సాక్షి, నిర్మల్ : బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో కలకలం రేగింది. అమ్మవారి భక్తులు లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో పురుగులు దర్వనమివ్వటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాసర సరస్వతి అమ్మవారి భక్తులు ప్రసాదాన్ని తింటున్న సమయంలో లడ్డూలోంచి పురుగులు రావటంతో వారు అవాక్కయ్యారు. ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయని ఆలయ అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదంలో పురుగులు, చెత్త రావటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా అధికారుల తీరులో మార్పురాకపోగా.. ఈ సంఘటన మరల పునరావృతం కావటంపై భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment