Draft Notification
-
వాహనాలపై ఆర్సీ రెన్యువల్ మోత
సాక్షి, న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. బీఎస్–2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజి్రస్టేషన్ రెన్యువల్‌కు రూ.2 వేలు, త్రీ వీలర్‌కైతే రూ.5 వేలు, కార్లు/జీపులకు రూ.10 వేలు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేగాక 15 ఏళ్లు పైబడిన భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం వాణిజ్య మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనానికి రూ.12 వేలు, హెవీ ప్యాసింజర్/ గూడ్స్ వాహనానికి రూ.18 వేలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలుగా ప్రతిపాదించింది. అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా రూ.24 వేలు, రూ.36 వేలుగా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు, కార్ల రిజి్రస్టేషన్ రెన్యువల్ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో, తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెవీ ప్రైవేట్ కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. -
రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో ఆ వాహనాల్ని రద్దు చేస్తూ..స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023,ఏప్రిల్ 1 నుంచి దేశంలో 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖల బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్త నియమం తప్పనిసరి. రాబోయే ౩౦ రోజుల్లో దీనికి సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది. అధికారిక వెబ్సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. స్క్రాప్‌గా మార్చేస్తాం 15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ స్క్రాప్ (చెత్త) గా మారుస్తామని, దీనికి సంబంధించిన విధి, విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు అగ్రికల్చర్ కార్యక్రమం 'ఆగ్రో విజన్' ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓల్డ్ గవర్నమెంట్ వెహికల్స్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారిక ఫైల్లో సంతకం చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరారు. వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ 2021లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పరిశ్రమకు మూడు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. అందులో పాత వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభసాటిగా మారుతుంది. ఎందుకంటే పాత వాహనాలను కొత్త వాహనాలతో భర్తీ చేసేలా డిమాండ్‌ను పెంచుతుంది. ఉక్కు పరిశ్రమ కోసం చౌకైన ముడి పదార్థాలు స్క్రాప్ మెటీరియల్ నుండి లభిస్తాయి. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు దోహద పడతాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్‌కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్‌లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
ఏపీ రాజధానిలో భూ సంతర్పణ
-
నెరవేరనున్న మండల కల
డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు చోటు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు కల్హేర్: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్ పేరు ఉండడంతో ప్రజల దశాబ్దాల కలకు అడుగు పడినట్టు అయ్యింది. చాలా కాలంగా మండల ఏర్పాటు కోసం సిర్గాపూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ కళ సాకారం కానుంది. కల్హేర్ మండలంలో సిర్గాపూర్ ఓ పెద్ద గ్రామం. ఈ గ్రామానికి మండల హోదా కల్పిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించారు. ఇదే డిమాండ్‌ను చాలా కాలంగా వినిపిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో సిర్గాపూర్‌కు కలిసొచ్చింది. చాలా కాలంగా మండలం కోసం నిరీక్షిస్తున్న ప్రజల ఆకాంక్షను అధికారులు, ప్రభుత్వం గుర్తించింది. మండల ఏర్పాటుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్నాయని బేరీజు చేసుకొని ఆ దిశగా అడుగులు వేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు చోటు కల్పించింది. దీంతో ఇక్కడి ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. త్వరలో మా గ్రామం కూడా మండల కేంద్రం అవుతుందని సంతోష పడుతున్నారు. ఇదిలా ఉండగా సమీపంలో ఉన్న పంచాయతీలు కూడా సిర్గాపూర్ మండల కేంద్రం అయితే మేలు జరుగుతుందని, అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. దసరా నుంచి కొత్త మండలంలో మా జీవితాలు ప్రారంభమవుతాయని సిర్గాపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట నిలుపుకున్న పాలకులు ఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో సిర్గాపూర్‌లో పర్యటించిన నాయకులు, ప్రజాప్రతినిధులు మండల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. అనుకున్నట్లే ప్రజల ఆకాంక్ష మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్‌కు స్థానం కల్పించారు. మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలంలో చేరిన గ్రామాలు కల్హేర్ మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు, 41 తండాలు ఉన్నాయి. సిర్గాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో పలు గ్రామాలు విలీనమయ్యాయి. సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కానుంది. కల్హేర్ మండలంలోని సిర్గాపూర్, కడ్పల్, ఖాజాపూర్, గోసాయిపల్లి, పోచాపూర్, బోక్కస్‌గాం, చిన్న ముబారక్పూర్, పెద్ద ముబారక్పూర్, అంతర్గాం, సుల్తానాబాద్, కంగ్టీ మండలంలోని చీమాల్పాడు, గర్డెగాం, సంగెం, వాసర్, పోట్పల్లి, నాగన్‌పల్లి, వంగ్దాల్, గౌడ్గాం(కె), గాజుల్పాడు, బాన్స్వాడ(డి), దామర్గ్ది(పిఎం), నారాయణఖేడ్ మండలంలోని ఉజలంపాడ్ను కలిపి సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్ మండలం జనాభా 35,004 ఉండనుంది. గర్వించ దగ్గ అంశం సిర్గాపూర్ కేంద్రంగా మండలం ఏర్పాటు కానుండడం మాకు గర్వంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దశాబ్దాల కళ సాకారం కానుంది. సిర్గాపూర్‌లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మండల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - మనీష్‌పాటిల్, సర్పంచ్, సిర్గాపూర్ మాట నిలబెట్టుకున్నారు సిర్గాపూర్‌ను మండలంగా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారి మాటను నిలుపుకున్నారు. గ్రామస్తుల విన్నపాన్ని మన్నించి మండలం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. - సంజీవరావు, ఎంపీటీసీ, సిర్గాపూర్ -
అభ్యంతరాల స్వీకరణకు చర్యలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకుగాను అధికారులు చర్యలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌గా విభజిస్తూ జారీ చేసిన ఈ నోటిఫికే షన్లో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు ఏడు కొత్త మండలా (మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, చిన్నంబావి, పదర, అమరచింత, నాందిన్నె) లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొత్తూరు, కొందుర్గు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామాలు, ప్రాంతాల ప్రజల నుంచి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో కూడిన అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అభ్యంతరాలిలా.... రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోగాని, కలెక్టరేట్లో గానీ తెలియజేయాలి. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో అభ్యంతరాలు తెలియజేయాలి. మండలాలు, గ్రామాల కూర్పు, జిల్లాల ఏర్పాటు వంటి విషయాలు, ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మండలాలను శంషాబాద్ జిల్లాలో చేర్చిన విషయాలపై అభ్యంతరాలుంటే క్లుప్తమైన సమాచారంతో రాతపూర్వకంగా ఆర్డీఓ కారాలయాల్లో అధికారులకు అందజే యాలి. ఆన్లైన్లో అభ్యంతరాలు తెలపాలంటే ఠీఠీఠీ.n్ఛఠీఛీజీట్టటజీఛ్టిటజౌటఝ్చ్టజీౌn.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్లో తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. -
దశాబ్దాల కల.. మంచిర్యాల
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మంచిర్యాలలో జిల్లా ఏర్పాటు సంబురాలు హాజరైన ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనప్ప మంచిర్యాల టౌన్ : జిల్లా కేంద్రానికి 200ల కిలోమీటర్లకు పైగా దూరం ఉండి, సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ తూర్పు జిల్లా ప్రజల మంచిర్యాల జిల్లా కల నెరవేరుతోందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై మంచిర్యాలలో సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచే మంచిర్యాల ఐబీ చౌరస్తాలో సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంచిర్యాల పట్టణంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు, పలు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ర్యాలీ నిర్వహించారో, అదే రీతిలో కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాల శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. నూతన జిల్లాకు మంచి జరగాలని పండితులు, ముస్లిం మత పెద్దలతో పూజలను నిర్వహించారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, ఇక ఇక్కడి ప్రజలకు దూర భారం తగ్గిందని, ఇదే పెద్ద ఆనందమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరినట్లేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారన్నారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మమత సూపర్ బజార్ సొసైటీ చైర్మన్ యై తిరుపతి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఆటలు.. ర్యాలీలు.. టపాసులు పట్టణ ఐకేపీ ఆధ్వర్యంలో కొత్త జిల్లా ఏర్పాటుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే ట్రాక్టర్స్ యజమానుల సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ట్రాక్టర్ యజమానుల సేవా సమితి ముఖ్య సలహాదారు పల్లపు తిరుపతి, బగ్గని రవి, అధ్యక్షులు గొడిశెల దశరథం, గౌరవ అధ్యక్షులు బోరిగం వెంకటేశం, ఉపాధ్యక్షులు ఈ.హన్మంతు, ప్రధాన కార్యదర్శి ఎండీ.తాజొద్దీన్, జాయింట్ కార్యదర్శి పల్లపు రవి పాల్గొన్నారు. -
‘నిర్మల్ జిల్లా’ సంబరాలు
నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల ప్రజలు, నాయకుల్లో ఆనందం నిర్మల్‌లో అల్లోలకు ఘన స్వాగతం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్మల్ టౌన్/నిర్మల్ రూరల్ : నిర్మల్ జిల్లా ముసాయిదా ప్రకటన అనంతరం ఇక్కడికి తొలిసారిగా వచ్చిన రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్ఎస్, వివిధ సంఘాల నాయకులు సోమవారం ఘన స్వా గతం పలికారు. మండలంలోని సోన్ వద్దకు చేరుకోగానే పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం సోన్ నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యా లీ మంచిర్యాల చౌరస్తా మీదుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసానికి చేరుకుంది. అనంతరం మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభి షేకం చేశారు. పట్టణంలో నాయకులు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి నృత్యం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, ఎంపీపీ సుమతిగోవర్ధన్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, భూపతిరెడ్డి, అంగ నరేశ్, నేల్ల అరుణ్, నాయకులు పాకాల రాంచందర్, రాము, ముడుసు సత్యనారాయణ, ప్రదీప్, ఎస్పీ రాజు, తోట నర్సయ్య పాల్గొన్నారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు నిర్మల్ రూరల్ : ప్రజల కష్టాలను తెలుసుకుని, తానే స్వయంగా పరిశీలించి కొత్త జిల్లాగా నిర్మల్‌ను ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఆందోళనలు చేసినంత మాత్రాన కొత్త జిల్లా ఏర్పాటు ఆగిపోదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధూను నిర్మల్‌కు ఆహ్వానించి సన్మానిస్తామని అన్నారు. నిర్మల్‌లోనే జన్మించిన ఆమె తండ్రి రమణతో తాను ఈ విషయం మాట్లాడానని చెప్పారు. సాధించాం.. విఠల్ నిర్మల్ రూరల్ : ‘సాధించాం.. విఠల్. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మల్ జిల్లా కల నె రవేరింది. ఇక అభివృద్ధిపై దృష్టిపెడదాం..’ అంటూ ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సోమవారం నిర్మల్‌కు చేరుకున్న మంత్రిని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కలిశారు. జిల్లా ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు గజమాలతో సన్మానించారు. -
ఉత్కంఠకు తెర
మూడుగా చీలుతున్న ఆదిలాబాద్ జిల్లా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం కొత్తగా కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలు రెవెన్యూ డివిజన్లుగా భైంసా, బెల్లంపల్లి నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు సాక్షి, మంచిర్యాల: ఏళ్ల ఉత్కంఠకు తెరపడింది. కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా.. ఎట్టకేలకు మూడుగా చీలనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టి-సర్కార్ సోమవారం ముసాయిదాను జారీ చేసింది. పాలన సౌలభ్యం... అన్ని రంగాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలు.. సమావేశాలు.. చర్చలతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులిచ్చిన ప్రతిపాదనలు.. ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా.. కొమురంభీమ్, నిర్మల్ జిల్లాలను ఖరారు చేసింది. దీంతో ముచ్చటగా మూడు జిల్లాలు ఏర్పడనున్నారుు. పెద్ద జిల్లాగా కొమురంభీమ్ కొమురంభీమ్ (మంచిర్యాల) జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల క ంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు.. మండలాలు కలిగిన జిల్లాగా అవతరించనుంది. మొత్తం 25 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పడనుంది. ప్రస్తుతమున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి కూడా కొమురంభీమ్ పరిధిలోనిదే. ఇప్పటి వరకు మొత్తం 52 మండలాలతో ఉన్న ఆదిలాబాద్ జిల్లా 16 మండలాలకే పరిమితమైంది. ప్రస్తుతం మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ జిల్లా కేవలం ఆదిలాబాద్, ఉట్నూరు రెవెన్యూ డివిజన్లతోనే సరిపెట్టుకోనుంది. ఇక.. అనూహ్యంగా తెరపైకొచ్చి కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. కేవలం 13 మండలాలు కలిగిన చిన్న జిల్లాగా అవతరించనుంది. ప్రస్తుతమున్న నిర్మల్ రెవెన్యూ డివిజన్‌తో పాటు కొత్తగా ఏర్పడిన భైంసా రెవెన్యూ డివిజన్ కూడా ఈ జిల్లా పరిధిలో ఉంది. కొత్త మండలాలు రెండే.. జిల్లాల పునర్విభజనలో భాగంగా.. కొత్త మండలాల ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠకూ తెరపడింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మావల మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ‘తూర్పు’లో ఉన్న మంచిర్యాల మండల పరిధిలోని నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీని కొత్త మండలంగా చేస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఆదిలాబాద్ మండల పరిధిలో ఉన్న 45 గ్రామాల్లో.. మావల (9633), బట్టిసావర్గావ్ (7172), వాగాపూర్ (1407), దస్నాపూర్(22,216) నాలుగు గ్రామాలను వేరు చేసి మొత్తం 40,428 జనాభాతో ‘మావల’ మండలం ఏర్పాటు చేయనుంది. అలాగే.. 28 పంచాయతీలున్న మంచిర్యాల మండలం నుంచి 31,244 జనాభా ఉన్న నస్పూర్ , సింగాపూర్ (20,061), తీగల్‌పహాడ్ (12,656) తాళ్లపల్లి (9,656), సీతారాంపల్లి (3,024) గ్రామాలతో కొత్తగా నస్పూర్ మండలం ఏర్పాటు కానుంది. ఈ ఐదు గ్రామాల జనాభా 76,641. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బెజ్జూర్ మండల పరిధిలో ఉన్న పెంచికల్‌పేట, నిర్మల్ మండల పరిధిలోని సోన్, మంచిర్యాల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ పంచాయతీలనూ మండలాలుగా చేయాలన్న డిమాండ్.. అధికారుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన విషయం తెలిసిందే. కానీ జిల్లాలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఏర్పాటు కానుండడంతో మిగిలిన మండలాల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కాగా.. నిర్మల్ మండల పరిధిలోని సోన్నూ కొత్త మండలంగా చేయాలని సీఎం కేసీఆర్‌కు నిర్మల్ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి చేసిన విన్నపం నెరవేరలేదు. అన్నీ పరిగణలోకి తీసుకుని.. ముందు ఇచ్చిన హామి మేరకు.. మంచిర్యాలను కొమురంభీమ్ పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసి.. తర్వాత తెరపైకొచ్చిన నిర్మల్ జిల్లా డిమాండ్‌నూ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. నిర్మల్‌నూ జిల్లాగా మారుస్తూ.. కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించింది. ఆదిలాబాద్ జిల్లాను 16 మండలాలతో పరిమితం చేయగా.. 25 మండలాలతో కొమురంభీమ్.. 13 మండలాలతో నిర్మల్ జిల్లాను ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిల్లో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లు రాగా.. కొమురం భీం జిల్లా కింద మూడు డివిజన్లు రానున్నాయి. జిల్లాలతో పాటు కొత్తగా బెల్లంపల్లి, భైంసానూ రెవిన్యూ డివిజన్లుగా చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు తూర్పు ప్రాంత పరిధిలోని నస్పూర్, పశ్చిమ ప్రాంతంలోని మావల గ్రామ పంచాయతీలను మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే.. మండలాల విలీనం విషయంలోనూ ప్రభుత్వం స్థానికుల డిమాండ్.. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది. జన్నారం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసే నిర్మల్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలని... కెరమెరి మండలాన్ని ఆదిలాబాద్‌లో కాకుండా కొమురంభీమ్ జిల్లాలో కలపాలన్న ప్రజల డిమాండ్‌కు తలొగ్గిన ప్రభుత్వం ఆ రెండు మండలాలను కొమురంభీమ్ జిల్లాలో కలిపింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీని వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నెల రోజుల గడువిచ్చింది. ఏవైనా అభ్యంతరాలుంటే.. ఆయా జిల్లాల కలెక్టరేట్లు.. సీసీఎల్ఏలో తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అందులో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. రెండు రెవె‘న్యూ’ డివిజన్లు కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల నిరీక్షణ ఫలించింది. కొత్తగా బెల్లంపల్లి, భైంసా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. పశ్చిమ ప్రాంత పరిధిలోని.. భైంసా, కుభీర్, కుంటాల, ముథోల్, లోకేశ్వరం, తానూరు మండలాలతో భైంసా కొత్త రెవెన్యూ డివిజన్‌గా అవతరించనుంది. తూర్పు ప్రాంత పరిధిలోని బెల్లంపల్లి, కాసిపేట, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూరు, భీమిని, దహెగాం మొత్తం ఎనిమిది మండలాలతో బెల్లంపల్లి కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకోనుంది. మూడుగా చీలిన ఖానాపూర్ నియోజకవర్గం జిల్లాల పునర్విభజన పుణ్యమా.. అని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాలకు విభజించారు. నియోజకవర్గ పరిధిలో ఉట్నూరు, ఖానాపూర్, ఇంద్రవెల్లి, కడెం, జన్నారం మండలాలున్నాయి. అయితే పాలనా సౌలభ్యం కోసం జరిగిన జిల్లాల పునర్విభజనలో ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో కలిశాయి. ఖానాపూర్, కడెం మండలాలు నిర్మల్‌కు జతకట్టాయి. జన్నారం మండలం కొమురంభీమ్ జిల్లాలో కలిసింది. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణ 30 రోజుల వరకు గడువు ఆదిలాబాద్ : తెలంగాణ జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పునర్విభజన ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. సోమవారం నుంచి 30 రోజుల పాటు కార్యాలయం పనివేళల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిపాలన అధికారి (ఏఓ)కు అందజేయవచ్చని తెలిపారు. ఫోన్లోనూ.. అభ్యంతరాలను కలెక్టర్ కార్యాలయం సెల్ నంబర్‌కు కూడా తెలియజేయవచ్చు. సెల్ నం. 94910 53564 ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(16) 1. ఆదిలాబాద్ ఆదిలాబాద్, మావల(న్యూ), బజార్హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్ 2. ఉట్నూర్ ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్(యు), ఇచ్చోడ, నేరడిగొండ కొమురంభీమ్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(3) మండలాలు(25) 1. కొమురంభీమ్ మంచిర్యాల, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి, నస్పూర్(న్యూ), మందమర్రి, జన్నారం 2. బెల్లంపల్లి(న్యూ) కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూర్, భీమిని, దహెగాం 3. ఆసిఫాబాద్ ఆసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన, సిర్పూర్ (టి), కెరమెరి, వాంకిడి నిర్మల్ జిల్లా రెవెన్యూ డివిజన్లు(2) మండలాలు(13) 1.నిర్మల్ నిర్మల్, దిలావర్పూర్, కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్ 2. భైంసా(న్యూ) కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూరు -
ప్రజలే ఫైనల్!
27 జిల్లాలతో ముసాయిదా అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు సెప్టెంబర్ 20 వరకు గడువు ► జిల్లా కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో సూచనల స్వీకరణ ►ఆన్‌లైన్‌లోనూ వెల్లడించే అవకాశం.. అందుబాటులో ప్రత్యేక వెబ్సైట్ ► కొత్తగా 17 జిల్లాలు.. 15 రెవెన్యూ డివిజన్లు ► మొత్తం 505 మండలాలు.. కొత్తగా 46 ఏర్పాటు ► నేడు జిల్లాల రూపురేఖలతో జీఐఎస్, డిజిటల్ మ్యాపుల విడుదల ►మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే ► జిల్లాల ఏర్పాటు: మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్ జిల్లాల పునర్విభజనలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే అంతిమమని.. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 27 జిల్లాలతో కూడిన ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. తాము ఏ జిల్లా, మండలంలో ఉండాలనుకుంటున్నారో ప్రజలు అభ్యర్థించవచ్చని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త జిల్లాల ముసాయిదాను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్లతో కలసి డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘జిల్లాల పునర్విభజన ముసాయిదా ప్రకటనను విడుదల చేశాం. ముఖ్యమంత్రి, అధికారులు తీవ్ర కసరత్తు చేసి ముసాయిదాను రూపొందించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు.. రాజకీయ పార్టీలు, నాయకుల కోసం కాదు. ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ కోసం 30 రోజుల సమయం కేటాయించాం. ఈ ముసాయిదాయే ఫైనల్ కాదు.. ప్రజలే ఫైనల్. మెజారిటీ ప్రజలు.. 51 శాతంపైగా మంది ఏం చెబితే అదే చేస్తాం..’’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రజల సలహాలు, అభ్యంతరాలే కీలకమని చెప్పారు. కొత్త జిల్లాల ముసాయిదాపై అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంలో అభ్యంతరాలు, సలహా లను తెలపవచ్చని.. అందుకోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక http://newdistrictsformation.telangana. gov.in వెబ్సైట్లోనూ అభ్యంతరాలు, సూచనలను వెల్లడించవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక.. మళ్లీ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి మరోసారి వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ముసాయిదా ప్రకటన జారీ చేసిన సోమవారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే... సెప్టెంబర్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు తెలిపేందుకు అవకాశం ఉండనుంది. ప్రజల అభీష్టం మేరకే.. ఉద్యమ కాలంలో కేసీఆర్ గ్రామ గ్రామాలకు తిరిగినప్పుడు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 100 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాల్సి వస్తోందని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసేవారని మహమూద్ అలీ చెప్పారు. అందుకే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు హామీని చేర్చారన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలు చాలా పెద్దగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. చిన్న జిల్లాలతో పరిపాలన మెరుగుపడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్లు రాత్రింబవళ్లు శ్రమించి ముసాయిదాకు తుది రూపు ఇచ్చారని తెలిపారు. నేడు మ్యాపుల విడుదల ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసమే నిబంధనల మేరకు ముసాయిదా ప్రకటన జారీ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్ చంద్ర చెప్పారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయినా... మెజారిటీ ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంగళవారం సాయంత్రంలోగా వెబ్సైట్లో కొత్త జిల్లాల ముసాయిదాకి సంబంధించిన జీఐఎస్ మ్యాపులు, డిజిటల్ మ్యాపులను అందుబాటులో ఉంచుతామని సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాలోని ముఖ్యాంశాలు మొత్తం జిల్లాలు : 27 కొత్తగా ఏర్పాటయ్యేవి : 17 మొత్తం రెవెన్యూ డివిజన్లు : 60 కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లు : 15 మొత్తం మండలాలు : 505 కొత్తగా ఏర్పాటయ్యే మండలాలు : 46 కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు 1. ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) 2. హన్మకొండ 3. జగిత్యాల 4. కామారెడ్డి 5. కొమురం భీం (మంచిర్యాల) 6. కొత్తగూడెం 7. మహబూబాబాద్ 8. మల్కాజ్గిరి 9. నాగర్ కర్నూల్ 10. నిర్మల్ 11. పెద్దపల్లి 12. సంగారెడ్డి 13. శంషాబాద్ 14. సిద్దిపేట 15. సూర్యాపేట 16. వనపర్తి 17. యాదాద్రి కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు 1. బెల్లంపల్లి 2. భైంసా 3. కోరుట్ల 4. హన్మకొండ 5. హుజూరాబాద్ 6. భూపాలపల్లి 7. వైరా 8. కోదాడ 9. అచ్చంపేట 10. కీసర 11. తూప్రాన్ 12. జహీరాబాద్ 13. గజ్వేల్ 14. నారాయణఖేడ్ 15. బాన్సువాడ కొత్తగా ఏర్పాటు చేసే మండలాలు – ఆదిలాబాద్ జిల్లాలో మావల, నస్పూర్ – కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, అంతర్గాం, ఇల్లంతకుంట – వరంగల్ జిల్లాలో ఖాజీపేట, చిల్పూర్, వేలేరు, ఇల్లందకుంట, ఖిల్లా వరంగల్, ఐనవోలు – నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, మాడ్గులపల్లి, తిరుమలగిరి (సాగర్), కొండమల్లెపల్లి, నాగారం, అనంతగిరి, మోటకొండూరు, అడ్డగూడూరు – మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, పదర, అమరచింత, నందిన్నె – రంగారెడ్డి జిల్లాలో దుండిగల్, జవహర్‌నగర్, అబ్దుల్లాపూర్, బాలాపూర్, గండిపేట్ – మెదక్ జిల్లాలో సిర్గాపూర్, అమీన్పూర్, గుమ్మడిదల, సిద్దిపేట రూరల్, రాజంపేట్ – నిజామాబాద్ జిల్లాలో రామారెడ్డి, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, ముగ్పాల్, ఇందల్వాయి, ఆలూర్, మెండోరా, రుద్రూరు – ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, చిన్నంబావి -
ఓరుగల్లు.. నాలుగు
వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు యాదాద్రిలోకి దేవరుప్పుల మండలం మూడు జిల్లాల్లో జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు రెండు జిల్లాలో భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేట వరంగల్ రెవెన్యూ డివిజన్‌లోకి పరకాల కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు పునర్విభజన ముసాయిదా విడుదల నేడు గెజిట్ జారీ చేయనున్న కలెక్టర్ ! ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ షురూ నెలరోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా... ఇక నాలుగు భాగాలు కానుంది. జంట నగరాలైన వరంగల్, హన్మకొండలు వేర్వేరుగా జిల్లాలుగా ఏర్పడనున్నాయి. దశాబ్దాలపాటు వరంగల్ జిల్లాలకు ప్రత్యేకతను సమకూర్చిన అటవీ ప్రాంతం జయశంకర్(భూపాలపల్లి) జిల్లా కానుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాగా రూపుదిద్దుకోనుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జల్లాల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ప్రస్తుత ప్రతిపాదనలే కొనసాగితే సరిగ్గా 50 రోజుల తర్వాత వరంగల్ జిల్లా... నాలుగు జిల్లాలుగా మారనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉత్కంఠ వీడింది. అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు(363) జారీ చేసింది. ముసాయిదాపై 30 రోజులపాటు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. జిల్లా స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రత్యేంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కరుణ... జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం వరంగల్ జిల్లా... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా మారనుంది. పునర్విభజన ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 18, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), వేలేరు(ధర్మసాగర్), ఇల్లందకుంట(జమ్మికుంట) మండలాలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. ముసాయిదాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మొదలైంది. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ కమిటీ అభ్యంతరం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కరుణకు లేఖ ఇచ్చింది. జనగామౖపై అయోమయం... జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామపై ముసాయిదా నోటిఫికేషన్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయి. ముసాయిదాలో 50 మండలాల పేర్లను తెలుపుతూ... ఏ మండలం ఏ జిల్లాలో కలిసేది పేర్కొన్నారు. జనగామ మండలం పేరు నోటిఫికేషన్లో పేర్కొనలేదు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగించిన జనగామ విషయంలో ఇలా జరగడంపై జనగామ జిల్లా సాధన జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముసాయిదా నోటిఫికేషన్లో మరో తప్పుదొర్లింది. దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో మళ్లీ దీనిపై సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదా ప్రకారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో.... ములుగు, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉండనున్నాయి. ముసాయిదా ప్రకారం జిల్లాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది). జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్. మహబూబాబాద్ : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల లింగాలఘనపురం, సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు... వరంగల్ : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం, శాయంపేట, పరకాల. నర్సంపేట : నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ. హన్మకొండ : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, చిల్పూరు(కొత్తది), వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల. హుజూరాబాద్ : హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లందకుంట(కొత్తది). భూపాలపల్లి : భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, ములుగు : ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట. మహబూబాబాద్ : మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల. జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, రాజాపేట, గజ్వేల్ : చేర్యాల, మద్దూరు. -
‘కొత్త’ ముసాయిదా విడుదల
రెండుగా చీలిన ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లు ఖమ్మం జిల్లాలో వైరా, ఖమ్మం రెవెన్యూ డివిజన్లు పాల్వంచ రెవెన్యూ డివిజన్ కనుమరుగు కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం జిల్లా రెండుగా చీలిపోయింది. ఖమ్మాన్ని రెండు జిల్లాలుగా విడదీస్తూ ముసాయిదాను జీఓ ఆర్టీ నెంబర్ 364ను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్ చంద్ర ప్రకటించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతన జిల్లా, నూతన రెవెన్యూ yì విజన్, నూతన మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత ఉమ్మడి జిల్లా 41 మండలాలతో నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఉంది. విభజన తరువాత.. పద్దెనిమిది మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో కొత్తగూడెం జిల్లా; 22 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో ఖమ్మం జిల్లా ఏర్పాటవుతాయి. కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు; ఖమ్మం జిల్లాలో ఖమ్మంతోపాటు నూతనంగా వైరా రెవెన్యూ డివిజన్ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిలో పాల్వంచ రెవెన్యూ డివిజన్ కనుమరుగైంది. (విభజన తరువాత) కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లో తొమ్మిది మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్లో తొమ్మిది మండలాలు, ఖమ్మం రెవెన్యూ డివిజన్లో 12 మండలాలు, వైరా రెవెన్యూ డివిజన్లో 10 మండలాలు ఉంటాయి. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం రెవెన్యూ yì విజన్‌లో తొమ్మిది మండలాలు (కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చండ్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల) ఉన్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో తొమ్మిది మండలాలు (భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక) ఉన్నాయి. గతంలో పాల్వంచ రెవెన్యూ డివిజన్లో ఉన్న బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలు.. భద్రాచలం రెవెన్యూ డివిజన్లో కలిశాయి. అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాలు కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌లోకి వెళ్లాయి. ఖమ్మం జిల్లా విభజన తరువాత, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రెవెన్యూ డివిజన్లో 12 మండలాలు (ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, కొత్తగా ఏర్పాటయ్యే రఘునాధపాలెం) ఉన్నాయి. వైరా రెవెన్యూ డివిజన్లో 10 మండలాలు (సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం) ఉన్నాయి. కొత్త మండలంగా రఘునాధపాలెం నూతనంగా, 12 రెవెన్యూ గ్రామాలతో రఘునాథపాలెం మండలం ఆవిర్భవించింది. ప్రస్తుత ఖమ్మం అర్బన్ మండలంలోగల పది రెవెన్యూ గ్రామాలు (మంచుకొండ, చిమ్మపుడి, చింతగుర్తి, ఈర్లపూడి, రేగులచెలక, కోయచెలక, పాపటపల్లి, రఘునాధపాలెం, వి.వెంకటాయపాలెం, వేపకుంట్ల); ఖమ్మం రూరల్ మండలంలోగల రెండు రెవెన్యూ గ్రామాల(దారేడు, కామంచికల్)తో రఘునాథపాలెం మండలం ఏర్పాటైంది. ఈ మండల జనాభా 49,858. ఖమ్మం అర్బన్ ఇలా... విభజన తరువాత, ఖమ్మం అర్బన్ మండలంలో తొమ్మిది రెవెన్యూ గ్రామాలు (ఖానాపురం హవేలి, పాకబండ, వెలుగుమట్ల, ధంసలాపురం, బల్లేపల్లి, బుర్హా్హన్పురం, ఖమ్మం, మల్లెమడుగు, దానవాయిగూడెం) ఉంటాయి. ఈ మండల జనాభా 2,80,500. ఖమ్మం రూరల్ ఇలా... ఖమ్మం రూరల్ మండలంలో ప్రస్తుతం 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. విభజన తరువాత, 19 గ్రామాలు (కాచిరాజుగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, తీర్థాల, గోళ్ళపాడు, ఎం.వెంకటాయపాలెం, పల్లెగూడెం, ఆరెంపుల, బారుగూడెం, ముత్తగూడెం, పోలేపల్లి, ఏదులాపురం, కొండాపురం, తల్లంపాడు, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ఆరెకోడు, గుర్రాలపాడు, గుదిమళ్ళ) ఉంటాయి. ఈ మండలం జనాభా 64,284 (విభజన తరువాత). -
మెతుకుసీమ మురిసే
మెదక్ ఇకపై మూడు జిల్లాలు నెరవేరిన దశాబ్దాల కల సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు అదనంగా నాలుగు కొత్త మండలాలు ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం నేటి నుంచి సలహాలు, అభ్యంతరాల స్వీకరణ మెదక్, సిద్దిపేటలో అంబరాన్నంటిన సంబురాలు సాక్షి, సంగారెడ్డి: దశాబ్దాల కలలు నెరవేరాయి.. ప్రజల మనోభీష్టం మేరుకు ప్రభుత్వం కొత్త జిల్లాలకు తుదిరూపునిచ్చింది. మెదక్ జిల్లాను విభజించి కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి సోమవారం ముసాయిదాను విడుదల చేసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 23 మండలాలతో సంగారెడ్డి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 14 మండలాలతో మెదక్ జిల్లా కొనసాగనుంది. 19 మండలాలతో కొత్తగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా ఏర్పాటుకానున్న సిద్దిపేట, మెదక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాల్లో పాల్గొన్నాయి. మెదక్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. సిద్దిపేటలో సైతం ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు వేడుకలు జరుపుకున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లుగా ఏర్పడనుండటంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీ బీబీ పాటిల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై కలెక్టరేట్లో అధికారులు అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఎట్టకేలకు నెరవేరిన కల దశాబ్దాల కలను ప్రభుత్వం నిజం చేసింది. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే మెదక్ ప్రజలు సైతం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం మెదక్ జిల్లాను విభజించి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ సోమవారం ముసాయిదాను వెలువరించింది. సిద్దిపేట జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన చేర్యాల్, మద్దూరు విలీనం కానుండగా కరీంనగర్ జిల్లాలోని కోహెడ, హుస్నాబాద్ మండలాలు విలీనం కానున్నాయి. అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాలు సిద్దిపేటలో విలీనం చేయనున్నారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లకు అదనంగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో తూప్రాన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉంటే నర్సాపూర్ నియోజవకర్గంలోని కౌడిపల్లిని తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కలపటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా నాలుగు మండలాలు.. జిల్లాలోని పలు మండలాలను ప్రభుత్వం పునర్విభజించింది. ప్రతిపాదిత మూడు జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయనుంది. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా సిర్గాపూర్, అమీన్పూర్, గుమ్మడిదల మండలాలు ఏర్పాటు కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్ మండలం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి కొన్ని గ్రామాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నందున్న మండలాల స్వరూపం మారనుంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ ఒక్క కొత్త మండలం ఏర్పాటు కావటంలేదు. నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాన్ని విలీనం చేయాలని భావించినప్పటికీ విలీనం చేయలేదు. నిజామాబాద్ జిల్లా నేతలను నాగిరెడ్డిపేట మండలం విలీనంను గట్టిగా వ్యతిరేకించినందవల్లే ప్రభుత్వం విలీనం వైపు మొగ్గుచూపలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపాదిత కొత్త మండలాల జాబితాలో ఉన్న కంది, హవేలిఘనపురం, నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం మొగ్గుచూపలేదు. ప్రస్తుతం ఉన్న సంగారెడ్డి మండలాన్ని కంది రూరల్ మండలంగా ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ డ్రాప్టు నోటిఫికేషన్లో కంది మండలం ఏర్పాటను మినహాయించారు. కంది స్థానంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. కల్హేర్ మండలంలోని 9, కంగ్టి మండలంలోని 10, నారాయణఖేడ్ మండలంలోని రెండు గ్రామాలను కలుపుతూ కొత్తగా సిర్గాపూర్ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే పటాన్చెరు మండలంలోని 11 గ్రామాలతో కొత్తగా అమీన్పూర్ మండలాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం 34 గ్రామాలతో జిన్నారం మండలం ఉండగా అందులోని 13 మండలాలను విభజించి కొత్తగా గుమ్మడిదల మండలం ఏర్పాటు కానుంది. ఇక సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల ఏర్పాటు ప్రతిపాదన ఉండగా ప్రభుత్వం కేవలం కొత్తగా సిద్దిపేట రూరల్ మండలాన్ని ఏర్పాటుకు చేయనుంది. ప్రతిపాదిత నారాయణరావుపేట మండలం ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపలేదు. ఇదిలా ఉంటే సీఎం స్వగ్రామమైన చింతమడకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అయితే చింతమడకను మండలంగా ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. -
ఆకాశమే హద్దుగా..
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఆనందోత్సాహం సిద్దిపేట జిల్లా ఏర్పాటుపై వేడుకలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ స్వీట్ల పంపిణీ, బాణసంచా మోత సిద్దిపేట జోన్: తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసన ధ్వనులతో హోరెత్తిన సిద్దిపేట.. సరిగ్గా 26 నెలల తర్వాత జిల్లాల పునర్విభజనలో చోటు దక్కడంపై అంతకు రెట్టింపు స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. మూడు దశాబ్దాల కల అడుగు దూరంలో ఉండడంతో పండుగ చేసుకున్నారు. సోమవారం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అందులో సిద్దిపేట పేరు ఉండడంతో ఒక్కసారిగా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణ సంచా మోతతో పట్టణం అదిరిపోయింది. స్వీట్ల పంపిణీ, అభినందనలతో సిద్దిపేట పులకించింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎంపీడీఓ చౌరస్తాలోని బాబూజగ్జీవన్రావ్ విగ్రహానికి మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలతో కలిపి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. వందలాది వాహనాలతో హైదరాబాద్ మార్గం మీదుగా ర్యాలీ కొనసాగింది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్, విక్టరీ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తాల మీదుగా, వెంకటేశ్వర ఆలయం వరకు సాగింది. గాంధీచౌక్ వద్ద మహాత్ముడి విగ్రహానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేశారు. అక్కడి నుంచి నేరుగా కమాన్ మీదుగా నర్సాపూర్ చౌరస్తా, కరీంనగర్ రోడ్డు, అంబేద్కర్ నగర్ మీదుగా పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. అంబేద్కర్ నగర్లో బాబూజగ్జీవన్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ పాటలు అలరించాయి. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎంపీ నృత్యం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, మంత్రి వ్యక్తిగత సహాయకలు రాంచందర్‌రావు, జెడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ యాదయ్య, కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్, వెంకట్ గౌడ్, నర్సయ్య, నాగరాజు, ప్రవీణ్, జావెద్, మరుపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, బ్రహ్మం, వజీర్, జంగిటి కనకరాజు, జడేజ, రాజ నరేందర్, సాకి అనంద్, ఐలయ్య, గురజాడ శ్రీనివాస్, కొర్తివాడ రామన్న, సంపత్‌రెడ్డి, నాయకం లక్ష్మణ్, వెంకటేష్, శేషుకుమార్, గుండు రవితేజ, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీహరి, పరమేశ్వర్, అశ్వక్, విక్రమ్ పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాప్ట్ నోటిఫికేషన్
-
కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాప్ట్ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల పునర్విభజన ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. కలెక్టరేట్లు, సీసీఎల్ఏలో అభ్యంతరాల స్వీకరించనుంది. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు ప్రకటించింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. తొలుత 74 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్యను 31కి కుదించింది. దీంతో మొత్తం మండలాల సంఖ్య 490కి చేరింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, అర్జీలను స్వీకరిస్తారు. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి. ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లా వరంగల్ -
పండగ చేస్కో..
జిల్లా కానున్న సిద్దిపేట 30 సంవత్సరాల స్వప్నానికి నేడు మోక్షం డ్రాప్ట్ నోటిఫికేషన్ తొలి ఘట్టం చారిత్రాత్మక సంబురంగా సన్నాహాలు జిల్లా పండగకు ప్రజలు సన్నద్ధం అన్ని వర్గాలు ముందుండాలని మంత్రి పిలుపు సిద్దిపేట జోన్: 30 ఏళ్ల జిల్లా కల సాకారం కానుండటంతో సిద్దిపేట వాసుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పట్టణ ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఈక్రమంలో నేడు(సోమవారం) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుండటంతో పండగ చేసుకోనున్నారు. 30 ఏళ్లుగా డిమాండ్ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట.. జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ 30 ఏళ్లుగా ఉంది. ప్రతి ఎన్నికల్లో పార్టీలు జిల్లా కేంద్రంపై హామీలివ్వడం, మర్చిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే 1983లో అప్పటి ఎన్నికల ప్రచారానికి సిద్దిపేటకు వచ్చిన ఎన్టీఆర్‌కు అప్పటి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కేసీఆర్ సభాముఖంగా జిల్లా ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తేవడంతో సిద్దిపేట జిల్లాకు అంకురార్పణ జరిగింది. దీంతో సోమవారం ప్రభుత్వం అధికారికంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. నెలవేరిన ప్రజల ఆకాంక్ష కరీంనగర్, మెదక్, వరంగల్, జిల్లాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ రెండు డివిజన్లతో, కొత్త మండలాలతో సిద్దిపేట జిల్లా ప్రాతిపాదన జరిగింది. ప్రజల అభీష్టం, అంగీకారం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ దిశగా సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ జిల్లాకు చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మద్దూర్, చెర్యాల, సిద్దిపేట డివిజన్ పరిధిలోని గజ్వేల్, దౌల్తాబాద్, సిద్దిపేట నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, తొగుట, కొండపాక, ములుగు, వర్గల్, దుబ్బాక మండలాలను కలుపనున్నట్లు ప్రాథమిక రూపకలప్పనలో తేలింది. సోమవారం జారీ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనంతరం 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించానున్నారు. తదుపరి ప్రక్రియ అనంతరం దసరా రోజున నూతన జిల్లా ప్రకటన అధికారికంగా వెలువడనుంది. చారిత్రాత్మక ఘట్టం సిద్దిపేట జిల్లా కేసీఆర్ కల. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టం. జిల్లా పునర్విభజన జాబితాలో సిద్దిపేట పేరు ఉండటం శుభపరిణామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే సిద్దిపేట జిల్లా సాధ్యమైందన్నారు. దీంతో జిల్లా యూనిట్‌గా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్ స్కూల్, స్టేడియం తదితర వసతులు జిల్లా యూనిట్‌గానే మంజూరు అవుతాయని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం వెలువనుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ నెల నేడు సిద్దిపేటలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పండగలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో 1.50 లక్షల జనాభా పై చిలుకు కలిగి ప్రాంతాన్ని మండల కేంద్రంగా, గ్రామాల్లో 35 వేల జనాభా కలిగిన ప్రాంతాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. విజయదశమి తీపి జ్ఞాపకం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సిద్దిపేట ప్రజలకు ఈ దసరా మరో తీపి జ్ఞాపకాన్ని అందించనుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దసరా రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. జిల్లా ఏర్పాటుతో సిద్దిపేటలో ఉపాధి కల్పన, పరిశ్రమలతో పాటు సకల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మూడింటి ఘనత కేసీఆర్‌దే.. సిద్దిపేట ప్రజలకు దశాబ్దాలుగా మిగిలిన మూడు సుదీర్ఘ సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటకు రైల్వేలైన్, గోదావరి జలాలు, జిల్లా కేంద్రం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వ సారధ్యంలోనే సాధ్యమవుతుందన్నారు. నేడు సిద్దిపేటలో జిల్లా పండగ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్న క్రమంలో సోమవారం సిద్దిపేటలో జిల్లా పండగను ప్రజలు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ చౌరస్తా వద్దనున్న బాబుజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి భారీ బైక్‌ర్యాలీని పట్టణ ప్రజలు, పలు పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శర్మ, దేవునూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
22లోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దసరా నుంచే కొత్త జిల్లాలు
కొత్త జిల్లాల కసరత్తుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల మూడో వారంలో లేదా 22వ తేదీలోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని అంశాలనూ అధ్యయనం చేసేందుకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన ఐదుగురు మంత్రులతో కేబినేట్ సబ్ కమిటీని నియమించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందే కేబినేట్ భేటీ, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దసరా పండగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని సీఎం మరోమారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ లోగా అధికార ప్రక్రియలన్నింటినీ ముగించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నెల రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. తర్వాత 15 రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించి తుది ప్రకటన జారీ చేయాలని దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రేమండ్ పీటర్, ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. జోన్ల చిక్కుల్లేకుండా నివేదిక ఇవ్వండి జోనల్ సమస్యలను అధిగమించేందుకు అనుసరించాలని వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నందున అధికారుల విభజన, కార్యాలయాల సంసిద్ధత తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. కొత్త జిల్లాల్లో అధికార యంత్రాంగం ఎలా ఉండాలి? న్యాయాధికార పరిధి ఏ మేరకు ఉండాలి? అధికార వ్యవస్థ ఎలా ఉండాలి? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో ఇప్పటివరకు జరిగిన అధ్యయనాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాటిని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను పరిశీలించారు. జనాభా-భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూపొందించిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై విసృ్తతంగా చర్చించారు. రాజకీయ డిమాండ్లను పెద్దగా పట్టించుకోకుండా ప్రజలకు సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక నేపథ్యం, వెనుకబాటుతనం తదితర అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన కమిటీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించటంతో పాటు ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వడానికి ఈ కమిటీని నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
బలవంతపు భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం