‘నిర్మల్ జిల్లా’ సంబరాలు
‘నిర్మల్ జిల్లా’ సంబరాలు
Published Tue, Aug 23 2016 11:31 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల ప్రజలు, నాయకుల్లో ఆనందం
నిర్మల్‌లో అల్లోలకు ఘన స్వాగతం
పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
నిర్మల్ టౌన్/నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లా ముసాయిదా ప్రకటన అనంతరం ఇక్కడికి తొలిసారిగా వచ్చిన రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్‌ఎస్, వివిధ సంఘాల నాయకులు సోమవారం ఘన స్వా గతం పలికారు. మండలంలోని సోన్ వద్దకు చేరుకోగానే పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం సోన్ నుంచి టీఆర్‌ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యా లీ మంచిర్యాల చౌరస్తా మీదుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసానికి చేరుకుంది. అనంతరం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభి షేకం చేశారు. పట్టణంలో నాయకులు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి నృత్యం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, ఎంపీపీ సుమతిగోవర్ధన్‌రెడ్డి, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, భూపతిరెడ్డి, అంగ నరేశ్, నేల్ల అరుణ్, నాయకులు పాకాల రాంచందర్, రాము, ముడుసు సత్యనారాయణ, ప్రదీప్, ఎస్పీ రాజు, తోట నర్సయ్య పాల్గొన్నారు.
కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
నిర్మల్ రూరల్ : ప్రజల కష్టాలను తెలుసుకుని, తానే స్వయంగా పరిశీలించి కొత్త జిల్లాగా నిర్మల్‌ను ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఆందోళనలు చేసినంత మాత్రాన కొత్త జిల్లా ఏర్పాటు ఆగిపోదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధూను నిర్మల్‌కు ఆహ్వానించి సన్మానిస్తామని అన్నారు. నిర్మల్‌లోనే జన్మించిన ఆమె తండ్రి రమణతో తాను ఈ విషయం మాట్లాడానని చెప్పారు.
సాధించాం.. విఠల్
నిర్మల్ రూరల్ : ‘సాధించాం.. విఠల్. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మల్ జిల్లా కల నె రవేరింది. ఇక అభివృద్ధిపై దృష్టిపెడదాం..’ అంటూ ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సోమవారం నిర్మల్‌కు చేరుకున్న మంత్రిని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కలిశారు. జిల్లా ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్ నాయకులు గజమాలతో సన్మానించారు.
Advertisement
Advertisement