
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment