జి.కొండూరు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. వైఎస్సాఆర్ సీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి కాజా బ్రహ్మం, జి.కొండూరు-2 నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేములకొండ సాంబశివరావు, జి.కొండూరు-1 నుంచి పోటీలో ఉన్న వేములకొండ శైలజ, ఆత్కూరు ఎంపీటీసీ అభ్యర్థి వేములకొండ తిరుపతిరావు మంగళవారం రాత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు.
పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్‌తో కలసి కోనేరు ప్రచారంలో పాల్గొన్నారు. కోనేరు మాట్లాడుతూ పేద ప్రజల కోసం, కేంద్ర మంత్రి పదవులు కాదన్నాడనే కారణంలతోనే జగన్ పై ఇటలీ సోనియా ఆర్థిక నేరాలు మోపించిందని ఆరోపించారు.అయినా అవేమీ ప్రజాబలం ముందు నిలవకుండా పోయాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలన్నింటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్ మాట్లాడుతూ తేదేపా అధికారంలోకి రాదేమోననే భయంతో చంద్రబాబు అమలు కాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు, దగ్గరుండి విభజన చేసిన బీజేపీతో పొత్తుకు పాకులాడటం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ అభ్చర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో దారి పోడవున కోనేరుకు, జోగిరమేష్‌కు మంచి స్పందన లభించింది.
పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, శాగం శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ వీవీ.శ్రీనివాసరావు, ప్రచార కమిటీ జిల్లా సభ్యుడు మందా చక్రధర రావు, నారే ప్రసాద్, గుంటక సుబ్బారెడ్డి, పజ్జూరు సుబ్బులు, ఉచ్చూరు పరమేశ్వర రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ దొప్పల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనలో అధోగతి : కోనేరు
Published Wed, Apr 2 2014 1:48 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement