
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,535 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు.
నేడు అంగప్రదక్షిణ టోకెన్ల ఆన్‌లైన్ కోటా విడుదల
ఆగస్టు 10వ తేదీ శనివారం రోజున తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేసుకునే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 250 టోకెన్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment