Guru dev
-
గురు పూజోత్సవం స్పెషల్..
షాబాద్: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు.‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్ యూపీఎస్ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది. 1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్‌లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం. కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్ బోధన కొనసాగించాను.పూర్వపు విద్యార్థులు అనంతరెడ్డికి బహుమతిగా ఇచ్చిన బుల్లెట్ బండి..హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆటపాటలతో పాఠాలు..సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కవిత టీచర్ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్ ల్యాడర్ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్ కాన్సెప్ట్ గేమ్ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు. అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్‌ను ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.మా‘స్టారు’.. శేషగిరి సారు..బషీరాబాద్: నెల జీతం కోసం పనిచేసే వారు కొందరుంటే.. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి పాఠాలు చెప్పే సార్లు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే శేషగిరి సారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్గౌడ్తండాలో ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలతో విద్యార్థులు, గ్రామస్తుల మనసు గెలుచుకున్నారు. 2018లో మంతన్‌గౌడ్ స్కూల్‌కు వచ్చిన ఆయన గత జూలై వరకూ పనిచేశారు.మట్టిగణపతులను చేయిస్తున్న శేషగిరిఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో మా సారు మాకే కావాలి.. అంటూ గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రంఅందజేశారు. ఆయన రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చేశారు. స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజనం కోసం వాడేలా చేశారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించారు.అంతేకాదు.. ఏటా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లి, చారిత్రక ప్రదేశాలను చూపించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం.. మట్టితో వినాయకులను తయారు చేయించి గ్రామంలో ఇంటింటా మట్టి వినాయకులే ప్రతిష్టించేలా మార్పు తీసుకొచ్చారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పిల్లల విషయంలో జాగ్రత్తలు బో ధించేవారు. అందుకే సారు బదిలీ అయ్యారనేసరికి. ఊరంతా కదిలివచ్చింది. కన్నీరు రాల్చింది.శేషగిరి, ఉపాధ్యాయుడు -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు
వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా)/రాజమహేంద్రవరం సిటీ: షాలిమార్ నుంచి నాగర్‌కోయిల్ అప్‌లైన్‌లో వెళుతున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. ఎస్–5 బోగీలోని బ్రేక్ వీల్ యాక్సిల్‌లోకి ఎస్ఈజే (సెల్ఫ్ ఎడ్జస్టింగ్ జాయింట్), చెక్ రెయిల్ చొచ్చుకుపోవడంతో రైలు కదలికల్లో మార్పు వచ్చింది. దీన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కవిటగ్రహారం గేటు కీ ఉమన్ కె.రాధారాణి పూండి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమిచ్చారు. ఆయన పూండికి అతి సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేటు 381 వద్ద అర్థాంతరంగా రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మూడు గంటలపాటు గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ పూండిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నౌపడ ఎస్ఎస్ఈ చంద్రశేఖరరావు, సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది, రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూండిలోని సంతోషిమాతా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని కర్ని గురు సహకారంతో చెక్ రైల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు. మరమ్మతుల అనంతరం రైలు విశాఖకు బయలుదేరింది. మళ్లీ విరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ చెన్నై నుంచి హౌరా వెళ్లే కోరమండల్ (12842) ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ మరోసారి విరగడంతో గురువారం రాత్రి గంటన్నర పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా ఎస్–9 కోచ్ బాలిస్టర్ స్ప్రింగ్ విరగడాన్ని సీనియర్ గ్రేడ్ టెక్నీషియన్ గుర్తించాడు. విషయాన్ని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సత్యనారాయణకు చెప్పడంతో అతడు తన సిబ్బందితో వచ్చి గంటన్నర పాటు శ్రమించి కొత్త స్ప్రింగ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రైలు రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరింది. కాగా, ఇదే రైలుకి ఈ నెల 21న ఎస్–4 బోగీ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగిన సంగతి తెలిసిందే. -
..ష్ గప్ చుప్!
తాడిపత్రి : తాడిపత్రి సమీపంలోని గెర్డెవ్ ఉక్కు కర్మాగారంలో కార్మిక చట్టాలు అమలవుతున్న తీరుపై స్థానిక పోలీసుల విచారణ మొక్కుబడిగా సాగింది. ఏదైనా ఒత్తిడా.. లేక మరో కారణమో తెలీదు కానీ విచారణ సాగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. ఒడిశా కార్మికులను నిర్బంధించి.. జీతాలు ఇవ్వకుండా వారితో చాకిరీ చేయించుకుంటున్న విషయాన్ని ‘లోగుట్టేంటి?’ శీర్షికన సాక్షి గురువారం వెలుగులోకి తేవడంపై జిల్లా ఎస్పీ స్పందించారు. వెంటనే విచారణ చేపట్టాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐ రఘుప్రసాద్ గురువారం సాయంత్రం గెర్డెవ్ కర్మాగారంలోని లేబర్ కాలనీకి వెళ్లారు. పోలీసులు వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న యాజమాన్యం.. కాలనీలో ఎక్కువ మంది కార్మికులు లేకుండా జాగ్రత్త తీసుకుంది. కూలీలు కాని వారిని.. కూలీలుగా చూపుతూ పోలీసుల ముందుంచింది. కాసేపు వారితో మాట్లాడిన పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమన్యంతో కానీ, కార్మికులతో పని చేయిస్తున్న కాంట్రాక్టర్‌తో కానీ మాట్లాడలేదు. అనంతరం రూరల్ పోలీస్టేషన్లో విలేకరులతో సీఐ మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా 18 మంది కార్మికులను ఒడిశా రాష్ట్రానికి తరలించిన మాట వాస్తవమేనన్నారు. ఇంకా నిర్బంధంలో ఉన్న కార్మికుల గురించి విచారణ చేస్తున్నామన్నారు. తాము వెళ్లిన సమయంలో కార్మికులు పని చేస్తుండటంతో పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఫొటోను మీడియాకు అందజేశారు. ఆ ఫొటోలో ఉన్న వారు కార్మికులంటే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన యాజమాన్యం సెక్యూరిటీ విభాగం అధికారులపై తాడిపత్రి ప్లాంట్ ప్రధాన ఇన్చార్జి జార్జి ఆగ్ర హం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. హైదరాబాద్‌లో ఉన్న ఉప ప్రధాన కార్యాలయంలోని అధికారులు దీనిపై నివేదిక తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికులకు సంబంధించి ప్రధాన కాంట్రాక్ట్ పొందిన ఎన్సీసీ సంస్థ మళ్లీ సబ్ కాంట్రాక్ట్ చందన సంస్థకు ఇవ్వడంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎన్సీసీ ప్రతినిధి సోమయాజులు హైదరాబాద్ నుంచి సాయంత్రం వచ్చి డీజీఎం కుట్టి, ఏజీఎం జార్జ్‌లతో చర్చించారు. కార్మికుల విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. కార్మికులకు పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పి నిర్బంధంలో లేమని చె ప్పించేందుకు యాజమాన్యం, కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న ఒడిశా కార్మికుల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి వారితో కాంట్రాక్టర్ తరఫు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు సమాచారం. మరోవైపు యాజమాన్యం కూడా దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు, కార్మిక శాఖ అధికారులు తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేలా చూడాలని కోరినట్లు సమాచారం.