laddu prasad
-
సీబీఐ లేదా ‘సుప్రీం’ జడ్జితో విచారణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమే అయితే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కక్కుకుని చావాలి. మేం తప్పుచేసి ఉంటే కూడా రక్తం కక్కుకుని చావాలని స్వామిని కోరుతున్నా. ఆరోపణలు అబద్ధమైతే చంద్రబాబుని శ్రీ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తారు’.. అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై భూమన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి తప్పు చేశారన్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. నెయ్యి కాదు.. బాబే కల్తీ హత్యా రాజకీయాలు కంటే ఘోరమైన ఆరోపణ చంద్రబాబు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. టీటీడీ ఈఓ శ్యామలరావు మొదట నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ప్రకటించారు. సీఎం చంద్రబాబు బెదిరించిన తరువాత ఈఓ మాట మార్చారు. నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయన్నారు. మీ పాలనలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా జరిగిందో మీకు తెలీదా? మీ పాలనలో సరఫరా చేసిన నెయ్యి కంపెనీలే కదా మా హయాంలోనూ సరఫరా చేసింది వాస్తవం కాదా? నిజానికి.. కలుíÙతం అయ్యింది నెయ్యి కాదు చంద్రబాబే. అసలు మైసూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు? బాబూ.. మీ పాలనలో ఏం చేశారో తెలుసా? మీ పాలనలో తిరుమలలోని మద్రాస్ నల్లి స్టోర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేయికాళ్ల మండపాన్ని నేలమట్టం చేసి ఆనవాళ్లు లేకుండా చేసింది మీ హయాంలోనే. అన్నమయ్య నివాసాన్ని కూల్చివేసి కనీసం ఆ మహానుభావుని జ్ఞాపకాలు లేకుండా చేసింది మీ పాలనలో కాదా? ఇక చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రాయశి్చత్తం చేసుకోవడానికి ఆలయ శుద్ధి అంటున్నారు. అసలు ఆలయ శుద్ధి గురించి ఆయనెలా చెబుతారు? ఆగమ పండితులు చెప్పాలి. తిరుమలలో శ్రీ వైష్ణవులు చేతితో లడ్డూలు తయారుచేస్తారు, ఏమాత్రం తప్పిదం జరిగినా వారు ఉపేక్షించరు. ధర్మప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టింది మేమే.. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో అనేకానేక ధర్మప్రచార కార్యక్రమాలను మేం చేపట్టాం.. ఉదా.. ⇒ ఎస్వీబీసీ ఛానెల్ ప్రారంభించింది మేమే. దళిత గోవిందం పేరుతో శ్రీవారిని దళితవాడలకు తీసుకెళ్లి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టాం. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం కార్యక్రమాలూ నిర్వహించాం. ⇒ వేద విశ్వవిద్యాలయం స్థాపించిందీ.. వేద అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు విద్యార్థులకు రూ.2 లక్షలు డిపాజిట్ చేసింది మేమే. ⇒ శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించింది మా పాలనలోనే. దళిత , బలహీనవర్గాల పెళ్లిళ్లు చేశాం. 36 వేల పేద జంటలకు తాళిబొట్లు తయారుచేయించి వాటిని స్వామివారి పాదాల చెంత పెట్టి వాటిని ఆ జంటలకు ఇచ్చాం. ⇒ అన్నమయ్య ఉత్సవాలు.. 75 మంది వేద పండితులతో విద్వత్ సదస్సు నిర్వహించిందీ మేమే. చిన్న పిల్లల్లో దైవభక్తి పెంచేందుకు గోవింద కోటి, రామకోటి పెట్టి స్వామి దర్శన భాగ్యం కల్పించింది మేమే. .. కానీ, మీ పాలనలో ఏ రోజైనా ఏమైనా చేశావా చంద్రబాబూ? -
బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు
సాక్షి, నిర్మల్ : బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో కలకలం రేగింది. అమ్మవారి భక్తులు లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో పురుగులు దర్వనమివ్వటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాసర సరస్వతి అమ్మవారి భక్తులు ప్రసాదాన్ని తింటున్న సమయంలో లడ్డూలోంచి పురుగులు రావటంతో వారు అవాక్కయ్యారు. ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయని ఆలయ అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదంలో పురుగులు, చెత్త రావటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా అధికారుల తీరులో మార్పురాకపోగా.. ఈ సంఘటన మరల పునరావృతం కావటంపై భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. -
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు
వరుస సెలవులతో తిరుమలలో రద్దీ సాక్షి, తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 63,524 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న సర్వదర్శనం భక్తులకు 18 గంటలు, కాలిబాట భక్తులకు 15 గంటల తర్వాత స్వామివారి దర్శనం లభించనుంది. అన్ని రిసెప్షన్ కేంద్రాల వద్ద ‘గదులు ఖాళీ లేవు’ అన్న బోర్డులే దర్శనమిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట వద్ద కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ఆదివారం రికార్డు స్థాయిలో 50,422 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, సోమవారం కూడా అదే స్థాయిలోనే ఉంది. కాగా, శ్రీవారికి రూ.3.10 కోట్లు హుండీ కానుకలు లభించాయి. -
ఈ యేడు ఖైరతాబాద్ గణేష్ ఇదే
♦ సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేశుడు ♦ చవితికి వారం రోజుల ముందే దర్శనం ♦ ఈ ఏడాదీ తాపేశ్వరం లడ్డూ ప్రసాదం ఖైరతాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది 58 అడుగుల ఎత్తులో ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా భక్తులకు దర్శనమీయనున్నాడు. విగ్రహ తయారీ పనులు శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీకాయుడిని తీర్చిదిద్దడంలో ఎంతో మంది శ్రామికుల శ్రమ ఉంది. తయారీ ఇలా.. ఈ ఏడాది నెలకొల్పే గణపతి విగ్రహం 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో రూపు దిద్దుకుంటోంది. ఇందుకు 20 టన్నుల స్టీల్, కెమికల్ కేవలం ఒకశాతం మాత్రమే ఉండే విధంగా సముద్రపు గవ్వల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తమిళనాడు నుంచి తీసుకువచే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 1750 బ్యాగులు (ఒక్కో బ్యాగు 50 కేజీలు), నార 45 బండిల్స్, గుజరాత్‌లోని పోర్బందర్ నుంచి బంకమట్టి 200 బ్యాగులు (ఒక్కో బ్యాగు 35 కేజీలు), వాటర్ కలర్స్ 150 లీటర్లు వాడుతున్నారు. వీటితో పాటు షెడ్డు వేసేందుకు నర్సాపూర్ నుంచి 25 టన్నుల సర్వీ కర్ర, 50 బండిళ్ల కొబ్బరి తాడుతో నిర్మించిన 60 అడుగుల షెడ్డు అదనం. వీటన్నింటికీ కమిటీ రూ.55 లక్షలు వెచ్చించింది. వినాయకుడి మొత్తం బరువు సుమారు 45 టన్నులు ఉంటుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. (శిల్పి రాజేంద్రన్) పనులు సాగే తీరిదీ.. మహాగణపతి విగ్రహం నెలకొల్పే షెడ్డును వేసేందుకు ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ నేతృత్వంలో 20 మంది శ్రామికులు 15 రోజుల పాటు శ్రమించారు. మచిలీపట్నంకు చెందిన నాగబాబు ఆధ్వర్యంలో 12 మంది వెల్డింగ్ పనులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులను చెన్నైకి చెందిన ఆర్టిస్టు మూర్తి ఆధ్వర్యంలో 25 మంది పనిచేస్తున్నారు. విగ్రహం ఫినిషింగ్ వర్క్ కోసం మహారాష్ట్ర, యూపీ, కోల్‌కతా నుంచి 25 మంది కళాకారులను తీసుకువచ్చారు. మౌల్డింగ్ పనులను నగరానికి 20 మంది చూస్తున్నారు. చివరగా చేసే ఫినిషింగ్ పెయింటిగ్ పనులను కాకినాడకు చెందిన భీమేష్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు పనిచేస్తారు. నైవేద్యం లడ్డూ 500 కేజీలే.. ఖైరతాబాద్ మహాగణపతికి మొదటిసారిగా 2010లో తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. ఆ తరువాత 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోలు, 2014లో 5200 కిలోలు, 2015లో 5600 కిలోల మహాలడ్డూను ప్రసాదంగా సమర్పించారు. ఈ ఏడాది గణపతికి కేవలం నైవేద్యంగా మల్లిబాబు నుంచి 500 కేజీల లడ్డూను మాత్రమే తీసుకుని సమర్పిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతితో పాటు లడ్డూ పెరుగుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం వినాయకుడి ఎత్తు తగ్గినట్లుగానే లడ్డూ సైజు కూడా మొదటి సారిగా 2010లో వలే 500 కేజీలు మాత్రమే.. అదీ నైవేద్యంగా మాత్రమే పెట్టాలని నిర్ణయించారు. గత సంవత్సరం ఖైరతాబాద్ గణేషుడి ప్రతిమ(ఫైల్)