
కొత్తగూడెం కొత్త జిల్లా ఏర్పాటతో ర్యాలీ నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
- రెండుగా చీలిన ఖమ్మం జిల్లా
- కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్లు
- ఖమ్మం జిల్లాలో వైరా, ఖమ్మం రెవెన్యూ డివిజన్లు
- పాల్వంచ రెవెన్యూ డివిజన్ కనుమరుగు
- కొత్తగా వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం జిల్లా రెండుగా చీలిపోయింది. ఖమ్మాన్ని రెండు జిల్లాలుగా విడదీస్తూ ముసాయిదాను జీఓ ఆర్టీ నెంబర్ 364ను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్ చంద్ర ప్రకటించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతన జిల్లా, నూతన రెవెన్యూ yì విజన్, నూతన మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఖమ్మం జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత ఉమ్మడి జిల్లా 41 మండలాలతో నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఉంది. విభజన తరువాత.. పద్దెనిమిది మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో కొత్తగూడెం జిల్లా; 22 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో ఖమ్మం జిల్లా ఏర్పాటవుతాయి. కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు; ఖమ్మం జిల్లాలో ఖమ్మంతోపాటు నూతనంగా వైరా రెవెన్యూ డివిజన్ ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటిలో పాల్వంచ రెవెన్యూ డివిజన్ కనుమరుగైంది. (విభజన తరువాత) కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌లో తొమ్మిది మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో తొమ్మిది మండలాలు, ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో 12 మండలాలు, వైరా రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు ఉంటాయి.
కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం రెవెన్యూ yì విజన్‌లో తొమ్మిది మండలాలు (కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చండ్రుగొండ, అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల) ఉన్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో తొమ్మిది మండలాలు (భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక) ఉన్నాయి. గతంలో పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలు.. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో కలిశాయి. అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాలు కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌లోకి వెళ్లాయి.
ఖమ్మం జిల్లా
విభజన తరువాత, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో 12 మండలాలు (ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, సింగరేణి, కామేపల్లి, కొత్తగా ఏర్పాటయ్యే రఘునాధపాలెం) ఉన్నాయి. వైరా రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు (సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం) ఉన్నాయి.
కొత్త మండలంగా రఘునాధపాలెం
నూతనంగా, 12 రెవెన్యూ గ్రామాలతో రఘునాథపాలెం మండలం ఆవిర్భవించింది. ప్రస్తుత ఖమ్మం అర్బన్ మండలంలోగల పది రెవెన్యూ గ్రామాలు (మంచుకొండ, చిమ్మపుడి, చింతగుర్తి, ఈర్లపూడి, రేగులచెలక, కోయచెలక, పాపటపల్లి, రఘునాధపాలెం, వి.వెంకటాయపాలెం, వేపకుంట్ల); ఖమ్మం రూరల్ మండలంలోగల రెండు రెవెన్యూ గ్రామాల(దారేడు, కామంచికల్)తో రఘునాథపాలెం మండలం ఏర్పాటైంది. ఈ మండల జనాభా 49,858.
ఖమ్మం అర్బన్ ఇలా...
విభజన తరువాత, ఖమ్మం అర్బన్ మండలంలో తొమ్మిది రెవెన్యూ గ్రామాలు (ఖానాపురం హవేలి, పాకబండ, వెలుగుమట్ల, ధంసలాపురం, బల్లేపల్లి, బుర్హా్హన్‌పురం, ఖమ్మం, మల్లెమడుగు, దానవాయిగూడెం) ఉంటాయి. ఈ మండల జనాభా 2,80,500.
ఖమ్మం రూరల్ ఇలా...
ఖమ్మం రూరల్ మండలంలో ప్రస్తుతం 23 రెవెన్యూ గ్రామాలున్నాయి. విభజన తరువాత, 19 గ్రామాలు (కాచిరాజుగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, తీర్థాల, గోళ్ళపాడు, ఎం.వెంకటాయపాలెం, పల్లెగూడెం, ఆరెంపుల, బారుగూడెం, ముత్తగూడెం, పోలేపల్లి, ఏదులాపురం, కొండాపురం, తల్లంపాడు, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ఆరెకోడు, గుర్రాలపాడు, గుదిమళ్ళ) ఉంటాయి. ఈ మండలం జనాభా 64,284 (విభజన తరువాత).