ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌కి సంబంధించి విడుదల చేసిన చర్చాపత్రంపై దాదాపు 6,000కు పైగా పరిశ్రమవర్గాల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. ఆ ఫీడ్‌బ్యాక్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా వేగవంతంగా ప్రాసెస్ చేసినట్లు ఆమె చెప్పారు.
నిఘా, ప్రాసెసింగ్‌ను మెరుగుపర్చేందుకు పలు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై సెబీ పని చేస్తోందని మాధవి వివరించారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి సంబంధించి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, డెరివేటివ్ మార్కెట్లలో స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై జూలైలో సెబీ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. కనీస కాంట్రాక్టు సైజును పెంచడం, పొజిషన్ లిమిట్స్‌ను ఇంట్రా–డేలో పర్యవేక్షించడం, స్ట్రైక్ ప్రైస్‌లను క్రమబదీ్ధకరించడం, నియర్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ మార్జిన్‌ను పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment