akshara srikaram
-
వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్‌జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
అమ్మ కటాక్షం కోసం అక్షర శ్రీకారం!
బాసర(ఆదిలాబాద్ జిల్లా): బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్త జనం సందోహంతో నిండిపోయింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ చిన్నారులను తల్లిదండ్రులకు జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో అక్షర శ్రీకారం చేయించారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3గంటల సమయం పట్టింది. 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 876 మంది చిన్నారులకు అక్షర శ్రీకారం జరిపించారు. అమ్మవారి ఆలయానికి సుమారు రూ.4లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.