శాలిగౌరారం
యూరీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ స్థానిక స్వయంకృషి యువజన సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రాంరంభించిన ఆత్మశాంతి కొవ్వొత్తుల ర్యాలీ శాలిగౌరారం, బాలిశెట్టిగూడెం మీదుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తావద్ద శాలిగౌరారం–నకిరేకల్ ప్రధాన రోడ్డుపై మౌనం నిర్వహించి అమరవీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆ యువజన సంఘం నాయకులు బట్ట వెంకటయ్య, కూతాటి సోములు, బట్ట లక్ష్మినారాయణ, శ్రీనివాస్, పీరయ్య, వీరబాబు, వినయ్, కుమార్, గుండ్లపల్లి రమేశ్, వెంకటయ్య, బోడ లింగయ్య, నిమ్మల శంకర్, తోటకూరి బాబు, వడ్లకొండ బిక్షం, రమేశ్, చిలుకూరి బిక్షం, సుంచు మైసయ్య, తాటిపాముల రాములు, శివ, మోష, ఈర్ల సైదులు, రాగి ఏసోబు, ఇంద్రకంటి శ్రీను, మద్ది రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వీరజవాన్లకు ఘన నివాళి
Published Wed, Sep 21 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement