
ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న తాతినేని పద్మావతి
సాక్షి, అమరావతి/పెనమలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని, నామినేటెడ్ పదవులతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతానికి మించి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ తాతినేని పద్మావతి కొనియాడారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళలంతా ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్‌పర్సన్, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్‌గాను నియమితులైన ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనమలూరులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా కార్మికుల బాధలు తీర్చేందుకు చొరవ తీసుకున్నారన్నారు.
ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయడానికి, ఆర్టీసీ స్థలాల్లో వాణిజ్య, వ్యాపార నిర్వహణ ద్వారా ఆదాయం పెంపునకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఆదుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ టి.కల్పలత, ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ చిన్నపరెడ్డి విజయానందరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment