వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు | Heavy rush at Basara | Sakshi
Sakshi News home page

వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు

Published Mon, Jan 22 2018 8:34 AM | Last Updated on Mon, Jan 22 2018 8:54 AM

Heavy rush at Basara

సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement