వరుస సెలవులు రావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
అన్ని రిసెప్షన్ కేంద్రాల వద్ద ‘గదులు ఖాళీ లేవు’ అన్న బోర్డులే దర్శనమిస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట వద్ద కూడా భక్తులు కిక్కిరిసిపోయారు. ఆదివారం రికార్డు స్థాయిలో 50,422 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, సోమవారం కూడా అదే స్థాయిలోనే ఉంది. కాగా, శ్రీవారికి రూ.3.10 కోట్లు హుండీ కానుకలు లభించాయి.