Kasi trip
-
కాశీ వెళ్లిపోయిన శ్రీలీల.. పడవ ప్రయాణంలో అలా! (ఫొటోలు)
-
మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు!
సాక్షి, భువనగిరి: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా తీర్థయాత్రలకు వెళ్లిన దాదాపు వెయ్యి మంది తెలుగువాళ్లు కాశీలో చిక్కుకుపోయారు. వీరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్యతో పాటుగా 25 మంది ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డికి చెందిన 16 మంది, కరీంనగర్ జిల్లావాసి ఒకరు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా కాశీలో చిక్కుకుపోయిన వారందరూ 60 ఏళ్లు పైబడిన వారే. అయితే తాము బీపీ, షుగర్లతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంట తీసుకువెళ్లిన మందులు, డబ్బులు అయిపోయాయని చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. సీఎం కేసీఆర్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలే తమని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. కాశీలో చిక్కుకున్న వారికి వెంటనే వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేర్చాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు పంపుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు -
విషాద ప్రయాణం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు
-
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం
భోగాపురం(నెల్లిమర్ల): కాశీ యాత్ర ముగించుకుని వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నుంచి ఈ నెల 2న 45 మంది ట్రావెల్స్ బస్సులో కాశీ యాత్రకు బయల్దేరారు. వారంతా యలమంచిలి, ఎస్.రాయవరం, జి.కోడూరు, మాకవరం, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందినవారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో వారంతా బుధవారం తెల్లవారుజామున పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద సముద్ర స్నానాలు చేసి, గోవిందపురం వద్ద ఆలయాలు దర్శించుకుని భోజనం ముగించుకుని బయల్దేరారు. పోలిపల్లి వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి వస్తున్న లారీ అక్కడి కూడలి వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. దీంతో యూ టర్న్ తీసుకుంటున్న లారీ ఎదురుగా వెళ్తున్న యాత్రికుల బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీకొట్టి బోల్తాపడింది. ఘటనలో బస్సులో ఉన్న యలమంచిలికి చెందిన కర్ణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి (52) అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది సహా సంఘటనా స్థలానికి చేరుకుని హైవే సిబ్బంది సహకారంతో జేసీబీలతో బస్సు, లారీలో చిక్కుకున్న క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీశారు. గాయపడ్డ వారిలో 28 మందిని తగరపువలస సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి, 9 మందిని విశాఖ కేజీహెచ్‌కు, మరో ఏడుగురిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
కాశీకి వెళ్లి ఏడుగురి అదృశ్యం
♦ తలకు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన మరో యువకుడు పని చేయని సెల్ఫోన్లు ♦ 24 గంటల సస్పెన్స్ తర్వాత క్షేమంగా ఉన్నట్లు సమాచారం బోట్‌క్లబ్ (కాకినాడ)/ కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ఏడుగురు ఆదృశ్యమయ్యారు. తమ వారు ఏమై పోయారోనని వారి బంధువులు తల్లడిల్లిపోయారు. మంగళవారం పొద్దుపోయాక వారు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ గాంధీనగర్ ఎల్విన్‌పేటకు చెందిన డొక్కరి అప్పల నర్సమ్మ (50), డొక్కరి లోవరాజు (27), నమ్మి నారాయణమ్మ (70), గొర్ల మంగమ్మ (50), సర్వసిద్ధి అప్పారావు (75), సర్వసిద్ధి పేరంటాళ్లు (65), నరాల లక్ష్మి (50), బత్తిన మాణిక్యమ్మ (50) గత నెల 29న కాకినాడ నుంచి విజయవాడ మీదుగా రైలులో ఆదివారం కాశీ చేరుకున్నారు. సోమవారం కాశీ సమీపంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్టు బంధువులకు చెప్పారు. దారిలో ఏం జరిగిందో తెలీదు కానీ, లోవరాజు మినహా మిగతా వారి ఆచూకీ తెలియడం లేదు. లోవరాజు వారణాశిలోని కబీర్చోరా ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అక్కడి వైద్యులు ఫోన్లో తెలిపారని బంధువులు చెబుతున్నారు. మిగిలిన ఏడుగురి ఫోన్లు మూగపోవడంతో బంధువుల్లో ఆందోళన మొదలైంది. ‘అసలు వారి ఫోన్లు ఎందుకు పని చేయడం లేదు.. వారికి ఏమైంది.. లోవరాజు సెల్ ఫోన్ రింగవుతున్నా ఎవరూ తీయడం లేదు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతార’ంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. లోవరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లక ముందు వైద్యుని ఫోన్‌తో తమతో మాట్లాడాడని, తనతో ఉన్న వారిని ఎవరో చంపేశారని చెప్పి ఫోన్ పెట్టేశాడన్నారు. వివరాలు సరిగా చెప్పలేదని బంధువులు చెప్పారు. లోవరాజు తలకు గాయంతో ఆస్పత్రికి వచ్చాడని.. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని వైద్యుడు చెప్పారన్నారు. తమ వాళ్లు ప్రమాదానికి గురయ్యారా.. లేక దారి దోపిడీలో ప్రతిఘటించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా.. అనేది అర్థం కావడం లేదని వారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ వద్ద బావురుమన్నారు. అదృశ్యమైన వారి కోసం ఏపీ, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తుండగా.. తాము క్షేమంగానే ఉన్నామని మంగళవారం పొద్దుపోయాక ఆ ఏడుగురు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.