
సాక్షి, నిర్మల్: శ్రావణమాసం ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు.. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా గోదావరి నదికి పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున వేద మంత్రోత్సరణల మధ్య అమ్మవారికి నిత్య అభిషేకం, హారతి, గణపతి పూజ, కలశపూజ, కుంకుమార్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రావణమాస మొదటి శుక్రవారం పర్వదినం కావడంతో భక్తుల రద్ది పెరిగి అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment