గురుపౌర్ణమి విశిష్టత: గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలి? | Guru Purnima 2024: Why Do We Celebrate Puja Rituals And Significance | Sakshi
Sakshi News home page

గురుపౌర్ణమి విశిష్టత: గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలి?

Published Sun, Jul 21 2024 7:40 AM | Last Updated on Sun, Jul 21 2024 11:21 AM

Guru Purnima 2024: Why Do We Celebrate Puja Rituals And Significance

ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా పరిగణించడం సాంప్రదాయం. ఈరోజు వ్యాస దేముడని గురువుగా భావించి వ్యాస పీఠం మీద భారత, భాగవతాది పవిత్ర గ్రంధాలను ఏర్పాటు చేసుకొని, వ్యాస, లేక విష్ణు అష్టోత్తర నామాలతో పూజించు కోవడం మన సాంప్రదాయం. అలాగే మనకు భగవద్ జ్ఞానాన్ని, ఓసగిన గురువులను నూతన వస్త్రాలతో దక్షిణ తాంబూలాలతో సత్కరించు కోవడం ఒక సాంప్రదాయం. అదే విధంగా వేదం ప్రతిపాదించిన మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, రమణ మహర్షి శంకరాచార్యులు వంటి వారిని పూజించి తరించాలి.

గిరి ప్రదక్షిణ :- అవకాశం ఉన్నవారు గోవర్ధనం, అరుణగిరి, సింహాచలం వంటి గిరులకు పరిక్రమ చేయడం ఆధ్యాత్మికంగా. ఆరోగ్య పరంగా చాలా ఉత్తమం. ఈరోజు రాత్రి సమయం లో చంద్ర కిరణాలలో ఓషధీ తత్వం ఉండి మనస్సు, ప్రశాంతత చిక్కుతుంది. ఇది అవకాశం లేని వారు ఈరోజు రాత్రి చంద్రోదయం తరువాత వెండి గిన్నెలో ఆవుపాలు పోసి అందులో ఏలక పొడి పటిక బెల్లం కలిపి ఆ గిన్నెను చంద్రకిరణాలు సోకే విధంగా తులసికోట వద్ద ఉంచి లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం చేసి ఆ లలితా అమ్మ వారికి నివేదన చేసి ఇంటిల్ల పాదీ తీర్థంగా తీసుకొంటే వారిపై ఆ తల్లీ కరుణ సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మన గురు పరంపర స్మరించుకోవడం ఉత్తమం.

నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాఽస్య శిష్యం ...ఈరోజు ఈ శ్లోకం చదువు కుని గురు పరంపర స్మరించు కోవాలి. అదే విధంగా వ్యాసో నారాయణో హరిః. అనే నామాన్ని జపించుకోవాలి. గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు.!!

గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం. ‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశాన్నిఅందిస్తాడు!!

జగద్గురువు అయిన తను కూడా ప్రకృతి నుండి గురువులను గ్రహించానుఅని దత్తగురువు చెప్పాడు!! శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యదురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానము ఇచ్చాడు!! “యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు(24) గురువులున్నారు!!

జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము (కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు !!
ఇవి నా గురువులు.వాటి నుంచి గ్రహించినది విను.

  •  భూమి నుం – క్షమా, పరోపకారత్వం!!

  • వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము!!

  •  ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం!!

  • జలం నుంచి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం!!

  •  అగ్ని నుంచి – తేజస్సు, ఈశ్వరతత్త్వం!!

  • సూర్యుని నుంచి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే!!

  •  చంద్రుని నుంచి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.!!

  •  పావురాల జంట నుంచి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.!!

  • అజగరము నుంచి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.!!

  •  సముద్రం నుంచి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.!!

  •  మిడత నుంచి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.!!

  • తేనెటీగ నుంచి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!!

  •  గజం నుంచి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.!!

  • మధుహారి నుంచి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.!!

  • లేడి నుంచి – అమాయకత్వంలో సంగీతం మోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.!!

  •  చేప నుంచి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!!

  •  పింగళ నుంచి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.!!

  •  కురరము నుంచి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.!!
    బాలుడు నుంచి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.!!

  •  కన్యక నుంచి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.!!

  •  శరకారుడు నుంచి–ఏకాగ్రతనుసాధిస్తాడు!

  • సర్పము నుంచి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.!!

  • సాలెపురుగు నుంచి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.!!

  •  పురుగు నుంచి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల భగవత్ రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).

అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు.!!. ఇక, ఆచార్యులు గురువులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే!!

(చదవండి: తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement