పూజలు చేస్తున్న వేదపండితులు
బాసర(ముథోల్): బాసర అమ్మవారి క్షేత్రంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 8:30కు స్థాపిత దేవతహవానములు, మహావిద్య పారాయణములు, ఛండీపారాయణం, సరస్వతీ హోమంను ఆలయ అర్చకులచే నిర్వహించారు.
అనంత రంప్రదోషార్చన, సహస్రనామార్చన, నీరాంజన మంత్ర పుష్పదాలు, తీర్థప్రసాదాల వితరణ వేదవ్యాస ఆలయంలో అర్చకులు కలష పూజలు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల «మధ్య పూజ కార్య క్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధానాచార్యులు సంజీవ్‌పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్‌పాఠక్, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో చీఫ్ ఇంజినీర్
బాసర(ముథోల్): బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ భగవత్ రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయాధికారులు స్వాగతం ప లికారు. అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులచే తన మనవరాలికి అక్షరశ్రీకార పూజలను చేయించారు. ఆలయాధికారులు అమ్మవారి ప్రతిమతోపాటు, తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment