ఆర్టీసీలో జగనోదయం
ప్రభుత్వంలో విలీనంతో కొత్త చరిత్రకు జగన్ శ్రీకారం
52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం
చంద్రబాబు జమానాలో కుదేలైన ఆర్టీసీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... ఈ పేరు వింటనే ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఈ పేరు చెవిలో పడితేనే ఆ ఉద్యోగుల్లో హడల్ ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం...కల కూడా. గతంలో చంద్రబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విలీనం సాధ్యం కాదని కొట్టిపారేశారు. అంతేకాదు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించి తన రాజగురువు రామోజీరావుకు అప్పగించాలన్న దురాలోచన కూడా చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ చరిత్రాతి్మక నిర్ణయం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో నవోదయాన్ని తీసుకువచి్చంది. ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను కలి్పంచడమే కాకుండా ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఆర్టీసీ పట్ల చంద్రబాబు వైఖరి? ఆయన విధానాలు ...ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అనే అంశాలను ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
జగన్ విలీన హాసం..!
⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం.
⇒ ఉద్యోగుల జీతాల కోసం ఒక్క నెల కూడా అప్పు చేయలేదు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లించింది. ఇప్పటికి 52 నెలల్లో రూ.15,600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.
⇒ జీతాల కోసం అప్పులే చేయలేదు కాబట్టి...వడ్డీ సమస్యే లేదు
⇒ వైస్సార్‌సీపీ కోసం అద్దెకు తీసుకున్న బస్సులకు తక్షణమే పార్టీ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపు
⇒ జీతాల చెల్లింపునకు ఐదేళ్లలో రూ.2,500 కోట్లు అప్పు తీర్చింది. అప్పు రూ.2 వేల కోట్లకు తగ్గింది.
⇒ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం బకాయి రూ.200 కోట్లు చెల్లింపు దాంతో ఉద్యోగులకు సులభంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు
⇒ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ప్రమాద బీమా సదుపాయం ప్రమాద బీమా మొదట రూ.45 లక్షలకు...అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు పెంపు
⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
⇒ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన
⇒ 2016 నుంచి 2019 మధ్య పెండింగులో ఉన్న 845 మందికి ఉద్యోగాలు
⇒ 2020 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు
⇒ 2020 తరువాత అనారోగ్య కారణంతో పదవీ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు.
⇒ 2020 తరువాత రిటైరైన ఉద్యోగులకు గ్రాడ్యుటీ రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కింద రూ.271.89 కోట్లు, సరెండర్ లీవుల కింద రూ.165 కోట్లు చెల్లింపు
⇒ ఇప్పటికి 1,406 కొత్త బస్సులు కొనుగోలు. మరో 1,500 కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదన. తొలిసారిగా ఈ–బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ. తిరుమల–తిరుపతి ఘాట్‌లో 100 ఈ–బస్సులు. రానున్న ఐదేళ్లలో 7 వేల ఈ–బస్సుల కొనుగోలుకు నిర్ణయం
⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
బాబు మాటల మోసం..!
⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు.
⇒ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి.
⇒ ఉద్యోగుల జీతాల కోసం చేసిన అప్పులే ఏడాదికి రూ.350 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది.
⇒ టీడీపీ అవసరాల కోసం బస్సుల వినియోగం. బిల్లులు చెల్లించని టీడీపీ.
⇒ రూ.4,500 కోట్ల నష్టాల్లో ఉండేది.
⇒ ఉద్యోగుల పరపతి సంఘానికి రూ.200 కోట్ల బకాయి పడడంతోరుణాలు ఇవ్వలేని దుస్థితి.
⇒ ప్రమాద బీమా రూ.30 లక్షలు మాత్రమే.
⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం.
⇒ కారుణ్య నియామకాలు చేపట్ట లేదు.
⇒ గ్రాడ్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవులు పెండింగ్..
⇒ కొత్త బస్సులు కొనుగోలు లేదు.
⇒ పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు
ఇవి చదవండి: పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్..
Comments
Please login to add a commentAdd a comment