గ్రామ కమిటీలు వేసినప్పుడు పార్టీకోసం,ప్రజా సమస్యల కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
గంట్యాడ:గ్రామ కమిటీలు వేసినప్పుడు పార్టీకోసం,ప్రజా సమస్యల కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన మండలంలోని కొటారుబిల్లి కూడలిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు వర్రి నరిశింహమూర్తి అధ్యక్షతన గ్రామ కమిటీలపై కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లవద్ద కూర్చుని కమిటీలు వేయవద్దన్నారు.గ్రామాలలోకి మండల కార్యకర్తలు,నాయకులు వెళ్లి ఆయాగ్రామాలలో నాయకులతో కూర్చుని కమిటీలు వేయాలన్నారు.కమిటీలో పనిచేయడానికి ఆయాకార్యకర్తలు సుముఖత చూపితే వారికి పదవులు ఇవ్వాలని చెప్పారు.
పార్టీ కోసం,ప్రజలకోసం పనిచేసే వ్యక్తి నిజమైన నాయకుడన్నారు.పార్టీలోకి ఎవరోవస్తారని మనపై అజమా యిషీ చేస్తారని అనుకోవద్దని ఎవరు వచ్చినా పార్టీ కోసమే పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నాయకత్వ ల క్షణాలు ఉంటే పదవులు కోరకపోయినా వరిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎం.కృష్ణబాబు,పీరుబండి జైహింద్‌కుమార్,ఎం.సన్యాసినాయుడు,పూడి సత్యారావు,కోడెల ముత్యాలునాయుడు,మామిడి అప్పలనాయుడు,దత్తిరాజేరు మండలపార్టీ అధ్యక్షుడు కడుబండి రమేష్,జాగరపు త్యారావు,జె.దేముడుబాబు.టి.ప్రసాద్‌రాజు,ఆయాగ్రామ సర్పంచ్‌లు,ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం వీరభద్రస్వామిని సత్కరించారు.