గురు పూజోత్సవం స్పెషల్.. | Guru Pujotsavam Guru Position Indian Culture Telangana Special Story | Sakshi
Sakshi News home page

గురు పూజోత్సవం స్పెషల్..

Published Thu, Sep 5 2024 8:33 AM | Last Updated on Thu, Sep 5 2024 9:07 AM

Guru Pujotsavam Guru Position Indian Culture Telangana Special Story

శిథిలమైన బడిని.. గుడిని చేసి..

షాబాద్‌: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్‌.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు.

‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్‌ యూపీఎస్‌ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది. 1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్‌ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్‌లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం. కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్‌ బోధన కొనసాగించాను.

పూర్వపు విద్యార్థులు అనంతరెడ్డికి బహుమతిగా ఇచ్చిన బుల్లెట్‌ బండి..

హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్‌ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్‌ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  

ఆటపాటలతో పాఠాలు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కవిత టీచర్‌ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.

గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్‌ ల్యాడర్‌ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్‌ కాన్సెప్ట్‌ గేమ్‌ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు. అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్‌ లెరి్నంగ్‌ మెటీరియల్‌ను ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

మా‘స్టారు’.. శేషగిరి సారు..
బషీరాబాద్‌: నెల జీతం కోసం పనిచేసే వారు కొందరుంటే.. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి పాఠాలు చెప్పే సార్లు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే శేషగిరి సారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతన్‌గౌడ్‌తండాలో ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలతో విద్యార్థులు, గ్రామస్తుల మనసు గెలుచుకున్నారు. 2018లో మంతన్‌గౌడ్‌ స్కూల్‌కు వచ్చిన ఆయన గత జూలై వరకూ పనిచేశారు.

మట్టిగణపతులను చేయిస్తున్న శేషగిరి

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో మా సారు మాకే కావాలి.. అంటూ గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రంఅందజేశారు. ఆయన రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చేశారు. స్కూల్‌ ఆవరణలోనే కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజనం కోసం వాడేలా చేశారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించారు.

అంతేకాదు.. ఏటా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లి, చారిత్రక ప్రదేశాలను చూపించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం.. మట్టితో వినాయకులను తయారు చేయించి గ్రామంలో ఇంటింటా మట్టి వినాయకులే ప్రతిష్టించేలా మార్పు తీసుకొచ్చారు. సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పిల్లల విషయంలో జాగ్రత్తలు బో ధించేవారు. అందుకే సారు బదిలీ అయ్యారనేసరికి. ఊరంతా కదిలివచ్చింది. కన్నీరు రాల్చింది.


శేషగిరి, ఉపాధ్యాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement