హైదరాబాద్: తెలంగాణ జిల్లాల పునర్విభజన ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. కలెక్టరేట్లు, సీసీఎల్ఏలో అభ్యంతరాల స్వీకరించనుంది. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు ప్రకటించింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది.
తొలుత 74 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్యను 31కి కుదించింది. దీంతో మొత్తం మండలాల సంఖ్య 490కి చేరింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, అర్జీలను స్వీకరిస్తారు. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి.
ఖమ్మం
కొత్త జిల్లాల ఏర్పాటుకు డ్రాప్ట్ నోటిఫికేషన్
Published Mon, Aug 22 2016 2:08 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement