public issues
-
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్‌కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్‌లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్‌చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్‌ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
ఐపీవో వేవ్
న్యూఢిల్లీ: ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత వారం 4 ఇష్యూలు మార్కెట్లను పలకరించగా.. గురువారం(19న) మరో 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. 23న ముగియనున్న ఇవి 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. బుధవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనున్నాయి. వివరాలు చూద్దాం..ట్రాన్స్‌రైల్ లైటింగ్ ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధ ఈపీసీ సేవలందించే ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 410–432 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్ 1.01 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 839 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.డీఏఎమ్ క్యాపిటల్ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఏఎమ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 269–283 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 2.97 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. తద్వారా రూ. 840 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, విలీనాలు– కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్రోకింగ్, రీసెర్చ్లతోకూడిన సంస్థాగత ఈక్విటీల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కంపెనీ నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.కంకార్డ్ ఎన్విరో పర్యావరణ సంబంధ ఇంజనీరింగ్ సొల్యూషన్ల సంస్థ కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 665–701 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 46.41 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 500 కోట్లుపైగా సమ కూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధులను వాటర్ ట్రీట్మెంట్ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త అసెంబ్లీ యూనిట్(సీఈఎఫ్)లో ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రోకెమ్ సెపరేషన్ సిస్టమ్స్‌పై మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.సనాతన్ టెక్స్టైల్స్ విభిన్న యార్న్‌ల తయారీ కంపెనీ సనాతన్ టెక్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 305–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, గ్రూప్ సంస్థలు రూ. 150 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 550 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ టెక్స్టైల్స్, ఇండ్రస్టియల్ పాలియస్టర్, కాటన్ తదితర యార్న్లను కంపెనీ రూపొందిస్తోంది. -
ప్రజాధనమే హారతి కర్పూరం
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, చట్టాల తయారీకి వేదిక కావాల్సిన చట్టసభలు నిష్ప్రయోజనంగా మారుతుండడం ప్రజాస్వామ్యవాదులను ఆవేదనకు గురి చేస్తోంది. పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో నడిచే పార్లమెంట్లో వారి బాగోగులపై మాట్లాడేవారే కనిపించకుండాపోవడం విస్మయం కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు తప్ప జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల, వారి కష్టాలకు చట్టసభల్లో స్థానం దక్కడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిస్థితి మరింత దిగజారడం గమనార్హం. ఈ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీన ముగియనున్నాయి. అంటే మరో 9 రోజుల సమయమే మిగిలింది. మధ్యలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్లో సరైన చర్చే జరగలేదు. గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై ఇరుపక్షాలు గొడవలు పడడంతోనే సమయమంతా వృథాగా గడిచిపోయింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. సొమ్ము వెచ్చిస్తున్నా ఫలితం సున్నా ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతోనే పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఎంపీల వ్యవహార శైలికి అదే ప్రజలు బాధితులుగా మారుతున్నారు. పేదల సమస్యలు ఎప్పటికీ చర్చకు రాకుండాపోతున్నాయి. ఒక్క నిమిషం పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సొమ్ము వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం సున్నా. చర్చించాల్సిన బిల్లులు, తీసుకురావాల్సిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ అదానీ, సోరోస్ వివాదంతో కాలం గడిపేస్తుండడం గమనార్హం. ప్రజలను ప్రజాప్రతినిధులే శిక్షిస్తున్నారని, అందుకు మరొకరు అవసరం లేదని రాజకీయ వ్యాఖ్యాత కమలేష్ సింగ్ ఆక్షేపించారు. ఎంపీల వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో అనవసర విషయాలపై సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన అంశాలను పక్కనపెడుతున్నారని తప్పుపట్టారు. కొన్నిసార్లు ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు చట్టాలుగా మారిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని అన్నారు. ఇదేనా జవాబుదారీతనం? ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వేదిక పార్లమెంట్. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ కార్యకలాపాలు జరగపోవడంతో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుకొనే అవకాశం పాలకులకు లభిస్తోందని, జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంతో ఇతర పారీ్టల సభ్యులకు మాట్లాడే వెలుసుబాటు దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలని ఆరాటపడుతున్నప్పటికీ వారిని పట్టించుకొనే నాథుడే ఉండడం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో అదానీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా, దాని పోటీగా బీజేపీ ఎంపీలు జార్జి సోరోస్‌ను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అదానీ, సోరోస్ కాకుండా దేశ సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా పట్టువీడాలని సూచించారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్, బీజేపీలు హైజాక్ చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ప్రాంతీయ పారీ్టలు ఉన్నాయన్న సంగతే అవి మర్చిపోతున్నాయని ధ్వజమెత్తారు. బూడిదలో పోసిన పన్నీరు పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషం వృథా అయ్యిందంటే రూ.2.50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనని 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పారు. 2021లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు అప్పట్లో నిపుణులు లెక్కగట్టారు. మరోవైపు పార్లమెంట్ భేటీలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్‌సభ కాలంలో ప్రతిఏటా సగటున 135 రోజుల చొప్పున పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 దాకా మనుగడలో ఉన్న 17వ లోక్‌సభ కాలంలో సగటున ఏటా 55 రోజులపాటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
క్విప్.. కొత్త రికార్డ్!
ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో నిధుల సమీకరణ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఒకపక్క పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) వరదతో కంపెనీలు లిస్టింగ్ గంట మోగిస్తుంటే... మరోపక్క, లిస్టెడ్ కంపెనీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో వేల కోట్లను సమీకరించడం ద్వారా విస్తరణ, ఇతరత్రా అవసరాలను తీర్చుకుంటున్నాయి. ఈ ఏడాది క్విప్ ఇష్యూల బాట పడుతున్న లిస్టెడ్ కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ నాటికి దాదాపు 75 కంపెనీలు ఇప్పటికే రూ.1,0,2000 కోట్లను సమీకరించాయి. దీంతో 2020 నాటి రూ.80,800 కోట్ల సమీకరణ రికార్డును బ్రేక్ చేసింది. భారీగా సమీకరిస్తున్న ఈ నిధులను కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవడానికి, ప్లాంట్ల విస్తరణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రూ.8,500 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు చొప్పున తాజాగా సమీకరించాయి. సెప్టెంబర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.5,000 కోట్ల క్విప్ ఇష్యూను పూర్తి చేసింది. జూలైలో మెటల్–మైనింగ్ దిగ్గజం వేదాంత రూ.8,500 కోట్లను క్విప్ రూట్లో సమీకరించడం తెలిసిందే. వేదాంత ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడం కోసం వినియోగించుకుంది. అదే నెలలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్ల క్విప్ నిధులను దక్కించుకుంది. విద్యుత్ ట్రాన్స్మిషన్ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, రుణాల తిరిగి చెల్లింపు కోసం వీటిని వెచి్చంచనుంది. మరిన్ని కంపెనీలు క్విప్ బాటలో ఉండటంతో మొత్తంమీద ఈ ఏడాది క్విప్ సమీకరణ మరింత ఎగబాకే అవకాశాలున్నాయి.నిధులతో రెడీ... దేశీ కార్పొరేట్ దిగ్గజాలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భారీగా విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా పోటీ కంపెనీలతో తలపడేందుకు, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నిధులను సిద్ధం చేసుకుంటున్నాయని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు చెందిన క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వి. జయశంకర్ పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల క్విప్ ఇష్యూకు రాగా, మరో రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ క్విప్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. ఏప్రిల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కూడా విస్తరణ ప్రణాళికల కోసం రూ.5,000 కోట్ల క్విప్ నిధులను ఖాతాలో వేసుకుంది. ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్ ఎనర్జీ (రూ.3,319 కోట్లు), మాక్రోటెక్ డెవలపర్స్ (రూ.3,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.3,000 కోట్లు), కోఫోర్జ్ (రూ.2,240 కోట్లు) కొన్ని. ‘వేల్యుయేషన్స్ సానుకూలంగా ఉండటం, పటిష్టమైన సెకండరీ మార్కెట్లతో పాటు పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం వంటి అంశాలు లిస్టెడ్ కంపెనీల క్విప్ జోరుకు ప్రధాన కారణం. కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నాయి. మూలధన అవసరాల కోసం చాలా లిస్టెడ్ కంపెనీలు ఇదే రూట్‌ను ఆశ్రయిస్తున్నాయి’ అని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు చెందిన ఈక్విటీ విభాగం హెడ్ దీపక్ కౌశిక్ చెప్పారు. ఏంజెల్ వన్, శ్యామ్ మెటాలిక్స్, టెక్నో ఎలక్ట్రిక్, లాయిడ్స్ మెటల్స్, క్రాఫ్టŠస్మన్ ఆటోమేషన్, చాలెట్ హోల్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ వంటివి కంపెనీలు గడిచిన కొద్ది నెలల్లో రూ.1,000–1,500 కోట్ల స్థాయిలో క్విప్ నిధులను సమీకరించాయి.క్విప్ అంటే... ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు నిధులను సమీకరించే సాధనాల్లో క్విప్ కూడా ఒకటి. అర్హతగల సంస్థాగత బయ్యర్లకు (క్యూఐబీ) ఈక్విటీ షేర్లను, పూర్తిగా–పాక్షికంగా షేర్లుగా మార్చుకోగల డిబెంచర్లు లేదా ఇతరత్రా సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులను సమకూర్చుకోవడానికి ‘క్విప్’ వీలు కలి్పస్తుంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడుల్లో విశేష అనుభవం గల, ఆరి్థకంగా బలమైన సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ క్యూఐబీలుగా నిర్దేశించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బాబు గారి పొగడ్తలు.. అన్‌స్టాపబుల్!
ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయం ఎలా సాగిపోతోందో తెలుసా? హిందూపురం ఎమ్మెల్యే, బాబుగారి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఇంటర్వ్యూ మాదిరిగా సాగుతోందని అనవచ్చు. ఎందుకంటారా? ఆ ఇంటర్వ్యూలో మాదిరిగానే బాబుగారిని పచ్చమీడియా ఓ పొగిడేస్తోంది కాబట్టి.. భారీగా బిల్డప్ ఇచ్చి నిలబెడుతోంది కాబట్టి!! అన్‌స్టాపబుల్ అంటే నిరాఘాటంగా అని తెలుగు అర్థం. మామూలుగానైతే ఓ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అంటే అందులో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజా సమస్యలు వంటివి చర్చకు వస్తూంటాయి. అధికారం చేపట్టి నాలుగు నెలలైన నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడతారని ఆశిస్తాం. కానీ.. అలాంటివేవీ ఇందులో కనిపించవు. సానుకూల దృక్పథంతో మాట్లాడుకోవడం వరకూ ఓకే కానీ.. అచ్చంగా భజన కోసమన్నట్టుగా ముఖాముఖి నిర్వహిస్తేనే సమస్య. బాలకృష్ణ సినీ నటుడు కనుక, ఆయనకు ఏదో గ్లామర్ ఉంటుంది కనుక దానిని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. చంద్రబాబు ప్రజలను మాయ చేయడానికి ఈ గ్లామర్‌తోపాటు తన అధికారాన్ని కూడా వాడుకుంటున్నారు. ఏతావాతా ఎల్లో మీడియాలో వచ్చిన స్టోరీ అంతటిని చదివితే ఏమని అనిపిస్తుందంటే చంద్రబాబు, బాలకృష్ణలు, అన్ స్టాపబుల్‌గా అబద్దాలు చెప్పుకున్నారూ అని! తనకు, తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనపై వచ్చిన స్కిల్ స్కామ్ తదితర కేసులను నీరు కార్చడానికి ఈ ప్రోగ్రాం వేదికగా చంద్రబాబు ఒక ప్రాతిపదికను సిద్దం చేసుకుంటున్నారని అనిపించింది. ఇప్పటికే తనపై వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి సన్నాహాలు ఆరంభించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఏనాడు కక్ష రాజకీయాలకు పాల్పడలేదని ఆయన చెప్పారట. తనకు రాజకీయంగా పోటీ వస్తారని భావించి కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్ పై అక్రమ కేసులు పెట్టడం కక్ష రాజకీయం కాదన్నమాట. జగన్ టైమ్‌లో పలు స్కీములకు, ప్రాజెక్టులకు ఆయా ప్రముఖుల పేర్లు పెడితే వాటిని తాను అధికారంలోకి రాగానే తొలగించడం కక్ష రాజకీయం కాదట. ఉదాహరణకు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు దివంగత నేతలు గౌతంరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిల పేర్లు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తొలగించి వేసింది. తనను అరెస్టు చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. అంతవరకు ఒప్పుకోవచ్చు. తప్పు చేసినా, చేయకపోయినా, అరెస్టు కావాలని ఎవరూ కోరుకోరు కదా! కానీ అదే సందర్భంలో తాను చట్ట ధిక్కరణ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏపీ సీఐడీ ఆధారాలతో ప్రభుత్వ డబ్బు రూ.300 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయిందని కేసు పెట్టింది కదా? దానిని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నిర్దారించారు కదా? ఈ కేసులో పలువురిని అరెస్టు కూడా చేశారు కదా? టీడీపీ ఖాతాలోకి సుమారు రూ.అరవై కోట్లు వచ్చిందని సీఐడీ వివరాలు ఇచ్చింది కదా? అలా జరగలేదని టీడీపీ ఎందుకు చెప్పలేకపోయింది? అసలు ఆ కేసు విచారణకు పిలుస్తారని భావించి, తన పీఏ శ్రీనివాస్‌ను అకస్మాత్తుగా అమెరికా పంపించడం అవాస్తవమా? నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకు వెళతామని చెబితే ఒప్పుకోకుండా బస్‌లో ప్రయాణించింది దేని కోసం?. రాజమండ్రి జైలులో ఈయన ఏసీ కావాలని అడిగితే ప్రభుత్వం సమకూర్చలేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే,వాటినే తాను వాడుకుంటూ అప్పుడేదో అనుమానస్పద ఘటనలు జరిగాయని చెప్పడం ఇన్నేళ్ల సీనియర్ నేతకు తగునా?... ఇక బావమరిది బాలకృష్ణ ఇచ్చిన ఎలివేషన్ చూడండి. చంద్రబాబు అరెస్టుతో భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అదిరిపోయారట. కన్నీళ్లు పెట్టుకున్నారట. ‘‘ఆయన అసలు గీత దాటని మనిషి. ప్రజలే ఆయన కోసం గీత దాటారు’’ అని మాట్లాడారు ఆయన. మీడియా చేతిలో ఉంటే ఎలా బాజా బజాయించుకోవచ్చో ఈ ఇంటర్వ్యూ తెలియ చేస్తుంది. జైలులో మొదటి రాత్రి అనుభవాలు ఏమిటని బాలకృష్ణ అడగడం, చంద్రబాబేమో దానికి వైనవైనాల వర్ణనలతో సమాధానం ఇవ్వడం భలేగా ఉంది. ఏ వ్యక్తిని అయినా పోలీసులు అరెస్టు చేస్తే, ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో, దానినే అప్పుడు కూడా అనుసరించారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి, తనను రాత్రి తిప్పారని, విచారించారని చెబుతున్న తీరు ఇప్పటికీ దాని ద్వారా సానుభూతి పొందాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. తన సోదరి భువనేశ్వరి, తదితర కుటుంబ సభ్యులు అప్పట్లో చేసిన ఆందోళనలను కూడా బాలకృష్ణ ప్రస్తావించుకున్నారు. మరో హైలైట్ ఏమిటంటే ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్ బాబు అని అంటున్నారట.నిజమా? మరి ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వారిని అలగా జనం అని బాలకృష్ణ ఎందుకు గతంలో సంబోధించారో? పవన్ కళ్యాణ్ ,చంద్రబాబులు కలిసి పోటీ చేయాలని అనుకోవడం చారిత్రక సన్నివేశంగా చూపించడానికి బాలకృష్ణ యత్నించారు. విజయవాడలో వరదలలో చంద్రబాబు చాలా కష్టపడ్డారని ప్రొజెక్షన్ ఇవ్వడానికి బాలకృష్ణ తంటాలు పడ్డారు. చంద్రబాబు కలెక్టరేట్లో బస్‌లో బస చేయడం, పడవ ఎక్కడం అన్ని ఎవరూ చేయలేని పనులు అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. మరి అసలు వరదలు రావల్సిన అవసరం ఏమిటి? పది రోజులపాటు లక్షల మంది ఎందుకు నానా పాట్లు పడ్డారు? చంద్రబాబు కృష్ణ నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారా?లేదా? ఆ ఇంటిలోకి వరద నీరు చేరడంతోనే ఆయన బస మార్చింది అవాస్తవమా? అసలు వరదలే రాని ప్రాంతంలో వరదలు వచ్చినందుకు వారు బాధపడినట్లు లేదు. పది రోజుల్లో సాధారణ పరిస్థితి తెచ్చామని జబ్బలు చరుచుకున్నారు.మరో కీలక అంశం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసి నెయ్యి వాడారన్న ఆరోపణ గురించి బాలకృష్ణ ప్రశ్నించినా ,చంద్రబాబు జవాబు దాటవేశారనే అనుకోవాలి. సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి వదలివేశారు. మరి అంతకుముందు జగన్ పై అన్యాయమైన ఆరోపణలు ఎందుకు చేసినట్లు? అది కక్ష రాజకీయం కాదా? యథా ప్రకారం అమరావతి కల గురించి కూడా ప్రశ్నించారు. ఆయన ఎప్పటి మాదిరి సైబరాబాద్ తనదేనని, హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్క మాట అడిగితే ఒట్టు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు, బాలకృష్ణలు కలిసి ఆడిన మరో అన్ స్టాపబుల్ డ్రామాగా దీనిని అభివర్ణించుకోవచ్చేమో!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉద్యోగం వస్తుందని నమ్మబలికి పెళ్లి చేసుకున్నాడు
నరసరావుపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు పోటెత్తారు. పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. సోదరి 4 ఎకరాలు రాయించుకుంది.. నాకు అనారోగ్యం కారణంగా రెండు కళ్లు కని్పంచకుండా పోయాయి. నాకు ఐదెకరాల పొలం ఉంది. కళ్లు కని్పంచని నాకు నా సోదరి అంజమ్మ మాయమాటలు చెప్పి నాలుగు ఎకరాలు రాయించుకుంది. నా పొలం నాకు ఇప్పించి న్యాయం చేయండి. – కేసరి శ్రీనివాసరెడ్డి, అంధుడు, మాచవరం, రొంపిచర్ల మండలంవీసా పేరుతో రూ.3.50లక్షలు కాజేశారుప్లైహై కన్సెల్టెన్సీ అనే పేరుతో గుత్తికొండకు చెందిన బ్రహ్మం అనే వ్యక్తి కన్సెల్టెన్సీని నిర్వహిస్తూ వీసా ఇప్పించేందుకు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని, అందులో సగం ముందు చెల్లించాలంటూ నా వద్ద నుంచి రూ.3.50లక్షలు తీసుకున్నాడు. వీసా మంజూరు చేయలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. న్యాయం చేయండి.–పఠాన్ అబ్దుల్ ఖాదర్, పెద్దమసీదు, పిడుగురాళ్లనమ్మించి రూ.లక్ష కాజేశాడు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే శివరామకృష్ణ అనే వ్యక్తి బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నా వద్ద నుంచి ఇంటిపన్ను రసీదు, విద్యుత్ బిల్లు రసీదు తీసుకున్నాడు. బ్యాంకు దగ్గరకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించి రూ.1.50లక్షలు తీసుకొని బయటకు వచ్చి నాకు రూ.50వేలు ఇచ్చాడు. దీనికి నూటికి రెండురూపాయలు వడ్డీ చెల్లించాలని, మిగతా రూ.లక్ష తాను తీసుకొని నెలకు రూ.4 వడ్డీ చెల్లిస్తానని, మీకు నోటు రాసిస్తానంటూ నమ్మబలికి డబ్బు కట్టకుండా మోసం చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని, నా నగదు నాకు ఇప్పించండి. – పొట్టి శౌమ్య, రూపెనగుంట్ల, నకరికల్లు మండలంఉద్యోగం వస్తుందని నమ్మబలికి పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ బాబు అనే వ్యక్తి తనకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుందని, తన చెల్లెలు కూడా ఎస్ఐనే అంటూ వాళ్ల తల్లిదండ్రులు సైతం నమ్మబలికి రూ.12లక్షలు కట్నం ఇచ్చేలా మాట్లాడుకొని నన్ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే రూ.6 లక్షలు తీసుకున్నారు. వివాహం అనంతరం రూ.6 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. వివాహమైన తర్వాత ఆకాష్బాబుకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. మోసంచేసిన ఆకా‹Ùబాబు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోండి. – ఓ మహిళ, క్రిస్టియన్‌పాలెం, నరసరావుపేట -
ఐపీవో రష్.. లాభాల జాతర
గత క్యాలండర్ ఏడాది(2023)లో పబ్లిక్ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త కంపెనీల లిస్టింగ్స్‌తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం! ముంబై: స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్(బీఎస్ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్ఎస్ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి. రూ. 82 లక్షల కోట్లు గతేడాది(జనవరి–డిసెంబర్) దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్ టాప్–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్ చోటు సాధించింది. సగటున 45 శాతం ప్లస్ గతేడాది స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!! టాప్‌లో పీఎస్‌యూ ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్ డీఎల్ఎమ్ 155 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ 141 శాతం చొప్పున జంప్‌చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిస్టింగ్‌లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్ అత్యధిక ఐపీవోల మార్కెట్‌గా నిలిచింది. కారణాలున్నాయ్ బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్ 41 శాతం జంప్‌చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్ డిసెంబర్ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది! -
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్ నవంబర్ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్ నవంబర్ వాణిజ్య లోటు, బ్రిటన్ నవంబర్ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ అక్టోబర్ కరెంట్ ఖాతా, అమెరికా నవంబర్ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ ద్రవ్యోల్బణం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది. ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీప్ హెడ్ విజయకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 పబ్లిక్ ఇష్యూలు 8 లిస్టింగులు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్‌కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్ మైక్రో ఫిన్, మోతీసన్స్ జ్యువెలర్స్, సురజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్జ్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓలు డిసెంబర్ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్ ఇంజనీరింగ్స్ పబ్లిక్ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్ టెక్‌ల్యాబ్‌లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. -
ఐపీవో అధిక వేల్యుయేషన్స్‌పై సెబీ దృష్టి
ముంబై: పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి భారీ ప్రీమియంలు, అధిక వేల్యుయేషన్ల అంశాన్ని పరిశీలించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ తెలిపారు. పెద్దగా తెలియని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఫేస్ వేల్యూను తక్కువగా చూపించి, షేరును మాత్రం భారీ ప్రీమియం రేటుకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పబ్లిక్ ఇష్యూల టైమింగ్‌ను మార్కెట్‌కి వదిలేయాలన్నదే సెబీ ఉద్దేశమని మాధవి చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే కంపెనీలు ఇష్యూకి వస్తాయని, ఎప్పుడు రావాలనేది సెబీ నిర్దేశించడమనేది ఇటు ఇన్వెస్టర్లు, అటు సంస్థకు ప్రయోజనకరంగా ఉండబోదని ఆమె పేర్కొన్నారు. -
ఐపీవో బూమ్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడంతోపాటు.. పటిష్ట లాభాలతో కదులుతుండటంతో ప్రైమరీ మార్కెట్ జోరందుకుంది. కొద్ది రోజులుగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు ఆసక్తి చూపుతున్నాయి. మే–జూలై మధ్య సుమారు 10 కంపెనీలు నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకియో లైటింగ్, సెన్కో గోల్డ్, గ్లోబల్ సర్ఫేస్, ఐడియాఫోర్జ్ టెక్, డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, నెట్వెబ్ టెక్, ఉత్కర్‡్ష ఎస్ఎఫ్బీ తదితరాలను పేర్కొనవచ్చు. ఈ బాటలో తాజాగా మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. జాబితాలో సెల్లో బ్రాండ్ సంస్థ సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లెక్సిబుల్ హోస్ తయారీ కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 102–108 ధరల శ్రేణి నిర్ణయించింది. ఈ నెల 22–24 మధ్య చేపట్టనున్న ఇష్యూలో భాగంగా రూ. 162 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.75 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ శాట్ ఇండస్ట్రీస్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 351 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 21న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్ కంపెనీలో 91 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇతర సంస్థల కొనుగోళ్లనూ చేపట్టనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 130 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 80 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీ తద్వారా 80 శాతం ఆదాయాన్ని అందుకుంటోంది. 2022–23లో రూ. 269 కోట్ల ఆదాయం, రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెల్లో వరల్డ్ సెల్లో బ్రాండుతో హౌస్‌హోల్డ్, స్టేషనరీ ప్రొడక్టులను తయారు చేస్తున్న సెల్లో వరల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ. 1,750 కోట్లు సమీ కరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఈ క్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ముంబై కంపెనీ అర్హతగల తమ ఉద్యోగులకు రూ. 10 కోట్ల వి లువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ హౌస్‌వేర్, రైటింగ్, స్టేషనరీ ప్రొడక్టులతోపాటు.. మౌల్డెడ్ ఫరీ్నచర్, తత్సంబంధిత ఉత్పత్తులను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో గ్లాస్‌వేర్, ఒపల్ వేర్ ప్రొడక్టులను సై తం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. రాజస్టాన్‌లో గ్లాస్‌వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. 2022–23లో రూ. 1,770 కోట్ల ఆదాయం, రూ. 285 కోట్ల నికర లాభం ఆర్జించింది. హ్యాపీ ఫోర్జింగ్స్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80.55 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అంతేకాకుండా కంపెనీ మరో రూ. 500 కోట్ల విలువచేసే ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకు ముందుగా రూ. 100 కోట్ల విలువైన షేర్లను జారీ చేసే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 214 కోట్లు ప్లాంటు మెషినరీ, ఎక్విప్మెంట్ తదితరాలకు, రూ. 190 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులను వెచ్చించనుంది. వాణిజ్య, వ్యవసాయ, ఆఫ్‌రోడ్ వాహనాలకు విడిభాగాలను సమకూరుస్తోంది. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు తదితర దిగ్గజాలు క్లయింట్లుగా ఉన్నాయి. విదేశాలలోనూ కార్యకలాపాలు విస్తరించింది. 2022–23లో రూ. 1,197 కోట్ల ఆదాయం, రూ. 209 కోట్ల నికర లాభం ఆర్జించింది. 18 నుంచి బొండాడ ఇంజినీరింగ్ ఐపీవో టెలికం, సౌర విద్యుత్ రంగ సంస్థలకు మౌలిక సదుపాయాలపరమైన సేవలు అందించే బొండాడ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 42.72 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధరను రూ. 75గా నిర్ణయించారు. ఇష్యూ 18న ప్రారంభమై 22న ముగుస్తుందని సంస్థ సీఎఫ్‌వో బరతం సత్యనారాయణ తెలిపారు. కనీసం 1600 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని లిస్ట్ చేయనున్నామని వివరించారు. పూర్తిగా ఈక్విటీ జారీ రూపంలో ఈ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఐపీవో ద్వారా వచ్చే నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 1,150 కోట్ల ఆర్డరు లభించిందని, ప్రస్తుతం మొత్తం ఆర్డరు బుక్ విలువ రూ. 1,600 కోట్ల మేర ఉందని ఉందని వివరించారు. -
‘జగనన్న సురక్ష’ నేటి నుంచే..
సాక్షి, అమరావతి : అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ.. ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఇన్కమ్ మొదలైన 11 రకాలు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుంది. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష’. రేపటి నుంచి గృహ సందర్శన.. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తోడుగా.. ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు. జూలై 1 నుంచి క్యాంపులు.. మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు. సర్వీస్ ఫీజు లేకుండా సర్టిఫికెట్ల జారీ.. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుంది. కార్యక్రమం వివరాలు.. రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది పౌరులకు చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శిస్తూ, జూలైæ 1 నుంచి∙ఈ కార్యకమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు జరుగుతాయి. ఇందులో 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వోద్యోగులు, 2.6 లక్షల మంది వలంటీర్లు పాల్గొంటారు. ఇక 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక ఐఏఎస్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ క్యాంపులను తనిఖీ చేస్తారు. ప్రోగ్రాం పురోగతిపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై వారం వారం సమీక్ష నిర్వహిస్తారు. ‘1902’తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని ఇంటివద్ద లేకపోయినప్పటికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్లినట్లయితే వలంటీర్లతో కూడిన ఈ టీమ్ ‘1902’ హెల్ప్‌డెస్క్ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఇక గ్రామంలో.. సచివాలయ పరిధిలో ఏ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నంబర్ ‘1902’ కి కాల్ చేయాలి. లేదా https://vswsonline.ap.gov.in/#/home వెబ్‌సైట్‌ను సందర్శించాలి. -
ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు 50% సమయాన్ని కేటాయించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేశవరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడుచుకోవట్లేదని..17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్వినియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై అందరినీ కలుపుకుని పార్లమెంటులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఐపీవో నిధుల సమీకరణ వీక్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పబ్లిక్ ఇష్యూల వేగం తగ్గింది. దీంతో 14 కంపెనీలు మాత్రమే లిస్టింగ్కురాగా.. కేవలం రూ. 35,456 కోట్లు సమీకరించాయి. గతేడాది తొలి అర్ధభాగంలో 25 ఇష్యూల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న రూ. 51,979 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు 32 శాతం క్షీణించాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాలివి. నిజానికి మొత్తం నిధుల సమీకరణలో 58 శాతం వాటాను ఆక్రమించిన ఎల్ఐసీ ఇష్యూ(రూ. 20,557 కోట్లు)లేకుంటే ఈ సంఖ్య మరింత నిరుత్సాహకరంగా కనిపించేదని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అయితే ప్రైమ్ గణాంకాల ప్రకారం ఇకపై ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇప్పటికే 71 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు అనుమతులు పొందాయి. తద్వారా రూ. 1,05,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. ఇవికాకుండా మరో 43 కంపెనీలు రూ. 70,000 కోట్ల పెట్టుబడుల కోసం సెబీని ఆశ్రయించాయి. అనుమతులు వెలువడవలసి ఉంది. మొత్తం ఈ జాబితాలో 10 న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీలుకాగా.. రూ. 35,000 కోట్ల సమీకరణకు వేచి చూస్తున్నాయి. ఈక్విటీ నిధులు సైతం డీలా తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ సైతం 55 శాతం క్షీణించింది. రూ. 41,919 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో ఈక్విటీ మార్గంలో రూ. 92,191 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఎల్ఐసీని మినహాయిస్తే డెల్హివరి రూ. 5,235 కోట్లు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రూ. 1,581 కోట్లు సమకూర్చుకున్నాయి. 14 కంపెనీలలో డెల్హివరీ మాత్రమే న్యూఏజ్ టెక్ కంపెనీ కావడం గమనార్హం! పేటీఎమ్‌సహా కొన్ని ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచడం ప్రభావం చూపింది. దీంతో 14 ఐపీవోలలో 4 కంపెనీలకు మాత్రమే 10 రెట్లు, అంతకుమించిన స్పందన లభించింది. ఈ కాలంలో కేవలం 41 కంపెనీలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో 87 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. మరో 2 కంపెనీలు రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా రెండు కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. జాబితాలో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్, ఉదయ్‌శివ్‌కుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. దీంతో ఈ నెల(సెప్టెంబర్)లో ఇప్పటివరకూ కొత్తగా 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టినట్లయ్యింది. కాగా.. ఐపీవోలో భాగంగా ఎన్విరో ఇన్ఫ్రా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇక ఉదయ్‌శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రెండు సంస్థలూ వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనున్నాయి. ప్రభుత్వం తదితర సంస్థలకు చెందిన నీటిపారుదల పథకాలు, వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ సేవలు ఎన్విరో అందిస్తోంది. ఉదయ్‌శివకుమార్ రహదారుల నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. తదితరాల నిర్మాణం, నిర్వహణలను ఎన్విరో చేపడుతోంది. రోడ్లు, బ్రిడ్జిలు, ఇరిగేషన్, కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం తదితరాలను చేపడుతోంది. -
మళ్లీ ఐపీవోల స్పీడ్
న్యూఢిల్లీ: ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు బలపడుతుండటంతో ప్రైమరీ మార్కెట్లకు మళ్లీ కళ వస్తోంది. తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధుల సమీకరణ చేపట్టనున్న జాబితాలో జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ సబ్‌సిస్టమ్స్, కేబుళ్ల(ఎలక్ట్రానిక్) తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్, మాంసం(ఫ్రోజెన్) ఎగుమతుల కంపెనీ హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం మూడు కంపెనీలూ ఉమ్మడిగా రూ. 1,605 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. సెన్కో గోల్డ్ ఐపీవోలో భాగంగా సెన్కో గోల్డ్ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ వాటాదారు సైఫ్ పార్టనర్స్ ఇండియా 4 లిమిటెడ్ మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 525 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 240 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ 127 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. వీటిలో 70 సొంతంకాగా.. మరో 57 ఫ్రాంచైజీలు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సైతం ప్రొడక్టులను విక్రయిస్తోంది. జ్యువెలరీని దుబాయ్, మలేసియా, సింగపూర్‌లకు ఎగుమతి చేస్తోంది. డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్‌తోపాటు వివిధ ఎలక్ట్రానిక్ కేబుళ్లు, అసెంబ్లీలను రూపొందిస్తోంది. హెచ్ఎంఏ ఆగ్రో ఐపీవో ద్వారా హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ. 480 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 150 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 330 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో రూ. 135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆగ్రా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఘనీభవించిన ఎద్దు మాంసంతో కూడిన ప్రొడక్టులను 40 దేశాలకుపైగా ఎగుమతి చేస్తోంది. అమ్మకాలలో 90 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
Rahul Gandhi: ప్రజాస్వామ్యం ఖూనీ!
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడనీయకుండా ప్రభుత్వం.. ప్రతిపక్షాల గొంతు నొక్కేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అభివర్ణించారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలనే డిమాండ్‌తో విపక్షపార్టీల నేతలు మంగళవారం ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం నుంచి విజయ్ చౌక్‌కు నడిచి వెళ్లారు. నిరసన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తప్పుబడుతూ నినాదాలిచ్చారు. ‘సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని ప్రభుత్వం పార్లమెంట్లో ప్రస్తావించనివ్వట్లేదు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ప్రతిపక్షాల గళం వినిపించక ప్రస్తుతం ఈ సమావేశాల్లో పార్లమెంట్ కేవలం ఒక కట్టడంలా, ఒక మ్యూజియంలా మిగిపోయింది. ప్రధాని మోదీ అసలు పార్లమెంట్‌కే రావడం మానేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే విధానం ఇది కాదు’ అని రాహుల్ ఆగ్రహంగా మాట్లాడారు. పార్లమెంట్లో ప్రభుత్వంపై విపక్షాల వ్యూహం కోసం విపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, డీఎంకే నేత టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్, ఖర్గే సైతం పాల్గొన్నారు. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. జాబితాలో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, మహిళా దుస్తుల బ్రాండ్ గో కలర్స్ సంస్థ గో ఫ్యాషన్, మైనింగ్ ప్రొడక్టుల కంపెనీ టెగా ఇండస్ట్రీస్ చేరాయి. ఆగస్టులో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. డైవర్సిఫైడ్ సంస్థ పీకేహెచ్ వెంచర్స్ ఐపీవో ప్రయత్నాలు విరమించుకుంటూ ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. వివరాలిలా.. ఐపీవో ద్వారా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ సంస్థ సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీని విక్రయించనుంది. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన ఈ సంస్థ 2015లో సీఎంఎస్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక ఐపీవోలో భాగంగా గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను సైతం విక్రయించనుంది. నిధులను 120 కొత్త ప్రత్యేకించిన బ్రాండ్ ఔట్లెట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.36 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ కూడా.... షెడ్యూల్డ్ హోదా గల క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 38.40 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. పీఐ వెంచర్స్ ఎల్ఎల్పీ 3.37 లక్షల షేర్లు, ఎమికస్ క్యాపిటల్ పీఈ1 ఎల్ఎల్పీ 6.04 లక్షల షేర్లు, ఒమన్ ఇండియా సంయుక్త ఇన్వెస్ట్మెంట్ ఫండ్2– 8.37 లక్షల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇతర వాటాదారులు సైతం 19.91 లక్షల షేర్లను విక్రయించనున్నారు. నైకా ఐపీవోకు భారీ డిమాండ్ 82 రెట్లు అధిక స్పందన ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ కంపెనీ నైకా వెంచర్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా దాదాపు 82 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. షేరుకి రూ. 1,085–1,125 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా దాదాపు 2.65 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 216 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. తద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమకూర్చుకుంది. బ్యూటీ, వెల్నెస్ ప్రొడక్టుల కంపెనీ నైకా ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లు(క్విబ్) 91.2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలు చేయగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలోనూ 12.25 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 630 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.19 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. ఐపీవోలో భాగంగా గత బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,396 కోట్లు సమీకరించిన విషయం విదితమే. -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్‌లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
తొలి 4 నెలల్లో ఐపీవోల స్పీడ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో(ఏప్రిల్–జులై)లో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. పబ్లిక్ ఇష్యూల ద్వారా మొత్తం 12 కంపెనీలు రూ. 27,052 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ఇకపైన కూడా మరిన్ని కంపెనీలు ఐపీవోలను చేపట్టేందుకు ప్రణాళికలు వేశాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, ఎగ్జారో టైల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 4 నుంచి ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది (2021–22) మిగిలిన కాలంలోనూ మరో 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నట్లు శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈక్విటీస్ హెడ్ హేమంగ్ కె తెలియజేశారు. వెరసి రూ. 70,000 కోట్లు సమీకరించే వీలున్నట్లు వెల్లడించారు. సుప్రసిద్ధ బ్రాండ్లు రిటైల్ ఇన్వెస్టర్లకు పరిచయమున్న పలు సుప్రసిద్ధ బ్రాండ్లు(కంపెనీలు) ప్రైమరీ మార్కెట్లను పలకరించనున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపక సీఈవో కౌశలేంద్ర సింగ్ ఎస్ తెలియజేశారు. జాబితాలో పేటీఎమ్, మొబిక్విక్, పాలసీ బజార్, కార్‌ట్రేడ్ టెక్, డెల్హివరి, నైకా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా సెకండరీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నెలకొనడం ఐపీవోలకు జోష్‌నిస్తున్నట్లు వివరించారు. దీంతో కంపెనీలు గరిష్ట విలువలతో నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఫలితంగా పలువురు ప్రమోటర్లు అధిక విలువలవద్ద తమ వాటాలను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. ఇన్విట్లు సైతం సమీక్షా కాలంలో ఐపీవో బాటలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్) ద్వారా పీఎస్‌యూ దిగ్గజం పవర్‌గ్రిడ్ రూ. 7,735 కోట్లను సమీకరించింది. కాగా.. గతేడాది(2020–21) పబ్లిక్ ఇష్యూల ద్వారా 30 కంపెనీలు రూ. 31,277 కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. అంతక్రితం రెండేళ్లతో పోలిస్తే ఇవి అత్యధికమే. క్యాపిటల్ మార్కెట్ల మందగమనం కారణంగా 2019–20లో 13 కంపెనీలు రూ. 20,352 కోట్లు సమీకరించగా.. 2018–19లో 14 సంస్థలు రూ. 14,719 కోట్లు మాత్రమే అందుకోగలిగాయి. అయితే 2017–18లో పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏకంగా 45 కంపెనీలు రూ. 82,109 కోట్లు సమకూర్చుకోవడం విశేషం! స్టార్టప్‌ల జోష్ టెక్నాలజీ, స్పెషాలిటీ కెమికల్స్, డైరీ, ఫార్మాస్యూటికల్ తదితర విభిన్న రంగాల నుంచి కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టడం ఇటీవల ఐపీవో మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక పలు టెక్ స్టార్టప్‌లు సైతం పబ్లిక్ ఇష్యూ బాట పట్టడం పరిశ్రమకు మేలు చేయగలదని లెర్న్‌యాప్.కామ్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సింగ్ అభిప్రాయపడ్డారు. దొడ్ల డైరీ, ఇండియా పెస్టిసైడ్స్, శ్యామ్ మెటాలిక్స్, తత్వ చింతన్, జీఆర్ ఇన్ఫ్రా, క్లీన్‌సైన్స్ తదితర ఐపీవోలకు 29–180 రెట్లు మధ్య స్పందన లభించడం, 14–110 శాతం మధ్య లాభాలతో లిస్ట్‌కావడం ఇన్వెస్టర్లను ఊరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. పాలసీబజార్ ప్రాస్పెక్టస్ ఐపీవో ద్వారా రూ. 6,108 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పాలసీబజార్ తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 2,268 కోట్ల విలువైన షేర్లను కంపెనీ వాటాదారులు ఆఫర్ చేయనున్నట్లు దరఖాస్తులో వెల్లడించింది. ఫిన్‌కేర్ స్మాల్ బ్యాంక్‌కు ఓకే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు డిజిటల్ రుణాల ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 1,330 కోట్లు సమీకరించేందుకు కంపెనీ సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ ఫిన్‌కేర్ బిజినెస్ సర్వీసెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 330 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. అదానీ విల్మర్ ఐపీవో బాట వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 4,500 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఫార్చూన్, ఆధార్ బ్రాండ్లతో కంపెనీ ప్రధానంగా వంట నూనెలను తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆదానీ గ్రూప్‌లోని మరో ఆరు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. హెల్త్‌కేర్ కంపెనీల జోరు రానున్న రెండు వారాల్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి ఐదు కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. ఉమ్మడిగా రూ. 8,300 కోట్లు సమీకరించనున్నాయి. ఎమ్క్యూర్ ఫార్మా రూ. 4,000 కోట్లు, విజయా డయాగ్నోస్టిక్ రూ. 1,500 కోట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్సెస్ రూ. 1,200 కోట్లు, విండ్లాస్ బయోటెక్ రూ. 400 కోట్లు చొప్పున సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. -
పబ్లిక్ ఇష్యూలకు రిటైలర్ల క్యూ
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో గతేడాది మార్చిలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆపై కోవిడ్–19 కట్టడిలో భాగంగా ప్రజలను అధిక సంఖ్యలో గుమిగూడవద్దంటూ హెచ్చరించింది. అయితే ఇదే సమయంలో దేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు క్యూ కట్టడం విశేషం! ఇందుకు వీలుగా పలువురు ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. తద్వారా పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది! ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: గత కేలండర్ ఏడాది(2020) సెప్టెంబర్ నుంచి చూస్తే పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వెస్టర్లు సగటున 1.3 మిలియన్ అప్లికేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్–19కు ముందు ఈ సంఖ్య 0.5 మిలియన్లుగా మాత్రమే నమోదైంది. ప్రైమరీ మార్కెట్లను పరిశీలించే ప్రైమ్ డేటాబేస్ అందించిన వివరాలివి. ఇందుకు ప్రధానంగా కరోనా వైరస్ ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయడం ప్రభావం చూపింది. ఎలాగంటే స్టిములస్ల కారణంగా ఒక్కసారిగా లిక్విడిటీ పెరిగిపోయింది. చౌకగా లభిస్తున్న ఈ నిధులు స్టాక్స్, బంగారం తదితరాల్లోకి ప్రవహించడం అధికమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. పసిడి సైతం సరికొత్త రికార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూకట్టాయి. మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్, లిక్విడిటీ ప్రభావంతో ఐపీవోలకు వచ్చిన కంపెనీల షేర్లు భారీ లాభాలతో లిస్ట్‌కావడం దీనికి జత కలిసింది. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రైమరీ మార్కెట్లు భారీగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఖాతాల జోరు గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా 10 మిలియన్ డీమ్యాట్ ఖాతాలను తెరిచినట్లు ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. లాక్డౌన్ సమయంలో నెలకు సగటున 1 మిలియన్ డీమ్యాట్ ఖాతాలు జమ అయినట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఈ సందర్భంగా వెల్లడించింది. డీమ్యాట్ ఖాతాలను సులభంగా తెరవడంతోపాటు.. అలవోకగా ఐపీవోలకు దరఖాస్తు చేసే వీలుండటంతో రిటైలర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు జిరోధా బ్రోకింగ్ నిపుణులు పేర్కొన్నారు. పలు ఐపీవోలు భారీ సక్సెస్‌ను సాధించడం, కొత్త కంపెనీలు లిస్టింగ్ రోజే సగటున 40 శాతం లాభాలు ఆర్జించడం వంటి అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొత్త తరం రిటైలర్లు పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో లిస్టింగ్‌లోనే లాభాల ట్రెండ్ మరింత ఊపందుకున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్లు కళకళలాడితే.. కొత్తగా రిటైల్ ఇన్వెస్టర్లు పుట్టుకొస్తారని వివరించారు. నిజానికి మార్కెట్లలో కొనసాగుతున్న ఇన్వెస్టర్లు సైతం కుటుంబ సభ్యుల పేరుతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతారని జిరోధా నిపుణులు ప్రస్తావించారు. ఇటీవల పలు ఇష్యూలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో షేర్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి ట్రెండ్ ప్రకారం చూస్తే పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసిన ప్రతీ 30 మందిలో ఒక్కరికి మాత్రమే షేర్ల కేటాయింపునకు వీలున్నట్లు వివరించారు. పలు కంపెనీలు దేశీయంగా ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలను తాకగా.. అటు యూఎస్ మార్కెట్లు సైతం రోజుకో కొత్త గరిష్టానికి చేరుతూ వచ్చాయి. సెకండరీ మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్ ప్రభావంతో పలు కంపెనీలు బంపర్ లిస్టింగ్‌లను సాధిస్తూ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్ తదుపరి సైతం పలు కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో సాగడం కూడా రిటైలర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. తాజా ఉదాహరణ చూస్తే.. ఎంటార్ టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ. 575తో పోలిస్తే రూ. 1,055 వద్ద లిస్టయ్యింది. తొలి రోజు ఏకంగా 87 శాతం లాభంతో రూ. 1,078 వద్ద ముగిసింది. కాగా. ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంటు నేపథ్యంలో ఈ వారం క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇం డస్ట్రీస్, కల్యాణ్ జ్యువెల్లర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. వీటితోపాటు వారాంతాన ప్రారంభమై మంగళవారం ముగిసిన అనుపమ్ రసాయన్ ఐపీవో సైతం 44 రెట్లు అధికంగా బిడ్స్‌ను ఆకట్టుకుంది. ఈ 5 కంపెనీలూ ఐపీవోల ద్వారా వారంలో రూ. 4,524కోట్లను సమీకరించనుండటం గమనార్హం. గతేడాది మొదట్లో తలెత్తిన కోవిడ్–19 ప్రభావం 2021కల్లా చాలావరకూ ఉపశమించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వె స్టర్ల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ట్లు తెలియజేశాయి. ఇటీవలి ఐపీవోలలో రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉన్నదంటే.. దరఖాస్తుల తీరిలా(మిలియన్లలో) కంపెనీ పేరు అప్లికేషన్లు ఇండిగో పెయింట్స్ 2.59 మజ్గావ్ డాక్ 2.36 బెక్టర్స్ ఫుడ్ 2.20 రైల్‌టెల్ కార్ప్ 2.07 బర్గర్ కింగ్ 1.97 . -
2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6
ముంబై, సాక్షి: గతేడాది జోష్‌ను కొనసాగిస్తూ 2021లోనూ దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ట రికార్డులను సాధిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తినప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో ప్రైమరీ మార్కెట్ పలు ఇష్యూలతో కళకళాడింది. ప్రధానంగా గతేడాది లిస్టయిన పలు కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతానికి 15కుపైగా కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. ఈ నెల(జనవరి)లో కనీసం 6 కంపెనీలు మార్కెట్లను తాకనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో కోవిడ్-19 దెబ్బకు మార్కెట్లు పతనమైనప్పటికీ ద్వితీయార్థంలో వేగంగా పుంజుకున్నాయి. దీంతో అత్యధిక శాతం కంపెనీలు ద్వితీయార్థంలోనే పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి గతేడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా 16 కంపెనీలు రూ. 31,000 కోట్లను సమీకరించగలిగాయి. జాబితా తీరిలా ఈ ఏడాది సైతం మార్కెట్లు ర్యాలీ బాటలోసాగే వీలున్నట్లు నిపుణలు భావిస్తున్నారు. దీంతో 2021లోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో పీఎస్‌యూలు, ప్రయివేట్ రంగ సంస్థలున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బ్యాంక్(ఐఆర్ఎఫ్సీ), కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండిగో పెయింట్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రైల్‌టెల్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. వీటితోపాటు.. క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, సంహీ హోటల్స్, శ్యామ్ స్టీల్ తదితర పలు కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే జనవరిలో ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, ఐఆర్ఎఫ్సీ, బ్రూక్‌ఫీల్డ్ ఆర్ఈఐటీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఐపీవో ద్వారా ఐఆర్ఎఫ్సీ రూ. 4,600 కోట్లు, కళ్యాణ్ జ్యువెలర్స్ రూ. 1,700 కోట్లు, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,000 కోట్లు, ఇండిగో పెయింట్స్ రూ. 1,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ రూ. 4,000-4,500 కోట్లు, బార్బిక్యు నేషన్ రూ. 1,000-1200 కోట్లు, ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 1,000 కోట్లు, హోమ్ ఫస్ట్ కంపెనీ రూ. 1,500 కోట్లు, సంహీ హోటల్స్ రూ. 2,000 కోట్లు చొప్పున నిధుల సమీకరణ చేపట్టే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితో జోష్ గతేడాది ఐపీవోలు చేపట్టాక పలు కంపెనీలు లిస్టింగ్‌లో భారీ లాభాలు ఆర్జించాయి. లిస్టింగ్ తదుపరి బర్గర్ కింగ్, హ్యాపీయెస్ట్ మైండ్స్, బెక్టర్స్ ఫుడ్, రోజారీ బయోటెక్, రూట్ మొబైల్ 100-200 శాతం స్థాయిలో జంప్ చేశాయి. ఈ బాటలో కెమ్‌కాన్ స్పెషాలిటీ, కంప్యూటర్ ఏజ్, గ్లాండ్ ఫార్మా, మజగావ్ డాక్ సైతం రెండంకెల లాభాలు ఆర్జించాయి. దీంతో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
ఆంటొనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవో సక్సెస్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. తాజాగా మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. బుధవారం(23న) ముగిసిన ఇష్యూకి 15 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 66.66 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 10 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంపన్నవర్గాల నుంచి దాదాపు 19 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 16.5 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా కంపెనీ రూ. 300 కోట్లు సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. కంపెనీ తాజాగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (హైదరాబాద్ కంపెనీ ఎంటీఏఆర్ ఐపీవో బాట) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) -
2020: ఐపీవో నామ సంవత్సరం
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. 2019లో ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న నిధులు రూ. 20,300 కోట్లు. వీటితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటికే 50 శాతానికిపైగా ఫండ్స్‌ను కంపెనీలు సమీకరించగలిగాయి. అంతేకాకుండా 14 కంపెనీలూ ప్రస్తుతం ఐపీవో ధరలతో పోలిస్తే లాభాలతో ట్రేడవుతుండటం విశేషం! వెరసి 2020ను ఐపీవో ఏడాదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం నుంచి మార్కెట్లు ఫీనిక్స్‌లా పుంజుకోవడం విశేషమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి కనిష్టాల నుంచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 79 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. కొత్త సంవత్సరం(2021)లోనూ ప్రైమరీ మార్కెట్ ఇదేవిధంగా కళకళలాడే వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుండటాన్ని ప్రస్తావిస్తోంది. కొత్త ఏడాదిలో ఐపీవోకు రాగల కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్(రూ. 1750 కోట్లు), ఇండిగో పెయింట్స్(రూ. 1,000 కోట్లు), స్టవ్ క్రాఫ్ట్, సంహి హోటల్స్, ఏజీజే సురేంద్ర పార్క్ హోటల్స్, జొమాటో తదితరాలున్నాయి. ఎల్‌ఐసీకాకుండా 30 కంపెనీలు సుమారు రూ. 30,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఎల్ఐసీ భారీ ఇష్యూకావడంతో రూ. 50,000 కోట్లకు మించి నిధుల సమీకరణకు వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ అంచనా వేస్తోంది. (వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?) బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ ఈ ఏడాది 15వ కంపెనీగా గురువారమే ఐపీవో పూర్తిచేసుకున్న బెర్టర్స్ ఫుడ్ గత ఐదేళ్లలోలేని విధంగా 198 రెట్లు అధిక బిడ్స్‌ను పొందింది. ఇంతక్రితం 2018లో అపోలో మైక్రోసిస్టమ్స్ మాత్రమే ఇంతకంటే అధికంగా 248 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. వెరసి బెక్టర్స్ ఫుడ్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇక ట్రేడింగ్ ప్రారంభం రోజు లాభాలకు వస్తే.. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రెట్టింపునకుపైగా లాభంతో రూ. 731 వద్ద లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 340 మాత్రమే. ఇదేవిధంగా హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీవో ధర రూ. 166కాగా.. రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ బాటలో రూ. 350 ధరలో ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్ రూ. 708 వద్ద లిస్టయ్యింది. బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 60కాగా.. 115 వద్ద లిస్టయ్యింది. రోజారీ బయోటెక్ ఐపీవో ధర రూ. 425తో పోలిస్తే రూ. 670 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ ఏడాది 16వ కంపెనీగా వచ్చే వారం నుంచీ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) వెనకడుగులో ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన కంపెనీలలో ఇష్యూ ధర కంటే దిగువన లిస్టయిన కంపెనీల జాబితా చూస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ లాభాల బాట పట్టడం గమనార్హం. ఇక ఐపీవో ధరను మించి లాభాలతో లిస్టయిన కంపెనీలలో బర్గర్ కింగ్, గ్లాండ్ ఫార్మా, లిఖిత ఫైనాన్స్, మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, రూట్ మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, రోజారీ బయోటెక్ నిలుస్తున్నాయి. -
బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజుకి దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ విభాగంలో 68 రెట్లు అధికంగా స్పందన లభించింది. సంపన్నవర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి ఏకంగా 354 రెట్లు ఎక్కువగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సైతం 87 రెట్లు దరఖాస్తులు వచ్చినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. వెరసి 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. శుక్రవారానికల్లా మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు
ముంబై: ఇటీవల భారీ లాభాలతో్ దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు పలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. తద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలలో మెరుగైన లిస్టింగ్‌ను సాధించాలని చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఐపీవోలు చేపట్టేందుకు ఇటీవల పలు కంపెనీలు సెబీవద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. జాబితాలో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బర్గర్ కింగ్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా ఆర్ఈఐటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, కళ్యాణ్ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పలు కంపెనీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించడంతో రానున్న ఆరు వారాల్లోగా ఐపీవో మార్కెట్ జోరందుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బుధవారమే(11న) చైనీస్ మాతృ సంస్థ ఫోజన్ ఫార్మాకు చెందిన గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ ముగిసిన విషయం విదితమే. భారీ ర్యాలీ ఈ నెలలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఏకంగా 10 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు కేవలం 8 ట్రేడింగ్ సెషన్లు మాత్రమే తీసుకోవడం విశేషం. ఇటీవల మార్కెట్లు జోరు చూపడంతో మార్చి కనిష్టాల నుంచి 70 శాతం పురోగమించింది. అమెరికాలో జో బైడెన్ విజయం సాధించడం, ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19 కట్టడిలో సఫలమైనట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్ల కారణంగా లిక్విడిటీ భారీగా పెరిగింది. ప్రధానంగా ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలోనే రూ. 20,000 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! మరోవైపు ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి సెప్టెంబర్‌లోనే 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి! -
రెండు దశాబ్దాలలో.. రికార్డ్ లిస్టింగ్స్
పబ్లిక్ ఇష్యూ ధర రూ. 116 కాగా.. గురువారం(17న) రూ. 351 వద్ద లిస్ట్‌కావడం ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దశాబ్ద కాలంలో ఇది(111 శాతం) అత్యధిక లాభంకాగా.. ఇంతక్రితం డీమార్ట్ రిటైల్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ 102 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు సంపదను పంచిన కంపెనీలలో డీమార్ట్ రెండో ర్యాంకుకు చేరింది. ఐటీ రంగ దిగ్గజం అశోక్ సూతా ప్రమోట్ చేసిన హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో 151 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ కావడం ద్వారా కూడా రికార్డును సాధించిన విషయం తెలిసిందే. కాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో భారీ ప్రీమియంతో లిస్టయిన జాబితాను పరిగణిస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ మూడో కంపెనీగా నిలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 100 కోట్లకుపైగా నిధులను సమీకరించిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదిక వివరాలు చూద్దాం... టాప్-5 2017 మార్చిలో వచ్చిన డీమార్ట్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 299కాగా.. 102 శాతం ప్రీమియంతో రూ. 604 వద్ద లిస్టయ్యింది. ఇదే విధంగా 2019 అక్టోబర్‌లో రూ. 320 ధరలో ఐపీవోకి వచ్చిన పీఎస్‌యూ.. ఐఆర్సీటీసీ కౌంటర్లో రూ. 644 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 101 శాతం లాభంకాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే.. 150 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా ఇంద్రప్రస్థ గ్యాస్ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఐపీవో ధర రూ. 48తో పోలిస్తే తొలి రోజు రూ. 120 వద్ద నమోదైంది. ఈ బాటలో టీవీ టుడే నెట్వర్క్ రూ. 95 ధరలో ఐపీవో చేపట్టగా.. 121 శాతం లాభంతో రూ. 210 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ప్రారంభమైంది. జాబితాలో గత రెండు దశాబ్దాల కాలంలో పబ్లిక్ ఇష్యూ ముగిశాక భారీ లాభాలతో లిస్టింగ్ సాధించిన కంపెనీల జాబితాను చూద్దాం.. పార్శ్వనాథ్ డెవలపర్స్ ఇష్యూ ధర రూ. 300 కాగా.. 80 శాతం లాభంతో రూ. 540 వద్ద లిస్టయ్యింది. అదానీ పోర్ట్స్ రూ. 440 ధరలో ఐపీవోకిరాగా.. రూ. 770 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇది 75 శాతం ప్రీమియం. ఇక ఎడిల్వీజ్, మేఘమణి ఆర్గానిక్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, వీ2 రిటైల్, అపోలో మైక్రోసిస్టమ్స్, శోభా లిమిటెడ్ సైతం సుమారు 75 శాతం లాభాలతో లిస్ట్‌కావడం విశేషం! ఈ కాలంలో 20 వరకూ ఐపీవోలకు 100 రెట్లు అధికంగా స్పందన లభించినప్పటికీ లిస్టింగ్‌లో లాభాలు సగటున 70 శాతానికే పరిమితమైనట్లు నిపుణులు తెలియజేశారు. -
ఆ పోరాటం స్ఫూర్తిగా సీపీఐ పోరాడుతుంది
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం వద్ద తన వాహనంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలకు చాడ వెంకట్ రెడ్డితోపాటు కమ్యూనిస్టులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా వెట్టిచాకిరి బానిసత్వం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభాకర్ రావు లాంటి వారు ఎందరో పోరాడి అసువులు బాశారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాంటి సమరయోధులను గుర్తుంచుకునేలా ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్రం కోసం పోరాడిన ప్రభాకర్ రావు లాంటివారు ఎన్కౌంటర్ అయిన హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టల్లో స్మృతి వనంతో పాటు కరీంనగర్‌లోని ప్రభాకర్ రావు విగ్రహం వద్ద పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇలాంటి పరిస్థితుల్లో నాటి పోరాటయోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టులు పోరాడక తప్పదని హెచ్చరించారు. -
రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ. 13న
కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ ప్రకటించాక మళ్లీ పబ్లిక్ ఇష్యూ సందడి మొదలుకానుంది. ఇందుకు స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ శ్రీకారం చుడుతోంది. ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని షేరుకి రూ. 423-425గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 16న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ లిస్టయ్యాక తిరిగి ఓ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రావడం గమనార్హం. కోవిడ్-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 2 ముఖ విలువ రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రోజారీ బయో రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే.. ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 విభాగాలలో రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
వైఎస్సార్ నవశకానికి ‘స్పందన’తో నాంది
సాక్షి, అమరావతి : ప్రజల సమస్యలు సత్వరమే తీర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతుల నేపథ్యంలో ‘వైఎస్సార్ నవశకం’ ఆవిర్భవించింది. రాష్ట వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అత్యధికంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అర్హత కలిగి ఉండి కూడా పింఛన్, ఇల్లు, రేషన్ కార్డు లేని వారు ఎంత మంది ఉన్నారో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ నవశకం పేరుతో రాష్ట్రమంతటా ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది జూన్ 24న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రతి సోమవారం కొనసాగుతోంది. సోమవారం వచ్చిన వినతుల్లో చాలా వరకు శనివారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పని చేస్తోంది. ఈ కార్యక్రమంపై క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి కూడా ప్రతి మంగళవారం సమీక్షిస్తూ అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్ తీసుకొచ్చారు. యథాలాపంగా కాకుండా ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా స్పందన కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారు. తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులనూ కేటాయించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచాలని ఆదేశించారు. ప్రజలు రోజుల తరబడి సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండరాదని, ఏ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వినతులు ఇచ్చే ప్రజలకు రశీదు ఇప్పించారు. ఆ సమస్య పరిష్కారం కాగానే తెలియజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏదైనా వినతి పరిష్కారానికి నోచుకోకపోతే అందుకు గల సహేతుక కారణాలతో వివరణ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పాలనే జవాబు దారీ తనాన్ని అధికార యంత్రాంగానికి అలవాటుగా మారుస్తున్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై స్పందనలో ఇప్పటి దాకా లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. వీటి పరిష్కారంలో నాణ్యత పెంచడానికి సీఎం ఆదేశాల మేరకు అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. చిరునవ్వుతో స్వాగతించాలి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా పనిచేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతామని ప్రతి సమీక్షలో ఆయన అధికారులకు స్పష్టం చేస్తున్నారు. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలని సూచిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. -
ప్రజా సమస్యలపై సీఎం స్పందన అమోఘం
తిరుపతి కల్చరల్: ప్రజల సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని, సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు అమోఘమని ప్రజా కళాకారుడు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రెండోసారి విడుదల నేపథ్యంలో తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించి ఆదుకోవాలని ఇటీవల ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు. ఏలేరు, టన్వా రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ ఏలేరు కాల్వను మరింత విస్తరించి మెట్ట ప్రాంతానికి పొడిగించడం ద్వారా నీటి కష్టాలు తీర్చాలని కోరినట్లు తెలిపారు. తాను సమస్య చెప్పగానే ముఖ్యమంత్రిగా ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పటికప్పడే సంబంధిత ఇంజనీర్లను పిలిచి ఇది ప్రజా సమస్య కనుక తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలు, రైతులను ఆదుకోవాలని చెప్పడం మహద్భాగ్యమన్నారు. తనతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నేతల కోరిక మేరకు నవంబర్ మూడో వారంలో తాను నటించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నట్లు నారాయణమూర్తి తెలిపారు. -
అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ సేవలు మరింత సులభతరం
ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి.. నేరుగా లబ్ధిదారులకు అందజేసి.. పారదర్శకమైన పాలన అందించాలన్న లక్ష్యంతో నూతన ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా జిల్లాలో 2వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికి ఎంతమంది ఉద్యోగులను నియమించాలి.. ఏయే శాఖల నుంచి నియమించాలి.. అన్న అంశాలపై పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. అందుకనుగుణంగా ఓవైపు వలంటీర్ల నియామకాలు చేపడుతూనే.. మరోవైపు కొత్త సచివాలయాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లా సమాచారం జిల్లా మొత్తం జనాభా - 41.74 లక్షలు పురుషులు- 20.90 లక్షలు మహిళలు- 20.84 లక్షలు గ్రామీణ జనాభా- 29.43 లక్షలు అర్బన్ జనాభా- 12.31 లక్షలు ఎస్సీ జనాభా- 18.82 లక్షలు ఎస్టీ జనాభా- 3.81 లక్షలు రెవెన్యూ గ్రామాలు- 1,540 గ్రామ పంచాయతీలు- 1,372 పట్టణాలు- 14 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు - 8 సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 1,372 గ్రామ పంచాయతీలున్నాయి. ఆ పంచాయతీల్లో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం 2వేల మందికి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఆ విధంగా జిల్లా మొత్తం 1,096 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఒక్కో గ్రామ సచివాలయంలో పంచా యతీ కార్యదర్శి ఆధ్వర్యంలో 11 మంది ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండేచోట మరికొంతమందిని నియమించే అవకాశముందని అధికారులు అంటున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ, బాధ్యతలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పశుసంవర్థక, మహిళా, శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించనున్నారు. ఉద్యోగంలో నియమించే మొదటి రెండేళ్ల సమయం ప్రొబెషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు. కేవలం సంబంధిత శాఖల వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయాల పరిధిలో ఏపని అప్పగించినా చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారికి బాధ్యతలు అప్పజెబుతారు. అధునాతన నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటును అమలులోకి తీసుకురానున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజలకు సులభంగా అందజేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు ఉన్న పంచాయతీలను ఇప్పుడు కొత్తగా సచివాలయంగా ఏర్పాటుచేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రజలకు, సామాన్యులకు కచ్చితంగా అందుతాయి. గ్రామ సచివాలయాల్లో 8 శాఖలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల్లో 8 శాఖలను 11 మంది ఉద్యోగులను నియమించనున్నారు. 1. వ్యవసాయ శాఖ, 2. పశుసంవర్థక శాఖ, 3. రెవెన్యూ శాఖ, 4. వైద్యశాఖ, 5. ఉద్యానవన, 6. మహిళా, శిశు సంక్షేమశాఖ, 7. సంక్షేమ శాఖ, 8. పంచాయతీరాజ్ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సచివాలయానికీ అనుసంధానకర్తగా గ్రామ వలంటీర్ వ్యవహరిస్తారు. వలంటీర్ తనకు కేటాయించిన కుటుం బాల్లో ఉన్న సమస్యలపై సచివాలయంలో ఫిర్యాదు చేస్తారు. ఈ ప్రజా సమస్యలను 72 గంటల్లో గ్రామ సచివాలయాల్లోని ఆయా శాఖల ఉద్యోగులు పరిష్కారించాల్సి ఉంటుంది. జిల్లాలో అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో చేరేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. కసరత్తు ప్రారంభించాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో గ్రామసచివాలయాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాం. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఉత్తర్వులను అనుసరించి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీఓలతో రెండు రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ఏయే నియమాలు పాటించాలి అనే అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. –నారాయణ భరత్‌గుప్త, కలెక్టర్, చిత్తూరు గ్రామ వలంటీర్ విధులు ఇవే.. జిల్లాలో గ్రామాలకు గ్రామ వలంటీర్, నగరాల్లో వార్డులకు వార్డు వలంటీర్లను నియమిస్తారు. వారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నేరుగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు చేరవేయాల్సి ఉంటుంది. వలంటీర్ గ్రామ సచివాలయానికి, తనకు కేటాయించిన కుటుంబాల మధ్య వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. గౌరవవేతనంగా రూ.5 వేలను ప్రభుత్వం అందజేస్తుంది. 1. వలంటీర్ తనకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు చేరవేయాలి. 2. కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి. 3. తన పరిధిలోని కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి. 4. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలి. 5. ఉన్నతాధికారులు అప్పగించే ఇతర విధులను నిర్వహించాల్సి ఉంటుంది. 6.ప్రాథమిక సర్వే నిర్వహించడం, కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం, ప్రజల అవసరాలను, సమస్యలను తెలుసుకోవడం చేయాలి. 7. ప్రజల ఇళ్ల ముంగిటకే సేవలు అందించాలి. 8. ప్రజా సమస్యలు, వినతుల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. 9. వలంటీర్లు విధులు సరిగ్గా నిర్వహించకున్నా, పనితీరు సంతృప్తికరంగా లేకున్నా విధుల నుంచి తొలగిస్తారు. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక
కడప వైఎస్సార్ సర్కిల్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మహసభల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. అలాగే ప్రజా సమస్యలపై కూడా పలు తీర్మానాలు చేశారు. రామకృష్ణ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ నేతలతో పాటు పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు. -
పేదల కోసం పోరుబాట
సాక్షి, కడప : ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పోరుబాట పడుతున్నారు. చిన్నదైనా, పెద్దదైనా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. జెడ్పీ సమావేశ మందిరం సాక్షిగా అనేకమార్లు సమస్యలపై అధికారులను నిలదీశారు....ప్రజా వేదికలపై సమస్యలు పరిష్కరించాలని శంఖారావం పూరించారు. చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ సంఘాలతో కలిసి అనేక పర్యాయాలు పోరుబాట పట్టారు.ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఇంకోమారు ఉద్యమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తూనే ఉన్నారు.ఒకవైపు పోలీసు నిర్బంధాలను ఎదుర్కొంటూ....మరోవైపు అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటూ ప్రజల వైపు నిలుస్తున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా పోరుబాట ప్రొద్దుటూరు కేంద్రంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోరుబాట పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకు పోతూనే ప్రజా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో పట్టణంలో తీవ్రంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలతో కలిసి జల దీక్ష చేపట్టారు. ఆగస్టులో జనవాసాల మధ్య మద్యం షాపులు ఎత్తి వేయని నేప«ధ్యంలో ప్రజా సంఘాలతో కలిసి దీక్షకు కూర్చొన్నారు. ఇటీవల చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లు మంజూరు చేసినా టీడీపీ ప్రొద్దుటూరు నాయకుడు అడ్డుకుంటున్న వైనాన్ని వివరిస్తూ వెంటనే అర్హులకు పింఛన్లు అందించాలని మూడు రోజులపాటు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు.ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. ఇలా ప్రతినిత్యం ప్రజల బాటలోనే నడుస్తున్నారు. నేటి నుంచి 36 గంటల దీక్షకు శ్రీకారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో మంగళవారం నుంచి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 36 గంటల నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న మొదటి రకం గృహాలకు సంబం«ధించి రూ. 3.25 లక్షలు రుణం కాగా, సబ్సిడీ కింద కేంద్రం రూ. 1.50 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 6.25 లక్షలు మంజూరు చేస్తున్నారు. అయి తే ఆ సొమ్మును 30 ఏళ్లలోపు చెల్లించేలా ఒప్పందం రాసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లకు దాదాపు లెక్కలు వేస్తే రూ. 18 లక్షలు అవుతోంది. అంటే ప్రతినెల కంతు కింద రూ. 3500– 4000 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ తరహాలోనే ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే దీక్షకు దిగుతున్నారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఉదయం 10 గంటలకు దీక్షకు కూర్చొని బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విరమించనున్నారు. ఎమ్మెల్యే దీక్ష చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
త్వరలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్లీనరీ
-
త్వరలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్లీనరీ
► హైదరాబాద్‌లో నిర్వహణ.. వైఎస్సార్సీపీ నిర్ణయం ► ముఖ్య అతిథిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ► రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 6 వేల మంది నాయకులతో నిర్వహిస్తాం ► పది ప్రజా సమస్యలపై ప్లీనరీలో తీర్మానం చేస్తాం ► ప్లీనరీ సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 6 వేల మంది నాయకులతో త్వరలోనే హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించాలని వైఎ స్సార్ కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయించింది. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలు, తదితర ముఖ్యమైన పది అంశాలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో మిర్చి, ఇతర పంటలు వేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని నిర్ణయించింది. బుధవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ సన్నాహక సమావేశంలో పార్టీ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్య దర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మతీన్ ముజ్దా్దది, రాం భూపాల్‌రెడ్డి, బోయినపల్లి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జిల్లాల ఇన్చార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నా రు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతోపాటు, ప్లీనరీ ఏర్పాట్లు, చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు. ప్లీనరీలో పది అంశాలపై తీర్మానం దళితులకు మూడెకరాల పంపిణీలో వైఫల్యం, లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 10, 15 వేలు మాత్రమే భర్తీ చేయడం, పత్రికల్లో ఆర్భా టపు ప్రకటనలు, మీడియాలో పెద్దఎత్తున ప్రచారం తప్ప పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టక పోవడం, రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, ఇప్పటికి కేవలం 1,600 మాత్రమే నిర్మించడం, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చేసిన పొరపాట్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలపై సమావేశంలో చర్చించారు. వీటి ఆధారంగానే ప్లీనరీలో పది అంశాలపై తీర్మానాలను రూపొందించాలని నిర్ణయిం చినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బం దుల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. మిర్చితో పాటు ఇతర పంటలు వేసిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపట్టాలని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలపై చర్చిస్తాం..: గట్టు హైదరాబాద్‌లో జరగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలతోపాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఆహ్వా నించాలని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. త్వరలోనే ప్లీనరీ తేదీని ఖరారు చేస్తామన్నారు. సమావేశంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలపై ప్లీనరీలో పది తీర్మానాలు చేస్తామన్నారు. జూలైలో విజయవాడలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలిపారు. -
ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట
జిల్లాల వారీగా ఆందోళనకు కార్యాచరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలను చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో అనుసరిం చిన విధానాలు, ప్రజా సమస్యలు, చేపట్టా ల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు మూడ్రోజులపాటు నిర్వహించనున్న సమా వేశాలు మంగళవారం మగ్దూంభవన్‌లో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఇందులో ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రిలే దీక్షలు సాగుతున్న తీరు, మిర్చి రైతుల సమస్యలు, సింగరేణిలోని తాడిచర్ల బ్లాక్‌ల ప్రైవేటీకరణ, పార్టీపరం గా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణా ళిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి హాజరయ్యారు. బుధ, గురువారాల్లో రాష్ట్ర కార్యవర్గం పలు అంశాలపై చర్చిస్తారు. కాగా, సింగరేణి కాలరీస్ సంస్థ పరిధిలోని తాడిచర్ల బ్లాక్–1, 2 ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మే 12 నుంచి 17 వరకు బస్సు యాత్రను చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఇందిరా పార్కు ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. -
ప్రజా సమస్యలపై పోరాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో అన్ని మండల, నియోజవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు త్రీవ సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ అదును దాటుతున్నా.. ఇంతవరకు పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారని చెప్పారు. దీంతో పెట్టుబడులేక పంటసాగు ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈనెల 21న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. షాద్‌నగర్ పట్టణం కేంద్రంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రక్తదాన శిబిరాల ఏర్పాటు, అన్నదానం, దుస్తుల పంపిణీ తదితర సేవాకార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని బలోపేతం కావడానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బండారు వెంకట రమణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, యువజన విభాగం అధ్యక్షులు వి. రామ్మోహన్, మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర కార్యదర్శి పాప వెంకట్‌రెడ్డి, రమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి!
అతి త్వరలో ప్రకటన సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీని అతి త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నాయకుల విశ్వసనీయ సమాచారం. ముం దుగా రాష్ట్ర కమిటీని నియమించాకే కొత్త జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, పార్టీకి పట్టున్న జిల్లా లు తదితర అంశాల ప్రాతిపదికన పాత, కొత్తల మేలు కలయికగా కొత్త కమిటీ ఎంపికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు పార్టీ ముఖ్యుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర పదాధికారుల్లో పలువురిని మార్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శని, ఆది, సోమవారాల్లో రాష్ర్టవ్యాప్తంగా అన్ని పాత జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలను నిర్వహించి కొత్త జిల్లాల కమిటీల నియామకంపై చర్చించనున్నారు. ఎన్నికలకు పార్టీపరంగా సిద్ధం కావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, వైఖరిని ఎండగట్టేం దుకు వీలుగా ఇకపై ప్రజా సమస్యలు, ప్రత్యేకించి రైతాంగ సమస్యలపై పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నెల 20-29 వరకు రైతాంగ సమస్యలపై అన్ని మండలాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. -
ప్రజా సమస్యలపై మరో పోరాటం చేయాలి
- సినీ హీరో మాదాల రవి - ఖిలావరంగల్‌లో పీఎన్ఎం ఆధ్వర్యంలో వీధి నాటకోత్సవం - ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు కరీమాబాద్ : ఆనాటి పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై మరో పోరాటం చేయాలని అభ్యుదయ సినిమాల హీరో మాదాల రవి అన్నారు. ఖిలావరంగల్ చమన్ వద్ద ప్రజానాట్య మండలి ఆద్వర్యంలో తెలంగాణ విమోచన దినం పురస్కరించుకుని శుక్రవారం వీధి నాటకోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరై రవి మాట్లాడుతూ ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి పోవాలని, దున్నే వాడికే భూమి కావాలని ఎర్రజెండా అండతో పేదలంతా పోరాటం చేశారన్నారు. ఇందులో సుమారు 4 వేల మంది అమరులయ్యారని రవి గుర్తు చేశారు. దీంతో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని చెప్పారు. నేడు తెలంగాణ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరిట అభివృద్ధి అంటూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రజల భూములను లాక్కోవడం జరుగుతోందన్నారు. అనంతరం పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డ భిక్షమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మళ్లీ పేదల భూములు లాక్కోవాలని చూస్తుందని, ప్రజలందరూ దీనిని వ్యతిరేకిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కళలను ప్రోత్సహించడం లేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత, మర్రి శ్రీనివాస్, కొప్పుల శ్రీను, మైదం నరేష్, భోగి సురేష్, పల్లం రవి, డి. రవి, ఎస్.ప్రవీన్‌కుమార్, ఆరూరి కుమార్, సారంగపాణి, యుగేందర్, వేణు, అనిల్, దశరద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కళ్లకు కట్టిన ప్రదర్శన వీధి నాటకోత్సవాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ పోరాటం, ఆసరా, చరుతల రామాయణం, మొదలైన కళారూపాలు ఆహుతులను అలరించాయి. అలాగే ఆనాటి పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించడం ఆలోచింప చేసింది. కళాకారుల డప్పు చప్పులు, నృత్యాలు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. 16డబ్ల్యూజిఎల్106- : వీధినాటకోత్సవాల్లో మాట్లాడుతున్న అభ్యుదయ సినీ హీరో మాదాల రవి 16డబ్ల్యూజిఎల్ 111 - ఖిలావరంగల్ చమన్ వద్ద కళాకారుల ప్రదర్శన -
ప్రజాసమస్యలపై పోరాటాలు సాగించాలి
టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి * రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా విభాగం పోరాటాలను సాగించాలని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం మెడలు వంచాలని, గతంలో మహిళా విభాగం చేసిన పోరాటాలు ఫలప్రదం అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు మహిళలకు ప్రాతినిధ్యమే కల్పించకపోవడం దారుణమన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళా నేతలు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ మహిళా విభాగాన్ని బలోపే తం చేసి, సమస్యలపై సమరాన్ని సాగించడానికి సమాయత్తమవుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. కాగా, శాసనసభ్యులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాల చెల్లింపు నిలిపివేయడం సిగ్గుచేటని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. -
ప్రజా సమస్యలపై పోరుబాట
పార్టీ విస్తరణ, ఉద్యమాలపై సీపీఎం దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో విద్య, వైద్యం, ఇళ్లు, భూమి, ఉపాధి వంటి ప్రధానమైన సమస్యలపై ఉద్యమించాలని సీపీఎం నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వల్ల నిర్వాసితులవుతున్నవారి సమస్యలపై ఉధృతంగా పోరాటాలు చేయాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మా ణం, విస్తరణకు గ ట్టి చర్యలు తీసుకుంటూనే ప్రజాసమస్యలపై పోరాడి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న రాష్ర్టపార్టీ ప్లీనంలో కార్యాచరణను ఖరారు చేయాలని నేతలు భావిస్తున్నారు. జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు దిశానిర్దేశనం చేయనున్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల పథకం అమలుకు గట్టిగా పట్టుబట్టేలా కార్యక్రమాలను రూపొందించనుంది. రాష్ట్రంలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవారు ఉండడంతో సామాజిక న్యాయ ఎజెండాతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. -
పోరుబాట పట్టాలి
వైఎస్ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం పథకాల పేరు మార్చి పబ్బం గడుపుతున్నారు జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది లోటస్‌పాండ్ సమావేశంలో జిల్లా నేతలకు దిశానిర్దేశం సాక్షిప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని, దీనిని నిరసిస్తూ పార్టీ తరఫున పోరుబాట పట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు జిల్లాపార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం రాజధానిలోని లోటస్‌పాండ్‌లో పార్టీ ఖమ్మం జిల్లా విస్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, సేవాదళ్ అధ్యక్షుడు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేమీలేదని, జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లాలో పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. కానీ ప్రసుత్తం ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తోందని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే దూరదష్టితో వైఎస్.జలయజ్ఞం కింద జిల్లాలో తీసుకున్న ప్రాజెక్టుల పేరును ప్రభుత్వం మార్చి వాటిని ముందుకు సాగకుండా చూస్తోందన్నారు. వీటిపైనే పార్టీ శ్రేణులు దష్టి పెట్టి, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యమించాలన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాడి.. పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా నేతలు, శ్రేణులు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల్లో ఉండి కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా కమిటీతోపాటు అనుబంధ సంఘాల బాధ్యుల నియామకాలు కూడా చేపడతామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు తరలివెళ్లారు. జిల్లా నేతలు జిల్లపల్లి సైదులు, మందడపు వెంకటేశ్వర్లు, ఆలస్యం సుధాకర్, సంపెట వెంకటేశ్వర్లు, వాలూరి సత్యనారాయణ, రాములు, ఎస్కె.కరీం, ఎస్కె.మీరా, మర్రి బాబూరావు, గనపారపు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ జ్యోతి, ఏసురత్నం, రమేష్‌బాబు, పులి సైదులు, రుద్ర హనుమంతరావు, రుద్ర ఉపేందర్, రేవతి, జయమ్మ, కుర్తం సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
కష్టాల్లో ఖరీఫ్
* రైతుల కష్టాలపై ప్రశ్నించనున్న విపక్షం * గత సమీక్షలు ఆరు శాఖలకే పరిమితం * ఈసారి అజెండాలో వ్యవసాయమే ప్రధానం * నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు బదిలీలతో రెండు నెలలు గడిచిపోయింది. వెనకుటి తేదీలతో ఇప్పటికీ ఇంకా బదిలీలు చేస్తుండడంతో పాలన గాడితప్పింది. దీనికి తోడు మూడు నెలలకొక మారు చర్చించుకునే అవకాశం ఉన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆరు అంశాలపైనే సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టారు. ఈసారి వ్యవసాయంపై చర్చ సాగే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలకు నారుమళ్లు సిద్ధమయ్యాయి. ఖరీఫ్ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వర్షాలు మెరుగ్గా ఉండడంతో ఈ ఏడాది సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలో రైతుల అవసరాలను తీర్చేబాధ్యతలను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఖరీఫ్‌కు తగిన సహకారం అందించడానికి జెడ్పీలో చర్చ జరగాల్సి ఉన్నా ఇంతవరకు చేపట్టలేదు. శనివారం ఖరీఫ్ ముందస్తు సమీక్షకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికవుతోంది. వర్షాధారమే అధికం జిల్లాలో ఏటా 4.17లక్షల హెక్టార్ల మేరకు సాగు విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇందులో నికర నీటి లభ్యత 1.82 లక్షల హెక్టార్లకు మాత్రమే ఉంది. వర్షాధారంతో కొన్ని ప్రాంతాల్లో సాగవుతోంది. ఇందులో వంశధార కుడి, ఎడమ కాలువలతోపాటు నాగావళినదిపై ఉన్న నారాయణపురం, తోటపల్లి కుడి ఎడమ కాల్వలతోపాటు మడ్డువలస రిజర్వాయర్, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన పైడిగాం, కళింగదళ్, డబార్సింగి, లోకొత్తవలస, జంపరకోట, లొత్తూరు, జలాశయాలు, ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2.05 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోంది. ఇందులో ప్రధాన పంట వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, అపరాలసాగు వంటి పంటలు పండిస్తున్నారు. సాగుకు అవసరమైన నీటి నిల్వల సామర్థ్యం ఉన్న శాశ్వత ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు ఏటా కరువుతప్పని పరిస్థితి. శివారు ప్రాంతాలకు అందని సాగునీరు ఈ ఏడాది తోటపల్లి ప్రాజెక్టు నీరు కొత్త ఆయక ట్టుకు సాగునీరు అందిస్తుందని రైతులు ఆశపడుతున్నారు. కాగా, గురువారం నీరు విడుదల చేసినప్పటికీ శివారు గ్రామాలకు ఇంకా నీరు చేరలేదు. వంశధార ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఏటా శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఖరీఫ్‌కు నీటిపారుదలశాఖ ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంది. జెడ్పీ పాలక మండలి సభ్యులు ఈ అంశాన్ని చర్చించేందుకు వీలుంది. రైతులను వేధిస్తున్న విత్తనాల కొరత ఖరీఫ్ రైతాంగానికి ఇప్పటికే విత్తనాల కొరత వేధిస్తోంది. రైతులు మార్కెట్ కమిటీలు, విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా విత్తనాలు లభ్యం కావడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. నైర వ్యవసాయ పరిశోధనా కేంద్రంతోపాటు విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న విత్తనాలు సరిపోక రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులు ఎరువులను సిద్ధం చేసుకోవాల్సివస్తోంది. ఎప్పటికప్పుడే మార్కెట్లో ఎరువుల ధరలు పెంచడంతోపాటు కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది జిల్లాకు సరిపడా ఎరువులను అందించడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై చర్చించే అవకాశం ఉంది. అందని రుణాలు ఖరీఫ్ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ రుణ ప్రణాళికలను సిద్ధం చేసినా ఇంతవరకు రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు పంట రుణాల మాఫీ పత్రాలను ప్రభుత్వం ఇచ్చినా వాటిని ఎందుకు పనికి రాని కాగితాలుగా బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. స్వయానా మంత్రి అచ్చెన్నాయుడినే ఓ బ్యాంకు మేనేజరు తన సీట్లో ఉండి పనిచేయమంటూ హితవు పలికారంటే ఇక రుణాల మంజూరు ఎలా ఉంటుందో ఊహించకోవచ్చు. వీటితోపాటు మరెన్నో సమస్యలపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది -
సమస్యలు పరిష్కరించాలి
► జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ ► అధికారులకు ఆదేశాలు ► కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుని పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అధికారులు తమకు నేరుగా వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో సమస్యలు నేరుగా తన దగ్గరకు వస్తున్నాయని, అక్కడి అధికారులు స్పందించి పరిష్కరిస్తే ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని అన్నారు. అధికారులు గ్రీవెన్స్‌లో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, అధికారులు శ్రద్ధగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. అంతకుముందు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నేరుగా జేసీ సుందర్ అబ్నార్‌తో ఫోన్లో మాట్లాడి తమ సమస్యలను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన జేసీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఆర్వో సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ జితేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి మేము బీడీ కార్మికులం. మాకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయి. బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్నాం. మాతోపాటు బీడీలు చుట్టే వారికి మా గ్రామంలో చాలామందికి పింఛన్లు వస్తున్నాయి. మాకు మాత్రం ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే మీకు అక్కడి నుంచి మంజూరు కాలేదంటున్నారు. మాకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాం. - బీడీ కార్మికులు, గ్రామం : మాటేగాం, మం : భైంసా ‘ఉపాధి’ డబ్బులు ఇస్తలేరు ఉపాధి హామీ పనులు చేసినం. వారం రోజుల కూలీ డబ్బులు ఇస్తలేరు. అధికారులను అడిగితే ఇంకా రాలేదంటున్నారు. రోజుకు రూ.145 ఉంటే మాకు రూ.60 నుంచి 70 ఇస్తున్నారు. వారానికి రూ.400 మాత్రమే అస్తున్నాయి. కూలీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుంటే మేం పనులు చేసి ఏం లాభం. మాకు కూలీ డబ్బులు ఇవ్వాలి. - ఉపాధి హామీ కూలీలు, బట్టిసావర్గాం, మం : ఆదిలాబాద్ -
ఎమ్మెల్యేకు అవమానం
♦ సమస్యలపై సీఎంకు వినతిపత్రమిచ్చిన తిప్పారెడ్డి ♦ హెలిప్యాడ్ సమీపంలోనే పడేసిన ముఖ్యమంత్రి మదనపల్లెః రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రాన్నే కింద పడేసిన వైనం మిది. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి స్వయంగా నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివా రం మదనపల్లె పర్యటనకు వచ్చిన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద సీఎంను కలసి 13 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. అయితే అది ఆదివారం హెలిప్యాడ్ సమీపంలో నేలపై స్థానికులకు కనిపించింది. వారు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకి, పాత్రికేయులకు ఫోన్‌చేసి తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యం ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా? నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు వినతిపత్రం అందజేస్తే హెలిప్యాడ్ వద్దే పడవేయడం చూస్తే ఇక ఆయన నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారన్న సందేహం కలుగుతోంది. కేవలం ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేనన్న కక్ష సాధింపుతోనే ఇలా చేశారు. ఈ చర్య నియోజకవర్గంలోని 4 లక్షల మంది ప్రజలను అవమానించినట్లే. ప్రజాప్రతినిధి, ప్రజల మనోభావాలను అవహేళన చేసిన ఆయనపై గౌరవం పోయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. - డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే -
జిల్లా అభివృద్ధిపై మంత్రికి శ్రద్ధలేదు
శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని జూట్‌మిల్లులు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పైపుల ఫ్యాక్టరీలు, సింథటిక్ ప్యాక్టరీలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడుతున్నప్పటికీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి చీమకుట్టనట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించకుండా, జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయమన్నారు. పక్కా గృహాలకు నోచుకోని మత్స్యకారులు జిల్లాలోని 194 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాలు, 104 గ్రామాలు విస్తరించి ఉన్నాయని, ఆయా గ్రామాల్లో 40 వేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. తీర గ్రామాల ప్రజలు తాగునీరు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా... ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు పక్కా గృహాలకు నోచుకోకుండా నేటికీ పూరి గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. జిల్లాలో హుద్‌హుద్ తుపాను వల్ల 6,474 ఇళ్లు నేల మట్టం కాగా, ప్రభుత్వం 1500 ఇళ్లు మంజూరు చేసి, చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఇందులో 300 గృహాలే నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. నెలకు రూ.50 లక్షల విద్యుత్ భారం ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల జిల్లాలో 6.50 లక్షలు గృహ కనెక్షలపై నెలకు సుమారు రూ.50 లక్షల అదనపు భారం పడనుందన్నారు. రుణమాఫీ వర్తించక జిల్లాలో 10 వేలకు పైగా డ్వాక్రా సంఘాలు రద్దయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, పార్టీ నేతలు మండవిల్లి రవి, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
► అధికారులకు కలెక్టర్ జగన్మోహన్ ఆదేశం ► డయల్ యువర్ కలెక్టర్‌కు ఎనిమిది కాల్స్ ► కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించా రు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ సుందర్ అబ్నార్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులకు ఎన్ని పనులు ఉన్నా సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్‌లో ఉంచకూడదని పేర్కొన్నారు. గత వారం వరకు వచ్చిన అర్జీలపై సమీక్షించారు. ఉదయం 10 గంటల నుంచి 10:30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. జిల్లా నుంచి ఎనిమిది మంది నేరుగా కలెక్టర్‌ను ఫోన్‌ద్వారా సంప్రదించి తమ సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జేసీ సుందర్ అబ్నార్, డీఆర్వో సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఆదుకోవాలి రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేవాళ్లం. రూ.1.20 లక్షలు అప్పు ఉంది. నా భర్త భాస్కర్ 2013లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అపద్భాందు పథకం కింద ఆర్థికంగా ఆదుకోవాలని గత మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పథకం కింద నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి. - కీర్తి అనూష, గుడిహత్నూర్ టవర్ నిర్మాణాన్ని ఆపాలి మా గ్రామంలో అక్రమ లే అవుట్లో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా రిలయన్స్ టవర్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం. రేడియేషన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టవర్ జనావాసాలకు, పాఠశాలకు దగ్గరగా ఉంది. దీనిని ఆపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. - యువజన సంక్షేమ సంఘం నాయకులు, భీంసరి, ఆదిలాబాద్ -
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
తిరుపతి ఎంపీ డాక్టర్ వి.వరప్రసాద్ కలువాయి: ప్రజా సమస్యలపై గళం విన్పించే ఎమ్మెల్యే రోజాపై అసెంబ్లీలో ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడం దారుణమని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. మండలంలో సోమవారం పర్యటించిన ఆయ న మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేను ఏడా ది పాటు సస్పెండ్ చేయడం చరిత్రలో లేదని, గౌరవ ముఖ్యమంత్రి, స్పీకర్లు ఈవిషయమై తక్షణమే స్పందించాలన్నారు. కలలు కనండి...నిజం చేసుకునేందుకు కృషి చేయండి: విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనాలని, వాటిని సాధించుకునేందుకు కష్టపడి కృషిచేయాలని సూచించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత ఆశయాలు ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషిచేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఇప్పుడు సాధిస్తున్న మార్కులు పదిశాతం ఎక్కువ సాధించాలని, అలా సాధించిన విద్యార్థులకు వచ్చే ఏడాది బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠశాలలో నీటి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచేందుకు జెడ్పీ నుంచి రూ.5 లక్షలు మం జూరు చేయించిన జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూకనపల్లి బీసీ కాలనీని ఎంపీ పరిశీలించారు. -
ప్రజా సమస్యలపైనే అసెంబ్లీ నడపాలి
సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేలా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదని, ఇప్పుడు శాసనసభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించకుండా, మొత్తం ప్రతిపక్షాన్నే విస్మరించే చెడు సంప్రదాయం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. గత ఏడాది శీతాకాల సమావేశాలనే ఎత్తేశారని, అసెంబ్లీ ఎజెండాలో 344, ఎస్‌ఎన్‌క్యూ, కాల్ అటెన్షెన్ (74) తీర్మానాలు ప్రచురించడాన్ని మానేశారని, చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. విపక్షాలన్నీ ఒకే సమస్యపై వాయిదా తీర్మానం పెట్టినా తిరస్కరిస్తున్నారన్నారు. రూల్స్ కమిటీ మీటింగ్ పెట్టి.. అసెంబ్లీ జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని, అరెస్ట్‌లు, కేసులు, అవసరమైతే జైల్లో పెడతామని ప్రతిపక్షాలకు హెచ్చరికలు చేయడం సరైంది కాదన్నారు. సభలో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ప్రాధాన్యతనిచ్చి సభను సజావుగా నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
గెలుపే ధ్యేయం
* వైఎస్, జగన్ అభిమానులందరినీ ఏకతాటిపైకి తెస్తా * నిరుద్యోగ, రైతు సమస్యలపై ఉద్యమం * ప్రజా సమస్యలపైనా నిరంతర పోరాటం * గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం * ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సంగారెడ్డి జోన్: రానున్న 2019లో గెలుపే ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అభిమానులందరినీ పార్టీలకతీతంగా ఏకం చేసి ఏకతాటిపైకి తెస్తానని చెప్పారు. జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి, పటిష్టవంతానికి పాటు పడతానన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రజల తరఫున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. కాగా జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం కొద్దిమందికి మాత్రమే పరిహారం అందజేసి మిగతా వారికి మొండిచేయి చూపించిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడం కోసం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రైతు పరామర్శ యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుగా నియామకమైన సందర్భంగా గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాక్షితో మాట్లాడారు. సాక్షి: జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? శ్రీధర్‌రెడ్డి : పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదే శాల మేరకు పార్టీ పటిష్టానికి పాటు పడతా. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ కమిటీల నియామకానికి గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తా. సాక్షి: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలుకోసం ఏం చేస్తారు? శ్రీధర్‌రెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్నాయి. యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతా. సాక్షి: రైతు సమస్యలపై మీ అభిప్రాయం? శ్రీధర్‌రెడ్డి : జిల్లాలో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు సైతం రాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కొందరికి మాత్రమే పరిహారం అందింది. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమిస్తాం. సాక్షి: రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బరిలో వుంటుందా? శ్రీధర్‌రెడ్డి : జిల్లాలో మూడు స్థానాలు గ్రేటర్ మున్సిపాలిటీలో వున్నాయి. పటాన్చెరు, భరత్‌నగర్, రామచంద్రాపురంలలో పార్టీ అభ్యర్థులను గ్రేటర్ ఎన్నికల బరిలో వుంటారు. పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాలతో, ప్రజలతో ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. -
‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం’
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 37వ వార్డు పరిధి బింగివీధి, డక్కిన వీధి ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు బోరుబావులను ఎమ్మెల్యే గీతతో పాటు మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో రెండు బోరుబావులు చొప్పున మొత్తం 80 బోరుబావులు ఏర్పాటు చేసేందుకు రూ.50లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కందిమురళీనాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సార్..! సమస్యలు ఆలకించండి !!
- ప్రజావాణిలో వినతుల వెల్లువ - స్వయంగా అర్జీలు స్వీకరించిన జేసీ వెంకట్రాంరెడ్డి సంగారెడ్డి జోన్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జేసీ వెంకట్రాంరెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. విచారణ చేసి సత్వరం న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తన ప్రమేయం లేకుండానే తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, గ్రామ పట్వారీలపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన ప్రభాకర్ కోరారు. తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తమకు ఎకరా భూమి పట్టా ఇచ్చారని, కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదని పాపన్నపేట మండలం మిన్పూర్కు చెందిన ఏసమ్మ, బాలమ్మలు తెలిపారు. తమకు వెంటనే పొజిషన్ చూపించాలని, లేకుంటే మూడెకరాల భూమి ఇప్పించాలని జేసీకి విన్నవించారు. మావోయిస్టుగా జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తనకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని మెదక్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య కోరారు. విధి నిర్వహణలో తన భర్త మతిస్థిమితం కోల్పోయినందునా తనకు ఉపాధి కల్పించాలని కొండాపూర్మండలం మారేపల్లికి చెందిన ఇందిరమ్మ విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని అందోల్ మండలానికి చెందిన సువర్ణ, దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన సునీత, యాదమ్మ వినతిపత్రం అందజేశారు. తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన కోనమ్మ విజ్ఞప్తి చేశారు. తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించానని, ఈ కారణంగా తమ కూ తురుకు బాలిక సంరక్షణ పథకం వర్తింపజేయాలని జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కుచెందిన మంగళి విజయకుమార్ కోరారు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తినంతా వారికే ఇచ్చారని, న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇప్పించాలని న్యాల్కల్కు చెందిన అంజమ్మ జేసీకి విజ్ఞప్తి చేసింది. తన భూమిలో అక్రమంగా ఇతరులు రోడ్డు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోహీర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లయ్య కోరారు. మెదక్ మండలం హవేళీఘన్పూర్కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అందోల్ మండలం పోసానిపేటకు చెందిన వడ్డే యాదమ్మ కోరారు. తాను గత 30 సంవత్సరాలుగా పిండి గిర్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నానని, దాన్ని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నట్టు చేగుంటకు చెందిన రాజలింగం తెలిపారు. పిండి గిర్ని యథావిధిగా నడిపించుకొనేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే సమస్యల పరిష్కారం : ఎస్పీ సంగారెడ్డి క్రైం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి.సుమతి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
అక్రమ కేసుల బనాయింపే బాబు లక్ష్యం
- ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు - నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆరోపించారు. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నాయకులు ఆదివారం.. 72గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరికి భూమా మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను అణచి వేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎల్లకాలం సాగబోవన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండబోదని, ప్రజలకు మాత్రమే తాము భయపడుతామన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సీపీఎం నాయకులు కోరుతున్న విధంగా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రూ.350కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారనే కసితో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని భూమా ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను గమనించకుండా కాలుష్యానికి దూరంగా శిల్పా..బెంగళూరులో నివాసం ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదని, అధికారులు తొత్తులుగా మారకుండా నిజాయితీ వ్యవహరించాలని కోరారు.నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణతో పాటు పందుల సమస్య కూడా తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. రోడ్లు వెడల్పు చేయాలని చిన్నారులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి తేవడానికి పీఏసీ చైర్మన్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో సీపీఎం నాయకుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కొత్తపెంట,ఎం.ఫణుకువలస(బొబ్బిలి రూరల్) : రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి వంచనలేకుండా పని చేస్తున్నామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణరంగారావు తెలిపారు. ఆదివారం మండలంలోని కొత్తపెంట, ఎం.పణుకువలస గ్రామాల్లో ఆయన పర్యటించారు. సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. కొత్తపెంట గ్రామం వద్ద వేగావతి నదికి ఇరువైపులా ఉన్న రహదారిని పరిశీలించారు. ప్రజలు, విద్యార్థులు ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కొత్తపెంట పారాధి ఛానల్‌ను ఆయన పరిశీలించారు. స్వయంగా సమస్యలను తెలుసుకుని, అధికారులకు లేఖలు రాసి వాటి పరిష్కారానికి కృషిచేద్దామని భావిస్తున్నామన్నారు. 10 గ్రామాల ప్రజలు గొల్లాది-కొత్తపెంటల మధ్య రాకపోకలు సాగిస్తున్నారని, వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారాది ఆనకట్ట, ఛానల్లో గ్రామపరిధిలో బాగుచేసినా పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో పనులు పూర్తి కాలేదని తెలిపారు. తుపానులు వస్తే తప్ప తమకు నిధులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. అనంతరం ఎం.పణుకువలస గ్రామంలో బడివానిచెరువును పరిశీలించారు. గ్రామానికి ఎగువన, గ్రోత్‌సెంటర్ వెనుక ఉన్న బడివానిచెరువునీరు క్వారీ ద్వారా పంటపొలాలకు అందించే అవకాశాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు బేతనపల్లి శ్రీరాములు, సింగనాపల్లి ఈశ్వరరావు తదితరులు చెరువునీటిని ఎలా క్వారీ నుంచి తరలించవచ్చో వివరించారు. -
సిద్ధం
- అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ - సహకారానికి వివిధ పార్టీల సంసిద్ధత - పనుల కోసం ప్రత్యేక కమిటీలు - సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం సాక్షి,సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదికగా నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయాల కు అతీతంగా అన్ని పార్టీలనూ కలుపుకొని ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో వివిధ పార్టీలు నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారమందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. నగరంలో నాలాలను ఆధునీకరించాలన్నా, రహదారులను వెడ ల్పు చేయాలన్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని పార్టీలను కలుపుకొని పోవడం.. స్థానిక ఎమ్మెల్యేకే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ-జలమండలి, హెచ్ఎండీఏ, విద్యుత్‌కు సంబంధించిన పనులపై ప్రత్యేక కమిటీలు వేస్తున్నారు. వీటి బాధ్యతలను సైతం నాలుగు పార్టీల నాయకులు కె.కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, మల్లారెడ్డి, కిషన్‌రెడ్డిలకు అప్పగించారు. వారు కమిటీలపై వెంటనే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. త్వరలోనే జీవో వెలువడనుంది. ఈ కమిటీలు వచ్చేనెల 8న మరోమారు సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనున్నాయి. తొలుత నాలాలు.. నీళ్లు.. చెత్త.... గృహ నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాలాల ఆధునికీకరణ నగరంలో నాలాల ఆధునికీకరణకు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించనిదే ఈ సమస్య పరిష్కారం కాదని సీఎం భావించారు. అందుకనుగుణంగా అన్ని పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడం... తాగునీటిలో మురుగునీరు కలుస్తున్న దుస్థితిని వివరించారు. కాలువలపై ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే విధి విధానాలు రూపొందించనున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో కనీసం రూ. 6వేల కోట్ల పనులైనా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆటోట్రాలీలు ఇళ్ల నుంచి చెత్త తరలింపునకు ప్రస్తుతమున్న రిక్షాల స్థానే ఆటోట్రాలీలు అందుబాటులోకి తేనున్నారు. బస్తీల్లోని నిరుద్యోగులకే వీటిని అందజేసి, ఇంటి చెత్త రోడ్డుపై ఎక్కడా పడకుండా డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేయనున్నారు. తొలిదశలో 2వేల ఆటోట్రాలీలను కొనుగోలు చేయనున్నారు. దీనికి దాదాపు రూ. 90 కోట్లు ఖర్చు చేయనున్నారు. 24 తక్షణ మరమ్మతు బృందాలు రహదారులపై గుంతలు, ఫుట్‌పాత్‌ల మరమ్మతుల వంటి చిన్నచిన్న పనులకు తక్షణ మరమ్మతు బృందాలను శాశ్వతంగా ఏర్పాటుచేయనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో వీటి వల్ల మంచి ఫలితం కనిపించిన సంగతి తెలిసిందే. 45 లక్షల డబ్బాలు ఇళ్లనుంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రెండు రంగుల డబ్బాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేయనుంది. దాదాపు 45 లక్షల డబ్బాలను వీలైనంత త్వరితంగా ప్రజలకు అందజేసే పనిలో పడ్డారు. తాగునీరు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ తాగునీటి సరఫరాకు అవసరమైన రూ.3100 కోట్లు, తాగునీరు.. మురుగునీరు కలిసిపోతుండటాన్ని నిరోధించేందుకు అవసరమైన రూ.3400 కోట్లు సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చే పనిని కూడా చేపట్టనున్నారు. సిబ్బంది కొరతపై దృష్టి జీహెచ్ఎంసీ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం సీఎం దృష్టికి వచ్చింది. అవసరమైన వారిని వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీటితో పాటు సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలని భావిస్తున్నారు. -
ప్రజా సమస్యలపై పోరాడదాం
తణుకు :రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి వారి పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముందు ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. తణుకు పట్టణ పార్టీ కార్యకర్తల సమావేశం స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సోమవారం నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి తన వంతు పాత్రను అసెంబ్లీలో పోషిస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో మంగళగిరిలో చేపట్టబోయే సమరదీక్షలో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందన్నారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులు తమపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అధికార పార్టీ నాయకుల వేధింపులకు తాళలేక మృతి చెందిన గణపవరానికి చెందిన పార్టీ కార్యకర్త నాగరాజు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మౌనం పాటించి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రి కాశీరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మత్స రామరాజు, నియోజకవర్గ ఇన్చార్జి మంతెన రవిరాజు, నాయకులు ఎస్ఎస్ రెడ్డి, బీపీ రవిశంకర్, మద్దిరాల రామసతీష్, కారుమంచి మిత్రా, కడియాల సూర్యనారాయణ, బోడపాటి వీర్రాజు, బూసి వినీత తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు యాళ్లవానిగరువు (పాలకొల్లు అర్బన్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను రోడ్డుపాలు చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. యాళ్లవానిగరువులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారన్నారు. డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు చేయనందుకు నిరసగా, వికలాంగ, వృద్దాప్య, వితంతు పింఛన్లు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, పార్టీ అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్, నేతలు వంగలపూడి యెస్సయా, గీర్ల శ్రీను, నరసాపురం మునిసిపల్ కౌన్సిలర్ వన్నెంరెడ్డి శ్రీనివాసు పాల్గొన్నారు. -
జన సమరంలో జగన్ వెంట సాగుదాం
చెల్లూరు(రాయవరం) : ప్రజాసమస్యలపై నిత్యం పోరాట యోధుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని, ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ప్రజలపై ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం రాత్రి రాయవరం మండలం చెల్లూరులో ఎమ్మెల్సీగా ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహిం చారు. పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామన్నచౌదరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టా రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బూటకపు హామీలతో అందరినీ మోసగించారన్నారు. 13జిల్లాల్లో 17లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలతో రాజకీయాలు చేస్తున్నారని, రైతులు అయినకాడికే ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. గృహ నిర్మాణానికి దాదాపు నీళ్లొదిలారన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దం ‘బోస్’ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ నీతి, నిజాయితీ, విలువలకు నిలువుటద్దం అని జ్యోతుల నెహ్రూ, ఆదిరెడ్డి అప్పారావు ప్రశంసించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ జెడ్పీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, నీటి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ నేతలు కర్రి పాపారాయుడు, సిరిపురపు శ్రీనివాసరావు, మిందిగుదిటి మోహన్, నక్కా రాజబాబు, ఆర్.వి.వి.సత్యనారాయణచౌదరి, బొడ్డపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడే వ్యక్తిగా బోస్‌ను కొనియాడారు. బోస్ పరిపాలనాదక్షుడని, మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన బోస్ జిల్లాకే గర్వకారణంగా పేర్కొన్నారు. అనంతరం బోస్‌ను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పూల కిరీటం, గజమాల, దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అలాగే పలు శెట్టిబలిజ సంఘాలు బోస్‌ను సత్కరించాయి.ఈ కార్యక్రమంలో కె.గంగవరం ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పాలిక రాఘవగోవిందు, సత్తి సత్యవతిరామచంద్రారెడ్డి, అంపోలు సాయిలక్ష్మి, మేడపాటి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, కామిరెడ్డి తాతాజీ, సర్పంచ్‌లు వాసంశెట్టి అనంతలక్ష్మి రాధాకృష్ణ, పరంశెట్టి వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి(చినకాపు), సత్తి ఈశ్వరరెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సత్తి వీర్రెడ్డి, సత్తి శంకరరెడ్డి,కట్టా సూర్యనారాయణ, పాలిక గోవిందు, గాదంశెట్టి శ్రీధర్, వి.లక్ష్మీనారాయణరెడ్డి, వల్లూరి రామకృష్ణ, పెంకే వెంకట్రావు, సత్తి వెంకటరెడ్డి, చిక్కాల శ్రీరాములు, దేవు శివానందం, వైట్ల వెంకటకృష్ణారావు, నైట్ శ్రీను, టేకి సాయి, కుక్కల శ్రీనివాస్, మేడిశెట్టి నరేష్కుమార్, రాయుడు ప్రసాద్, చోడె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసమే పనిచేయాలి
గంట్యాడ:గ్రామ కమిటీలు వేసినప్పుడు పార్టీకోసం,ప్రజా సమస్యల కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన మండలంలోని కొటారుబిల్లి కూడలిలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు వర్రి నరిశింహమూర్తి అధ్యక్షతన గ్రామ కమిటీలపై కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లవద్ద కూర్చుని కమిటీలు వేయవద్దన్నారు.గ్రామాలలోకి మండల కార్యకర్తలు,నాయకులు వెళ్లి ఆయాగ్రామాలలో నాయకులతో కూర్చుని కమిటీలు వేయాలన్నారు.కమిటీలో పనిచేయడానికి ఆయాకార్యకర్తలు సుముఖత చూపితే వారికి పదవులు ఇవ్వాలని చెప్పారు. పార్టీ కోసం,ప్రజలకోసం పనిచేసే వ్యక్తి నిజమైన నాయకుడన్నారు.పార్టీలోకి ఎవరోవస్తారని మనపై అజమా యిషీ చేస్తారని అనుకోవద్దని ఎవరు వచ్చినా పార్టీ కోసమే పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వ ల క్షణాలు ఉంటే పదవులు కోరకపోయినా వరిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎం.కృష్ణబాబు,పీరుబండి జైహింద్‌కుమార్,ఎం.సన్యాసినాయుడు,పూడి సత్యారావు,కోడెల ముత్యాలునాయుడు,మామిడి అప్పలనాయుడు,దత్తిరాజేరు మండలపార్టీ అధ్యక్షుడు కడుబండి రమేష్,జాగరపు త్యారావు,జె.దేముడుబాబు.టి.ప్రసాద్‌రాజు,ఆయాగ్రామ సర్పంచ్‌లు,ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం వీరభద్రస్వామిని సత్కరించారు. -
ప్రజాసమస్యలకు పెద్దపీట
- 12 అంశాలతో టీడీపీ జిల్లా మినీ మహానాడులో అజెండా - 5 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం - ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా మినీమహానాడులో ప్రజా సమస్యలపై చర్చించి,ఈ నెలాఖరు లో జరిగే రాష్ట్ర మహానాడుకు పంపేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కంచికచర్ల మండలం దొనబండలోని ఉమా హాలిడే ఇన్ ప్రాంగణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన గురువారం ఉదయం మినీమహానాడు జరగనుంది. అన్ని జిల్లాల్లోనూ గురువారం జిల్లాల మినీ మహానాడులు జరుగుతున్నందున పార్టీ అధినేత చంద్రబాబు 12 అంశాలతో కూడిన అజెండా పంపారు. ఆ అంశాలతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా మినీమహానాడులో నాయకులు చర్చించనున్నారు. రాజధాని, రైతు, డ్వాక్వా రుణాల మాఫీపై చర్చ నూతన రాజధాని ఏర్పాటులో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తీరు తెన్నులపై జిల్లా మినీమహానాడులో కీల కంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం, కొత్తపరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తే అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించి పార్టీ, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం, వారికి ఉద్యోగాలు కల్పించడానికి సలహాలు సూచనలు, మానవ వనరుల అభివృద్ధిపై కులంకుషంగా చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెల కొన్న ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ప్రతిపాదిస్తారు. 16 నియోజకవర్గాల్లోని ఉమ్మడి సమస్యలపై జిల్లా మినీమహానాడులో చర్చించి, మహానాడుకు పంపుతారు. 4 వేల మందికి ఆహ్వానాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సర్పం చులు, ఇన్చార్జిల వరకూ సుమారు 4వేల మందికి జిల్లా మినీ మహానాడుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జిల్లా మినీ మహానాడుకు సుమారు 5వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. -
ముత్తిరెడ్డి x కడియం
- అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలి : జనగామ ఎమ్మెల్యే - అక్కర లేదు : డిప్యూటీ సీఎం - సమావేశంలో నిరసన తెలుపుతానన్న యాదగిరిరెడ్డి - జెడ్పీలో ఇద్దరి మధ్య సంవాదం - అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలని యాదగిరిరెడ్డి పట్టు - అక్కర్లేదన్న డిప్యూటీ సీఎం కడియం - నిరసన తెలుపుతానన్న ఎమ్మెల్యే - మంచినీటి సమస్యపై గరం గరం సాక్షి, హన్మకొండ : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారుల వ్యవహార శైలిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మధ్య జిల్లా పరిషత్ సమావేశంలో సంవాదం చోటుచేసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినా అధికారులు సరైన సమయంలో స్పందించడం లేదని దీనిపై తీర్మానం చేయాలని ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా అధికారుల తీరుపై తీర్మానం చేయకుంటే అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడిని అయినా సరే తాను సభలో నిరసన వ్యక్తం చేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న సమావేశం దీంతో ఒక్కసారిగా వేడెక్కింది. వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలంలో వడ్లకొండ, గానుగుపాడు గ్రామా ల్లో నెలకొన్న మంచినీటి సమస్యను జనగామ జెడ్పీటీసీ విజ య లేవనెత్తారు. ఆ తర్వాత జనగామ నియోజకర్గంలో మం చినీటి సమస్య వివరించేందుకు ముత్తిరెడ్డి మైకు తీసుకోగానే కడియం అడ్డుపడుతూ ‘ముత్తిరెడ్డిని మాట్లాడమంటే గోదావరి నీళ్లు కావాలంటడు.. వార్తల్లా కాకుండా సమస్యను క్లుప్తంగా చెప్పాలి’ అని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా నియోజకర్గంలో మంచినీటి కొరత తీర్చేందుకు కొత్త బోర్లు వేయడంతోపాటు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని గత సమావేశంలో అడిగాను. రూ. 3.5 కోట్లు చెల్లిస్తే ప్రత్యేక కరెంటు లైన్లు నిర్మించి నియోజకర్గం పరిధిలో 24 గంటల కరెంటు ఇస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా మా నియోజకర్గ పరిధిలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ నిధులు ఈ పథకం కోసం తమ నిధులు కేటాయించారు. నేను కూడా కోటి రూపాయలు ఎమ్మెల్యే నిధులు జత చేసి మొత్తం రూ 3.5 కోట్లు కూడబెట్టాం. ఇందుకు సంబంధించి వేసవికి ముందే కలెక్టర్‌కు నివేదిక సమర్పించగా, ఒక్క రోజులోనే ఈ ఫైలుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కానీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్‌లో ఈ ఫైల్‌ను రెండు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. మరో 15 రోజుల్లో వేసవి ముగుస్తుంది. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మా ప్రజాప్రతినిధులు నోరు కట్టుకుని నిధులన్నీ కేటాయిస్తే అధికారులు రెండు నెలలుగా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడంతో మా సమస్య తీరలేదు’ అని అన్నారు. వేసవికాలం ముగుస్తున్నా తగు చర్యలు తీసుకోని అధికారుల తీరును నిరసిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తీర్మానం అవసరం లేదంటూ ఉపముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. తీర్మానం పెట్టకపోతే తాను అధికార పార్టీలో ఉన్నా సరే నిరసన తెలుపుతానంటూ ముత్తిరెడ్డి ధీటుగా స్పందిం చారు. చివరికి తీర్మానం చేస్తామంటూ అప్పటి వరకు చర్చను ముగించారు. చివరకు జిల్లా పరిషత్ తీర్మానాల్లో ముత్తిరెడ్డి డిమాండ్‌ను చేర్చకపోవడం కొసమెరుపు. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
- పార్టీలకతీతంగా సమస్యలపై స్పందించాలి - శాసనసభ జీవోల అమలు కమిటీ చైర్మన్ సూర్యారావు యూనివర్సిటీక్యాంపస్: ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనసభ జీవోల అమలు కమిటీ చైర్మన్ జి.సూర్యారావు అన్నారు. గురువారం తిరుపతి పద్మావతీ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్, ఇతర శాఖాధికారులతో కమిటీ సమీక్ష నిర్వహించింది. 2012 నుంచి సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో వెలువడిన 348 జీవోల అమలుపై సమీక్షించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జె.నెహ్రూ, కె.రామకృష్ణయ్య పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పార్టీలకతీతంగా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులను 15 రోజుల్లోపు పరిష్కరించాలన్నారు. జీవోలను చిత్తశుద్ధితో అమలు చేయించడమే కమిటీ లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ త్వరలో మండల స్థాయి అధికారులకు కూడా ప్రొటోకాల్ అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ సభ్యులు ఇచ్చిన సమస్యల సిఫారసు లేఖల అమలుపై అధికారులకు సూచనలు చేస్తామన్నారు. అలాగే ఎయిర్పోర్ట్, సీఐఎస్ఎఫ్, పోలీస్ అధికారులతో కూడా ప్రొటోకాల్ అంశాలపై సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయాచంద్, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డీ పీవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రావు, డీఎంహెచ్ కోటీశ్వరి, బీసీ కార్పొరేషన్ ఈడీ రామచంద్రరాజు, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు పెంచలకిషోర్, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలి
బొండపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పారు. బొండపల్లిలోని నాయుడు ఫంక్షన్ హాల్లో గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన నియోజకవర్గ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో కనీసం 16 మంది సభ్యులతో కమిటీలు, మండల స్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అమలు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రజలను మోసగించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. రుణమాఫీ చేశామని మంత్రులు, టీడీపీ నేతలు మిఠాయిలు పంచుకుంటూ మీడియాలో ఆర్భాటం చేస్తున్నారని చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో రుణమాఫీ జరగ కపోవటంతో రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీ పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు వరుదు కల్యాణి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, ఆశపు వేణు, ఎం.సత్యనారాయణ, భూడి వెంకటరావు, కడుబండి రమేష్, ఈదుబిల్లి క్రిష్ణ, వర్రి నర్శింహమూర్తి, గెద్ద రవి, గెద్ద రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని కలెక్టర్
ఎమ్మెల్యే జయరాములు బద్వేలు(అట్లూరు): ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన కలెక్టర్ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిసర ప్రజలతో పాటు సీమాంక్ రహదారికోసం గృహాలు కోల్పోనున్న రామాంజనేయనగర్ వాసులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలకు భయపడాల్సిన అవసరం లేదని వారిలో ధైర్యం నింపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామనే ఆలోచన లేదని, పచ్చచొక్కాలకు ఏజంటుగా పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. మహిళల ప్రసూతి, చిన్న పిల్లల కోసం నిర్మించిన సీమాంక్ ఆసుపత్రిలో జనరల్ ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. సీమాంక్ ఆసుపత్రికి నాలుగువైపులా రహదారులున్నాయని ఏ ఒక్కరి ఇల్లుగాని, చర్చి స్థలం గాని ఆసుపత్రి రహదారికి అవసరం లేదని ఆయన అన్నారు. ఆ గృహాలకు సంబంధించిన వారి అభిప్రాయాలను సేకరించకుండానే కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బద్వేలు మాజీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భీమారెడ్డి, కలసపాడు మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, కాలువపల్లె మాజీ సర్పంచ్ శ్రీరాములు, కౌన్సిలర్ గోపాలస్వామి, ఎస్సీ సెల్ బద్వేలు కన్వీనర్ క్రిష్ణ తదితరులు ఉన్నారు. -
సర్కారు తీరుపై సమర భేరి
ఏలూరు (ఆర్ఆర్ పేట) :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రెండో రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఆయా మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసిల్దార్లకు సమర్పించిన వినతిపత్రాల్లో కోరారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ధర్నాలు నిర్వహించారు. అనంతరం తహసిల్దార్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు మండల కార్యాలయం వద్ద పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి తదితరులు ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. పెదపాడు మండలంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గణపవరం, నిడమర్రు మండలాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు మండలంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనా కార్యక్రమంలో రైతు విభాగం కార్యదర్శి నడపన సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చెల్లెం ఆనంద్‌ప్రకాష్ తదితరులు పాల్గొని తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల, గోపాలపురం మండలాల్లో నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టి.నరసాపురంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం, చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం, కామవరపుకోట మండలాలు, ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ మండలం, భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. -
నిధులపై రగడ
నల్లగొండ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనుకున్నదే జరిగింది. జెడ్పీ పాలకవర్గం కొలువుదీరిన తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు జరిగిన సర్వసభ్య సమావేశాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలపై సమీక్షించే అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు మాటల యుద్ధానికి దిగారు. జెడ్పీ నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు పై పూ ర్తి స్థాయి సమీక్ష చేయాలని పట్టుబట్టారు. గురువారం నల్లగొండలోని ఉదియాదిత్య భవన్లో జరిగిన జెడ్పీ 3 వ సర్వసభ్య సమావేశానికి చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మార్తి గురువుల మృతికి సంతాపంగా సభ నివాళులు అర్పించింది. గురువులు సంతాప సభ నడిగూడెంలో ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అయితే అత్యవసరంగా ఆమోదించాల్సిన తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలపాలని చైర్మన్ కోరారు. అందుకు కాంగ్రెస్ సభ్యులు అంగీకరించక పోగా.. చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించారు. సంతాపం సభ అని చెప్పి ఈ సమావేశంలోనూ ప్రజా సమస్యలు, పథకాల పై ఎలాంటి సమీక్ష లేకుండానే తీర్మానాలు ఆమోదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా పరిషత్‌కు వస్తున్న నిధులు, వాటి వినియోగం తదితర అంశాల పై సమగ్రంగా చర్చిచేందుకు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులకు మద్దతుగా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి గొంతు కలిపారు. ఎలాంటి భేషేజాలకు పోకుండా రెండు రోజులు పాటు సమావేశాలు నిర్వహిస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు వీలుంటుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని పై స్పందించిన చైర్మన్.. జెడ్పీ నిధులు దాచుకుని.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సభ్యుల కోరిక మేరకు ఈ నెల 12 తేదీలోపు రెండు రోజుల పాటు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ రోజున అందరు సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. 13 వ ఆర్థిక సంఘం నిధులపైనే రచ్చ చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానాల్లో 13 వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రధానంగా హైదరాబార్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డుకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి రూ.40 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ఆమోదించారు. కానీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, మరమ్మతులకు 13 వ ఆర్థిక సంఘం నుంచి రూ.53 కోట్లు కేటాయించేందుకు ప్రవేశపెట్టిన తీ ర్మానాన్ని సభ్యులు వ్యతిరేకించారు. దీంట్లో విద్యుత్ బకాయిలు, కార్మికుల వేతనాలు ఉన్నా యి. మూడు మాసాలుగా కార్మికులకు వేతనాలు చెల్లించలేదని, వారికి జీతాలు చెల్లించకుం టే విధులు బహిష్కరించే అవకాశం ఉందని చైర్మన్ వివరించారు. దీనికి సభ్యులు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు చెల్లించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ 13 వ ఆర్థిక సంఘం నిధులపై సమగ్రంగా చర్చించిన తర్వాతే చెల్లించాలన్నారు. ఈ 9 నెలల కాలంలో సభ్యులకు ఎలాంటి నిధులు రాలేదని.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. బీఆర్జీఎఫ్ నిధులు కూడా రాకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆర్థిక సంఘం నిధుల గురించి పూర్తిగా చర్చించిన తర్వాతే నిధుల మళ్లింపు చేయా లన్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని సభ్యులు కోరారు. ఈ సమావేశాల్లోనే మిగిలిన తీర్మానాల పై కూడా చర్చించాలన్నారు. సభ్యులు కోరికను చైర్మన్ కూడా అంగీకరించడంతో సభను వాయిదా వేశా రు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రముఖుల సంతాపం... జెడ్పీ మాజీ చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి,జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మార్తి గురువుల మృతికి చైర్మన్ నేనావత్ బాలునాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, విప్ గొంగడి సునీత, ఎంపీ గుత్తా ్డ, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ లు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, జెడ్పీటీసీల ఫోరం జి ల్లా అధ్యక్షుడు మందడి రామకృష్ణా రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రామిరె డ్డి తమ సంతాపం తెలిపారు. ఆమోదించిన ... వ్యతిరేకించిన తీర్మానాలు నడిగూడెం మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మార్తి గురువులు కుటుంబానికి అవకాశం ఇవ్వడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదించి ంది. టీడీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. 13 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, జెడ్పీ, మండల పరిషత్ వార్షిక బడ్జెట్, ఉపాధి హామీ వార్షిక బడ్జెట్, తాగు నీటి సమస్య తీర్చేందుకు విడుదలైన నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలనే దాని పై చైర్మన్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ వీటి పై పూర్తిస్థాయి చర్చ చేయకుండా ఆమోదించడాన్ని కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. ముందుగా ఎంపీ తన వద్దకు వచ్చిన ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారం కోసం అధికారులకు ఫోన్లు చేశారు. చిన్నకుడాల గ్రామానికి చెందిన బీసీ కాలనీ మహిళలు తమ కాలనీకి పార్నపల్లె నీరు రావడం లేదని ఎంపీకి మొరపెట్టుకోగా.. ఆయన సంబంధిత అధికారి డీఈ మోహన్‌కు ఫోన్ చేసి శనివారం రాత్రిలోగా కాలనీకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా ఎంపీ నిధుల ద్వారా గ్రామంలో సంప్ ఏర్పాటు చేస్తానని శాశ్వతంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కొంత మంది రేషన్ డీలర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి వేధిస్తున్నారని ఆయన దృష్టికి తేగా, అందుకు ఎంపీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, సింహాద్రిపురం పరిధిలోని సమస్యలు ఆయన దృష్టికి తేగా, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోరగా.. వివిధ కంపెనీల ప్రతినిధులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రామగిరి జనార్థన్‌రెడ్డి, నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డి, వేముల సాంబ శివారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిల్లో ‘దేశం’ రచ్చ..రాజమండ్రికి మచ్చ..
నాలుగు మంచిపనులు చేస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. వారికి ఐదేళ్లపాటు బాధ్యతలను అప్పగిస్తారు. తీరా గద్దెనెక్కాక వారు వ్యవహరించే తీరును చూసి విస్తుపోవడం ప్రజల వంతవుతోంది. ఈ వారం రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు నగర చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయూరుు. ఓ వైపు పుష్కరాలు దగ్గర పడుతున్న తరుణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు దృష్టి సారించాల్సింది పోయి, కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలను తప్పించుకునేందుకు నాటకీయంగా వ్యవహరించడాన్ని నగరవాసులు ఈసడించుకుంటున్నారు. (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :రాజమండ్రి కార్పొరేషన్ పగ్గాలు నగర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలి. అభివృద్ధి పనులపై వస్తున్న అవినీతి, ఆరోపణలపై చర్చించి... లోటుపాట్లు సవరించాల్సిన బాధ్యత పాలకపక్షంపై ఉంది. అయితే మెజార్టీ ఉందన్న అహంకారంతో ఏకపక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాజమండ్రి మున్సిపల్ చరిత్రలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చూసి మేధావులు, నగర ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. స్వయంగా అధికార పార్టీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ లేఖ రాయడం గమనార్హం. నగరంలో సెల్ టవర్లు, వాటి నిర్వహణ, జనన మరణ విభాగంలో అవినీతి, రిలయన్స్ 4జీ విషయంలో రోడ్ల తవ్వకాలకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరు, మేయర్ కార్లకు అయ్యే ఖర్చు, నగర పాలక సంస్థకు ఫర్నీచర్ కొనుగోలులో అవినీతి వంటి మొత్తం 23 అంశాలపై కమిషనర్‌కు ఆయన లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే కౌన్సిల్ చర్చలో ఈ అంశాలను పక్కదారి పట్టించేందుకు పాలక పక్షానికి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి కార్పొరేటర్లు నాటకీయ పరిణామాలకు పురిగొల్పారు. తమ తప్పు దొరక్కుండా తప్పించుకున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు. అయితే అధికార పక్షం అవకాశం ఇవ్వకపోయినా ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ విషయాన్ని బయటకు తీసుకురాగలిగింది. ఎన్ని చేసినా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం సాధ్యం కాదని అధికారపార్టీ నేతలు గ్రహిస్తే మేలు. ‘పట్టిసీమ’పై చంద్రబాబు మొండిపట్టు కొంతకాలంగా వివాదాస్పదమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈ వారం మరోసారి చర్చకు వచ్చింది. ఈ పథకం వల్ల గోదావరి సీమ ఎడారిగా మారిపోతుందని రైతులు, రైతు సంఘాల నేతలు, వివిధ పార్టీలు ఎంత నిరసన తెలిపినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ అమలు చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు డెల్టా రైతుల పొట్టకొట్టే పట్టిసీమకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ నైజాన్ని బయట పెట్టుకున్నారు. రూ.16 వేల కోట్లతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా కనీసం నిరసన కూడా తెలపని చంద్రబాబు పట్టిసీమపై పట్టుదలగా ఉండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసి కూడా రూ.1,300 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు మొండిగా ముందుకు వెళుతోంది. అంచనాలకు 20 శాతం ఎక్కువకు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా ఈ పథకం అసలు ఉద్దేశం సొమ్ములు చేసుకోవడమేనని తేటతెల్లం చేశారు. దీనిపై అమీతుమీ తేల్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. అమెరికా నుంచి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల కాకినాడలో సమావేశమై పట్టిసీమ పథకం నిలుపుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్‌తో ఉద్యమించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఎత్తిపోతల పథకంపై చేపట్టాల్సిన ఉద్యమంపై గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రు, ఆళ్ల నాని చర్చించారు. త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం రైతులకు ఊరటనిస్తోంది. రాజా వివాహ వేడుకకు హాజరైన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాకు వచ్చారు. దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. జక్కంపూడి కుటుంబంపై తమ కుటుంబానికి ఉన్న ఆప్యాయాతానురాగాలను మరోసారి చూపించారు. జక్కంపూడి ఇంట గంటకుపైగా గడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో రెండు మూడువేల ఎకరాలు సరిపోతాయని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కుంటున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా తన వాణిని వినిపిస్తానని చెప్పారు. కాగా వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు రాజా, రాజీ దంపతులను ఆశీర్వదించారు. జన్మస్థలంలో ‘గానగంధర్వుడు’ గానగంధర్వుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆరేళ్ల తరువాత తన జన్మస్థలమైన శంకరగుప్తం రావడంతో ఆ గ్రామం ఉప్పొంగింది. గ్రామస్తులు చూపించిన ఆదరాభిమానాలకు మంత్రముగ్ధులయ్యారు. మైమరిచిపోయారు. ఆయనతోపాటు వచ్చిన కుమార్తెలు, కోడళ్లు, మనుమలు, మనుమలతో గ్రామంలో తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించి పులకించిపోయారు. గ్రామస్తులు ఆయనకు సత్కరించుకుని పాదపూజ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రబీలో నీటికి కటకట పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ఎడారిగా మారుతుందన్న రైతుల ఆందోళన ముందే నిజమయ్యేలా ఉంది రబీ పరిస్థితి చూస్తుంటే. గోదావరి డెల్టాలో నెలకొన్న నీటి ఎద్దడి ఆయకట్టు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జిల్లాలో డెల్టా కాలువల పరిధిలో సుమారు 3.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. చేలు పాలుపోసుకునే దశకు చేరుకున్న సమయంలో చేలల్లో నీటికి ఎక్కువగా ఉంచుతారు. సరిగ్గా ఇదే సమయంలో నీటి ఎద్దడి రైతులను కలవరపెడుతోంది. నీటి ఎద్దడిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న 4,500 క్యూసెక్కుల నీటికి అదనంగా గత ఆదివారం నుంచి వెయ్యి క్యూసెక్కులు, శుక్రవారం నుంచి మరో వెయ్యి క్యూసెక్కులు కలిపి విడుదలు చేస్తున్నారు. మొత్తానికి డెల్టాకు నీటి ఎద్దడి తప్పేటట్టు లేదు. గోదావరిలోని, మురుగునీటి కాలువల్లోని వృథా జలాలను పంట కాలువల్లోకి, చేలల్లోకి మళ్లించేందుకు రూ.పది కోట్లు అవసరమవుతాయని అధికారులు సాగు ఆరంభంలోనే ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం సకాలంలో అనుమతి ఇవ్వకపోడంతో ఇప్పుడు సీలేరు నుంచి అదనపు నీటిని తెప్పిస్తున్నా శివారుకు అందడం లేదు. రబీ సాగుకు ఈ 30 రోజులు కీలకమని తెలిసి కూడా అధికారులు ముందుగా మేల్కొనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడికి గురైతే ధాన్యం గింజలు తాలుతప్పలుగా మారిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పట్టిసీమ ఎత్తిపోతలు చేపడితే డెల్టా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తే పుట్టగతులుండవ్
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి హెచ్చరిక పథకాల అమలులో సీఎం మ్యాజిక్ చేస్తున్నారని విమర్శ వైఎస్ ప్రారంభించిన సాగునీటి పథకాలు నేటికీ పూర్తి కాలేదు సచివాలయం తరలింపునకు మేం వ్యతిరేకం ప్రజా సమస్యలపై అన్ని పార్టీలతో కలసి పోరాటం చేస్తాం వనపర్తి/జడ్చర్ల: ప్రాంతీయతత్వంపై గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కనికట్టును ప్రదర్శిస్తున్నారని, ఇలా చేస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఆయన సమక్షంలో పలువురు న్యాయవాదులు, ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా, అంతకు ముందు జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేతగా ఎన్నో అంచనాలతో ప్రజలు కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టారని..అయితే, ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతులకు రుణమాఫీతోపాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలులో కేసీఆర్ మ్యాజిక్ చేస్తున్నారని, దీంతో తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని నీటిని ఏపీ ప్రభుత్వం ఎక్కువగా వాడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. విద్యుత్ సమస్యతో పం టలు ఎండిపోయి అప్పులు తీర్చలేక రైతు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు సహాయంగా అందించాలని, నష్టపోయిన పం టలకు ఎకరాకు పత్తి, మిర్చి పంటలకు రూ.25 వేలు, వరికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుకు కరెంట్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్ హయాంలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు నాలుగు ప్రాజెక్టులు చేపట్టారని ఆయన తెలి పారు. అప్పట్లోనే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వైఎస్ మరణం తర్వాత నేటికీ మిగతా పనులు పూర్తికాక పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం అంతా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని విమర్శించారు. సచివాలయ మార్పు నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలసి తమ పార్టీ పోరాటం చేయనుందని తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పూర్తిస్థాయి అమలుతోపాటు ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తే బం గారు తెలంగాణ సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పేద ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటుందని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని పొంగులేటి చెప్పారు. ప్రతి ఇంట్లో దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని అభిమానించే వారున్నారని.. ఆయన హయాంలో తమకు ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదని చెప్పే వారు ఒక్కరూ లేరని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలో వైఎస్ ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ప్రజలకు సాగునీరందించాలని.. లేకుంటే వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులతో ఉద్యమాన్ని చేపడతామన్నారు. వాగ్దానాలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని పొంగులేటి చెప్పారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో ప్రకారం సహాయమందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్, సయ్యద్ ముస్తాక్, భీమయ్య గౌడ్, బంగి లక్ష్మణ్, రాంభూపాల్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల విభాగానికి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆయా శాఖలకు చెందిన అధికారులకు అందజేశారు. ప్రజలకు సమస్యలు ఉండడంతోనే అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. వారి సమస్యను మండల స్థాయి అధికారులు పరిష్కరించేలా చూడాలని, వారు పట్టించుకోకపోవడంతోనే ప్రజలు తన దాకా వస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, వారి సమస్యలు పరిష్కరించినట్లైతే వారి మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలపై దృష్టిసారించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్, డీఆర్వో ప్రసాదరావు, డీఎస్వో వసంత్‌రావు, డ్వామా పీడీ గణేశ్‌జాదవ్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. - ఆదిలాబాద్ అర్బన్ -
ప్రజా సేవకే అంకితం: అన్నాహజారే
గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన వీఎస్కేయూ బళ్లారి : ప్రజా సమస్యలపై పోరాడే తమలాంటి వారికి ప్రభుత్వం, సంఘ సంస్థలు అందజేసే పట్టాలు, పురస్కారాలు మరింత బాధ్యత పెంచుతాయని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే పేర్కొన్నారు. నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) శనివారం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైసూరు పేటా తొడిగి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశానన్నారు. జనలోక్పాల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త సంస్థలు చురుకుగా పని చేయాలన్నారు. రాజ్యాంగమే మనకు ఇచ్చిన పోరాట హక్కును సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల మద్దతు ఉండే ఏ పోరాటాలైనా నీరుగారి పోవన్నారు. గతంలో తాను అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చిన పోరాట పిలుపునకు యావత్ దేశ నలుమూలల నుంచి మద్దతు దొరికిందని గుర్తు చేశారు. సీనియర్ గాంధేయవాది దొరెస్వామి, ఇన్చార్జి వీసీ సోమశేఖర్, రిజిస్ట్రార్ విజయకుమార్, ఎల్ఆర్ నాయక్ పాల్గొన్నారు. -
ఉద్యమమే ఊపిరి..
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఆందోళనలు పార్టీ బలోపేతానికి మహాసభల్లో కార్యాచర ణ రూపొందిస్తాం ‘సాక్షి’తో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ ఉద్యమానికి తమ పార్టీ జిల్లాలో ఊపిరిలూదిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ పాత్ర కీలకమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు తెలిపారు. ఈనెల 17, 18 తేదీలలో భద్రాచలంలో పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మూడు సంవత్సరాలుగా జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కదిలించామని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, గిరిజనులకు పోడు భూముల పట్టాలు తమ ఉద్యమ ఫలితమేనని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై పోరాడుతామని వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ‘దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు, బూర్జువా వర్గాలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వామపక్ష శక్తులు బలంగా ఉన్న చోట విపరీతంగా డబ్బు ఖర్చుచేయడంతో పాటు రకరకాల ప్రలోభాలకు పాల్పడ్డారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వామపక్షాలు అగ్రభాగాన నిలవడం కొన్ని శక్తులకు, సంస్థలకు కంటగింపుగా మారింది. అందుకే వామపక్ష వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి కృషి.. జిల్లాలో అన్ని మండలాల్లో సీపీఐ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోంది. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళనలు చేపట్టాము. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఆందోళనలు నిర్వహించడం, ప్రజల్లో రాజకీయ, సైద్ధాంతిక అవగాహన కల్పించడం ద్వారా కొద్ది రోజుల్లో పూర్వ వైభవాన్ని సాధిస్తాం... సమస్యలపై వామపక్షాలు పోరాడుతాయి... ఖమ్మం జిల్లా వామపక్ష ఉద్యమానికి పురిటిగడ్డ.. సైద్ధాంతికంగా కొన్ని విభేదాలున్నా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుతున్నాము. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు ఐక్యంగా చేపట్టిన పలు ఆందోళనలకు ప్రజల మద్దతు లభించింది. భవిష్యత్తులో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం. ఇక ముందు కూడా ప్రధానమైన సమస్యలపై కలసి పోరాడేందుకు సీపీఐకి ఎటువంటి ఇబ్బంది లేదు. వామపక్ష ఉద్యమంలో ఎన్నికలు ఒక అంకం మాత్రమే. ప్రజా ఉద్యమాలతో ఎన్నికల ఫలితాలను పోల్చడం సరికాదు. కాంగ్రెస్‌తో పొత్తు కలిసి రాలేదు.. 2014 ఎన్నికల్లో జిల్లాలో సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు అంతగా కలిసి రాలేదు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ శక్తులు కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీనికితోడు మిగిలిన పార్టీలు ఎన్నడూ లేనంతగా విచ్చలవిడిగా చేసిన ఖర్చు కూడా సీపీఐ ఓటమికి కారణమైంది. మిత్రపక్షం సహకారం పూర్తిస్థాయిలో లభించకపోవడం, ఎన్నికల్లో పెరిగిన ధన ప్రభావం ఓటమికి కారణమని మా సమీక్షలో తెలిసింది. మహాసభల్లో ప్రత్యేక కార్యాచరణ... 17 నుంచి జరిగే జిల్లా మహాసభల్లో విస్తరణ దిశగా కార్యాచరణ రూపొందిస్తాము. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు అవకాశాలున్నాయి. ఐక్యంగా ముందుకు వెళ్లనున్నాము. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటిపైనా చర్చించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నాము. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కమ్యూనిస్టు పార్టీ మార్గంలో పయనించాలని ఆహ్వానిస్తాము. గ్రామ గ్రామాన కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం అయ్యేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యే 600 మంది ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తాము. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు... ప్రధానంగా పోడు భూముల సమస్య జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోం ది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాము. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌చేస్తూ ప్రత్యేక ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నాము. పారిశ్రామిక ప్రగతికి జిల్లాలో సానుకూలంగా ఉన్నందున స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమ లు రూపొందించాలని ఆందోళన చేపడతాము. సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తాము.ప్రజాసంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాము’. -
వాస్తవాలు చెప్పండి
సత్ఫలితాలు సాధిద్దాం ప్రజావాణిలో మార్పులు చేస్తా జిల్లాను స్మార్ట్‌గా మారుద్దాం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ బాబు.ఎ మచిలీపట్నం : అధికారులు వాస్తవ పరిస్థితులు చెబితే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, సత్ఫలితాలు సాధించవచ్చని నూతన కలెక్టర్ బాబు.ఎ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాబు.ఎ సోమవారం 10.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డీఆర్వో ప్రభావతి, బందరు ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ నారదముని, కలెక్టరేట్ ఏవో సీతారామయ్య స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కలెక్టర్ చాంబర్లోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను జిల్లా అధికారులు మర్యాదపూ ర్వకంగా కలిశారు. చాంబర్ నుంచి బయలుదేరిన కలెక్టర్ తొలుత ప్రజావాణి జరిగే కలెక్టరేట్లోని సమావేశపు హాలుకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ఎవ్వరూ లేకపోవటంతో ప్రజావాణి అర్జీలు స్వీకరించే విభాగం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రజావాణికి ప్రజావాణి జరిగే సమావేశపు హాలుకు వచ్చిన కలెక్టర్ బాబు.ఎ జిల్లాకు చెందిన అధికారులను ఒక్కక్కరినీ పరిచయం చేసుకున్నారు. వారి పేరు, హోదా, కార్యాలయం ఎక్కడ ఉంది.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వస్తున్నారని, ఇకనుంచి మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో ప్రజావాణి నిర్వహించేలా ప్రత్యేక ఉత్తర్వుల జారీచేయాలని డీఆర్వో ఎ.ప్రభావతిని ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణిలో కొద్దిపాటి మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్లోనే ఆయా విభాగాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేస్తామని సంబంధిత అధికారి పేరును తెలుగులోనే ఈ కౌంటర్లో ఉంచుతామని, అర్జీలు ప్రజలు అక్కడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అర్జీల పరిష్కారం విషయంలో ఒక ప్రొఫార్మాను తయారుచేశానని, ఆ ప్రొఫార్మాలో ప్రతి శాఖ జిల్లా అధికారులు తమ పరిధిలోని అర్జీల పరిష్కారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఇక్కడ దరఖాస్తులు ఇచ్చిన అనంతరం సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా తనకు దరఖాస్తులు ఇచ్చేలా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. ప్రజావాణికి కొన్ని శాఖల వారు సిబ్బందిని పంపి చేతులు దులిపేసుకుంటున్నారని, ఈ పద్ధతిని విడనాడాలని హెచ్చరించారు. బాధ్యత గల అధికారులను ప్రజావాణికి పంపి ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు అధికారుల హాజరుపట్టీ పరిశీలిస్తానని, గత ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, వాటిలో పరిష్కారమైన సమస్యలు, మిగిలిన వాటిపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఏదైనా కార్యాలయం పనిచేయాలంటే అక్కడ పనిచేసే సిబ్బందికి సత్ప్రవర్తన, సింప్లిసిటీ, టూల్స్ అవసరమని, వీటన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. స్మార్ట్ జిల్లాగా రూపొందిద్దాం : కృష్ణాజిల్లా రాజధాని జిల్లాగా పిలువబడుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను సత్వరమే పాటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పారు. స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేద్దామని ఆయన అధికారులను కోరారు. పరిపాలనాపరంగా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కృష్ణా టీమ్ సమర్థంగా పనిచేస్తోందనే పేరు తెచ్చుకోవాలని అధికారులతో అన్నారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రిని కలిశానని, ఆయన సూచనల మేరకు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరం కృషిచేద్దామని చెప్పారు. -
ప్రజల కోసం పోరాడుదాం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ప్రజా సమస్యలపై కలసి పోరాడుదామని జిల్లా నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, పింఛన్ల పంపిణీ తదితర సమస్యలపై ఉద్యమిద్దామని పేర్కొన్నారు. నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా పార్టీ కమిటీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, లేదా పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా అధ్యక్షుడు మాట్లాడి ఆయా మండలాల కమిటీలను ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. ఆరు నెలలు తిరగకుండానే వూకొద్దు బాబోయ్ ఈ చంద్రబాబు పాలన అని ప్రజలందరూ వాపోతున్నారని అన్నారు. కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...‘ఎన్నికల వుుందు బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్ధాలకు విసుగెత్తి ప్రజలందరూ తవు తరపున పోరాటం చేయూలని ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకే వునం ప్రజలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వునం ఏం చేయూలి? ప్రజలకు ఎలా దగ్గర కావాలి? వారికి ఎలా తోడుగా నిలబడాలనే అంశాలపై వునం సమీక్షించుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సవుస్యలపై వునం పోరాడాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ స్థారుు నుంచి వునం పార్టీని వురింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయుని లెక్కిస్తే.. చంద్రబాబు కూటమికి కోటి 35 లక్షల ఓట్లు వస్తే... వునకు కోటి 30 లక్షల ఓట్లు వచ్చారుు. అంటే తేడా కేవలం 5 లక్షల ఓట్లు వూత్రమే. సాధారణ ఎన్నికలకు వుుందు జరిగిన కడప పార్లమెంటు సెగ్మెంటులో నాకు వచ్చిన మెజార్టీ 5 లక్షల 45 వేలు. అంటే ఇంత కంటే తక్కువే. రాష్ర్టవుంతటా కలిపి కూడా ఆ మెజార్టీ కంటే ఇంకా తక్కువే. ఈ తేడా ఎందుకు వచ్చిదంటే చంద్రబాబు వూదిరిగా వునం 87 వేల కోట్ల వ్యవసాయు రుణాలను వూఫీ చేస్తావుని అవులు సాధ్యం కాని హామీలు ఇవ్వకపోవడం ఒక కారణమైతే...పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ గాలి కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది’ అని ఆయన వివరించారు. బాబు పరిస్థితి దినదినగండం...! ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి దినదినగండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రోజుకో అబద్ధం చెప్పాల్సి వస్తోందని, ప్రజల్లోకి వెళితే రాళ్లతో కొట్టకుండా చూసుకునేందుకు రోజుకో మోసం చేయూల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లోనే బాబు ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుదావుని కసితో ఉన్నారని పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబుకు ఏం కోరికలు ఉన్నాయో నాకు తెలియుదు కానీ నాకు సీఎం అరుుతే, 30 ఏళ్లు పాలించాలని.. ఈ కాలంలో సాధ్యమైనన్ని వుంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయూలని ఉంది. ప్రతీ ఇంట్లో నాన్న ఫొటో వూదిరిగా నా ఫొటో ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని భావోద్వేగంగా మాట్లాడారు. అవ్వా, తాతల పింఛన్లలోనూ కోతలే.. సావూజిక కార్యకర్తల పేరుతో టీడీపీ కార్యకర్తలను పెట్టి ఉన్న పింఛన్లను కోసేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘అవ్వా తాతల పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000 పెంచుతానని బాబు చెప్పారు. పింఛన్లకు సువూరు రూ. 3,700 కోట్లు కావాల్సి ఉండగా... బడ్జెట్లో కేవలం రూ. 1338 కోట్లు వూత్రమే కేటారుుంచారు. అంటే మిగిలిన రూ. 2,400 కోట్ల మేరకు కత్తిరింపులు ఉంటాయుని చెబుతున్నట్లేనన్నవూట’ అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, అఖిలప్రియ, గుమ్మనూరు జయరాం, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యులు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి, జిల్లా పార్టీ గ్రీవెన్స్‌సెల్ కన్వీనరు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, తుగ్గలి రామచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి, పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. బాబు భార్య మెడలో మాత్రం బంగారం ఉంది ఎన్నికల్లో బాబు వూటలను నమ్మి ఓటు వేసి.. రుణాలన్నీ వూఫీ అవుతాయునుకుంటే వడ్డీ కూడా వూఫీ కాని పరిస్థితి ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘వడ్డీలేని రుణాలు అందుకోవాల్సిన రైతులు చంద్రబాబు వూటలను నమ్మి ఇప్పుడు 14 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తోంది. కొత్త రుణాలు లభించక రైతులు రూ.2-రూ.3 లకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయూల్సి వస్తోంది. బీవూ డబ్బులను కూడా రైతులు కోల్పోవాల్సిన పరిస్థితి. బ్యాంకులో బంగారం ఇంట్లోకి వస్తుందనుకుంటే బ్యాంకు వాళ్లు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది. అరుుతే, చంద్రబాబు ఇంట్లో బంగారు వూత్రం ఆయున భార్య మెడలోనే ఉంది. డ్వాక్రా అక్కాచెల్లెవ్ముల రుణాలు వూఫీ కాకపోగా.. వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకులు లాక్కొంటున్న పరిస్థితి ఉంది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల వుుందు చెప్పారు. ఇప్పుడేమో బాబు వచ్చి ఉన్న జాబును ఊడబెరికిన పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.2 వేల నిరుద్యోగ భృతి గురించి అసలే వూట్లాడటం లేదు’ అని ఆయన మండిపడ్డారు. నంద్యాల ఘటనపై న్యాయపోరాటం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ పోలీసులను ఉసిగొల్పి అక్రవు కేసులతో దాడులు చేస్తోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘బలమైన నాయుకత్వం ఉన్న నంద్యాల, ఆళ్లగడ్డ లాంటి చోట్లనే ఇలా చేస్తుందంటే... మిగిలిన చోట్ల పరిస్థితి ఎంత భయుంకరంగా ఉందో వునం అర్థం చేసుకోవచ్చు. నంద్యాల ఘటనపై వునం న్యాయుపోరాటం చేద్దాం’ అని భరోసానిచ్చారు. మనకు దేవుడి దయ ఉంది చంద్రబాబుకు తోడుగా ఒక ఈనాడు ఉంది... ఒక ఆంధ్రజ్యోతి ఉంది... ఒక టీవీ 9 ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రేప్పొద్దున చంద్రబాబు హామీలు అవులు చేయుకపోతే ఈ మీడియా చంద్రబాబు వుంచోడే. ఆయునకు రుణవూఫీ చేద్దావుని ఉందని.. అయితే, బ్యాంకులు, కేంద్రం ఒప్పుకోలేదు అని చెబుతాయి. చంద్రబాబుకు లేనిది వునకు ఉన్నది ఆ దేవుడి దయు, ప్రజల మనస్సుల్లో స్థానమ’ని పేర్కొన్నారు. సంతాపం శోభమ్మకు, బస్సు ప్రమాద మృతులకు సంతాపం కర్నూలు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతికి, అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంతాపం ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన మేరకు సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశ ప్రారంభానికి ముందు జననేత మాట్లాడుతూ శోభమ్మ వ్యక్తిగతంగా తనకు అక్కలాంటిదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పెనుగొండ మధ్య జరిగిన బస్సు ప్రమాదంలో 15 మంది చనిపోయిన ఘటనను గుర్తు చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజా ప్రతినిధులు మౌనం పాటించారు. -
జనం కోసం పోరుబాట
కదిలిస్తే...ప్రతీ మదీ ఆవేదనల నదే... పింఛన్లు తీసేశారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు...రేషన్ కార్డులదీ అదే పరిస్థితి. నగరంలో ఏ సందు వెతికినా..తాండవిస్తోన్న అపరిశుభ్రత..చివరకు తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు రాని పరిస్థితి...ఇలా ఒకటి కాదు...రెండు కాదు.. సమస్యల చట్రంలో చిక్కుకుని ‘అనంత’వాసులు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టనట్లున్న అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిపై జనం మండిపడుతున్నారు. ఈ క్రమంలో నగర వాసుల సమస్యలు తెలుసుకునేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ‘రిపోర్టర్’గా మారారు. పాతూరులో ‘సాక్షి వీఐపీ’ రిపోర్ట్‌ర్‌గా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొదటగా పాతూరు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట దిగిన గురునాథ్‌రెడ్డి అక్కడ తోపుడు బండ్ల వ్యాపారితో.. గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి? వ్యాపారం ఎలా ఉంది? తోపుబండ్ల వ్యాపారి: సార్ నా పేరు వెంకటేష్. వ్యాపారం బాగా తగ్గింది. గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా? వెంకటేష్ : ట్రాఫిక్ వాళ్ల నుంచి ఇబ్బంది. బండి అక్కడపెట్టు..ఇక్కడ పెట్టు అంటూ ఇబ్బంది పెడుతున్నారు. గురునాథ్‌రెడ్డి: ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందా? వెంకటేష్ : ఇప్పటి వరకు ఎలాంటి సాయమూ లేదు. గురునాథ్‌రెడ్డి: అన్నా..వ్యాపారాలు ఎలా ఉన్నాయి? రామూర్తి ప్రసాద్ : వ్యాపారం తక్కువ. బాడుగలు ఎక్కువగా ఉన్నాయన్నా...!. గురునాథ్‌రెడ్డి: బాడుగ ఎంత కడుతున్నారు? రామూర్తి ప్రసాద్ : 13 వేల చిల్లర కడుతున్నాము. దీనికి తోడు సేవా పన్ను కట్టాలంటున్నారు. వ్యాపారాలు లేని పరిస్థితుల్లో బాడుగలు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏం నాగభూషణం బాగున్నావా? ఇక్కడ సమస్యలు ఏంటి? నాగభూషణం: సార్.. పాతూరులో వ్యాపారం చేసుకునే మహిళలకు, సరుకులు, కూరగాయలు కొనేందుకు వచ్చే మహిళలకు టాయ్‌లెట్ సమస్య అధికంగా ఉంది. గురునాథ్‌రెడ్డి: దగ్గరలో సులబ్ కాంప్లెక్స్ ఉంది కదా! నాగభూషణం: ఉంది సార్.. అది చాలా అధ్వానంగా ఉంటుంది. అక్కడికి పోతే రోగాలొస్తాయి. శుభ్రం చేయండని చెబితే... చేస్తాం... చూస్తామంటున్నారు. గురునాథ్‌రెడ్డి: సరే నేను అధికారులతో మాట్లాడి టాయ్లెట్లు ఏర్పాటు జరిగేలా చూస్తాను. గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి. ఆటో జీవితం ఎలా ఉంది. ఆటోవాలా: సార్ నా పేరు ఓబుళపతి. బాడుగలు వర్కవుట్ కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఓబుళపతి : ట్రాఫిక్ వాళ్లతో ఇబ్బంది. ఆటోలు పెట్టుకుంటే తీసేమంటారు. ఫైన్ రూ.150 నుంచి రూ.200 వరకు వేస్తారు. అసలే బాడుగలు అంతంత మాత్రం. ఫైన్లు వేసిన రోజున ఉత్తి చేతులతో ఇంటి పోవాల్సి వస్తోంది. గురునాథ్‌రెడ్డి: ట్రాఫిక్ వాళ్లతో మాట్లాడి మీ ఆటోవాళ్ల సమస్యను పరిష్కరిస్తాను. తాడిపత్రి రోడ్డు నుంచి రాజమ్మకాలనీకి వెళ్లిన గురునాథరెడ్డి అక్కడి పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ బాగున్నావా..? పింఛను వస్తోందా..? నూరి: అయ్యా పింఛను వస్తోంది. అయితే మూడు నెలల పింఛన్ రూ.3 వేలు ఇవ్వకుండా రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు. గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వలేదో అడగలేదా..? నూరి : అడిగితే మళ్లీ ఇస్తామంటూ పంపించేశారు. గురునాథ్‌రెడ్డి: అమ్మా పింఛను ఇస్తున్నారా..? ఉసేన్‌బీ: లేదయ్యా..? పింఛను కోసం ఎన్ని సార్లు అర్జీ ఇచ్చినా ఎవరూ ఇయ్యలేదు. గురునాథ్‌రెడ్డి: మీ వాళ్లు ఎవరూ లేరా..? ఉసేన్‌బీ : మా ఇంటాయన చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు. నా కూతురు దోసెలు వేస్తుంది. ఆమె దగ్గరే ఉంటున్నారు. పింఛను వచ్చేలా చూడయ్యా. గురునాథ్‌రెడ్డి: అధికారులతో మాట్లాడి పింఛను వచ్చేలా చూస్తానమ్మ. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా.. మీ కాలనీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? రసూలా : సార్ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాలువలు తీసేవాళ్లు రారు. నీళ్లు సరిగ్గారావు. గురునాథ్‌రెడ్డి: రేషన్ బాగా ఇస్తున్నారా..? రసూనా : ఎక్కడిస్తున్నారు సార్. మా నాన్న కార్డులో నా పేరు ఉండేది. నాకు పెళ్లయ్యిందని ఆ కార్డులో పేరు తీసేసి రేషన్ ఇవ్వడం లేదు. మా ఆయన కార్డులో నా పేరు చేర్చాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పని జరగలేదు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ నీరసంగా ఉన్నావు? ఖాజాబీ : అయ్యా ఆరోగ్యం సరిగ్గా లేదు. గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్నాను. గురునాథ్‌రెడ్డి: ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయించుకోలేదా..? ఖాజాబీ: లేదయ్యా చేయించుకోలేదు. గురునాథ్‌రెడ్డి: నీకు పింఛను ఇస్తున్నారా..? ఖాజాబీ: పింఛను రావడం లేదు. అర్జీలు ఇచ్చి తిరుగుతున్నాను. అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నారు. తిరిగితిరిగి ఆయసం వస్తోంది తప్పా పింఛను రాలేదు. గురునాథ్‌రెడ్డి: ఏం తల్లి బాగున్నావా..? నీ పేరేమిటి..? ముసలమ్మ: అయ్యా నాపేరు నారమ్మ. నాకు ఆరు మంది పిల్లలు. అందరూ వేరుపోయారు. నా భర్త చనిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. గురునాథ్‌రెడ్డి: పింఛను, రేషన్ వస్తోందా..? నారమ్మ : మూడు నెలల నుంచి పింఛను ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడలేదంటూ పంపించేశారు. రేషన్‌కూడా తక్కువ ఇస్తున్నారు. గురునాథ్‌రెడ్డి: అమ్మా నీ పేరేమి..? ప్రభుత్వం సాయం అందుతోందా..? మహిళ : సార్ నా పేరు హుసేన్‌బీ. నా భర్త చనిపోయాడు. పింఛన్ రూ.200 ఇచ్చేప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వడం లేదు..? హుసేన్‌బీ: అదేమి చెప్పడం లేదు. రూ.200 ఇచ్చినప్పుడే బాగుండేది. చానా ఇబ్బంది పడుతున్నాము. గురునాథ్‌రెడ్డి:అమ్మా నీ పేరు ఏమిటి..? మహిళ : కైరున్‌బీ సార్. గురునాథ్‌రెడ్డి: కుటుంబం బాగా జరుగుతోందా..? కైరున్‌బీ : ఏమి జరుగుతుందిలే సారు. చెప్పుకుంటే అన్ని కష్టాలే. వైఎస్ఆర్ ఉన్నప్పుడే బాగుండేది. గురునాథ్‌రెడ్డి: ఇప్పుడేం సమస్యలున్నాయి..? కైరున్‌బీ: కరెంటు బిల్లు ఎక్కువ. రేషన్ తక్కువ ఇస్తారు. 16 కేజీలు బియ్యానికి 12 కేజీలే ఇస్తారు. సంసారం ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు. గురునాథ్‌రెడ్డి : అక్కా బాగున్నావా? నీ పేరేమిటి? మహిళ: అయ్యా నాపేరు పెద్దక్క. ఏం బాగులే సారు. అన్ని సమస్యలే. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా ఏమి ఇబ్బందులున్నాయి..? పెద్దక్క: అయ్యా నా మొగుడు పోయి చాన్నాళ్లయ్యింది. వితంతు పింఛను ఇయ్యండని తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. గురునాథ్‌రెడ్డి: అధికారులతో మాట్లాడి వచ్చేలా చూస్తాను. రాజమ్మ కాలనీ నుంచి రాణీనగర్‌కు చేరుకున్న గురునాథ్‌రెడ్డి వద్దకు అక్కడి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎకరవు పెట్టారు. గురునాథ్‌రెడ్డి: ఏమ్మా మీ కాలనీలో సమస్యలన్నాయా? పింఛను అందరికి వస్తోందా..? స్థానికులు : కాలువలు సరిగ్గా తీయడం లేదు.స్టోరు మూడు రోజులే ఇస్తారు. పింఛను ఇవ్వడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దాయనా..దిగాలుగా ఉన్నావ్? వృద్ధుడు : కదల్లేని ముసలాడినయ్యా.. (వీరప్ప) అయినా నాకు పింఛను ఇవ్వడం లేదు. గురునాథ్‌రెడ్డి: ఏమన్నా బాగున్నావా..? నీ పేరేమిటి..? ఏంచేస్తుంటావు. కాలనీ వాసి : సార్ నా పేరు సంజీవయ్య. నాకు పొలం కూడా ఉంది. వ్యవసాయం చేసుకుంటాను గురునాథ్‌రెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల న్యాయం జరిగిందా...? సంజీవయ్య : ఎక్కడి రుణమాఫీ సార్. ఆయన చెప్పిన దానికి.. చేసిన దానికి పొంతనే లేదు. రుణమాఫీ అంతా కాగితాలు, కంప్యూటర్లకే పరిమితమైంది. బ్యాంకుకు వెళితే స్పందన లేదు. గురునాథ్‌రెడ్డి: రుణమాఫీ చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చాడు కదా..? సంజీవయ్య: చంద్రబాబు చెప్పిందేదీ చేయడు. ఇంతకు ముందు చూసాము. ఆయన పాలనలో వానలు రావు. కరువుతో అల్లాడాల్సిందే. ఇప్పుడే అదే కనిపిస్తోంది. ఎనిమిది నెలలైనా రుణ మాఫీ చేయలేదు. ఉత్త పేపర్లు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. గురునాథ్‌రెడ్డి: అన్నా నీ పేరేమిటి. నువ్వూ వ్యవసాయం చేస్తావా..? కాలనీ వాసి: సార్ నా పేరు శివమూర్తి. మంగళషాపు నడుపుకుంటున్నా. పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటాను. గురునాథ్‌రెడ్డి: రుణం ఎంత తీసుకున్నావు. మాఫీ అయ్యిందా..? శివమూర్తి : రుణం రూ.40 వేలు తీసుకున్నాను. మాఫీ చేశామంటున్నారు. చేతికిచ్చింది లేదు. బ్యాంక్‌కు వెళితే మాకు ఏమీ రాలేదని చెప్పి పంపుతున్నారు. అయితుందో కాదో తెలియదు. ఆ తర్వాత రాణీనగర్ నుంచి వచ్చిన గురునాథ్‌రెడ్డి.. పాతూరు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న హామాలీలను పలకరించారు గురునాథ్‌రెడ్డి: ఏమన్నా హమాలీల పరిస్థితి ఎలా ఉంది..? వెంకటేశ్: సార్ బతుకు భారమయ్యింది. మా గురించి పట్టించుకునేవారులేరు. ఇల్లు లేదు. మాకు గుర్తింపులేదు. ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. పిల్లల్ని చదించుకోవడం కష్టంగా ఉంది. గురునాథ్‌రెడ్డి: పిల్లలు ఏమి చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కదా..? వెంకటేశ్: మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక సారి తీసుకున్నాను. ఇప్పుడు రావడం లేదు. గురునాథ్‌రెడ్డి: హమాలీలకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా అధికారులతో మాట్లాడతాను. పిల్లల్ని బాగా చదివించుకోండి. వైఎస్ఆర్ ఆశయం కూడా అదే. పేదలకు మంచి చదువులు అందించాలనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. గురునాథ్‌రెడ్డి: బాబు నీపేరేమిటి. ఏం చేస్తున్నావు? వ్యాపారి : సార్ నా పేరు గౌస్‌మోహిద్ధీన్. నేను కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాను. గురునాథ్‌రెడ్డి: ఎలా ఉంది వ్యాపారం. సమస్యలు ఏమైనా ఉన్నాయా..? గౌస్‌మోహిద్దీన్: ఏం వ్యాపారంలే సార్. చదువుకున్న వారు రోడ్ల మీదపడ్డారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రుణమాఫీ అంటూ రైతులకు చేయలేదు. పింఛను వెయ్యి ఇస్తానంటూ సగం మందికి లేకుండా చేశాడు. -
ఎర్రజెండానే ప్రజలకు అండ..
ఆదిలాబాద్ రిమ్స్ : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్రజెండానే ప్రజలకు అండ అని సీపీఎం రాష్ట్ర నాయకుడు సాయిబాబు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో సీపీఎం డివిజన్ మహాసభలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలిచింది సీపీఎం అని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటాలు మొదలుకొని ఇప్పటి వరకు పేద ప్రజల ఇళ్ల కోసం, ఉద్యోగుల, కార్మికుల, రైతుల సమస్యలపై ఉద్యమిస్తూ వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమాన్ని మరిచి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతోందన్నారు. ఎన్నిల ప్రచారంలో పెట్టుబడిదారుల సొమ్ముతో దేశమంత తిరిగిన నరేంద్రమోడి.. ఇప్పుడు ప్రధానిగా కూడా దేశవిదేశాలు తిరుగుతున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కుదించి పేద ప్రజల పొట్టకొటేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ విగ్రహాల పక్కన గాడ్సే విగ్రహాలు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి గత ప్రభుత్వాల దోరణినే బీజేపీ అవలంబిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లు రైతుల రుణాల ఉంటే ఇప్పటి వరకు కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి రాక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులను గుర్తించడంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని పేర్కొన్నారు. దళితులకు భూపంపిణీ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 18 లక్ష ఎకరాలు అసరముంటే.. ఇప్పటి వరకు 15 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసిందన్నారు. ఆసరా పేరుతో అర్హులైన లబ్ధిదారులకు కూడా పింఛన్ అందకుండాపోయిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, సౌకర్యాలు కల్పించిన తర్వాతే వన్‌ఫుల్ భోజనం పెట్టాలన్నారు. మార్చి 1న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు పెద్దఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, లంక రాఘవులు, జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, నాయకులు డి.మల్లేష్, పోశెట్లి, అశోక్, రాములు, చంద్రకళ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చర్చకొస్తాయా !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. మన ఎమ్మెల్యేల్లో కొందరు ఇటీవల అసెంబ్లీలో గళం విప్పారు. నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలను ప్రస్తావించారు. ఇప్పుడు జిల్లా వంతు వచ్చింది. కీలకమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, కష్టాలపై ఈ సమావేశాల్లో చర్చించి, పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక, ఎజెండాలో పేర్కొ న్న అంశాలన్నీ జెడ్పీ సమావేశంలో చర్చకు రావడం లేదు. ముఖ్యంగా చివరిలో ఉన్న అంశాల గల శాఖలపై కనీస చర్చ జరగ డం లేదు. నాలుగైదు అంశాలపై చర్చించి, సాగదీతతో మమ అన్పించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమావేశంలోనైనా గతంలో చర్చకు రాని అంశాలను ముందుకు తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ,ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న పరిస్థితులివి... తుపాను సాయంలో రాజకీయం హుద్‌హుద్ తుపాను వెలిశాక జిల్లాకొచ్చిన సీఎం తొలిసారిగా భోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటానని, ఇళ్లు కోల్పోయిన వారందరికీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా అధునాతన ఇళ్లు నిర్మిస్తానని ప్రకటించారు. దీంతో గ్రామస్తులు సంతోషించారు. ముఖ్యమంత్రి ఆదుకుంటారని భావించారు. కానీ అవేవీ ఆచరణకు నోచుకోలేదు. కనీసం ప్రకటించిన పరిహారం కూడా అందరికీ అందలేదు. టీడీపీ వాళ్లకే దాదాపు సాయం అందించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో సుమారు 80 ఇళ్లు దెబ్బతినగా కేవలం 20 ఇళ్లకు పరిహారం అందించారు. మిగతా వారిని గాలికొదిలేశారు. నీలాపు బంగారమ్మ, నీలాపు రాములప్పయ్యమ్మ, బొట్టు సూరమ్మ, దల్లి కనకం, శీల ముత్యమ్మ, దల్లి సత్తెమ్మ, శీల సత్తెమ్మ,పిట్ట సూరమ్మ, పిట్ట కనకం, నీలాపు సూరప్పయ్యమ్మ, నీలాపు ఆదమ్మ...ఇలా 60 మంది వరకు ఇళ్లు కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి కృష్ణారావు తన మూడెకరాల పొలంలో అరటి సాగు చేయగా, హుద్‌హుద్ తుపానుకు ఆ తోట పూర్తిగా ధ్వంసమయింది. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు సైతం ఫొటోలు తీసి నష్టాన్ని రికార్డు చేశారు. కానీ పరిహారం జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. పరిహారం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ రైతు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. బలిజిపేట మండలం గౌరీపురం గ్రామంలో తుపానుకు 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిహారం 23 ఎకరాలకే మంజూరయింది. దీంతో పాడైన వరి పంటను తగలబెట్టి నిరసన తెలియజేశారు. గంట్యాడ మండలం మధుపాడలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. కానీ సర్పంచ్ వర్గీయులకే పరిహారం మంజూరైంది. దీంతో మిగతా రైతులకు అనుమానం వచ్చింది. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కారణాలతో సర్పంచ్ బొడ్డకాయల శ్రీనివాసనాయుడు ఇంట్లో కూర్చుని తెలుగుదేశం కార్యకర్తలకే పరిహారం అందేలా జాబితాను మార్చారని, అర్హులైన దాదాపు పది మంది పేర్లు గల్లంతయ్యాయని, రెండు నుంచి మూడెకరాల్లో అరటి పంటను నష్టపోయిన వారి పేర్లను మార్చి, పంటనష్టాల్లేని సర్పంచ్ బంధువులు, వర్గీయులకు మాత్రం పరిహారాన్ని మంజూరు చేశారని బాధితులు రోడ్డెక్కుతున్నారు. ఊర్లో లేని వారిపేరున, ప్రభుత్వ ఉద్యోగుల పేరున కూడా పరిహారం తీసుకున్నారని కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇలా జిల్లాలో ఎక్కడా చూసినా పరిహారం మంజూరు విషయంలో వివక్ష చూపారని స్పష్టమవుతోంది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి అనుచరులకే పరిహారంలో పెద్ద పీట వేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మత్స్యకారులకు, పశువులను కోల్పోయిన వారికీ ఇంతరకు పరిహారమే మంజూరు కాలేదు. హుద్‌హుద్ తుపాను వల్ల జిల్లాలో 1,552 మంది మత్స్యకారులు నష్టపోయారు. సుమారు రూ.కోటీ 55 లక్షల మేర నష్టం వాటిల్లింది. జిల్లాలో పెద్ద ఎత్తున పశువులు చనిపోయాయి. సుమారు 938 మంది బాధితులయ్యారు. రూ.4.31కోట్లు నష్టం జరిగినట్టు గుర్తించారు. ఇంతవరకు ఆ పరిహారం మంజూరు కాలేదు. ఇక, వ్యవసాయ నష్టం అంచనా విషయానికి వస్తే 50 శాతం పైబడి నష్టం వాటిల్లిన వారినే గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలో 19,689 మంది బాధితులకు రూ.6.83కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దాంట్లో ఇంతవరకు 18,477మందికి రూ.6.17కోట్ల వరకు పంపిణీ చేశారు. మిగతా పరిహారాన్ని పంపిణీ చేసేందుకు మీనమీషాలు లెక్కిస్తున్నారు. ఉద్యానవన పంటల విషయానికొస్తే జిల్లాలో 31,431మంది రైతులను బాధితులుగా గుర్తించి రూ.31.19కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, ఇంతవరకు 3,689మంది రైతులకు గాను రూ.23.54కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అధికార పార్టీ నేతలు వేలు పెడుతున్నారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై రైతుల వద్ద కొనుగోలు చేసి ఆ ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. రైతు పేరుతో విక్రయిస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను దోచేస్తున్నారు. కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం కూడా అధికార పార్టీ నేతలకు చెందిన మిల్లర్లకే వెళ్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయిస్తున్న మిల్లుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఊగిసలాటలో గిరిజన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు విశాఖ జిల్లా సబ్బవరంలో పెడతారని విశాఖ మంత్రులు చెబుతున్నారు. అదేమీ కాదంటూ జిల్లా నేతలు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు . నెల్లిమర్ల, బొండపల్లి, కొత్తవలసలలో ఏదొక చోట ఏర్పాటు చేస్తారని చెప్పుకొస్తున్నారు. కానీ అధికారికంగా ఇంతవరకు స్పష్టత రాలేదు. భారీ మంచినీటి పథకాల నిర్వహణకు టెండర్లు పిలవరా? జిల్లాలో రూ.10 లక్షలకు పైబడి నిర్వహణ వ్యయం ఉన్న భారీ మంచినీటి పథకాలకు టెండర్లు పిలిచి,కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉండగా ఒత్తిళ్లతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దాదాపు 19 పథకాలు నామినేటేడ్‌గా నడిపించేసి కాలం గడిపేస్తున్నారు. వీటి ద్వారా అధికార పార్టీ అండ ఉన్న వారు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. -
కలత వద్దు
పాలక మండలి లేని లోటు కనిపించనివ్వం ప్రజల్లో నమ్మకం కలిగిస్తాం కింది స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలి ఇక రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫిర్యాదుల స్వీకరణ జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్ వెల్లడి సిటీబ్యూరో:‘పాలకమండలి లేదని కలత చెందవద్దు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. అదే మా తొలి ప్రాధాన్యం. మాపై నమ్మకం కలిగేలా పనిచేస్తాం.కింది స్థాయి అధికారులు కూడా అదే విధంగా స్పందించాలి’ అని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్ అన్నారు. నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి గంట సేపు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ తరఫున చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన గురువారం విలేకరులకు వివరించారు. అవేంటంటే... జవాబుదారీతనం.. ప్రతి సోమవారం ‘ప్రజావాణి’లో అందే ఫిర్యాదులతో పాటు ప్రజలు ఏ రూపంలో తమ ఇబ్బందులు తెలియజేసినా పరిష్కరించేందుకు అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి. జవాబుదారీతనం ఉండాలి.ఫిర్యాదులు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసినా... కాల్‌సెంటర్(040-21 11 11 11)కు తెలిపినా... నేరుగా వినతిపత్రం అందజేసినా సర్కిల్ స్థాయిలోనే పరిష్కారానికి చర్యలు చేపడతాం. ప్రతి ఫిర్యాదునూ నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరిస్తాం. రహదారి భద్రత.. దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు ఆ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, సీఆర్డీపీ, తదితర పథకాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. రోడ్ల కారణంగా ఎవరికీ ప్రమాదం జరుగకుండా చర్యలు చేపడతాం. నాలాల ఆధునికీకరణ ఇప్పటికే మొదలైన నాలాల ఆధునీకరణ పనులను వీలైనన్ని ప్రాంతాల్లో త్వరితంగా పూర్తి చేస్తాం. నాలాల భూముల్లో ఆక్రమణల తొలగింపుతో పాటు పనులు త్వరితంగా జరిగేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. పారిశుద్ధ్యం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం. జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో సర్వే జరిపి.. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటుతాం. ప్రభుత్వ సంస్థల్లోనూ మొక్కలు నాటేలా చర్యలు చేపడతాం. మరుగుదొడ్లు ప్రధాన మార్గాల్లో పురుషుల కోసం వెయ్యి యూరినల్స్తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహిళల కోసం వంద ‘షీ టాయ్‌లెట్స్’ నిర్మిస్తాం. వీటితో పాటు బాలికలు ఉన్న వంద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు చర్యలు. ఇంకా ఏంటంటే... వెయ్యి ఎఫ్‌ఓబీలు, మరో 50 కేంద్రాల ద్వారా రూ. 5కే భోజనం, 36 శ్మశానవాటికల అభివృద్ధి, 36 చెరువుల సుందరీకరణను తొలిదశలో అమలు చేస్తామన్నారు. వారం రోజుల్లోగా ఆర్ అండ్ బీ రహదారులు జీహెచ్ఎంసీ అజమాయిషీలోకి రానున్నాయని తెలిపారు. తమ పరిధిలోకి రాగానే ప్రధాన మార్గాల్లోని పనులు చేపడతామన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ వేలు ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ భూసేకరణ, ఉన్న సదుపాయాలకు ఆటంకాల్లేకుండా ఈ మార్గాలను అభివృద్ధిపరచేందుకు అనువైన విధానాల కోసం కన్సల్టెంట్ల అధ్యయన నివేదికలు ఆహ్వానిస్తామన్నారు. నగరమంతా ఎల్ఈడీలు నగరంలోని అన్ని మార్గాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. స్టాండింగ్ కమిటీ ఉన్నప్పుడు దీనిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ అధికారాలు కూడా రావడంతో స్పెషల్ ఆఫీసర్‌గా ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు సోమేశ్‌కుమార్ సిద్ధమయ్యారు. ఈ పనులు మొదలయ్యాయన్నారు. బాధ్యతల వికేంద్రీకరణ పనులు త్వరితగతినపూర్తి చేసేందుకు ఒక్కో అధికారికి ఐదారు అంశాలకు సంబంధించిన బాధ్యత లుఅప్పగించనున్నట్లు తెలిపారు. తన బాధ్యత మరింత పెరిగిందని, దీన్ని సమర్థంగా నిర్వహించడం పెద్ద సవాలేనని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారంతో అందరినీ కలుపుకొని సమర్థంగా విధులు నిర్వహిస్తానని సోమేశ్‌కుమార్ చెప్పారు. -
తొలి అడుగే ధీమాగా
‘‘ఇంతియని చింతించవలదు... ఘనములెన్నియో చేసి చూపింతుము’’ అన్న ఓ కవి వాక్కులను వారు నిజం చేశారు. పాలనలో తొలి అడుగే అయినా ధీమాగా వేశారు. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, అటు ఆఫీసు పనులను చక్కబెట్టారు. తమ మీద నమ్మకముంచి అందలమెక్కించిన జనం సమస్యల పరిష్కారంలోనూ ముందుంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు అవుతోంది. తొలిసారిగా ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను అధిరోహించిన పలువురు మహిళా నేతలు ఈ ఆరు నెలల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వేలమైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు కాస్త తడబడినా.. ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోగలిగితే ఇక ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా ఎదురుండదు. అందులోనూ ఆడవాళ్లు ఒక్కసారి తమ మనసును లగ్నం చేస్తే ఏపనినైనా విజయవంతం చేసేదాకా వదలరు. ఆరునెలల కిందటి దాకా వంటింటికే పరిమితమై.. ఇంటి బాధ్యతలను పంచుకున్నారు వీరంతా. కనీసం పక్క ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక మండలాఫీసు, జిల్లా పరిషత్తు అంటే.. అవేంటి, ఎక్కడుంటాయి అనేవారు. కానీ ఇప్పుడు.. ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా గెలుపొందారు. తమ మండలంలో ఏ ఊరిలో ఏ సమస్య ఉంది.. దాని పరిష్కారానికి ఏం చేయాలి.. ఏ అధికారి ఏం పనిచేస్తాడు.. ఇలా అన్ని విషయాలపై పట్టు సాధించారు. ఆడవాళ్లు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎంపీపీలు, జడ్పీటీసీలుగా దాదాపు ఆరునెలల పదవీకాలం పూర్తిచేసుకున్న పలువురు మహిళా ప్రజాప్రతినిధుల ‘వాయిస్’ ఇది... ప్రజాసమస్యలపై అవగాహన నాగిరెడ్డిపేట : ఎంపీపీ పదవి చేపట్టి ఆరునెలలవుతోంది. ఇప్పటిదాకా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనవచ్చింది. ప్రజాప్రతినిధుల, అధికారుల విధులు, బాధ్యతలు తెలుసుకున్నాను. అంతకుముందు ఇంటికే పరిమితమైన నాకు కొత్తలో కొంత కష్టమైంది. రిజర్వేషన్ కారణంగా ఎంపీపీనైన నాకు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి సహకరిస్తున్నారు. మండలంలో పలు సమస్యల పరిష్కారానిక ప్రతిపాదనలు చేశాం. నిధుల వస్తే అభివృద్ధి పనులను చేపడతాను. -ఊశమ్మ, ఎంపీపీ, నాగిరెడ్డిపేట కొత్త విషయాలు తెలుసుకోవడం.. సదాశివనగర్ : మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త విషయాలను నేర్చుకున్నా. రాజకీయ అనుభవం కూడా వచ్చింది. ప్రజలు, అధికారులతో పరిచయాలు పెరిగాయి. ప్రతీ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తున్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఉద్దేశం. - బంజ విజయ, ఎంపీపీ, సదాశివనగర్ -
ఆఫర్..ఆకర్ష్
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వినూత్న పంథాను అనుసరిస్తోంది. తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా అని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలో ‘నామ’మాత్రం అవుతున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు ఈ కొత్త పాలసీని ఎంచుకుంది. ప్రజా సమస్యలు, వారి తరఫున పోరాటాలు, పరిష్కారాల జోలికి వెళ్తే ఎక్కడ భంగపడాల్సి వస్తుందోనని ఆ పార్టీ ఈ విధానాన్ని అనుసరిస్తోందని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ప్రతి క్రియాశీల కార్యకర్తకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా అని ఏకంగా కరపత్రాలే పంచుతోంది. టార్గెట్ పూర్తి చే సేందుకు పడరాని పాట్లు జిల్లాలో ఈనెల 1వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో శిక్షణ తీసుకున్న యువకులతో ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును పార్టీ వెబ్సైట్లో నిక్షిప్తం చేయిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సభ్యత్వ నమోదుకు పార్టీ పెద్దలు పలు ఆఫర్లు ప్రకటించారు. ప్రజలను ఆకర్షించేందుకు సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా (ఇన్సూరెన్స్), ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా 100 శాతం బీమా, ఇలా రకరకాలుగా బీమా ఆఫర్లు పెట్టి సభ్యత్వ నమోదుకు జిల్లా పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రాయితీలు ఇవ్వడానికి ఇటు హైదరాబాద్, అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు నెట్వర్క్ ఆస్పత్రులను సూచించారు. ఆఫర్లతో కూడిన కరపత్రాలతో ప్రచారం చేస్తూ.. సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ఓట్లు వేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే మొహం చాటేసే నేతలు.. ‘సభ్యత్వం తీసుకుంటే ఇవన్ని కల్పిస్తారా’..? ఇదంతా వట్టి ప్రచారమే అని పలువురు తిప్పికొడుతున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను నమ్మిని కొందరు మాత్రం టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఆఫర్ ప్రకటించినా ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడంతో టార్గెట్ ఎలా పూర్తవుతుందోనని ఆయా నియోజకవర్గాల నేతలు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో పట్టుకోసం.. తెలుగుదేశం పార్టీ జిల్లాలో పూర్వ వైభవాన్ని కోల్పోయింది. అప్పటి పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, మరో నేత నామా నాగేశ్వరరావుల మధ్య వైరం తారాస్థాయికి చేరి.. తుమ్మల పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయన వెంటే అధిక సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నడిచారు. గతంతో తెలంగాణలోనే జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం ఈ పరిణామాలతో పట్టుకోల్పోయిందని చెప్పవచ్చు. పార్టీ తరఫున ఒకే ఎమ్మెల్యే గెలవడం, జడ్పీ చైర్పర్సన్ పదవి కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడంతో గ్రామస్థాయిలో టీడీపీ పట్టు తప్పింది. పార్టీ అధిష్టానం పెట్టిన బీమా ఆఫర్లతో సభ్యత్వ నమోదుకు దిగినా.. జిల్లాలో మాత్రం ఆపార్టీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేక పోతోంది. సభ్యత్వ నమోదు వరకే ప్రమాద బీమా అంటారని, ఆ తర్వాత తాము ఎవరో నాయకులు గుర్తు కూడా పట్టరని.. ప్రజలు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పలు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైనా.. నత్తనడకనే కొనసాగుతోంది. ప్రమాద బీమా ఆఫర్లపైన ఆపార్టీలోనూ చర్చసాగుతోంది. పార్టీలోని కొంతమంది నేతలు పైకి ఇది మంచి కార్యక్రమం అంటున్నా..ప్రజల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కొన్ని మండలాల్లో దీనిపై ప్రచారం చేయడానికి వెనకాడుతున్నారు. మభ్య పెట్టడమే.. ప్రజా ఉద్యమాలు, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు వెళ్తున్న పార్టీలకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఇలా ఆయా పార్టీలకు ఆకర్షితులవుతున్న వారే సభ్యత్వం నమోదు చేసుకుంటారు. కానీ టీడీపీ బీమా ఆఫర్ ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టడమే అని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. గతంలో సభ్యత్వ నమోదు కోసం ఎలాంటి ఆఫర్లు పెట్టలేదని, ఇలా చేయడం ఆ పార్టీ నైతికతను దెబ్బతీసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్‌ను విస్తృతం చేసుకోవడానికి, నష్టాలను పూడ్చుకోవడానికి మాత్రమే కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయని..టీడీపీ ప్రకటించిన ఈ బీమా ఆఫర్ ఆ పార్టీ హీనస్థితికి నిదర్శనమని పేర్కొంటున్నారు.