రేపు సప్తధామంలో గురుపౌర్ణమి వేడుకలు | Gurupaurnami celebrations in saptadhamam Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సప్తధామంలో గురుపౌర్ణమి వేడుకలు

Published Mon, Jul 18 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

రేపు సప్తధామంలో గురుపౌర్ణమి వేడుకలు

రేపు సప్తధామంలో గురుపౌర్ణమి వేడుకలు

పోచమ్మమైదాన్‌ : వరంగల్‌ ములుగురోడ్డులోని సప్తధామంలో మంగళవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు త్రిపురనేని గోపీచంద్‌ తెలిపారు. వరంగల్‌ బ్యాంకు కాలనీలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సప్తధామంలోని ఆలయంలో అభిషేకం, అర్చన, హారతితో పాటు సామూహిక భజన, పూజ, గురుపూజ ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత శ్రీసద్గురు శివానందమూర్తి గురువు సందేశం వినిపిస్తామని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రప్రభు త్వం చేపడుతున్న హరితహారంలో భా గంగా సప్తధామంలో మెుక్కలు నాటనున్నామని గోపీచంద్‌ వివరించారు. ఈ మేరకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో సోమ రామయ్య, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement