ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి
Published Wed, Jul 20 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొని తమ ఆధ్యాత్మిక గురువు సత్యసాయికి హృదయ నివేదనను అర్పించుకున్నారు. ఉదయం తొలుత సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ విద్యార్థులు తమ గురువు సత్యసాయికి గురు వందనం సమర్పించుకున్నారు. గురుబ్రహ్మ నీవే..ప్రేమ జ్యోతి నీవే అంటూ విద్యార్థులు నృత్యప్రదర్శన నిర్వహించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవాళికి మంచిని బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన జగద్గురువు సత్యసాయి అని కొనియాడారు.ఈసందర్భంగా సత్యసాయి ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వినిపించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏథెన్స్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి జార్జి బెబిడిలిస్ గురుపౌర్ణమి విశిష్టతను,సత్యసాయి వైభవాన్ని,ఆధ్యాత్మిక గురువుగా సత్యసాయి సందేశాన్ని వివరించారు. చెన్నైకి చెందిన కుమారి సంతాల సుబ్రమణియం వేణుగాణ కచేరి నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్ పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులతోపాటు,సేవా సంస్థల ప్రముఖలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement