అభ్యంతరాల స్వీకరణకు చర్యలు
Published Wed, Aug 24 2016 12:37 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకుగాను అధికారులు చర్యలు తీసుకున్నారు.
మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌గా విభజిస్తూ జారీ చేసిన ఈ నోటిఫికే షన్‌లో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు ఏడు కొత్త మండలా (మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, చిన్నంబావి, పదర, అమరచింత, నాందిన్నె) లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొత్తూరు, కొందుర్గు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామాలు, ప్రాంతాల ప్రజల నుంచి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో కూడిన అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
అభ్యంతరాలిలా....
రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోగాని, కలెక్టరేట్‌లో గానీ తెలియజేయాలి. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో అభ్యంతరాలు తెలియజేయాలి. మండలాలు, గ్రామాల కూర్పు, జిల్లాల ఏర్పాటు వంటి విషయాలు, ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మండలాలను శంషాబాద్ జిల్లాలో చేర్చిన విషయాలపై అభ్యంతరాలుంటే క్లుప్తమైన సమాచారంతో రాతపూర్వకంగా ఆర్డీఓ కారాలయాల్లో అధికారులకు అందజే యాలి. ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలపాలంటే ఠీఠీఠీ.n్ఛఠీఛీజీట్టటజీఛ్టిటజౌటఝ్చ్టజీౌn.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్‌లో తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
Advertisement
Advertisement