కొత్త జిల్లాలకు నిధులు మంజూరు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
17 కొత్త జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటిన్నర చొప్పున నిధులు ప్రకటించారు. వీటితో పాటు కలెక్టరేట్ ఏర్పాటుకు రూ.కోటి, పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. కొత్త జిల్లాల్లో పనిభారం లేకుండా ఉండేందుకు శాఖల కుదింపు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఒకే పనితీరు కలిగిన శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.