శోభానాగిరెడ్డికి కన్నీటి నివాళి | Sobha Nagireddi in Vijayawada | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డికి కన్నీటి నివాళి

Published Fri, Apr 25 2014 1:13 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

శోభానాగిరెడ్డికి కన్నీటి నివాళి - Sakshi

శోభానాగిరెడ్డికి కన్నీటి నివాళి

పమిడిముక్కల, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటూ విశేష సేవలందించిన శోభానాగిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు. పార్టీ ముఖ్య నాయకురాలుగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని తెలిపారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆమె చిన్న వయసులోనే మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చోరగుడి గ్రామంలో గురువారం శోభానాగిరెడ్డి చిత్రపటానికి సారథి, పామర్రు అసెంబ్లీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్పన మాట్లాడుతూ పదేళ్లుగా శోభానాగిరెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అనేక పదవులు నిర్వహించి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.
 
కోనేరు ఆధ్వర్యంలో...
 
విజయవాడ : విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో శోభానాగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించి పార్టీకి ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సంతాపసభలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పాల్గొని శోభానాగిరెడ్డితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
 
ఉదయభాను దిగ్భ్రాంతి
 
జగ్గయ్యపేట అర్బన్ : శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె ఇలా అర్ధంతరంగా అసువులు బాయటం బాధాకరమన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
నాగిరెడ్డి సంతాపం
గుడివాడ : శోభానాగిరెడ్డి మృతికి వైఎస్సార్‌సీపీ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.
 
పార్టీకి తీరని లోటు : వేదవ్యాస్
పెడన : శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్‌సీపీ పెడన అసెంబ్లీ అభ్యర్థి వేదవ్యాస్ అన్నారు. ఆమె మృతికి నివాళి అర్పించారు.
 
బాధ కలిగించింది : జోగి
ఇబ్రహీంపట్నం : శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఎంతో బాధ కలిగించిందని వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సంతాపసభలో ఆమె మృతికి నివాళి అర్పించారు.
 
దుట్టా నివాళి
హనుమాన్‌జంక్షన్ : శోభానాగిరెడ్డి హఠాన్మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్‌సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు అన్నారు. గురువారం హనుమాన్‌జంక్షన్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
 
పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి : కొడాలి
గుడివాడ : వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన శోభానాగిరెడ్డి అకాల మృతి పార్టీకి తీరని లోటని గుడివాడ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
 
బాధాకరం : జగన్‌మోహనరావు
నందిగామ : వైఎస్సార్ సీపీ కీలక నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి మృతి బాధాకరమని, ఆమె పార్టీకి చేసిన సేవలు మరువరానివని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు. ఆమె మృతికి నివాళులర్పించారు.
 
నమ్మలేకపోతున్నాం : సింహాద్రి రమేష్
శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ అన్నారు. అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఆమె లేరనే వార్తను నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
 
మేకా ప్రతాప్ సంతాపం
నూజివీడు : శోభానాగిరెడ్డి మృతిచెందడంపై ఆ పార్టీ నూజివీడు అసెంబ్లీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతికి నివాళి అర్పించారు.
 
దిగ్భ్రాంతికి గురయ్యా : ఉప్పాల
కలిదిండి : శోభానాగిరెడ్డి మృతి వార్తతో దిగ్భ్రాంతికి గురైనట్లు కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ చెప్పారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు.
 
ఆమె మరణం జీర్ణించుకోలేనిది: పేర్ని నాని
మచిలీపట్నం : వైఎస్సార్‌సీపీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి, చురుకైన నాయకురాలిగా ఎదిగిన శోభానాగిరెడ్డి అకాల మరణం పార్టీ నేతలు జీర్ణించుకోలేనిదని మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి పేర్ని నాని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement