Basara Saraswathi Temple
-
బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీక్షేత్రంలో వసంత పంచమి జరుçపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయంలో పూజలు జరిగాయి. గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు, అఖిల భారత పద్మశాలి సంఘంతోపాటు పలువురు వ్యక్తులు బాసర వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ఐటీకి చెందిన 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆలయంలో సేవలు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బాసర భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి 4 గంటలు, అక్షరాభ్యాసానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిరావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. -
నాగుల పంచమి: కొండచిలువ కలకలం
సాక్షి, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు పొడవాటి కొండచిలువ శనివారం కనిపించింది. ఈ రోజు శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆలయం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. (పులికి చెమటలు పట్టించిన పైథాన్) అదే విధంగా ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా రెండు జంట నాగులు సయ్యాటలాడాయి. ఈ ఘటన చెక్ డ్యాం వద్ద చోటుచేసుకుంది. శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. -
బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం
-
బాసరలో భక్తుల ప్రత్యేక పూజలు
సాక్షి, నిర్మల్: శ్రావణమాసం ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు.. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా గోదావరి నదికి పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున వేద మంత్రోత్సరణల మధ్య అమ్మవారికి నిత్య అభిషేకం, హారతి, గణపతి పూజ, కలశపూజ, కుంకుమార్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రావణమాస మొదటి శుక్రవారం పర్వదినం కావడంతో భక్తుల రద్ది పెరిగి అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు
సాక్షి, నిర్మల్ : బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో కలకలం రేగింది. అమ్మవారి భక్తులు లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో పురుగులు దర్వనమివ్వటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాసర సరస్వతి అమ్మవారి భక్తులు ప్రసాదాన్ని తింటున్న సమయంలో లడ్డూలోంచి పురుగులు రావటంతో వారు అవాక్కయ్యారు. ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయని ఆలయ అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదంలో పురుగులు, చెత్త రావటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా అధికారుల తీరులో మార్పురాకపోగా.. ఈ సంఘటన మరల పునరావృతం కావటంపై భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. -
బాసర అమ్మవారి కిరీటంలోని కెంపు గల్లంతు
-
బాసర అమ్మవారి కిరీటంలోని వజ్రం గల్లంతు
సాక్షి, బాసర : ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో మరకతం (పచ్చ) గల్లంతయినట్లు గుర్తించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారటంతో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కెంపు గల్లంతుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు... మరోసారి ఇంకో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం. -
కిటకిటలాడుతున్న దేవాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అలాగే 100, 300 రూపాయల టికెట్ల విక్రయం రద్దు చేశారు. భక్తులను సాధారణ క్యూలైన్లతో పాటు ముఖ మండప దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దసరా సందర్భంగా కొండగట్టుపై భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులకు అంజన్న దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా తమ వాహనాలకు పూజలు చేయించడానకి వాహనదారులంతా కొండగట్టుకు క్యూ కట్టారు. పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా నిజరూప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసుల ట్రాఫిక్ అంక్షలు విధించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా శతచండీయాగం జరిగింది. సిద్దిరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం శమీపూజకు యోగా, ఉగ్ర వెంకటేశ్వర స్వామి రానున్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వెంకటేశ్వరస్వామి శేషవాహనసేవను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శమీపూజ, 6.30కు తుంగభద్ర నదీ హారతి ఉండనుంది. రాత్రి 7 గంటలకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వాళ్లకు తెప్పోత్సవం జరగనుంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిదా(మహాలక్ష్మీ) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం పూర్ణాహుతితో నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. బాసరలో మహర్నవమి సందర్భంగా సరస్వతీ యాగం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ చేశారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నివేదన ఉండనుంది. సాయంత్రం 4 గంటల నుంచి పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం, సాయంత్రం 6.30 కు ఆలయం ముందు శమీ పూజ ఉండనుంది. -
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
బాసర(ముథోల్): బాసర అమ్మవారి క్షేత్రంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 8:30కు స్థాపిత దేవతహవానములు, మహావిద్య పారాయణములు, ఛండీపారాయణం, సరస్వతీ హోమంను ఆలయ అర్చకులచే నిర్వహించారు. అనంత రంప్రదోషార్చన, సహస్రనామార్చన, నీరాంజన మంత్ర పుష్పదాలు, తీర్థప్రసాదాల వితరణ వేదవ్యాస ఆలయంలో అర్చకులు కలష పూజలు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల «మధ్య పూజ కార్య క్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధానాచార్యులు సంజీవ్‌పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్‌పాఠక్, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి సేవలో చీఫ్ ఇంజినీర్ బాసర(ముథోల్): బాసర సరస్వతీ అమ్మవారిని బుధవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ భగవత్ రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయాధికారులు స్వాగతం ప లికారు. అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులచే తన మనవరాలికి అక్షరశ్రీకార పూజలను చేయించారు. ఆలయాధికారులు అమ్మవారి ప్రతిమతోపాటు, తీర్థప్రసాదాలు అందజేశారు. -
అమ్మవారిని దర్శించుకున్న ‘చాగంటి’
బాసర(ముథోల్): చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, పాలకవర్గసభ్యులు ఉన్నారు. -
వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
చరిత్రాత్మకం.. నిర్మల్
కోటలు, ఆలయూలకు ప్రసిద్ధి కొయ్యబొమ్మలకు పెట్టిందిపేరు ప్రాజెక్టులు, పర్యాటక క్షేత్రాలు చాలానే ఎన్నో చారిత్రక ఆనవాళ్లు.. నిర్మల్ కోటలు, బురుజులు. మరెన్నో చరిత్రాత్మక గురుతులు.. వెయ్యి ఉరుల మర్రి, పోరాటాలు. ఆధ్యాత్మికతను పెంచే ఆలయూలు.. బాసర, అడెల్లి, కదిలి. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు.. జన్నారం అడవులు, కడెం జలాశయ అందాలు, తాగు, సాగు నీరందించే ప్రాజెక్టులు.. కడెం, స్వర్ణ గడ్డెన్నవాగు ప్రాజెక్టులు. కళలు ఉట్టిపడే కొయ్యబొమ్మలు, నకాశి కళాకారుల నుంచి జాలువారే పెరుుంటింగ్లు.. ఒకటేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త జిల్లా నిర్మల్‌లో ప్రతీది విశేషమే. విశ్లేషణాత్మక అంశమే. - నిర్మల్ బాసర సరస్వతీదేవి చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరి ఉన్నది కొత్తగా ఏర్పడుతున్న నిర్మల్ జిల్లాలోనే. నిత్యం అక్షరాభ్యాసం కోసం పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దేశంలో కాశ్మీర్ తరువాత రెండో సరస్వతీ దేవాలయం ఇదే కావడం విశేషం. బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు ఉన్నాయి. పలు విశ్రాంతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్మల్ కొయ్యబొమ్మలు నిర్మల్ కొయ్యబొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. పొనికి కర్రతో తయారు చేస్తున్నారు. 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల్ కొయ్యబొమ్మలు సహజ రూపాన్ని తలపిస్తాయి. వివిధ రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి కళారూపాలకు జీవం పోస్తున్నారు. పెయింటింగ్‌ను డెకో పెయింటింగ్‌తో వేయడం ఇక్కడి ప్రత్యేకత. బ్లాక్ పెయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా వస్తూ, ఇక్కడి చిత్రాలు రూపుదిద్దుకుంటాయి. కదిలిలో పాపహరేశ్వరాలయం దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వరాలయం అత్యంత పురాతనమైన, ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పూర్వం పరశరాముడితో ప్రతిష్టించిన శివలింగంగా చెబుతుంటారు. ఆలయంలోని విగ్రహాలు అత్యంత శిల్పకళ ఉట్టిపడేలా ఉంటాయి. నందీశ్వరుడు, ద్వారపాలకులు, వినాయకుని విగ్రహం, శివలింగం, మాతాన్నపూర్ణదేవి విగ్రహాలు అత్యంత ప్రాశస్త్యం కలిగినవి. చుట్టూ అటవీ ప్రాంతంతో పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అటవీ ప్రాంతంలో ఉన్న కాల్వ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం బాగా పేరెన్నికగన్నది. ఇక్కడి కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారినిని దర్శించుకుంటారు. బూర్గుపల్లి రాజరాజేశ్వరాలయం మామడ మండలంలోని బూర్గుపల్లి శ్రీరాజరాజేశ్వరాలయం శివరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి. భక్తుల కొంగుబంగారంగా నిలిచే ఈ ఆలయం గుట్టల మధ్య అటవీ ప్రాంతంలో వెలసింది. శ్రీ పరమేశ్వరుడు భూలోకానికి వచ్చి బూర్గుపల్లి ఆలయంలో వెలిసిన అనంతరం లక్ష్మణచాంద మండలం బాబాపూర్ శివాలయం, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా వేములవాడకు వెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిర్మల్ మండలంలోని సోన్‌లోని చారిత్రాత్మక వేంకటేశ్వర, దక్షిణాముఖ హనుహన్ ఆలయాలు ప్రసిద్ధి గాంచారుు. ప్రాజెక్టులు సారంగాపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్టు కింద సుమారు 10 వేల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1183 అడుగులు. అలాగే ఎస్సారెస్పీ కింద సరస్వతీ కెనాల్ ద్వారా నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీర ందుతుంది. భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు వేల ఎకరాల ఆయకట్టు కలిగింది. కడెం ప్రాజెక్టు జిల్లాకు తలమానికం. ఈ భారీ నీటి పాదరుల ప్రాజెక్టు 700 అడుగులు, 7.50 టీఎంసీల నీటి సామర్థ్యం కలదు. కడెం ప్రాజెక్టు దిగువ భాగంలో బోటింగ్‌లను ఏర్పాటు చేయడంతో నిత్యం పర్యాటకుల తాకిడి కనిపిస్తుంది. తెలంగాణ టూరిజం కింద ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు. హరితా రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. కోటలు నిర్మల్ పట్టణంలో నిమ్మలనాయుడి కాలంలో ఛత్తీస్, బత్తీస్, శ్యాంఘడ్ కోటలు, గొలుసు కట్టు చెరువులు, బురుజులు కట్టించారు. ఇవి ఆ కాలం నాటి చరిత్రను కళ్లకు కడుతున్నారుు. చరిత్రాత్మక ఆనవాళ్లను గుర్తు చేస్తున్నాయి. పర్యాటకంగా వాటిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. -
నాడు ధర్మకర్త..నేడు యాచకుడు..
బాసర, న్యూస్‌లైన్ : ఆయన అమ్మవారి భక్తుడు.. ఆమె దర్శనం లేనిదే పచ్చి నీళ్లయినా ముట్టడు.. ఆయనతోపాటు తన కుటుంబం సరస్వతీ సేవలోనే తరించింది.. ఆలయ ధర్మకర్త అయ్యాడు.. దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు.. ఆలయ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప జేశాడు.. నయాపైసా కూడా ఆశించలేదు.. చివరకు విధి వక్రీకరించి అందరిని పోగొట్టుకున్నాడు.. ఉన్నవారి నిరాదరణకు గురయ్యాడు.. బాసర ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు.. అతడే బాసరకు చెందిన లక్ష్మణ్! బాసరకు చెందిన లక్ష్మణ్ రెండు దశాబ్దాల క్రితం బాసర సరస్వతీ ఆలయ ధర్మకర్తగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న ఆలయ చైర్మన్‌గా ఉన్నకాలంలో లక్ష్మణ్‌తోపాటు మరో 12 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు ఆలయ ధర్మకర్తగా పనిచేశాడు. ఆయన హయాంలో రెండంతస్తుల ధర్మశాల, ఒక అతిథి గృహం ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూసేవారు. శివరాత్రి, అమ్మవారి నవరాత్రోత్సలు, జన్మదినోత్సవాలను ఆయనే దగ్గరుండి చేయించేవారు. పదవీ ఉన్నప్పుడు నయాపైసా ఆశించకుండా ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. కాలక్రమేణ బాసరలో మార్పులు వచ్చాయి. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. అదే ఆలయం వద్ద భిక్షాటన పదవీ పోయిన కొన్నేళ్లకు లక్ష్మణ్ భార్య లక్ష్మి అకాల మరణం చెందింది. వీరి ఇద్దరు కొడుకులు పెద్ద విశ్వనాథ్, నగేశ్‌లతో కొన్ని రోజులు లక్ష్మణ్ ఉన్నాడు. పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లను తీసుకుని వారి పుట్టింటికి వెళ్లింది. ఇక చిన్న కుమారుడికి పిల్లలు లేకపోవడం తండ్రిని పట్టించుకోకపోవడంతో ఆలయ అధికారులను లక్ష్మణ్ పనిఇప్పించాలని అడిగారు. ఆలయ అధికారులు మూడేళ్ల క్రితం వరకు రూ.3వేల జీతంతో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు. ఆరోగ్యం క్షీణించడం, పనిచేసే స్థోమత లేకపోవడంతో ఎన్ఎంఆర్ నుంచి అధికారులు తొలగించారు. ఎటూపోయే దారిలేక ఆలయం వద్దే భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా భిక్షవేస్తే తిన్నట్లు లేకపోతే కడుపుమాడినట్టే. నెలకు రూ.500 ఇవ్వండి.. : లక్ష్మణ్ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ప్రభుత్వం పింఛన్ రూ.200 ఇస్తుంది. ఇవి సరిపోవడం లేదు. మందులకే డబ్బులు అవుతున్నాయి. పనిచేయలేని స్థితిలో ఉండటంతో భిక్షాటన చేస్తున్నా. ఆలయ అధికారులు స్పందించి నెలకు రూ.500 ఇస్తే బాగుంటుంది.