Koneru Rajendra Prasad
-
హత్యా రాజకీయాలొద్దు
కంచికచర్ల : నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు హత్యలను ప్రోత్సహించవద్దని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కోనేరు రాజేంద్రప్రసాద్ సూచించారు. మండలంలోని గొట్టుముక్కలలో ఆదివారం అర్థరాత్రి హత్యకు గురయిన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను గురువారం కలుసుకుని ప్రగాడ సానుభూతి తెలిపారు. హత్య జరిగిన తీరుపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. నిద్రపోతున్న కృష్ణారావును లేపి రాడ్లతో, కర్రలతో కొట్టి రెండు పెడరెక్కలు విరిచి లాక్కుంటూ కాళ్లతో తన్నుకుంటూ బయటకు తీసుకువెళ్లి చంపి రోడ్డుపై పడేశారని కృష్ణారావు భార్య ముత్తమ్మ, కుమార్తె వాసిరెడ్డి నాగమణి చెప్పారు. కుంటుంబానికి పెద్దదిక్కు పోయిందని కోనేరు ముందు బోరున విలపించారు. తమను దిక్కులేని వారిని చేసిన హత్యను ప్రోత్సహించిన వారిని శిక్షించాలని అన్నారు. కోనేరు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి హత్యకు సహకరించిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. పచ్చని గ్రామాల్లో జీవించే వారిపై రాజకీయాల కోసం దాడులు చేసి హత్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధికోసం పాటుపడాలని, కక్షలు పెంచుకుంటూపోతే ప్రజలు గ్రామాల్లో ఎవరూ మిగలరని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నంత మాత్రాన హత్యలు చేస్తే చట్టం ఊరుకోదని తెలిపారు. అనంతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులకొట్టారని, బయటకు వస్తే చంపుతామని నానా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని కోనేరుకు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయం నుంచి టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అయినా ఊరుకుంటున్నామని దీంతో పోలీసు వర్గాలన్నీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కోనేరుతో పార్టీ నేతలు వాపోయారు. కోవెలమూడి వెంకటనారాయణ, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్‌చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు షేక్ షహనాజ్‌బేగం, మహ్మద్ గౌస్, గుదే రంగారావు, అక్కారావు, తాటుకూరి గంగాధరరావు, కోటేరు సూర్యనారాయణరెడ్డి, ములకలపల్లి శేషగిరిరావు, వాసిరెడ్డి విజయకుమార్, జొన్నలగడ్డ సుబ్బారావు, ఆలోకం శ్రీనివాసరావు, గుదే సాంబశివరావు, తాటుకూరి అమ్మారావు, బండి వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధికే మా ఓటు
* ఐటీ హబ్ సంగతేంటి.. అటకెక్కిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ * టీడీపీ ఎంపీకి పట్టని మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు * సంక్షేమ సారథినే గెలిపిస్తామంటున్న కృష్ణాజిల్లావాసులు కళలకు పుట్టిల్లు.. పరిశ్రమలకు పొదరిల్లు.. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన కృష్ణా జిల్లా అభివృద్ధిలో మాత్రం ఒక అడుగు వెనుకే ఉంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దినదినాభివృద్ధి చెందిన జిల్లా ప్రస్తుతం వెనుకబడిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు బెజవాడపైనే. ఈ ప్రాంతవాసులు మాత్రం సంక్షేమ సారథికే పట్టం కడతామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇటీవల ‘సాక్షి’ నిర్వహించిన రోడ్ షోలో ఈ విషయం స్పష్టమైంది. విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎ.అమరయ్య: విజయవాడ బస్టాండ్‌లో దిగి బెంజిసర్కిల్‌కు వెళ్తుం డగా బందరు రోడ్డంతా ఎన్నికల సందడే కనిపించింది. గత ఎన్నికల్లో పెద్దగా లేని ఇంటర్నెట్లు, ఫేస్‌బుక్‌లు కనిపించాయి. బీసీ రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాలపై చర్చలు వినిపించాయి. గతానికి భిన్నంగా సరికొత్త రాజకీయ భాష, సాంకేతిక పరికరాలపై అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అభివృద్ధి జాడలేవీ? సుమారు 46 లక్షల జనాభా, 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లా కూచిపూడి నృత్యానికి పురిటిగడ్డ. 70 శాతానికి పైబడి అక్షరాస్యులున్న ప్రాంతం. అభివృద్ధికి అనేక అవకాశాలున్నా అడుగుముందుకు పడని జిల్లా. విశాఖ తర్వాత పెద్ద నగరమైన విజయవాడ యువత ఉపాధి కోసం వలసపోతూనే ఉంది. పశ్చిమ కృష్ణా అంతటా నీటి కొరత ప్రధాన సమస్య అయితే, తూర్పు కృష్ణాకూ నీటితోనే ఇబ్బంది. ఒకచోట తాగునీటికీ కటకట, మరోచోట ముంపు. ఏతావాతా సమస్య నీళ్లదే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమైనప్పటికీ పట్టుమని వెయ్యిమందికి ఉపాధి చూపించే పరిశ్రమలేవీ ఇక్కడ లేవు. వ్యవసాయాధారిత ప్రాంతమైనా అనుబంధ పరిశ్రమలు లేవు. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ తర్వాత ఎక్కువ ఉపాధి చూపిస్తున్నది విజయవాడ థర్మల్ పవర్స్టేషనే. ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు తరలిపోయాయి. మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ వ్యాపారం వెలవెలబోతోంది. కొండపల్లి బొమ్మలు అటకెక్కాయి. సరిగ్గా ఈ దశలో జమిలిఎన్నికలకు జిల్లా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సరైన నేత కోసం యువత దృష్టి సారించింది. తానొస్తేనే అభివృద్ధి అంటున్న బాబును, యువతకు భరోసా, ఉపాధికి హామీ ఇస్తున్న జగన్మోహన్రెడ్డిని బేరీజు వేసి చూస్తున్నారు. జగన్‌వైపే మొగ్గు చూపుతున్నారు. పేరుకే ఆర్థిక రాజధాని విజయవాడ వాణిజ్య రాజధానిగా పేరొందినా ఇక్కడి వ్యాపారం ఈ రాష్ట్రానికే పరిమితం. బంగినపల్లి మామిడి తప్ప మిగతావేవీ ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతయ్యే పరిస్థితి లేదు. అది కూడా గత ఏడాది ఆగింది. ఎవరికీ పట్టని ఐటీ పార్క్ విజయవాడ కేంద్రంగా యువతకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసరపల్లి గ్రామం వద్ద నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.70 కోట్లతో, లక్షా 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో తలపెట్టిన ఈ పార్క్ 2010లో పూర్తయింది. వైఎస్ ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఆయన మరణంతో వెనుకడుగు వేశాయి. దీంతో కేవలం 15,550 చదరపు అడుగుల్లో మాత్రమే సంస్థలు ఏర్పడ్డాయి. అటకెక్కిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ వైఎస్ హయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణకు కసరత్తు జరిగింది. మొదట్లో ఇందుకు కావాల్సిన భూమి ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల్ని వైఎస్ ప్రభుత్వం అంగీకరింపజేసినా ఇప్పుడు దాన్ని పట్టించుకునే వారే లేకపోయారు. కోయంబత్తూరులా అభివృద్ధి చేస్తా.. జిల్లాలో సమస్యలపై ఇటీవల విజయవాడలోని పలువురు పారిశ్రామికవేత్తలు లోక్‌సభ అభ్యర్థులతో చర్చించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ తాను గెలిస్తే ఏమీ చేస్తానో వివరించిన తీరు పారిశ్రామికవేత్తలను అబ్బురపరిచింది. కోయంబత్తూరు మాదిరిగా ఐటీ హబ్, ఆటోరంగ విస్తరణకు తాను ఎలా కృషిచేస్తానో, ఉపాధి ఎలా కల్పిస్తానో వివరించి కార్మికులను ఆకట్టుకున్నారు. దీంతో వందలమంది పారిశ్రామికవేత్తలు కోనేరుకు మద్దతు పలికారు. మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు సంగతేంటి.. నాగాయలంక మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన మిస్సైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.వెయ్యికోట్లతో, 260 ఎకరాల విస్తీర్ణంలో డీఆర్డీఏ ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కృష్ణాజిల్లా పాలిట వరం. ఈ ప్రాజెక్టు వాస్తవానికి 2012లో చేపట్టాల్సి ఉన్నా, గతంలోని టీడీపీ ఎంపీ పట్టించుకోలేదు. దీంతో విశ్వాసం కోల్పోయిన మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసే సత్తా తనకే ఉందని వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెబుతున్నారు. సంక్షేమ సారథికే పట్టం ‘మాకు అభివృద్ధి కావాలి. యువత నిరాశ, నిస్పృహల్లో ఉంది. వారిని ఆదరించే వ్యక్తి కావాలి. దానికి చంద్రబాబు తగిన వ్యక్తి కాదు. ప్రజా సంక్షేమం, విద్య, వైద్యం వంటివి అమలు కావాలంటే ఎవరు తగిన వ్యక్తో జనం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మే 7న తీర్పు ఇస్తారు’ అని పటమటలంకకు చెందిన వ్యాపారి రమేష్‌చంద్ర చెప్పారు. ఏదిఏమైనా ఈసారి జిల్లాలో గతంలో గెలిచిన సీట్లను నిలబెట్టుకోడానికి టీడీపీ ఎదురీదుతోంది. వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయంగా ప్రజాభిప్రాయం ఉంది. బాబూ.. ఇంతకీ నువ్వు ఎవరి వైపు? రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఇటీవల కొందరు పారిశ్రామికవేత్తలు సుమారు 20 రోజులు 13 జిల్లాల్లో యాత్ర చేశారు. చిత్రమేమిటంటే.. ఈ యాత్రను చంద్రబాబు ప్రారంభించడమే. పారిశ్రామికవేత్తల్ని ఎందుకూ కొరగాకుండా చేసిన బాబుకు ఈ అర్హత ఉందా? అని విజయవాడకు చెందిన ఓ బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు ప్రశ్నిస్తే, అసలు ఇంతకీ ఈ బాబు ఎవరి పక్షం అంటూ సామాజిక కార్యకర్త అయిన కె.శరత్ నిలదీశారు. చంద్రబాబుకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమైతే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్నది ఆయన ప్రశ్న. బాబు ధనవంతుల మనిషి అని వామపక్షవాది టీవీ నరసింహారావు ధ్వజమెత్తారు. -
టీడీపీ గోబెల్స్ ప్రచారం సిగ్గుచేటు
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులతో కుమ్మక్కు కాలేదు మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ వసంత నాగేశ్వరరావుపై ఎంతో గౌరవం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేయటం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ప్రతి విషయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని టీడీపీ పనిగట్టుకొని ప్రచారం చేస్తుందని ఇవన్నీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం అనుసరిస్తున్న చిల్లర వ్యూహాలని విమర్శించారు. శనివారం ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్‌తో కలసి మాట్లాడారు. పోలీసులు, వైఎస్సార్సీపీతో కుమ్మక్కు కాలేదని, వారు ఇతర రాజకీయపార్టీల కంటే ఎక్కువగా వైఎస్సార్ సీపీనే టార్గెట్ చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పోలీసులు తరచూ ఎవరి వాహనాలను తనిఖీలు చేస్తున్నారో... అక్కడక్కడ ఏ పార్టీ కార్యకర్తల్ని అరె స్టు చేస్తున్నారనేది జగమెరిగిన సత్యమని తెలిపారు. ప్రతి విషయాన్నీ మాపై రుద్ది మీరు ఒప్పుకోవాలి అనేరీతిలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రచారానికి దిగడం పనికి మాలిన చర్య అని మండిపడ్డారు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావుతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని, తాను జిల్లాలకు వస్తున్నప్పుడు కూడా ఆయనే నందిగామలో తనకు స్వాగతం పలికారని వివరించారు. ఆయనతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని, తనకంటే ఆయన చాలా సీనియర్ అని వారి కుటుంబంతోనూ పరిచయాలున్నాయని చెప్పారు. కృష్ణప్రసాద్ అరెస్ట్ వ్యవహరం తనకు ఏమాత్రం తెలియదని వివరించారు. కృష్ణప్రసాద్ అరెస్టు దురదృష్టకరమని వాఖ్యానించారు. టీడీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడటం సరికాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులని, అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. పార్టీ నాయకులు నరహరశెట్టి శ్రీహరి, కొల్లి గంగాధరరావు, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
నాటి సీఎం బాబు కాదా?
ఆయన ప్రస్తావన చెయ్యరెందుకు? ఎమ్మార్‌లో ఎలాంటి తప్పూ జరగలేదు అందుకే నేను న్యాయపోరాటం చేస్తున్నా ‘ఈనాడు’ రాతలపై మండిపడ్డ - కోనేరు ప్రసాద్ ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి కొద్దిరోజులుగా కొన్ని పత్రికల్లో వ్యతిరేక వా ర్తలు వస్తుండటం, ప్రత్యర్థులు సైతం ఈ వ్యవహారంపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశం... ‘‘ఎమ్మార్ వ్యవహారంలో ఎలాంటి తప్పూ జరగలేదని నేను మొదట్నుంచీ చెబుతున్నా. న్యాయస్థానంలోనూ అదే చెప్పా. న్యాయపోరా టం కూడా చేస్తున్నా. సీబీఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చార్జిషీటు కూడా వేసింది. దాన్ని పట్టుకుని కొన్ని పత్రికలు తీర్పులిచ్చేస్తూ రాతలు రాయటం దారుణం.. బాధాకరం. సీబీఐ వేసింది అభియోగపత్రమే తప్ప అదేమీ తుది తీర్పు కాదు. దాని దర్యాప్తు నివేదికను అది కోర్టుకిచ్చిం ది అంతే!! సీబీఐ ఆ చార్జిషీట్లో మొత్తం రూ. 96 కోట్ల మేర ఏపీఐఐసీకి నష్టం జరిగిందని చెప్పింది. కానీ కొన్ని పత్రికల్లో అది రూ. 167 కోట్లుగా రాస్తున్నారు. నా ప్రత్యర్థులైతే ఏకంగా రూ. 5వేల కోట్లంటున్నారు. ఇదంతా విజయవాడ ఓటర్లను ప్రభావితం చేసి, ప్రజా జీవితంలో ఉన్న నన్ను దెబ్బతీయడానికేనన్నది ఎవరికీ తెలి యంది కాదు. ఓటర్లను ప్రభావితం చేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలపై నేను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నా. సీబీఐ చార్జిషీటు ప్రకారం చూసినా ఈ వ్యవహారం 2002లో జరిగిందని పేర్కొంది. ఆ రకంగా చూసినా అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఉండాలి కదా? ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన దగ్గర్నుంచి, భూములు కేటాయించడం వరకూ అంతా జరిగింది ఆయన హయాంలోనే. కేసు కోర్టులో ఉంది కనుక ఈ విషయంలో ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నేను చెప్పేదొక్కటే. విజయవాడతో మా కుటుంబానికి 70 ఏళ్ల అనుబంధం ఉంది. స్థానిక ప్రజలకు నేనేంటో తెలుసు. వారిచ్చే తీర్పు ముందు... ఈ ఆరోపణలు ఎందుకూ పనికిరావనేది నా ప్రగాఢ విశ్వాసం.’’ -
చంద్రబాబును వదిలి రామోజీ దగుల్బాజీ రాతలు
ఎమ్మార్ వ్యవహారంపై మళ్లీ విషం కక్కిన ‘ఈనాడు’ ఆది నుంచీ చక్రం తిప్పిన బాబు పేరు కూడా రాయని తీరు ఎమ్మార్ ప్రాజెక్టు బిడ్లను 2001లోనే ఆహ్వానించిన బాబు ఐదు సంస్థలు రాగా వాటిలో రెండింటి తిరస్కరణ మిగిలిందల్లా ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీ సంస్థలే చివరితేదీ నాటికి ఎమ్మార్ మినహా మిగతా రెండూ వెనక్కి ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది దానికి హైటెక్‌సిటీ రెండోదశ, జెమ్స్ అండ్ జువెలరీ పార్క్ అప్పగింత ఎల్ అండ్ టీకి హైటెక్‌సిటీ, కాకినాడ పోర్టు సహా విలువైన ప్రాజెక్టులు ఎమ్మార్ తరఫున డీల్ చేసిన కోనేరు ప్రసాద్‌తో అప్పటికే చంద్రబాబుకు సంబంధం దీనికిచ్చిన 535 ఎకరాల సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి భూమి ఎకరా రూ.కోటికి అమ్మకం ఎమ్మార్‌కు మాత్రం ఎకరా రూ.29 లక్షలకే అప్పగింత ఇన్ని చేసిన బాబు పేరును ప్రస్తావించకుండా రామోజీ కథనాలు నవ్విపోతున్న జనం.. పట్టించుకోకుండా దిగంబర రాతలు మరీ ఇంత దగుల్బాజీతనమా? ‘‘వందల కోట్ల విల్లాసం.. యావజ్జీవ శిక్షకు అవకాశం’’ అంటూ కోనేరు రాజేంద్రప్రసాద్ గురించి పాంచజన్యంలో అంత గట్టిగా ఊదినప్పుడు... ఆ వ్యవహారంలో చంద్రబాబు నాయుడి పాత్ర గురించి చెప్పరేం? టెండర్ల నుంచి దుబాయ్ అలబ్బర్ను ఇక్కడికి రప్పించటం మొదలు... భూముల్ని కట్టబెట్టడం దాకా బాబు చేసిన బాగోతాన్ని ఒక్క ముక్క కూడా రాయరెందుకు? ‘‘ఈయనకు యావజ్జీవం పడుతుంది’’ అనే బెదిరింపు ఓటర్లను భయపెట్టడానికి కాదా? అసలు రామోజీపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నిట్లో గనక వ్యతిరేక తీర్పు వస్తే వాటిని అనుభవించడానికి రామోజీకి ఒకటి రెండు జీవితాలు సరిపోతాయా? ఎన్ని పదుల జీవితాలు కావాలి? చాలా కేసుల్లో సాంకేతిక చంద్రబాబు కనక సాంకేతిక కారణాలతో తప్పించుకోకపోతే ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉండేవారు కాదా? అసలు ఎన్నికల బరిలో నిలిచే అర్హత ఉండేదా? ఈ వ్యవహారంలో బాబు పాత్ర మీకు కనిపించలేదా?.. బాబు హయాంలో జరిగిందిదీ... దేశంలో ఎక్కడా లేనట్లు ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనుకున్నారు 2000వ సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు. టౌన్షిప్ అంటే జనం ఉండేదేమీ కాదు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్... చుట్టూ శ్రీమంతుల విల్లాలు... ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరం. ఇదీ టౌన్షిప్ స్వరూపం. 2000 మార్చిలో ఏపీఐఐసీ ప్రకటన ఇచ్చింది. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీసీ, ఈఐహెచ్ లిమిటెడ్‌లను షార్ట్‌లిస్ట్ చేశారు. రెండిటికీ ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) పత్రాలు పంపగా ఐటీసీ ఒక్కటే స్పందించింది. మణికొండ, హుస్సేన్‌సాగర్ రెండుచోట్లా భూములు కేటాయిస్తే ప్రాజెక్టును రెండు చోట్లా చేపడతామని పేర్కొంది. కానీ మణికొండ వద్ద మాత్రమే భూమి కేటాయిస్తామని చెప్పిన బాబు ప్రభుత్వం... ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. 2001 జూలై 6న ఏపీఐఐసీ ద్వారా మరో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి స్పందించి... దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ... ముందుకొచ్చాయి. ఎందుకనో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీని బాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సెప్టెంబర్ 26న మిగిలిన మూడింటినీ ఆర్ఎఫ్పీకి అర్హమైనవిగా ప్రకటించింది. టెండర్లకు ఆఖరుతేదీ 2001 డిసెంబర్ 15 కాగా... చిత్రంగా ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. పోటీ లేకుండా సింగిల్ టెండరుంటే దాన్ని రద్దు చేసి మళ్లీ పిలుస్తారు. కానీ బాబు ప్రభుత్వం అలా చేయలేదు. ఎమ్మార్కే ప్రాజెక్టు కట్టబెట్టేసింది. ప్రభుత్వానికి చెందిన 445 ఎకరాలతో పాటు మరో 80 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించి మరీ... మొత్తం 535 ఎకరాలిచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అది కూడా కేవలం ఎకరా రూ.29 లక్షల చొప్పున. ఇక్కడ గమనించాల్సింది మరొకటుంది. ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బాబు కుటుంబానికి మూడెకరాల స్థలం ఉంది. దాన్ని ఎమ్మార్‌తో ఒప్పందానికి మూడేళ్ల ముందే బాబు ఎకరా రూ.కోటి చొప్పున రెడ్డీ ల్యాబ్స్‌కు విక్రయించారు. మరి సొంత స్థలాన్ని మూడేళ్ల ముందే ఎకరా కోటి రూపాయలకు అమ్మిన బాబు... ఎకరా విలువ రూ.4 కోట్లు పలుకుతున్న సమయంలో ప్రభుత్వ స్థలాన్ని కేవలం రూ.29 లక్షల చొప్పున ఎందుకిచ్చేశారు? ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయి? ఆ రెండూ బినామీ సంస్థలే... ఇక్కడ మరొకటి కూడా గమనించాలి. చివరి నిమిషంలో టెండర్లు వేయకుండా వెనక్కెళ్లిపోయిన సంస్థలు రెండూ బాబుకు అత్యంత సన్నిహితమైనవి. ఎల్ అండ్ టీని చూస్తే రాష్ట్రంలో హైటెక్ సిటీ నుంచి కాకినాడ పోర్టు వరకూ బాబు కట్టబెట్టిన ప్రాజెక్టులన్నీ దానికే. టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక ఐఓఐ ప్రాజెక్ట్స్ (ఇండియా) చూసుకున్నా అది బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. ఆయనకు బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన ఐదెకరాల్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట కారు చౌకగా బాబు కట్టబెట్టారు. పెపైచ్చు హైటెక్ సిటీ రెండోదశనూ సురేష్‌కు చెందిన ఫినిక్స్ ప్రాజెక్ట్స్‌కే అప్పగించారు. అదీ కథ. 250 నుంచి 535 ఎకరాలకు పెంపు ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఆసక్తి అంతా ఇంతా కాదు. 2001లో ఏపీఐఐసీ ప్రకటనలు జారీ చేసినపుడు కూడా మణికొండలోని 250 ఎకరాలనే ప్రతిపాదించారు. ఆ భూములపై నాటికి హైకోర్టు స్టే కూడా ఉంది. కానీ బాబు చొరవతో 2001 జూలై 11న స్టే తొలగటం, ఆ మర్నాడే పత్రికల్లో ప్రకటనలివ్వటం జరిగిపోయాయి. నిబంధనల ప్రకారం ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ ప్రకటనల్ని జతపరుస్తూ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి ఏపీఐఐసీ నోట్‌ఫైళ్లు పంపింది. ఆ వెంటనే భూమి 250 ఎకరాలు కాకుండా 500 ఎకరాలకు పెంచాలని ఏపీఐఐసీకి ఆదేశాలందాయి. నిబంధనల ప్రకారం వెళుతున్న అధికారులకు అనుమానం వచ్చింది. చీఫ్ సెక్రటరీని అడిగారు. దీంతో ఆయన తనకు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పంపిన నోట్‌ను వాళ్లకు పంపారు. దాన్లో ఏముందంటే... ‘‘చీఫ్ సెక్రటరీ గారూ! ఈ విషయం పరిశీలించండి. ఈ ఉదయం దీనిపై సీఎం నాతో మాట్లాడారు. మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆ నోట్లో ఉంది. చేసేదేమీ లేక ఏపీఐఐసీ మరో సవరణ ప్రకటన జారీ చేసింది. దాన్లో భూమిని 535 ఎకరాలకు పెంచింది. అసలు భూమిని పెంచమని ఎవరడిగారు? టెండర్లు వేసిన సంస్థలు ఎక్కువ భూమి కావాలన్నాయా? ఏపీఐఐసీ ఏమైనా ప్రతిపాదించిందా? అలాంటిదేమీ లేనపుడు చంద్రబాబు ఎందుకంత ఆసక్తి చూపించారు? 500 ఎకరాలైతే ముడుపులు డబుల్ అవుతాయనా? దీన్ని రామోజీ రాయరెందుకు? ఏపీఐఐసీ వాటాకు ఆదిలోనే గండి! రైతుల నుంచి సేకరించి మరీ ఎమ్మార్‌కు 535 ఎకరాల భూమిని అప్పగించిన చంద్రబాబు... వాటాల్లోనూ చేతివాటం చూపించారు. 535 ఎకరాల్లో... హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు 15, గోల్ఫ్‌కోర్సుకు 200, విల్లాలకు 285 ఎకరాలు కేటాయించారు. అయితే 15 ఎకరాల హోటల్, కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచి... 520 ఎకరాలిచ్చిన గోల్ఫ్‌కోర్స్, విల్లాల ప్రాజెక్టులో మాత్రం 26 శాతానికే పరిమితం చేశారు చంద్రబాబు. ఇది చాలు బాబు కుట్ర బయటపెట్టడానికి!! లాభాలొచ్చే రియల్ ఎస్టేట్‌కు అనుమతించిన 285 ఎకరాల్లో ఏపీఐఐసీ వాటాను 26 శాతమే ఎందుకు ఉంచారు? ఎన్ని కోట్లు ముడుపులు తీసుకున్నారు? కొలాబరేషన్‌తో కొల్లగొట్టిందీ బాబే! భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక... ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక... 2003 ఆగస్టు 19న కొలాబరేషన్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. ఈ కొలాబరేషన్ ఒప్పందమే కుంభకోణానికి మూలమని విజిలెన్స్ నివేదిక స్పష్టంగా చెప్పింది కూడా. మరి ఇదంతా జరిగింది బాబు హయాంలో అయితే రామోజీ అస్సలు ఆ ప్రస్తావనే ఎందుకు చేయటం లేదు? దీన్నిబట్టే అర్థం కావటం లేదా ఈ ఎల్లో కుట్ర? -
జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం
జి.కొండూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌తో కలిసి ఆయన మండలంలోని కోడూరు, చిననందిగామ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోనేరు, జోగి రమేష్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎక్కడికక్కడ మహిళలు వారికి విజయ తిలకాలు దిద్దారు. అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో కోనేరు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో కొనసాగాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఆయన ప్రతినిధులుగా పోటీచేస్తున్న తమకు మద్దతు తెలిపి, ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక ప్రతిపక్షాలు తన పేరుగల ఇద్దరితో ఎంపీ అభ్యర్థులుగా పోటీలో నిలిపాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జోగి రమేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత భూములకు సాగు నీటి సరఫరా, కాలువలకు మరమ్మతులు, అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. చిననందిగామ, కోడూరు గ్రామాల్లో ప్రజల తె లిపిన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థి వేములకొండ సాంబయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి కాజా బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ పులిపాక థామస్, నాయకులు లీలా శ్రీనివాస్, పామర్తి శ్రీనివాసరావు, మాజీ సర్పంచి వీరంకి వెంకట నరసింహారావు, శ్రీమన్నారాయణరెడ్డి, పసుపులేటి రమేష్, మన్నే రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
శోభానాగిరెడ్డికి కన్నీటి నివాళి
పమిడిముక్కల, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటూ విశేష సేవలందించిన శోభానాగిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ వైఎస్సార్సీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు. పార్టీ ముఖ్య నాయకురాలుగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని తెలిపారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చోరగుడి గ్రామంలో గురువారం శోభానాగిరెడ్డి చిత్రపటానికి సారథి, పామర్రు అసెంబ్లీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్పన మాట్లాడుతూ పదేళ్లుగా శోభానాగిరెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అనేక పదవులు నిర్వహించి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. కోనేరు ఆధ్వర్యంలో... విజయవాడ : విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో శోభానాగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించి పార్టీకి ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సంతాపసభలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పాల్గొని శోభానాగిరెడ్డితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఉదయభాను దిగ్భ్రాంతి జగ్గయ్యపేట అర్బన్ : శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె ఇలా అర్ధంతరంగా అసువులు బాయటం బాధాకరమన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగిరెడ్డి సంతాపం గుడివాడ : శోభానాగిరెడ్డి మృతికి వైఎస్సార్సీపీ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. పార్టీకి తీరని లోటు : వేదవ్యాస్ పెడన : శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ పెడన అసెంబ్లీ అభ్యర్థి వేదవ్యాస్ అన్నారు. ఆమె మృతికి నివాళి అర్పించారు. బాధ కలిగించింది : జోగి ఇబ్రహీంపట్నం : శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఎంతో బాధ కలిగించిందని వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సంతాపసభలో ఆమె మృతికి నివాళి అర్పించారు. దుట్టా నివాళి హనుమాన్‌జంక్షన్ : శోభానాగిరెడ్డి హఠాన్మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు అన్నారు. గురువారం హనుమాన్‌జంక్షన్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి : కొడాలి గుడివాడ : వైఎస్సార్సీపీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన శోభానాగిరెడ్డి అకాల మృతి పార్టీకి తీరని లోటని గుడివాడ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. బాధాకరం : జగన్మోహనరావు నందిగామ : వైఎస్సార్ సీపీ కీలక నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి మృతి బాధాకరమని, ఆమె పార్టీకి చేసిన సేవలు మరువరానివని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఆమె మృతికి నివాళులర్పించారు. నమ్మలేకపోతున్నాం : సింహాద్రి రమేష్ శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ అన్నారు. అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఆమె లేరనే వార్తను నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మేకా ప్రతాప్ సంతాపం నూజివీడు : శోభానాగిరెడ్డి మృతిచెందడంపై ఆ పార్టీ నూజివీడు అసెంబ్లీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతికి నివాళి అర్పించారు. దిగ్భ్రాంతికి గురయ్యా : ఉప్పాల కలిదిండి : శోభానాగిరెడ్డి మృతి వార్తతో దిగ్భ్రాంతికి గురైనట్లు కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ చెప్పారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె మరణం జీర్ణించుకోలేనిది: పేర్ని నాని మచిలీపట్నం : వైఎస్సార్సీపీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి, చురుకైన నాయకురాలిగా ఎదిగిన శోభానాగిరెడ్డి అకాల మరణం పార్టీ నేతలు జీర్ణించుకోలేనిదని మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని నాని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న మద్దతు
విశాఖపట్నం: ఎన్నికల దగ్గరపడుతున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వైఎస్సార్ సీపీలోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నారు. గాజువాక అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో 50వ వార్డు నుంచి 200 మంది మహిళలు పార్టీలో చేరారు. విజయమ్మకు మద్దతుగా కోలా గురువులు ఆధ్వర్యంలో విశాఖ నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ కన్వీనర్ నౌషథ్ ఆధ్వర్యంలో 200 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, మైలవరం అసెంబ్లీ అభ్యర్థి జోగి రమేష్ సమక్షంలో మాజీ జెడ్పీటీసీలు తేరేజమ్మ, దగ్గుమల్ల భారతి, మాజీ ఎంపీపీ పులిపాక తామస్, మాజీ డీసీసీ కార్యదర్శి పామర్తి శ్రీనివాసరావు సహా 200 మంది వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డికి మద్దతుగా కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా రమణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోలా రమణారెడ్డి సమక్షంలో 200 మంది వైఎఎస్సార్ సీపీలో చేరారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరిలో వైపీ ప్రభాకర్‌రెడ్డి, వైసీ గోవర్థన్‌రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ శ్రీరాములు సహా 50 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా సదూంలో వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వి.కోట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వీవీ రత్నం పార్టీలో చేరారు. -
హెల్త్‌సిటీగా విజయవాడ
జగ్గయ్యపేట నుంచి తిరువూరు వరకు పైప్‌లైన్‌తో కృష్ణా జలాలు పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయిస్తా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఉపాధి అవకాశాలు పెంపొందిస్తా వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు వెల్లడి ‘నాకు విజయవాడపై పూర్తి విజన్ ఉంది. కాళేశ్వరరావు మార్కెట్లోని సమస్యల దగ్గర్నుంచి బెంజిసర్కిల్‌లో ట్రాఫిక్ కష్టాల వరకు సమగ్ర అవగాహన ఉంది. జగ్గయ్యపేటలో సాగు, తాగునీటి సమస్య.. తిరువూరు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నాయని తెలుసు. జిల్లా ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయదారుల ఇబ్బందులు... ఇలా అన్నింటిపై ఉన్న అవగాహనతో విజన్ విజయవాడను రూపొందించుకున్నా. దీనికి అనుగుణంగానే ప్రజలకు సేవ చేయడానికి వారధిగా నిలిచే రాజకీయాలను ఎంచుకుని మీ ముందుకొచ్చా..’ అంటున్నారు వైఎస్సార్ సీపీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్. సాక్షి, విజయవాడ : ప్రజలకు, సమాజానికి సేవచేయాలనే తలంపుతో వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకంటే ప్రచారపర్వంలో దూసుకెళుతున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా అభివృద్ధికోసం తాను రూపొందించుకున్న ప్రణాళికలు.. విజయవాడ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలవారీగా ప్రధాన సమస్యలు.. వాటికి తాను సూచించే ఆచరణాత్మక పరిష్కార మార్గాలు.. ఇలా పలు అంశాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే... జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఇతర రాజకీయ పార్టీ నేతలను విమర్శించను. నన్ను విమర్శించేవారిని సైతం విమర్శించను. పాజిటివ్ రాజకీయాలతోనే ముందుకు సాగుతా. నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పి మరీ ప్రజలను ఓట్లడుగుతున్నాను. వైద్యపరంగా ఉపాధి.. ముఖ్యంగా వైద్యపరంగా విజయవాడ నగరానికి మంచి పేరుంది. అనేక కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రభుత్వాస్పత్రి, నిపుణులైన వైద్యులు ఎందరో ఉన్నారు. విజయవాడను హెల్త్ సిటీగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 15 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాళాల, వైద్యానికి సంబంధించి అన్ని విభాగాలు, కోర్సులతో కలిపి యూనివర్సిటీ, స్కూల్‌ను ఏర్పాటుచేయడం నా లక్ష్యం. తద్వారా సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, సుమారు ఐదు వేల మందికి సొంతప్రాంతంలోనే నాణ్యమైన విద్య లభిస్తాయి. హెల్త్ సిటీకి అనుసంధానంగా ఫార్మా కంపెనీలు, ల్యాబ్‌లు ఇలా అనేకం ఏర్పాటుచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఉచిత వైద్యం హెల్త్ సిటీలో అందితే వాణిజ్యపరంగానూ నగరం పురోగతి సాధిస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ‘విజన్ విజయవాడ’ను రూపొందించుకున్నా. దీనికోసం పంచ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా.. విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మూడు ప్రధాన నీటి కాల్వల్లోకి 126 మురుగునీటి కాల్వలను అనుసంధానం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి డ్రైనేజీ కాల్వలను దారిమళ్లించాలి. నీటి కాల్వల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తను, నీటిని వేరుచేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకియ ద్వారా చెత్తను వినియోగిస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు స్వీయ నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో వైఎస్సార్.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఆయన పార్టీ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్లినప్పుడు మమ్మల్ని కూడా అదే అభిమానం, ఆప్యాయతలతో ఆదరిస్తున్నారు.. స్వాగతిస్తున్నారు. పార్లమెంట్ పరిథిలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తిచేశాను. అక్కడి ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. నాకు కమిట్మెంట్ ఉంది. నా సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించకున్నా. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను. కోనేరు ట్రస్టుద్వారా నీరు.. శ్రీకాకుళం జిల్లాలో కోనేరు ట్రస్టుద్వారా వంశధార నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుచేసి వేలాది ఎకరాలకు సాగునీరందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడా ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాను. కృష్ణానది పక్కనే ఉన్న జగ్గయ్యపేట మొదలుకొని తిరువూరు వరకు నీటి సమస్య ఉంది. దీని పరిష్కారం కోసం పైప్లైన్లు ఏర్పాటు చేస్తే అటు తాగునీరు, ఇటు సాగునీటి అవసరాలు తీరతాయి. ఫ్లైవోవర్ల ఏర్పాటు.. మౌలిక వసతుల్లో భాగంగా దుర్గగుడి వద్ద, బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తక్షణం ఫ్లైవోవర్లు నిర్మించాలి. మా పార్టీ అధికారంలోకి రాగానే తొలి్ర పాధాన్యతాంశంగా దీన్నే తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలి. బీఆర్టీఎస్ రోడ్డు వల్ల నగరానికి పెద్దగా ఉపయోగం చేకూరలేదనేది నా అభిప్రాయం. దానికి ఖర్చుచేసిన రూ. 152 కోట్ల నిధులతో 15 ఫ్లైవోవర్లు నిర్మించి ఉంటే ట్రాఫిక్ సమస్య సమసిపోయేది. బుడమేరుకు శాశ్వత పరిష్కారం.. నగరంలో మరో ప్రధాన సమస్య బుడమేరు ముంపు. దీనికి శాశ్వత పరిష్కారం చూసేలా అన్ని చర్యలు తీసుకుంటాం. అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, పులిచింతల ప్రాజెక్టు నుంచి జిల్లా సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, పోలంపల్లి రాజీవ్ మున్నేరు డ్యామ్ నిర్మాణం పూర్తి చేయిస్తాం. పారిశ్రామికాభివృద్ధి.. విజయవాడ ఆటోనగర్‌ను కేంద్రంగా చేసి విడిభాగాల తయారీ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాం. రవాణాయేతర రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థల్ని అవసరమైతే నా సొంత నిధులతో ఏర్పాటుచేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. -
జగనే సీఎం
విజన్ విజయవాడ సాధిస్తా క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతా ‘పైలా’ చేరిక శుభసూచకం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ వెల్లువలా వస్తోందని, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం బెంజిసర్కిల్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర పార్టీలకు చెందిన వందలాది మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు. విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలు విశ్వసిస్తున్నారని కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. నగరానికి చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రముఖులంతా నేడు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు సేవలందించిన పైలా సోమినాయుడు, బాయిన వెంకట్రావు లాంటివారు తన సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి రావడం శుభసూచకమన్నారు. వీరిని పార్టీలోకి తీసుకుంటున్నట్లు తాను జగన్మోహన్రెడ్డికి చెప్పానన్నారు. వీరి చేరికతో తాను పార్టీలో ఒక అడుగు ముందుకు వేశానని సంతోషం వ్యక్తం చేశారు. వీరందరి సలహాలు, సంప్రదింపులతో ‘విజన్ విజయవాడ’ లక్ష్యంగా పని చేస్తానన్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడమే తన ధ్యేయమన్నారు. విజయవాడ అబివృద్ధికి బ్లూప్రింట్ తయారుచేసి ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతక్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. జనాదరణగల నేత జగన్.. పార్టీ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. తమ అధినేత జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆకర్షణ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, ఆదరణ చిరస్థాయిగా ఉంటుందన్నారు. మహానేత ైవె ఎస్ రాజశే ఖరరెడ్డి చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన పేద ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. నాలుగేళ్లు రాజన్న కుటుంబానికి దూరం పార్టీలో చేరిన పైలా సోమినాయుడు మాట్లాడుతూ.. తాను 1986 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లుగా తాను రాజన్న కుటుంబానికి దూరంగా ఉన్నానని విచారం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ, కోనేరు రాజేంద్రప్రసాద్ స్ఫూర్తితో తాను వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా చేరానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని చెప్పారు. -
కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి, విజయవాడ/ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయన కార్యాలయం కార్యకర్తలతో నిండిపోయింది. ఎండ మండుతున్నా ఆయనతోపాటు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నడిచారు. బెంజిసర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు, మదర్ థెరిస్సా విగ్రహం జంక్షన్, సిద్ధార్థ కళాశాల, మొగల్రాజపురం, పుష్పాహోటల్, రెడ్‌సర్కిల్, గోపాలరెడ్డి రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయూనికి ర్యాలీగా వచ్చారు. అనంతరం కోనేరు నాలుగు సెట్ల నామిషన్లను దాఖలు చేశారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, తూర్పు, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల అభ్యర్థులు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతమ్‌రెడ్డి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతా : కోనేరు ప్రజలతో మమేకమై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోనేరు రాజేంద్రప్రసాద్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై అపార నమ్మకంతో విజయవాడ ఎంపీ సీటును కేటారుుంచారని పేర్కొన్నారు. ఆయన నమ్మకానిన నిలబెట్టుకుంటానన్నారు. భగవంతుని ఆశీస్సులు, తన కుటుంబ సభ్యుల సహకారంతో స్వతహాగా కొన్ని ప్రణాళికలు, మరికొన్ని ప్రభుత్వపరంగా చేపట్టి అభివృద్ధి చేస్తాన్నారు. గతంలో కొందరు నాయకులు చెప్పిన విధంగా రాత్రికి రాత్రే నగరాన్ని వెనీస్ గానో, సింగపూర్ గానో మారుస్తానని తాను చెప్పనని, ఇప్పుడున్న దీనస్థితి నుంచి ముందుకు తీసుకువెళతానని పేర్కొన్నారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తానని, ఎక్కడా మురుగు నీరు నిలువకుండా ప్రణాళికను అమలు చేస్తామన్నారు. మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు అందించేందుకు కృషిచేస్తానన్నారు. నగరంలోనే ఉంటా.. ఎట్టిపరిస్థితిలోను నియోజకవర్గాన్ని విడిచి వెళ్లనని, విజయవాడ వాసిగానే ఉంటానని మీడియూ ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు కోనేరు సమాధానమిచ్చారు. నగరం గురించి తనకు అంతా తెలుసని, కొందరు నాయకుల మాదిరిగా ఒక రోజు ఇక్కడ మిగిలిన 364 రోజులు వేరే ప్రాంతాల్లో ఉండనని ఆయన ప్రకటించారు. రాజధానిగా విజయవాడ చేస్తారా.. అని ప్రశ్నించగా.. ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతమని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రం విడిపోదని చెప్పిన వారే నేడు రాజధాని కావాలని, ప్యాకేజీలు కావాలని తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. కేవలం రాజధానే ముఖ్యం కాదని, అంకితభావం చిత్తశుద్ధితోనే అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. -
రైతు పక్షపాతి వైఎస్ జగన్
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆమె నందిగామలోని ఐతవరం, అడవిరావులపాలెం, తక్కెళ్లపాడు, లింగాలపాడు, రాఘవపురం, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మెహన్‌రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తారని, ప్రకృతి విపత్తుల్లో దెబ్బతిన్న పంట లను కొనుగోలుచేసేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కౌలు రైతులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహా నేత వైఎస్సార్ హయాంలో సాగర్ కుడి, ఎడమ కాలువలకు సకాలంలో సాగునీరు అంది మెట్టపంటలకు ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. నాలుగేళ్లుగా సాగర్ కాలువలకు నీరు విడుదలకాక పశ్చిమకృష్ణాలోని ఎత్తిపోతల పథకాలు మూలనపడి తిరువూరు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు తది తర ప్రాంతాల్లో పంటలు పండక రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు పగటి సమయంలోనే ఏడు గంటల నిరంత విద్యుత్ సరఫరా, డ్వాక్రా రుణాలను రద్దుకు జగన్మోహన్రెడ్డి కట్టుబడివున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే లంక గ్రామాల్లోని లింకురోడ్లను అభివృద్ధిచేసి, రైతులు తమ పంటలను ఇళ్లకు, మార్కెట్ యార్డులకు తరలించేందుకు వీలుకల్పిస్తామన్నారు. కోనేరు రాజేంద్రప్రసాద్మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాజధానిగా విజయవాడకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామాల్లో బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కె.వి.ఆర్.విద్యాసాగర్, వసంతనాగేశ్వరరావు, తిరువూరు, పామర్రు, నియోజకవర్గాల సమన్వయకర్తలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఉప్పులేటి కల్పనతోపాటు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, తాతినేని పద్మావతి తదితరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి నందిగామ మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గురువారం పర్యటించారు. ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరే విధంగా, పేద కుటుం బాల్లోని పిల్లలు విద్యావంతులు కావడానికి వైఎస్.జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రకటించారన్నారు. ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి కోవెలమూడి ప్రమీలారాణి, కొమ్మినేని నాగేశ్వరరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ జెడ్పీటీసీ అభ్యర్థి దిడ్లప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయకులు గుడివాక శివరాం, యాసం చిట్టిబాబు, సింహాద్రి రమేష్‌బాబు బందలాయి చెరువులో ప్రచారం చేశారు. కొండపల్లిలో జోగి రమేష్ ప్రచారం మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఇబ్రహీం పట్నం జెడ్పీటీసీ అభ్యర్థి వి.నాగమణితో కలిసి విసృ్తతంగా ప్రచారంచేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, మొవ్వ జెడ్పీటీసీ అభ్యర్థి చిమటా విజయశాంతి, ఎంపీటీసీ అభ్యర్థులు పెడసనగల్లు, బార్లపూడి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో ప్రచారంచేశారు. -
చంద్రబాబు పాలనలో అధోగతి : కోనేరు
జి.కొండూరు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. వైఎస్సాఆర్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కాజా బ్రహ్మం, జి.కొండూరు-2 నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేములకొండ సాంబశివరావు, జి.కొండూరు-1 నుంచి పోటీలో ఉన్న వేములకొండ శైలజ, ఆత్కూరు ఎంపీటీసీ అభ్యర్థి వేములకొండ తిరుపతిరావు మంగళవారం రాత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్‌తో కలసి కోనేరు ప్రచారంలో పాల్గొన్నారు. కోనేరు మాట్లాడుతూ పేద ప్రజల కోసం, కేంద్ర మంత్రి పదవులు కాదన్నాడనే కారణంలతోనే జగన్ పై ఇటలీ సోనియా ఆర్థిక నేరాలు మోపించిందని ఆరోపించారు.అయినా అవేమీ ప్రజాబలం ముందు నిలవకుండా పోయాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలన్నింటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్ మాట్లాడుతూ తేదేపా అధికారంలోకి రాదేమోననే భయంతో చంద్రబాబు అమలు కాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు, దగ్గరుండి విభజన చేసిన బీజేపీతో పొత్తుకు పాకులాడటం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ అభ్చర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో దారి పోడవున కోనేరుకు, జోగిరమేష్‌కు మంచి స్పందన లభించింది. పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, శాగం శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ వీవీ.శ్రీనివాసరావు, ప్రచార కమిటీ జిల్లా సభ్యుడు మందా చక్రధర రావు, నారే ప్రసాద్, గుంటక సుబ్బారెడ్డి, పజ్జూరు సుబ్బులు, ఉచ్చూరు పరమేశ్వర రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ దొప్పల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యం
సాక్షి, విజయవాడ : జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో అంతర్గత సమీక్షాసమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై చర్చించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో పార్టీ అభ్యర్థుల పరిస్థితి, నిర్వహించిన ప్రచారశైలి, సమన్వయకర్తల పనితీరు అంశాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని సమన్వయకర్తలు భుజాన వేసుకుని పనిచేయడం అభినందనీయమని, అన్ని ఎన్నికల్లోనూ ఇదే కొనసాగించాలని సూచించారు. అనంతరం ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చర్చించారు. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలు, 836 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం అన్నిస్థానాల్లో పోటీలో ఉన్నారా? లేక స్థానికంగా పొత్తులు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉన్నారా? అనే అంశంపై నియోజకవర్గాలవారీగా సమీక్షించారు. జెడ్పీ పీఠం మనదే.. జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలని, పార్టీ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిత్యం రెండు పూటల ప్రచార కార్యక్రమాలు సాగాలని సూచించారు. దివంగత వైఎస్సార్ హయాంలో రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ముఖ్య నేతలు వస్తారని వివరించారు. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో ఇక్కడ ఇబ్బందులు తల్తెతకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతితో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ప్రచారం గురించి చర్చించారు. పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్, కుక్కల విద్యాసాగర్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జోగి రమేష్ (మైలవరం), జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), పడమట సురేష్‌బాబు (పెనమలూరు), ఉప్పులేటి కల్పన (పామర్రు), మేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), రక్షణనిధి (తిరువూరు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), దూలం నాగేశ్వరరావు(కైకలూరు) పాల్గొన్నారు. కోనేరుతో నేతల భేటీ.. పార్టీ సమన్వయకర్తలు కోనేరు రాజేంద్రప్రసాద్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని కోనేరు సూచించారు.