Tatineni padmavathi
-
మహిళా పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి/పెనమలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని, నామినేటెడ్ పదవులతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతానికి మించి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి కొనియాడారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళలంతా ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్పర్సన్, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్‌గాను నియమితులైన ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనమలూరులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా కార్మికుల బాధలు తీర్చేందుకు చొరవ తీసుకున్నారన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయడానికి, ఆర్టీసీ స్థలాల్లో వాణిజ్య, వ్యాపార నిర్వహణ ద్వారా ఆదాయం పెంపునకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఆదుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ టి.కల్పలత, ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ చిన్నపరెడ్డి విజయానందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణానికి అధికారుల హామీ
వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని తోట్లవల్లూరు : తోట్లవల్లూరు-పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి అధికారులు హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తెలియజేశారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వంతెన నిర్మాణ ఆవశ్యకత గురించి ఇరిగేషన్ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన వంతెన నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు వచ్చాయని చెప్పారన్నారు. రూ.14 కోట్లకుపైగా వ్యయంతో మరో మూడు నెలల్లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారని పద్మావతి తెలిపారు. వంతెన నిర్మాణంతో లంక గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు. -
నట్టేట ముంచిన చంద్రబాబు
రుణమాఫీ పేరుతో వంచన అధికారం కోసమే దొంగ హామీలు అమలు చేయాల్సిందే జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి తోట్లవల్లూరు : రుణమాఫీ పేరుతో సీఎం నారా చంద్రబాబునాయుడు రైతులను, మహిళలను నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రుణమాఫీ ఓ పెద్దడ్రామాలా కనబడుతుందన్నారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్కు కూడా ససేమిరా అంటుంటే టీడీపీ నేతలు మాత్రం రీషెడ్యూల్ అని ఒకరోజు, మాఫీ చేస్తామంటూ మరొక రోజు అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనివార్యమని, కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉంటుందని తెలిసి కూడా అధికారమే పరమావధిగా బాబు ఎన్నికల్లో రుణమాఫీ హామీలను ఇచ్చారన్నారు. మోడీతో నిధులు రాబట్టుకుందామనుకున్న బాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా రైతులను రుణాలే చెల్లించేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని, అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారో వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. రైతులు రుణాలు చెల్లించే పరిస్థితి ఉంటే రుణమాఫీ కోసం ఎందుకు ఎదురుచూస్తారని పద్మావతి మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ సాధ్యం కాదనే ద్దేశంతోనే జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో సరిపోయేదని, ఇప్పుడు బ్యాంకులు 13 శాతం వడ్డీని వసూలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. త్వరలోనే రైతులు, డ్వాక్రా మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని పద్మావతి చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి రైతుల్ని, మహిళల్ని రుణవిముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్.కోటేశ్వరావు, సోలే నాగరాజు పాల్గొన్నారు. -
నేడు మలివిడత పరిషత్ పోరు
నేడు గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల ఎన్నికలు 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థుల పోటీ 354 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 919 మంది అభ్యర్థులు వైఎస్సార్ సీపీ, టీడీపీ ముఖాముఖి పోరు సాక్షి, మచిలీపట్నం : ప్రాదేశిక పోరు తుది అంకం నేటితో ముగియనుంది. మలిదశ పోరు హోరాహోరీగా శుక్రవారం జరగనుంది. జిల్లాలోని గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లలోని 23 మండలాల్లో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న జిల్లాలోని 26 మండలాల్లో పరిషత్ పోరు తొలిదశ ఎన్నికలు పూర్తఅయిన సంగతి తెల్సిందే. వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతి పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు జెడ్పీటీసీగా పోటీ చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి గద్దే అనురాధ గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తాతినేని పద్మావతి పోటీ చేసిన తొట్లవల్లూరు మండలం ఎన్నికలు పూర్తవగా మలివిడత పోరులో గద్దే అనురాధ పోటీ చేస్తున్న ఉంగుటూరు మండలం ఎన్నికలు జరగనున్నారుు. వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి రెండు విడతల్లోనూ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. మలి విడత పోరులో పట్టు సాధించేందుకు వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. జిల్లాలో మలి విడత పోరులో గుడివాడ, నూజివీడు డివిజన్లలో 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 363 ఎంపీటీసీ స్థానాలకు 9 ఏకగ్రీవమవగా 354 ఎంపీటీసీ స్థానాలకు 919 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 1,230 పోలింగ్ కేంద్రాల్లో 9,36,252 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నూజివీడు డివిజన్లో ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు, నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు, విస్సన్నపేట, ఉయ్యూరు మండలాల్లో మలి విడత పోరు జరగనుంది. నూజివీడు మండలంలో 14 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు ఏకగ్రీవం కావడంతో 232 స్థానాలకు 610 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 765 పోలింగ్ కేంద్రాల్లో 5,93,55 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుడివాడ రెవెన్యూ డివిజన్లో గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది పోటీ పడుతున్నారు. 129 ఎంపీటీసీ స్థానాలకు ఏడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 122 ఎంపీటీసీ స్థానాల్లో 309 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 312 పోలింగ్ కేంద్రాల్లో 3,42,797 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త గొన్నూరుకు పోలింగ్ కేంద్రం గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు మండలం, చినగొన్నూరు పోలింగ్ బూత్ పరిధిలోని కొత్త గొన్నూరు ప్రాంతంలో నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికలు గతంలో కొత్తగొన్నూరులోనే జరిగేవి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి సమీపంలో ఉన్న పాత గొన్నూరుకు పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేశారు. నాలుగు వందల ఓటర్లు ఉన్న కొత్త గొన్నూరును కాదని, కేవలం వంద మంది ఓటర్లు ఉన్న పాత గొన్నూరులో పోలింగ్ కేంద్రం పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందిం చిన కలెక్టర్ గత అనవాయితీని కొనసాగిస్తూ యాథావిధిగా కొత్త గొన్నూరు ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా మార్పు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం విషయంలో వివాదం సద్దుమణిగింది. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గుడ్లవల్లేరు, ఉయ్యూరు, కలిదిండి మండలాల్లో ప్రచారం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే గుడివాడ రెవెన్యూ డివి జన్లలోని గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర, ఉయ్యూరు మండలం కాటూరు, కలిదిండి మండలం పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులతో కలిసి పద్మావతి బుధవారం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.100 మాత్రమే విద్యుత్ బిల్లు వసూలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు తప్పక అమలవుతాయని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అల్లూరి శిరీష, బి.శ్రీసంధ్య, ఉయ్యూరులో మండలంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ పడమట సురేష్‌బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లే శ్రీనివాసరావు, కలిదిండి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి మోకా లక్ష్మి పాల్గొన్నారు. కైకలూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మీగడ చంద్రావతి, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థిం చారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి మోతుకూరి స్వర్ణలక్ష్మి, మండవల్లి జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.నాంచారమ్మ, పార్టీ నాయకులు పలువురు ప్రచారం నిర్వహించారు. ఆగిరిపల్లిలో తోట చంద్రశేఖర్ ప్రచారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనరు తోట చంద్రశేఖర్ ఆగిరిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్‌అప్పారావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త రక్షణనిధి ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెం మండలంలో కోనేరు ప్రచారం మండలంలోని నాగులూరు, తాడిగూడెం, బూరుగగూడెం, రంగాపురం, రెడ్డిగూడెం, అన్నేరావుపేట, సీతారామపురం, మద్దులపర్వ, శ్రీరామపురం,ముచ్చనపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున పార్టీ విజ యవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోనేరు రాజేంద్రప్రసాద్ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పూర్తిస్థాయిలో అమలు చేశారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయగల సమర్థుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోనేరు, జోగి కోరారు. -
రైతులను ఆదుకుంటాం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే బాపులపాడు, పెదపారుపూడి మండలాల్లో ఆమె మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారని పేర్కొన్నారు. రైతుల కోసం రూ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామని ప్రటించారని గుర్తుచేశారు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు పంటలు కోల్పోతే ఆదుకునేందుకు, దెబ్బతిన్న పంటలను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఈ నిధి నుంచి ఖర్చుచేస్తామని వివరించారు. జిల్లాలో వ్యవసాయం పైనే అధికశాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు పక్కా ఇళ్ల మంజూరునే పాలకులు విస్మరించారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించేందుకు డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.700లకు పెంచుతామని జగన్మోహన్రెడ్డి ప్రకటించారని తెలిపారు. బాపులపాడు మండలంలోని రేమల్లె, మల్లవల్లి తదితర గ్రామాల్లో పార్టీ బాపులపాడు జెడ్పీటీసీ అభ్యర్థి కైలే జ్ఞానమణి, ఇతర నాయకులతో కలిసి ప్రచారం చేశారు. పెదపారుపూడి మండలంలోని పెదపారుపూడి, చినపారుపూడి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మూల్పూరి హరీష, గొరిపర్తి శ్రీలక్ష్మితో కలిసి పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. -
ఓటెత్తిన పల్లెలు 82.74 శాతం పోలింగ్
ముగిసిన తొలిదశ పరిషత్ ఎన్నికలు విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో పోలింగ్ నందిగామలో బ్యాలెట్ పేపర్లు తారుమారు మాజీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ హౌస్ అరెస్ట్ పెనమలూరులో ఓటేసిన తాతినేని పద్మావతి పరిషత్ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి.. తొలిదశలో విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరిగింది. జిల్లాలో పోలింగ్ శాతం 82.74గా నమోదైంది. మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే పల్లెల్లో ఓటర్లకు అరకొర సౌకర్యాలతోనే సరిపెట్టారు.. పలుచోట్ల కనీసం షామియానా టెంట్లు కూడా లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఓటింగ్ ఊపందుకుంది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని 26 జెడ్పీటీసీలు, 450 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం తొలిదశ ఎన్నికలు జరిగాయి. విజయవాడ డివిజన్లో 14, మచిలీపట్నంలో 12 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఎంపీటీసీలకు సంబంధించి విజయవాడ డివిజన్లో 293, మచిలీపట్నంలో 157 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఓటర్లకు సక్రమంగా ఓటర్ స్లిప్‌లు అందకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు ఆదేశాలతో నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్ స్లిప్‌లను అందించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తు నిర్వహించారు. టెంట్లు కూడా వేయలేదు... మున్సిపల్ ఎన్నికలను బాగా నిర్వహించిన అధికారులు పరిషత్ ఎన్నికల్లో సరైన ఏర్పాట్లు చేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బారికేడ్లు, మరుగుదొడ్లు, మంచినీరు సౌకర్యాలను కల్పించారు. కానీ పరిషత్ ఎన్నికల్లో ౄలా గ్రామాల్లో బారికేడ్ల మాటెలా ఉన్నా కనీసం టెంట్లు కూడా వేయలేదు. దీంతో మండే ఎండల్లో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం అర్తమూరులో టెంట్లు వేయకపోవడంతో ఎండ కారణంగా ముగ్గురు వృద్ధులు కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికంగా వారికి ప్రాథమిక చికిత్స చేయడంతో కోలుకున్నారు. చాలా మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం గోడలపై ఏర్పాటుచేసే డిస్ప్లే బోర్డుల్లో సైతం అభ్యర్థుల పేర్లతో పాటు గుర్తుల నమూనాలు వేయలేదు. గుర్తుల పేర్లు మాత్రం రాశారు. అది కూడా స్కెచ్ పెన్నులతో రాయడంతో ఓటర్లకు డిస్ప్లే బోర్డులు సరిగా అర్థంకాని పరిస్థితి నెలకొంది. వృద్ధుడిపై ఎస్సై ప్రతాపం... మచిలీపట్నం రూరల్ ఎస్సై అనిల్‌కుమార్ తాళ్లపాలెం జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఒక వృద్ధుడ్ని అకారణంగా కొట్టారు. దీంతో గ్రామస్తులు ధర్నాలకు దిగారు. ఎస్సై టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. మిగిలిన పోలీసులు, స్థానికులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం టీడీపీకి చెందిన సర్పంచ్ భర్తపై కొందరు దాడి చేసి గాయపర్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు సెగ్మెంట్-2లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోనే ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ అభ్యర్థి గొరిపర్తి రమణ సహా పలువురు కొద్దిసేపు ధర్నా చేశారు. మొవ్వ మండలం కూచిపూడి పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన జనాన్ని పోలీసులు హడావుడి చేసి వారిని చెదరగొట్టారు. బ్యాలెట్ పేపర్లు తారుమారు... నందిగామ మండలం మునగచర్లలో జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు మారిపోయాయి. వాటి బదులు వీరులపాడు మండలానికి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. 50 బ్యాలెట్ పేపర్లు చొప్పున ఉండే ఒక కట్టలో పది, మరో కట్టలో 41 చొప్పున నందిగామ మండల జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు కలిసి వచ్చాయి. వాటిని అధికారులు గుర్తించేసరికే 25 ఓట్లు పోలయ్యాయి. దీనిపై మండల రిటర్నింగ్ అధికారి మోహన్‌రావు నందిగామలోని వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థులను పిలిచి మాట్లాడారు. ఎట్టకేలకు గుర్తులపై పడిన ఓట్లను ఆమోదించేలా వారినుంచి అంగీకార పత్రాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కె.అగ్రహారం, రెడ్డినాయక తండా వద్ద టీడీపీ కార్యకర్తలు గుర్తును ప్రచారం చేయడంతో వివాదం నెలకొంది. చిల్లకల్లు సెగ్మెంట్-4లో ఉన్న తిరుమలగిరి, తొర్రకుంటపాలెం పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు గంటలకే పోలింగ్ పూర్తికావడం విశేషం. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హౌస్ అరెస్ట్ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారన్న విషయమై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం నెప్పల్లిలో ఓటర్లను ప్రభావితం చేసేలా రాజేంద్రప్రసాద్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వచ్చిన ఆయన కంకిపాడులోని బట్టలషాపులోకి వెళ్లి కూర్చోగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెనమలూరులో ఓటేసిన పద్మావతి... వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పెనమలూరు జెడ్పీ హైస్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ బందరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కేవీఆర్ విద్యాసాగర్ తన స్వగ్రామం కోసూరులో ఓటేశారు. మైలవరం నియోజకవర్గంలో గణపవరం ఎంపీటీసీ-2లో వైఎస్ సోదరి మామగారు, గణపవరం జమీందారు 92 ఏళ్ల బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్ మేనల్లుడు బొల్లారెడ్డి యువరాజురెడ్డి కూడా స్వగ్రామంలో ఓటేశారు. -
డ్వాక్రా రుణాలు మాఫీ
తోట్లవల్లూరు రోడ్‌షోలో తాతినేని పిల్లల చదువు కోసం అమ్మఒడి పథకం ముగిసిన మొదటి విడత ప్రచారం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జె డ్పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి చెప్పారు. తోట్లవల్లూరు మండలంలో శుక్రవారం ఆమె విసృ్తతంగా పర్యటించారు. ప్రచారానికి ఆఖరిరోజు కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధిక ధరల నేపథ్యంలో కుటుంబం గడవటమే కష్టంగా మారిందన్నారు. దీంతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక సతమతమవుతున్నారన్నారు. ఈ ఇబ్బంది నుంచి మహిళలను బయటపడవేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. 150 యూనిట్లు కరెంటు వాడినా రూ. 100 బిల్లు వసూలు చేసేలా చూస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారని, ఈ హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు. కృష్ణానది వెంబడి ఉన్న లంక గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తోట్లవల్లూరు మండలంలోని బద్రిరాజుపాలెం, దేవరపల్లి, గురివిందపల్లి, ఐలూరు, పాలంకిపాడు తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జొన్నల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలంలోని గరికపాడులో పామర్రు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన విసృ్తత ప్రచారం నిర్వహించారు. బందరు మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), జెడ్పీటీసీ అభ్యర్థి లంకే వెంకటేశ్వరరావు, ఆయా సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, పెదయాదర, ఎన్ గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. పేర్ని నాని మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు, అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు సముద్రతీర ప్రాంతాల్లో తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. వైఎస్ కుటుంబాన్ని ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల దరికి చేరుతాయన్నారు. ఘంటసాల మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల చంద్ర మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. నాగాయలంకలో అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు విసృ్తత ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్ధి దిడ్ల ప్రసాద్ పాత ఎడ్లలంక తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. చల్లపల్లి జెడ్పీటీసీ అభ్యర్థి కైతేపల్లి కుమారి, కోడూరు జెడ్పీటీసీ అభ్యర్థి సీహెచ్.చినవెంకటేశ్వరరావు తదితరులు విసృ్తత ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి, పెడన మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జెడ్పీటీసీ అభ్యర్థులు జీవీ ప్రసన్నకుమారి, బుంగా నాగవెంకటశ్రీనబాబు రోడ్‌షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. మొవ్వ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి విజయశాంతి నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన పెడసనగల్లు, నిడుమోలు తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. మైలవరం, వెల్వడం, చంద్రాల, ఎదురువీడు, పోరాటనగర్, తుళ్లూరు తదితర గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, జెడ్పీటీసీ అభ్యర్థి కంభంపాటి ఏసుబాబు రోడ్‌షో నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. జి.కొండూరు జెడ్పీటీసీ అభ్యర్ధి కాజబ్రహ్మయ్య రోడ్‌షో నిర్వహించారు. నందిగామలో జెడ్పీటీసీ అభ్యర్థి ప్రమీలారాణి కంచికచర్ల జెడ్పీటీసీ అభ్యర్థి కాలువ వాసుదేవరావు, చందర్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థివెలగపూడి వెంకటేశ్వర్లు, వీరులపాడు జెడ్పీటీసీ అభ్యర్థి షహనాజ్‌బేగం, ఆగిరిపల్లి జెడ్పీటీసీ కాజా రాంబాబుయాదవ్ వివిధ గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. -
రైతు పక్షపాతి వైఎస్ జగన్
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆమె నందిగామలోని ఐతవరం, అడవిరావులపాలెం, తక్కెళ్లపాడు, లింగాలపాడు, రాఘవపురం, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మెహన్‌రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తారని, ప్రకృతి విపత్తుల్లో దెబ్బతిన్న పంట లను కొనుగోలుచేసేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కౌలు రైతులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహా నేత వైఎస్సార్ హయాంలో సాగర్ కుడి, ఎడమ కాలువలకు సకాలంలో సాగునీరు అంది మెట్టపంటలకు ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. నాలుగేళ్లుగా సాగర్ కాలువలకు నీరు విడుదలకాక పశ్చిమకృష్ణాలోని ఎత్తిపోతల పథకాలు మూలనపడి తిరువూరు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తది తర ప్రాంతాల్లో పంటలు పండక రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు పగటి సమయంలోనే ఏడు గంటల నిరంత విద్యుత్ సరఫరా, డ్వాక్రా రుణాలను రద్దుకు జగన్మోహన్రెడ్డి కట్టుబడివున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే లంక గ్రామాల్లోని లింకురోడ్లను అభివృద్ధిచేసి, రైతులు తమ పంటలను ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించేందుకు వీలుకల్పిస్తామన్నారు. కోనేరు రాజేంద్రప్రసాద్మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాజధానిగా విజయవాడకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామాల్లో బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కె.వి.ఆర్.విద్యాసాగర్, వసంతనాగేశ్వరరావు, తిరువూరు, పామర్రు, నియోజకవర్గాల సమన్వయకర్తలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఉప్పులేటి కల్పనతోపాటు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, తాతినేని పద్మావతి తదితరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి నందిగామ మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గురువారం పర్యటించారు. ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరే విధంగా, పేద కుటుం బాల్లోని పిల్లలు విద్యావంతులు కావడానికి వైఎస్.జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రకటించారన్నారు. ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి కోవెలమూడి ప్రమీలారాణి, కొమ్మినేని నాగేశ్వరరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్థి దిడ్లప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు గుడివాక శివరాం, యాసం చిట్టిబాబు, సింహాద్రి రమేష్‌బాబు బందలాయి చెరువులో ప్రచారం చేశారు. కొండపల్లిలో జోగి రమేష్ ప్రచారం మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఇబ్రహీం పట్నం జెడ్పీటీసీ అభ్యర్థి వి.నాగమణితో కలిసి విసృ్తతంగా ప్రచారంచేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, మొవ్వ జెడ్పీటీసీ అభ్యర్థి చిమటా విజయశాంతి, ఎంపీటీసీ అభ్యర్థులు పెడసనగల్లు, బార్లపూడి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో ప్రచారంచేశారు.