ముంబై: పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి భారీ ప్రీమియంలు, అధిక వేల్యుయేషన్ల అంశాన్ని పరిశీలించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ తెలిపారు. పెద్దగా తెలియని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఫేస్ వేల్యూను తక్కువగా చూపించి, షేరును మాత్రం భారీ ప్రీమియం రేటుకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు పబ్లిక్ ఇష్యూల టైమింగ్‌ను మార్కెట్‌కి వదిలేయాలన్నదే సెబీ ఉద్దేశమని మాధవి చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే కంపెనీలు ఇష్యూకి వస్తాయని, ఎప్పుడు రావాలనేది సెబీ నిర్దేశించడమనేది ఇటు ఇన్వెస్టర్లు, అటు సంస్థకు ప్రయోజనకరంగా ఉండబోదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment