రైతు పక్షపాతి వైఎస్ జగన్
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆమె నందిగామలోని ఐతవరం, అడవిరావులపాలెం, తక్కెళ్లపాడు, లింగాలపాడు, రాఘవపురం, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో గురువారం ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మెహన్‌రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తారని, ప్రకృతి విపత్తుల్లో దెబ్బతిన్న పంట లను కొనుగోలుచేసేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కౌలు రైతులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహా నేత వైఎస్సార్ హయాంలో సాగర్ కుడి, ఎడమ కాలువలకు సకాలంలో సాగునీరు అంది మెట్టపంటలకు ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు.
నాలుగేళ్లుగా సాగర్ కాలువలకు నీరు విడుదలకాక పశ్చిమకృష్ణాలోని ఎత్తిపోతల పథకాలు మూలనపడి తిరువూరు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తది తర ప్రాంతాల్లో పంటలు పండక రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు పగటి సమయంలోనే ఏడు గంటల నిరంత విద్యుత్ సరఫరా, డ్వాక్రా రుణాలను రద్దుకు జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడివున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే లంక గ్రామాల్లోని లింకురోడ్లను అభివృద్ధిచేసి, రైతులు తమ పంటలను ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించేందుకు వీలుకల్పిస్తామన్నారు.
కోనేరు రాజేంద్రప్రసాద్‌మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాజధానిగా విజయవాడకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామాల్లో బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కె.వి.ఆర్.విద్యాసాగర్, వసంతనాగేశ్వరరావు, తిరువూరు, పామర్రు, నియోజకవర్గాల సమన్వయకర్తలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఉప్పులేటి కల్పనతోపాటు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, తాతినేని పద్మావతి తదితరులు భారీ ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
నందిగామ మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గురువారం పర్యటించారు. ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరే విధంగా, పేద కుటుం బాల్లోని పిల్లలు విద్యావంతులు కావడానికి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రకటించారన్నారు. ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి కోవెలమూడి ప్రమీలారాణి, కొమ్మినేని నాగేశ్వరరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్థి దిడ్లప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు గుడివాక శివరాం, యాసం చిట్టిబాబు, సింహాద్రి రమేష్‌బాబు బందలాయి చెరువులో ప్రచారం చేశారు.
కొండపల్లిలో జోగి రమేష్ ప్రచారం
మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఇబ్రహీం పట్నం జెడ్పీటీసీ అభ్యర్థి వి.నాగమణితో కలిసి విసృ్తతంగా ప్రచారంచేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, మొవ్వ జెడ్పీటీసీ అభ్యర్థి చిమటా విజయశాంతి, ఎంపీటీసీ అభ్యర్థులు పెడసనగల్లు, బార్లపూడి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో ప్రచారంచేశారు.