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ పదార్థం నక్షత్రాల నమూనా అని, అసలైన నక్షత్ర ధూళి అని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, షికాగో వర్శిటీకి చెందిన ఫిలిప్ హెక్ తెలిపారు. భూమ్మీద రాలిపడే గ్రహ శకలాల్లో కేవలం ఐదు శాతం వాటిల్లో ఇలాంటి నక్షత్రధూళి లేదా ప్రీసోలార్ గ్రెయిన్స్ ఉంటుందని హెక్ తెలిపారు. వీటిని గుర్తించేందుకు ముందుగా గ్రహశకలాన్ని పేస్ట్‌లా మారుస్తారని తెలిపారు. యాసిడ్‌లో ఈ పేస్ట్‌ను ముంచినప్పుడు ప్రీ సోలార్ గ్రెయిన్స్ మాత్రమే మిగిలి, మిగిలినదంతా కరిగిపోతుందన్నారు. వీటిని వేరు చేసి పరిశీలించడం ద్వారా ఆ రేణువులు ఏ నక్షత్రం నుంచి వచ్చాయో తెలుస్తుందని చెప్పారు. -
వీరజవాన్లకు ఘన నివాళి
శాలిగౌరారం యూరీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ స్థానిక స్వయంకృషి యువజన సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రాంరంభించిన ఆత్మశాంతి కొవ్వొత్తుల ర్యాలీ శాలిగౌరారం, బాలిశెట్టిగూడెం మీదుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తావద్ద శాలిగౌరారం–నకిరేకల్ ప్రధాన రోడ్డుపై మౌనం నిర్వహించి అమరవీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆ యువజన సంఘం నాయకులు బట్ట వెంకటయ్య, కూతాటి సోములు, బట్ట లక్ష్మినారాయణ, శ్రీనివాస్, పీరయ్య, వీరబాబు, వినయ్, కుమార్, గుండ్లపల్లి రమేశ్, వెంకటయ్య, బోడ లింగయ్య, నిమ్మల శంకర్, తోటకూరి బాబు, వడ్లకొండ బిక్షం, రమేశ్, చిలుకూరి బిక్షం, సుంచు మైసయ్య, తాటిపాముల రాములు, శివ, మోష, ఈర్ల సైదులు, రాగి ఏసోబు, ఇంద్రకంటి శ్రీను, మద్ది రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొని తమ ఆధ్యాత్మిక గురువు సత్యసాయికి హృదయ నివేదనను అర్పించుకున్నారు. ఉదయం తొలుత సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ విద్యార్థులు తమ గురువు సత్యసాయికి గురు వందనం సమర్పించుకున్నారు. గురుబ్రహ్మ నీవే..ప్రేమ జ్యోతి నీవే అంటూ విద్యార్థులు నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవాళికి మంచిని బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన జగద్గురువు సత్యసాయి అని కొనియాడారు.ఈసందర్భంగా సత్యసాయి ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏథెన్స్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి జార్జి బెబిడిలిస్ గురుపౌర్ణమి విశిష్టతను,సత్యసాయి వైభవాన్ని,ఆధ్యాత్మిక గురువుగా సత్యసాయి సందేశాన్ని వివరించారు. చెన్నైకి చెందిన కుమారి సంతాల సుబ్రమణియం వేణుగాణ కచేరి నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్ పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులతోపాటు,సేవా సంస్థల ప్రముఖలు పాల్గొన్నారు. -
ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’లే!
సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనలో ఓ గమ్మత్తై విషయం ఉంటుంది. మరక మంచిదని! ఎందుకంటే అల్లరి చేసేటప్పుడు బట్టలు మురికవుతాయని. అల్లరి మానేస్తే పిల్లలు మానసికంగా ఎదగరని.అలాగే... కొవ్వు మంచిదే!మంచి కొవ్వు చాలా మంచిది.విటమిన్లను వృథా కాకుండా శరీరంలో ఇంకేలా చేస్తుంది. అలా అని కొవ్వును మరీ ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’ కావడం ఖాయం. ఏ మోతాదులో కొవ్వు మంచిదో...ఎక్కువైతే నష్టాలేమిటో...మీకు తెలియజేయడానికే ఈ కథనం. కొవ్వెక్కువైతే ముప్పు తప్పదని అందరికీ తెలిసిందే. అయితే, ఒంట్లో కొవ్వు తక్కువైనా చిక్కులు తప్పవు. ఆరోగ్యం సజావుగా ఉండాలంటే హెచ్చుతగ్గులకు తావు లేకుండా, శరీరానికి సమపాళ్లలో కొవ్వులు అందాల్సిందే. చాలామందిలో భయాలు ఉన్నట్లుగా కొవ్వులన్నీ చెడ్డవి కాదు. కొవ్వుల్లోనూ మంచి కొవ్వులు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వును హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఆరోగ్యానికి చేటు చేసే చెడు కొవ్వును లోడెన్సిటీ లైపో ప్రొటీన్ (ఎల్డీఎల్) అంటారు. గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీసే చెడు కొవ్వులనే సామాన్య పరిభాషలో కొలెస్ట్రాల్ అంటారు. గ్రీక్‌లో ఖొలె అంటే అంటే పిత్త సంబంధమైన కొవ్వు. స్టెరాల్ అంటే ఘనరూపం (సాలిడ్ లేదా స్టిఫ్) అని అర్థం. స్థూలంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ అంటే ఘనరూపంలో కొవ్వు. కొవ్వుల హెచ్చతగ్గుల వల్ల సమస్యలు కొవ్వు మన జీవక్రియలకు అవసరం. పిండ దశ నుంచి రెండేళ్ల వయసు వరకూ అన్ని రకాల పెరుగుదలకు, మానసిక ఎదుగుదలకు అది అత్యావశ్యకం. అందుకే మన కాలేయం దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. కాకపోతే వినియోగం కంటే ఎక్కువ తయారవుతూ ఉండటం, ఆహారం ద్వారా మనం తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదుకు మించి పెరుగుతుంది. స్పర్శకు వెన్నలా అనిపించే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీన్నే ప్లాక్ అని కూడా అంటారు. రక్త ప్రసరణకు అది అడ్డుపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదు పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోయినప్పుడు అది గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటునూ, మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో పేరుకుంటే పక్షవాతాన్నీ కలిగించవచ్చు. కాళ్లల్లోని నరాల్లో పరిమితికి మించిన కొవ్వులు పేరుకుపోతే, చివరకు ఆంప్యుటేషన్ (అవయవాన్ని తొలగించడం) తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, కొవ్వులు తక్కువైనా మనకు ఇబ్బందులు తప్పవు. శరీరానికి పోషణను అందించే విటమిన్లలో కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్లు శరీరానికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. వాటి లోపం వల్ల కంటి సమస్యలు, ఎముకల బలహీనత, చర్మం కాంతివిహీనం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కళ్లలో కొవ్వు... కళ్లలో ఉండే నల్లగుడ్డు కార్నియా చుట్టూ ఒక అంచులాగా కొలెస్ట్రాల్ ఉంటుంది. జాగ్రత్త గమనించే డాక్టర్లు దీన్ని గుర్తించగలరు. ఈ తెలుపు అంచు ఉన్నంత మాత్రాన గుండెకు కొవ్వు చేరే అవకాశం ఉందని నిర్ధారణ కాదు. అయితే దాన్ని చూడగానే కనురెప్పలను కూడా పరిశీలిస్తారు. కనురెప్పల్లో కొవ్వు పేరుకొని ఉంటే దానిని వైద్య పరిభాషలో ‘జాంథలాస్మా’ అంటారు. దీని వల్ల గుండెజబ్బులు రాగల అవకాశాలను డాక్టర్లు ఐదేళ్ల ముందే తెలుసుకోగలరు. కండ కాదు... ఇది కొవ్వుండ... వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ కొందరిలో కొవ్వు ఒకచోట చేరి ఒంటిపై చిన్న చిన్న ఉండల్లా కనిపిస్తుంటుంది. ఇవి సాధారణంగా శరీరంపై అన్ని భాగాల్లో వచ్చే అవకాశం ఉన్నా ప్రధానంగా మోచేయి, మోకాలు, చేతులపై ఎక్కువగా కనిపిస్తాయి. కొవ్వు నిండి ఉండే ఈ ఉండలను దీన్ని కొవ్వుండ అనుకోవచ్చు. వైద్యపరిభాషలో ‘గ్జాంథోమా’ అని పిలుస్తుంటారు. తరాల తరబడి తరగని కొవ్వు... కొంతమందికి కుటుంబాల్లో అందరికీ జన్యుపరంగా అత్యధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కండిషన్‌ను ‘హైపర్ కొలెస్టరాలేమియా’ అంటారు. దీనికి కుటుంబం అందరికీ చికిత్స అవసరం. ఇక కొలెస్ట్రాల్ తయారయ్యే తీరు జన్యుపరంగా నిర్ణీతమవుతుంది. ఇలాంటి కుటుంబాల వారిలో పదేళ్ల వయసు నుంచే వారికి రక్త పరీక్షలు అవసరం. ఇక కొన్ని కుటుంబాల వారు తరాల తరబడి శాకాహారులే అయినా జన్యుపరంగా వారసత్వంగా వారిలో కొలెస్ట్రాల్ తయారీ ఎక్కువగా ఉండి, గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో కొవ్వులు పేరుకునే కుటుంబ చరిత్ర లేనివాళ్లు సాధారణంగా 40 ఏళ్ల వయసు దాటాక తప్పసరిగా డాక్టర్లు సూచించిన వ్యవధిలో రక్తంలో కొవ్వు పాళ్లు పరిశీలించుకుంటూ ఉండాలి. కణానికీ కణానికీ మధ్య బంధం కొలెస్ట్రాల్... కణాల మధ్య బంధం పటిష్టానికి కొవ్వు కావాల్సిందే. ప్రతి సెల్ మెంబ్రేన్లోని కొవ్వు కణాలు ఒకదానితో మరొకటి అంటుకుని ఉండేందుకు తోడ్పడతాయి. చర్మకణాలలో ఉండి కవచంలా అల్ట్రా వయెలెట్ కిరణాల బారి నుంచి కాపాడుతుందీ మంచి కొవ్వు. అంతేకాదు... సూర్యుడి నుంచి అందే కిరణాలను ఉపయోగించి, చర్మం డి విటమిన్‌ను ఉత్పత్తి చేసుకునేందుకూ దోహదపడుతుంది. కొవ్వు పెరిగిన ప్రతిసారీ అది చేటు కాదు. కాకపోతే కొవ్వొత్తిలోని కొవ్వులా వెలుగుతూ కరుగుతూ జీవితానికి వెలుగునివ్వాలి. కొవ్వు కరగకపోతేనే ఇబ్బంది. తిండీ, శారీరక శ్రమతో అదుపులోకి రాకపోతే మందులతోనైనా దాన్ని అరిగించుకోండి. కొవ్వులు ఎక్కువైనప్పుడు కనిపించే లక్షణాలు చాలా సందర్భాలలో రక్తపరీక్ష చేయించే వరకు ఒంట్లో కొవ్వులు పెరుగుతున్న విషయం తెలియకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో శరీరంలో కొవ్వు పెరుగుతోందని. తొలుత ఉండలా, తర్వాత కొండలా పేరుకుంటోందని నిపుణులకు ముందే తెలుస్తుంది. ఒంట్లో అనవసరంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటే కొందరిలో మెడ వద్ద, చంకల వద్ద ఎక్కువ సంఖ్యలో పులిపిర్లు ఏర్పడతాయి.. కొవ్వుతో లవ్వెందుకు పెంచుకోవాలంటే..? కొవ్వు లేకపోతే లవ్వు అనే మాటకు అర్థమే లేదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ లేకపోతే మనలో సెక్స్ కోరికలను పెంచే హార్మోనులు చక్కగా తయారుకావు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ తయారీకీ, మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికీ దోహదం చేసేది ఈ కొవ్వే. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే... తినాల్సిన, తినకూడని పదార్థాలు... తినాల్సినవి ►{పతిరోజూ కనీసం 20 - 35 గ్రాముల పీచుపదార్థాలు తీసుకోవాలి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, పొట్టుతీయని గోధుమలతో చేసిన బ్రెడ్, వాల్నట్, బాదం వంటి నట్స్, తాజాపండ్లు. ►వేరుశనగలు, అవిసె గింజలు, పాప్‌కార్న్, శాకాహార నూనెలు, ఉడికించిన కూరగాయలు ►ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్, సార్డిన్, హెర్రింగ్ వంటి చేపలు, చికెన్ తినకూడనివి ►నూనెల్లో బాగా వేయించిన వేపుళ్లు, పిజ్జా, బర్గర్లు, మిర్చిబజ్జీలు వంటి జంక్‌ఫుడ్ ►కొవ్వులు ఎక్కువగా ఉండే వేటమాంసం, రొయ్యలు, పీతలు వంటి మాంసాహారం కొలత పెరిగితే కలత... ►మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) 40 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉండాలి. ►చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. ►మంచి, చెడు కలిసిన కొవ్వులు 140-200 ఎంజీ/డీఎల్ ఉంటే నార్మల్. 4200-239 ఉంటే అది బార్డర్‌లైన్. ► 240 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉంటే అది హైకొలెస్ట్రాల్ అని గుర్తిస్తారు. - ఇన్పుట్స్: డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్