- తోట్లవల్లూరు రోడ్‌షోలో తాతినేని
- పిల్లల చదువు కోసం అమ్మఒడి పథకం
- ముగిసిన మొదటి విడత ప్రచారం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జె డ్‌పీ చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి చెప్పారు. తోట్లవల్లూరు మండలంలో శుక్రవారం ఆమె విసృ్తతంగా పర్యటించారు. ప్రచారానికి ఆఖరిరోజు కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధిక ధరల నేపథ్యంలో కుటుంబం గడవటమే కష్టంగా మారిందన్నారు.
దీంతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక సతమతమవుతున్నారన్నారు. ఈ ఇబ్బంది నుంచి మహిళలను బయటపడవేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. 150 యూనిట్లు కరెంటు వాడినా రూ. 100 బిల్లు వసూలు చేసేలా చూస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి హామీ ఇచ్చారని, ఈ హామీని తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కృష్ణానది వెంబడి ఉన్న లంక గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తోట్లవల్లూరు మండలంలోని బద్రిరాజుపాలెం, దేవరపల్లి, గురివిందపల్లి, ఐలూరు, పాలంకిపాడు తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జొన్నల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తోట్లవల్లూరు మండలంలోని గరికపాడులో పామర్రు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన విసృ్తత ప్రచారం నిర్వహించారు. బందరు మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), జెడ్‌పీటీసీ అభ్యర్థి లంకే వెంకటేశ్వరరావు, ఆయా సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, పెదయాదర, ఎన్ గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. పేర్ని నాని మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు, అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు సముద్రతీర ప్రాంతాల్లో తాగునీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు.
వైఎస్ కుటుంబాన్ని ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల దరికి చేరుతాయన్నారు. ఘంటసాల మండలంలో జెడ్‌పీటీసీ అభ్యర్థి తుమ్మల చంద్ర మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. నాగాయలంకలో అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు విసృ్తత ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ జెడ్‌పీటీసీ అభ్యర్ధి దిడ్ల ప్రసాద్ పాత ఎడ్లలంక తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
చల్లపల్లి జెడ్‌పీటీసీ అభ్యర్థి కైతేపల్లి కుమారి, కోడూరు జెడ్‌పీటీసీ అభ్యర్థి సీహెచ్.చినవెంకటేశ్వరరావు తదితరులు విసృ్తత ప్రచారం నిర్వహించారు. బంటుమిల్లి, పెడన మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జెడ్‌పీటీసీ అభ్యర్థులు జీవీ ప్రసన్నకుమారి, బుంగా నాగవెంకటశ్రీనబాబు రోడ్‌షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. మొవ్వ మండలంలో జెడ్‌పీటీసీ అభ్యర్థి విజయశాంతి నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన పెడసనగల్లు, నిడుమోలు తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు.
మైలవరం, వెల్వడం, చంద్రాల, ఎదురువీడు, పోరాటనగర్, తుళ్లూరు తదితర గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, జెడ్‌పీటీసీ అభ్యర్థి కంభంపాటి ఏసుబాబు రోడ్‌షో నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. జి.కొండూరు జెడ్‌పీటీసీ అభ్యర్ధి కాజబ్రహ్మయ్య రోడ్‌షో నిర్వహించారు. నందిగామలో జెడ్‌పీటీసీ అభ్యర్థి ప్రమీలారాణి కంచికచర్ల జెడ్‌పీటీసీ అభ్యర్థి కాలువ వాసుదేవరావు, చందర్లపాడు జెడ్‌పీటీసీ అభ్యర్థివెలగపూడి వెంకటేశ్వర్లు, వీరులపాడు జెడ్‌పీటీసీ అభ్యర్థి షహనాజ్‌బేగం, ఆగిరిపల్లి జెడ్‌పీటీసీ కాజా రాంబాబుయాదవ్ వివిధ గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.