vasanta panchami
-
సరస్వతి అవతారంలో కనకదుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహామంటపంలో విద్యార్ధుల కోసం విజయీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న విద్యార్ధులకు శక్తి కంకణాలతోపాటు పెన్ను, అమ్మవారి చిత్రపటం, కంకుమ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. -
వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
వైభవంగా వసంత పంచమి
- కొలనుభారతిక్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు - సర్వసతీదేవికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థాన ఏఈఓ -చిన్నారుల అక్షరాభ్యాసం వద్ద తోపులాట కొలనుభారతి(కొత్తపల్లి): వసంతపంచమి వేడుకలు జిల్లాలో వైభంగా జరిగాయి. రాష్ట్రంలోని ఏకైక సరస్వతీ కేత్రం కొలనుభారతిలో భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షర్యాభ్యాసం చేయించారు. ఉదయం 5.30గంటల ప్రాంతంలో చారుఘోషిణీ నదీజలాలతో సర్వస్వతీదేవికి మంగళస్నానం చేయించారు. అనంతరం అమ్మవారికి పంచామృత సహిత మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, విశేష అలంకరణ పుష్పార్చన, కుంకుమార్చన, మహానైవేద్యం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ పూజలు నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ శ్రీశైల భ్రమరాంబమల్లిఖార్జున స్వామివారి దేవస్థానం అసిస్టెంటు జేఈఓ మల్లిఖార్జునరెడ్డి, ప్రధాన అర్చకులు మల్లిఖార్జున, వేదపండితులు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వారికి ఆలయకమిటీ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ చంద్రశేఖరయాదవ్, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అందజేసిన పట్టువస్త్రాలతో సరస్వతీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు చారుఘోషిణీ నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని, సప్తశివాలయాల్లోని శివలింగాలను దర్శించుకున్నారు. కాశిరెడ్డినాయన ఆశ్రమం ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు: వసంతపంచమిని పురుస్కరించుకుని కొలనుభారతిలో వెలసిన జ్ఞానసరస్వతీ అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు రాష్ట్రనలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నట్లు ఆలయపూజారి చంద్రశేఖరశర్మ తెలిపారు. అయితే, అక్షరాభ్యాసం చేయించే చోట ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అరగంటపాటు అక్షరాభ్యాస కార్యక్రమం నిలిపివేశారు. కానరాని అధికారుల సందడి: ప్రతి ఏటా సరస్వతీ అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే కలెక్టర్, ఎస్పీ,వివిధ శాఖల జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులు ఈసారి క్షేత్రం వద్ద కనిపించలేదు. వారు వచ్చి ఉంటే క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధిచేస్తామని గొప్పలు చెప్పి చేతులు దులుపుకుని వెళ్లేవారు. అధికారుల్లో బుధవారం ఆర్డీఓ సత్యనారాయణ ఒక్కరే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం గోకవరం ప్రాథమిక వైద్యాధికారిణి దీపిక అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్సై శివశంకర్‌నాయక్ ల అధ్వర్యంలో 45మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. -
వసంత పంచమికి ఏర్పాట్లు పూర్తి
-ముస్తాబైన కొలనుభారతి క్షేత్రం - భక్తులకు వసతి ఏర్పాట్లు - సామూహిక అక్షరాభ్యాసానికి ప్రత్యేకంగా అర్చకుల నియామకం కొత్తపల్లి: కొలనుభారతి క్షేత్రంలో బుధవారం వసంత పంచమిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఏకైక సరస్వతీ క్షేత్రం కొలను భారతి. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం దేవస్థానం నుంచి ఆలయ ఈఓ ..సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించటంతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. అంతకముందే ఆలయ పూజారులు అమ్మవారికి చారుఘోషిణి నదీజలాలతో భిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలం నుంచి వచ్చిన పట్టువస్త్రాలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరిస్తారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలను పఠిస్తూ వేడుకలను నిర్వహిస్తారు. భక్తులకు సకల సౌకర్యాలు: వసంత పంచమికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. వారు చారుఘోషిణీ నదిలో స్నానం ఆచరించి దుస్తువులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లను నిర్మించారు. తాగునీటి, మరుగుదొడ్ల వసతులు కల్పించారు. భక్తులు తోపులాడుకోకుండా క్యూలైన్లను నిర్మించారు. అక్షరాభ్యాసానికి తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అర్చకులను నియమించారు. భక్తులకు కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదానం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నందికొట్కూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపో వారు కొలనుభారతి క్షేత్రానికి బస్సులను తిప్పనున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్ఐ శివశంకర్‌నాయక్ అధ్వర్యంలో 40 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు: సత్యనారాయణ, ఈఓ, చంద్రశేఖరయాదవ్, ఆలయ చైర్మన్ వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి ఏటా కొలను భారతి క్షేత్రాభివృద్ధికి నిధులు మంజూరు చేసేవారు. ఈ ఏడాది అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు జిల్లా అధికారులు ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు. దేవాలయ ఖాతాలోంచి నిధులను తీసుకొని..వాటితోనే క్షేత్రంలో తోచినంతలో అభివృద్ధి పనులు చేపట్టాం. -
కిక్కిరిసిన బాసర క్షేత్రం
బాసర: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ పుణ్య క్షేత్రం వసంత పంచమి సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచి భక్తులతో కళకళలాడుతోంది. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మంచి ముహూర్తాలున్నాయని అక్షరాభ్యాసాలు చేయించే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కూడా సరస్వతీమాత సన్నిధిలో పూజలు చేసేందుకు వచ్చారు.